సాక్షి, అమరావతి: అర్హులైన పేదలకు ఉగాది నాటికి ఇళ్ల స్థలాల పంపిణీ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన ఉగాది నాటికి పేదలకు అందించాల్సిన 25లక్షల ఇళ్లపట్టాలపై చేస్తున్న ఏర్పాట్లపై జిల్లాల వారీగా అధికారులు, కలెక్టర్లతో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఇళ్లస్థలాల కోసం గుర్తించిన భూముల్లో ప్లాట్ల డెవలప్‌మెంట్ వేగవంతంగా పూర్తిచేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. స్థలాల గుర్తింపు, ప్లాట్ల అభివృద్ధిని అనుకున్న గడువులోగా పూర్తిచేయాలన్నారు. ‘మంచి చేయకపోగా..మోసం చేశారు’
ఈవిషయంలో వెనకబడ్డ జిల్లాలపై ప్రత్యేక దృష్టిసారించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఉగాది సమీపిస్తున్న నేపధ్యంలో ప్లాట్లను అభివృద్ధి చేసి పంపిణీకి సిద్ధంచేయాలన్నారు. ఆయా జిల్లాల్లో ఉన్నతాధికారులు పర్యటించి ఇళ్లపట్టాల విషయంలో సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అనుమతులు, ఆర్థిక వనరుల కేటాయింపు విషయంలో జిల్లా కలెక్టర్లు సహా యంత్రాంగానికి అండగా ఉండాలని సూచించారు. 25 లక్షల ఇళ్ల పట్టాలు ఉగాదిరోజున ఇవ్వాలన్నప్రభుత్వ కలను సాకారం చేసేదిశగా.. శరవేగంగా పనిచేయాల్సి ఆవశ్యకత ఉందన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
నెల రోజుల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని అధికారులకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వాహణపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. నెల రోజుల్లో ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు చెప్పినట్లు గుర్తు చేశారు. నెలాఖరులోగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం నియంత్రించాలనే ఆర్డినెన్స్ తెచ్చామన్నారు. ‘అంగిట బెల్లం ఆత్మలో విషం’ ఇది బాబు నైజం
పోలీసు యంత్రాంగం దీన్ని ఛాలెంజ్‌గా తీసుకోవాలని సూచించారు. డబ్బు, మద్యం పంపినట్లు రుజువు అయితే ఎన్నికల తర్వాత కూడా అనర్హత వేటు, మూడేళ్ల జైలు శిక్ష విధించాలన్నారు. గ్రామాల్లో ఉన్న మహిళా పోలీసు, పోలీసు మిత్రలను ఉపయోగించుకోవాలన్నారు. స్థానిక ఎన్నికల నిర్వాహణ దేశానికే ఆదర్శం కావాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘన నిరోధానికి ప్రత్యేక యాప్. ఏం జరిగినా ఈ యాప్‌లో నమోదయ్యేలా గ్రామ, వార్డు వాలంటీర్లకు శిక్షణ ఇవ్వాలని సీఎం అధికారులకు సూచించారు.
పెన్షన్ల పంపిణీ మరింత వేగవంతం
అవ్వాతాతలు, దివ్యాంగులు, వితంతువులకు వారి ఇళ్ల వద్దనే వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఫిబ్రవరి నుంచి అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. మార్చి నెలకు సంబంధించి పెన్షన్లు మొదటి రోజునే 92 శాతం పూర్తయ్యాయి. వచ్చే నెలలో మధ్యాహ్నం 2 గంటల సమయానికి పెన్సన్ల పంపిణీ పూర్తిచేయడమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేయాలన్నారు. ప్రతి 50 కుటుంబాలకు మ్యాపింగ్ కరెక్టుగా జరగాలన్నారు. 'మందేయాలనే బాబు ముఖ్యమంత్రి ఎలా అయ్యారో'
Comments
Please login to add a commentAdd a comment