house sites
-
పేదల భూములు ఫలహారం!
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ హయాంలో లబ్ధి పొందిన పేద రైతుల పొట్ట గొట్టడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. నిరుపేదలు ఇప్పటికే పూర్తి హక్కులు పొందిన భూములను స్వాధీనం చేసుకునేందుకు, వారికి కేటాయించిన ఇళ్లను రద్దు చేసేందుకు సిద్ధమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశాలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. దశాబ్దాల పాటు కొనసాగిన ఆంక్షల చెర నుంచి గత ప్రభుత్వంలో విముక్తి పొందిన అసైన్డ్ పేద రైతుల భూములను కుట్రపూరితంగా స్వాధీనం చేసుకునేందుకు టీడీపీ కూటమి సర్కారు ఎత్తులు వేస్తోంది. లక్షలాది ఎకరాల భూములకు చట్టబద్ధంగా హక్కులు కల్పించడాన్ని నేరంగా చిత్రీకరిస్తూ వారి నుంచి వాటిని లాక్కునేందుకు యత్నిస్తోంది. పేదల నుంచి భూములు ఎలా లాక్కోవాలనే అంశంపైనే మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘంగా చర్చలు జరగడం గమనార్హం. తన హయాంలో భూములకు సంబంధించి ఒక్క సంస్కరణ కూడా చేపట్టకుండా వాటన్నింటినీ వివాదాల్లో ముంచెత్తిన సీఎం చంద్రబాబు.. ఇప్పుడు వైఎస్ జగన్ హయాంలో జరిగిన సంస్కరణల కారణంగా ప్రయోజనం చేకూరిన రైతులను ముంచేందుకు కంకణం కట్టుకుని పని చేయడంపై అంతా నివ్వెరపోతున్నారు. భూముల సమస్యల పరిష్కారానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనేక సంస్కరణలు అమలు చేయగా అసలు ఎప్పుడూ వీటి గురించి ఆలకించని చంద్రబాబు ప్రభుత్వం పేదలను దగా చేసేందుకు కుతంత్రాలు పన్నుతోంది. ఫ్రీహోల్డ్ భూములపై పన్నాగాలుగత ప్రభుత్వం చరిత్రాత్మక రీతిలో అసైన్డ్ భూముల సమస్యను పరిష్కరించేందుకు నడుం బిగించి చట్టానికి కీలక సవరణలు చేసింది. దాన్ని తప్పుగా చిత్రీకరిస్తున్న కూటమి ప్రభుత్వం పేదల నుంచి లాక్కునేందుకు పావులు కదుపుతోంది. దీర్ఘకాలంగా భూములపై ఎలాంటి హక్కులు లేకపోవడంతో పేద రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. తమ భూములపై తమకు హక్కులు ఇవ్వాలని ఎస్సీ, బీసీ, ఎస్టీ, ఇతర పేద వర్గాల రైతులు ఎన్నో ఏళ్లుగా కోరుతూ వచ్చిన నేపథ్యంలో నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అధ్యయనం చేయడంతోపాటు మన రైతుల పరిస్థితులను పరిగణలోకి తీసుకుని 20 సంవత్సరాలు దాటిన అసైన్డ్ భూములపై పేద రైతులకు యాజమాన్య హక్కులు (ఫ్రీ హోల్డ్) కల్పించింది. దీంతో 27.40 లక్షల ఎకరాలకు చెందిన 15.20 లక్షల మంది అసైన్డ్ రైతులకు సంపూర్ణ హక్కులు కల్పించడంతో వారు ప్రైవేట్ భూముల తరహాలో తమ భూములకు హక్కుదారులయ్యారు. ఎన్నికలు జరిగే సమయానికి 13.59 లక్షల ఎకరాలకుపైగా అసైన్డ్ భూములను గత ప్రభుత్వం ఫ్రీహోల్డ్ చేసి పేద రైతులను భూ యజమానులుగా చేసింది. హక్కులు దక్కిన రైతుల్లో కొందరు తమ భూములపై ఆంక్షలు లేకపోవడం, మంచి ధర రావడంతో అవసరాల కోసం వాటిని అమ్ముకున్నారు. అయితే కూటమి ప్రభుత్వం దీన్ని తప్పుబడుతోంది. నిజానికి ఇలా క్రయ విక్రయాలు జరిగింది కేవలం 25 వేల ఎకరాలకు సంబంధించిన భూములు మాత్రమే. మిగిలిన భూములన్నీ అసైనీల చేతుల్లోనే భద్రంగా ఉన్నాయి. రైతులకు మేలు చేసిన ఈ సంస్కరణను చంద్రబాబు ప్రభుత్వం తప్పు పడుతూ ఈ భూములన్నీ అక్రమమని చెబుతూ వాటిని స్వాధీనం చేసుకునేందుకు పావులు కదుపుతోంది.10 లక్షల ఎకరాలు సక్రమమేనని కూటమి సర్కారు విచారణలోనే వెల్లడిగత 6 నెలల నుంచి ఫ్రీహోల్డ్ భూములపై కూటమి ప్రభుత్వం విచారణ చేయిస్తూనే ఉంది. సుమారు 10 లక్షల ఎకరాలు సక్రమంగా ఫ్రీ హోల్డ్ అయినట్లు ఈ విచారణలో తేలింది. మిగిలిన దాదాపు నాలుగు లక్షల ఎకరాల్లో ఉల్లంఘనలు ఉన్నాయని పేర్కొంటున్నా అవి ఏమిటనే అంశాలను కచ్చితంగా తేల్చలేకపోయింది. కేవలం రాజకీయ కారణాలతోనే కొన్ని జిల్లాల్లో ఫ్రీహోల్డ్ భూములపై వివాదాలు సృష్టించినట్లు స్పష్టమవుతోంది. ఎక్కడైనా అధికారులు, భూ మాఫియాల వల్ల పొరపాట్లు జరిగితే సరిదిద్దాల్సిందిపోయి వాటన్నింటినీ కబళించేందుకు కూటమి సర్కారు సిద్ధమైంది. ఆంక్షల చెరలో చిక్కుకుని దశాబ్దాలుగా అన్యాయమైపోయిన రైతులకు మేలు జరగడాన్ని జీర్ణించుకోలేక వారి నుంచి ఏకంగా భూములు లాక్కునేందుకు పన్నాగాలు పన్నడంపై పేదలు కలవరం చెందుతున్నారు. రాజధానిలో అసైన్డ్ రైతుల నుంచి భూములు కొల్లగొట్టి వారికి రావాల్సిన ప్లాట్లను దర్జాగా దోచేసిన టీడీపీ నేతలు ఇప్పుడు రాష్ట్రంలో మిగిలిన అసైన్డ్ రైతుల భూములను కూడా కొట్టేసేందుకు సిద్ధం కావడంపై పేదలు మండిపడుతున్నారు. చట్టబద్ధంగా అసైన్డ్ భూముల చట్టానికి సవరణ చేసి గత ప్రభుత్వం నిర్వహించిన మంచి పనిని సైతం వక్రీకరించి 22 ఏ జాబితా నుంచి తొలగించిన భూములన్నీ అన్యాక్రాంతమైనట్లు మంత్రులు, టీడీపీ నేతలు అడ్డగోలుగా ఆరోపణలు చేయడంపై రైతులు మండిపడుతున్నారు. ఫ్రీ హోల్డ్ అయిన 13 లక్షల ఎకరాల్లో రిజిస్ట్రేషన్లు జరిగింది కేవలం 25 వేల ఎకరాలు మాత్రమేనని టీడీపీ ప్రభుత్వమే నిర్ధారించింది. ఎక్కడైనా ఉల్లంఘనలు జరిగితే వాటిపై విచారణ నిర్వహించి మిగిలిన భూములపై ఆంక్షలు ఎత్తి వేయాల్సి ఉండగా ఆ పని చేయడం లేదు. జగన్ హయాంలో జరిగిన మేలు కొనసాగకూడదనే రీతిలో లక్షలాది ఎకరాలను వివాదాస్పదంగా మార్చేసింది. పేదల ఇళ్లపైనా పగగత ప్రభుత్వం పేదల కోసం కేటాయించిన ఇళ్లపైనా చంద్రబాబు కుయుక్తులు పన్నుతున్నారు. ఇళ్లు కట్టుకోలేదనే నెపంతో జగనన్న కాలనీల్లో వారికి కేటాయించిన ఇళ్ల స్థలాలను రద్దు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. కొందరు అక్రమంగా ఇళ్లు పొందారని చెబుతూ పేదల కడుపు కొట్టేందుకు యత్నిస్తున్నారు. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలు పొందిన వారి పరిస్థితి ప్రశ్నార్థకమైంది. వారికిచ్చిన స్థలాలను రద్దు చేసి తిరిగి ఎక్కడ ఇస్తారో చెప్పడం లేదు. ఇచ్చిన స్థలాలను రద్దు చేయడంపై పేదలు గగ్గోలు పెడుతున్నా ఆలకించడం లేదు. అదే రీతిలో రాష్ట్రంలో అనేక చోట్ల లక్షలాది మంది పేదలకిచ్చిన ఇళ్ల స్థలాలను వెనక్కి తీసుకునేందుకు సన్నద్ధం కావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. -
టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల పంపిణీ
తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. వైకుంఠ ద్వార దర్శనాలు నిన్న వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న భక్తులు 65,361 దర్శించుకున్నారు.20,784 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.3.91 కోట్లు ఆదాయం వచ్చింది. జనవరి 1 తేది వరకు వైకుంఠ ద్వార దర్శనం నేడు టిటిడి ఉద్యోగులకు ఇళ్ళ పట్టాలు పంపిణీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు టీటీడీ ఉద్యోగుల ఇళ్లస్థలాల పంపిణీ వివిధ దశల్లో చేయడం జరుగుతుంది. ఇందుకు సంబంధించి మొదటి దఫా డిసెంబరు 28న 3,518 మందికి ఇళ్లస్థలాలు పంపిణీ చేస్తాం. రెండో దఫా జనవరి మొదటి వారంలో 1500 మందికి ఇళ్లస్థలాల పంపిణీ చేపడతాం. మూడో దఫాలో ఏర్పేడు సమీపంలోని పాగాలి వద్ద 350 ఎకరాల భూమి కొరకు కలెక్టరును కోరడం జరిగింది. దీని వలన 5 వేల మందికి లబ్ధి చేకూరుతుంది. వీరికి కూడా ఫిబ్రవరిలో ఇళ్లస్థలాల పంపిణీకి చర్యలు తీసుకుంటాం. దీంతో విశ్రాంత ఉద్యోగులకు, ఉద్యోగులందరికీ ఇళ్లస్థలాలు అందించినట్టు అవుతుంది. ఈ ఇళ్లస్థలాలను ప్రభుత్వం నుండి టీటీడీ కొనుగోలు చేసి అభివృద్ధి చేసి ఉద్యోగులకు అందిస్తుంది. ఈ మొత్తాన్ని ఉద్యోగులు తిరిగి టీటీడీకి చెల్లిస్తారు. -
సీఎం జగన్ నిర్ణయంపై జర్నలిస్టుల హర్షం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులకు మూడు సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు సీఎం జగన్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన మంత్రి మండలి సమావేశం ఆమోదం తెలిపిన విషయం విదితమే. సీఎం జగన్ ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీకి ఆమోదం తెలపడం చరిత్రాత్మకమైన నిర్ణయమని పలు జర్నలిస్టు సంఘాలు, ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా, అంతర్ రాష్ట్ర వ్యవహారాల సలహాదారు దేవులపల్లి అమర్ ఓ ప్రకటన విడుదల చేస్తూ.. ఉమ్మడి ఏపీలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసిన దివంగత సీఎం వైఎస్సార్ తనయుడుగా.. నేడు రాష్ట్రంలోని వేలాది మందికి మేలు చేసే నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని తెలిపారు. నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ (ఇండియా) మాజీ జాతీయ కార్యదర్శి, అధికార భాషా సంఘం అధ్యక్షుడు పి.విజయబాబు, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు మరో ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. మీడియాలోని ఒక వర్గం నిత్యం రాష్ట్ర ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నప్పటికీ ఏమాత్రం పట్టించుకోకుండా మీడియా సంస్థల్లో పనిచేసే నిరుపేద పాత్రికేయుల చిరకాల స్వప్నాన్ని సీఎం నెరవేర్చబోతున్నారని పేర్కొన్నారు. సీఎం జగన్ విశాల దృక్పథంతో అందజేయనున్న ఇళ్ల స్థలాలను జర్నలిస్టులు సది్వనియోగం చేసుకోవాలని సి.రాఘవాచారి ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు విడుదల చేసిన ప్రకటనలో కోరారు. అమరావతి అక్రిడేటెడ్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ చైర్మన్ బి.వి.రాఘవరెడ్డి, వైస్ చైర్మన్ ఎం.విశ్వనాథ రెడ్డి, సెక్రటరీ పి. నాగశ్రీనివాసరావు విడుదల చేసి న ప్రకటనలో జర్నలిస్టుల ఆశలను నెరవేరుస్తూ నిర్ణయం తీసుకున్న సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సీఎంకు మంత్రుల ధన్యవాదాలు.. రాష్ట్రంలోని అక్రిడేటెడ్ జర్నలిస్టులకు మూడు సెంట్ల చొప్పున ఇళ్లస్థలాలను కేటాయించాలనే సీఎం జగన్ నిర్ణయం హర్షణీయమని పలువురు మంత్రులు ప్రశంసించారు. సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసిన మంత్రులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, కొట్టు సత్యనారాయణ, కే నారాయణస్వామి, బూడి ముత్యాలనాయుడు, అంజాద్ బాషా, తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు, కేవీ ఉషశ్రీచరణ్, ఆదిమూలపు సురే‹Ù, డాక్టర్ సీదిరి అప్పలరాజు, మేరుగ నాగార్జున, జోగి రమేష్ జర్నలిస్టుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం.. జర్నలిస్టులకు మూడు సెంట్ల ఇంటి స్థలాన్ని ఇవ్వనున్నట్లు రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడంపై ఏలూరు జిల్లా నూజివీడులోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ వద్ద నూజివీడు ప్రెస్‌క్లబ్ అండ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, కేడీసీసీబీ చైర్పర్సన్ తాతినేని పద్మావతి, ఏపీ స్టేట్ కో–ఆపరేటివ్ యూనియన్ చైర్మన్ దేశిరెడ్డి రాఘవరెడ్డి పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. చదవండి: సంపూర్ణ సాధికారత -
పాత్రికేయులకు త్వరలో ఇళ్ల స్థలాలు: కేటీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: పాత్రికేయులందరికీ వీలైనంత త్వరగా ఇళ్ల స్థలాలు ఇస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ ప్రక్రియను మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణకు అప్పగించామని తెలిపారు. ఢిల్లీ టీయూడబ్ల్యూజే–143 అధ్యక్షుడు నాగిళ్ల వెంకటేష్ అధ్యక్షతన శనివారం పాత్రికేయుల బృందం మంత్రి కేటీఆర్ తో సమావేశమైంది. ఈ సందర్భంగా ఢిల్లీలో పనిచేస్తున్న తెలంగాణ పాత్రికేయులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందిస్తూ.. హైదరాబాదు లోని పాత్రికేయులందరికీ స్థలాలు ఇస్తామని స్పష్టం చేశారు. ఇందులోనే ఢిల్లీలో పనిచేస్తున్న తెలంగాణ పాత్రికేయుల్ని సైతం చేరుస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు జీవోలో ఆ అంశాలను పొందుపరుస్తామన్నారు. జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్టు సొసైటీకి, హైదరాబాద్ పాత్రికేయులకు ఒకేసారి ఇళ్ల స్థలాలు ఇస్తామని స్పష్టం చేశారు. భేటీలో బీఆర్ఎస్ ఎంపీలు గడ్డం రంజిత్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి ఉన్నారు. -
భూపంపిణీ
-
నెల రోజుల్లో ఎన్నికలను పూర్తి చేయాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: అర్హులైన పేదలకు ఉగాది నాటికి ఇళ్ల స్థలాల పంపిణీ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన ఉగాది నాటికి పేదలకు అందించాల్సిన 25లక్షల ఇళ్లపట్టాలపై చేస్తున్న ఏర్పాట్లపై జిల్లాల వారీగా అధికారులు, కలెక్టర్లతో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఇళ్లస్థలాల కోసం గుర్తించిన భూముల్లో ప్లాట్ల డెవలప్మెంట్ వేగవంతంగా పూర్తిచేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. స్థలాల గుర్తింపు, ప్లాట్ల అభివృద్ధిని అనుకున్న గడువులోగా పూర్తిచేయాలన్నారు. ‘మంచి చేయకపోగా..మోసం చేశారు’ ఈవిషయంలో వెనకబడ్డ జిల్లాలపై ప్రత్యేక దృష్టిసారించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఉగాది సమీపిస్తున్న నేపధ్యంలో ప్లాట్లను అభివృద్ధి చేసి పంపిణీకి సిద్ధంచేయాలన్నారు. ఆయా జిల్లాల్లో ఉన్నతాధికారులు పర్యటించి ఇళ్లపట్టాల విషయంలో సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అనుమతులు, ఆర్థిక వనరుల కేటాయింపు విషయంలో జిల్లా కలెక్టర్లు సహా యంత్రాంగానికి అండగా ఉండాలని సూచించారు. 25 లక్షల ఇళ్ల పట్టాలు ఉగాదిరోజున ఇవ్వాలన్నప్రభుత్వ కలను సాకారం చేసేదిశగా.. శరవేగంగా పనిచేయాల్సి ఆవశ్యకత ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నెల రోజుల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని అధికారులకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వాహణపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. నెల రోజుల్లో ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు చెప్పినట్లు గుర్తు చేశారు. నెలాఖరులోగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం నియంత్రించాలనే ఆర్డినెన్స్ తెచ్చామన్నారు. ‘అంగిట బెల్లం ఆత్మలో విషం’ ఇది బాబు నైజం పోలీసు యంత్రాంగం దీన్ని ఛాలెంజ్‌గా తీసుకోవాలని సూచించారు. డబ్బు, మద్యం పంపినట్లు రుజువు అయితే ఎన్నికల తర్వాత కూడా అనర్హత వేటు, మూడేళ్ల జైలు శిక్ష విధించాలన్నారు. గ్రామాల్లో ఉన్న మహిళా పోలీసు, పోలీసు మిత్రలను ఉపయోగించుకోవాలన్నారు. స్థానిక ఎన్నికల నిర్వాహణ దేశానికే ఆదర్శం కావాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘన నిరోధానికి ప్రత్యేక యాప్. ఏం జరిగినా ఈ యాప్‌లో నమోదయ్యేలా గ్రామ, వార్డు వాలంటీర్లకు శిక్షణ ఇవ్వాలని సీఎం అధికారులకు సూచించారు. పెన్షన్ల పంపిణీ మరింత వేగవంతం అవ్వాతాతలు, దివ్యాంగులు, వితంతువులకు వారి ఇళ్ల వద్దనే వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఫిబ్రవరి నుంచి అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. మార్చి నెలకు సంబంధించి పెన్షన్లు మొదటి రోజునే 92 శాతం పూర్తయ్యాయి. వచ్చే నెలలో మధ్యాహ్నం 2 గంటల సమయానికి పెన్సన్ల పంపిణీ పూర్తిచేయడమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేయాలన్నారు. ప్రతి 50 కుటుంబాలకు మ్యాపింగ్ కరెక్టుగా జరగాలన్నారు. 'మందేయాలనే బాబు ముఖ్యమంత్రి ఎలా అయ్యారో' -
ఇక ఉగాది కానుక!
సొంతింటి కల సాకారం దిశగా.. సొంత స్థలం కానుక కాబోతున్న వేడుక ఉగాది. ఆ రోజు రాక కోసం కోటి ఆశలతో నిరుపేదలు ఎదురుచూస్తున్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని జీవితాంతం కష్టపడినా కాసింత జాగా కూడా కొనుక్కోలేని రోజులివి. పేదలను సొంతింటి మారాజులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. నిరుపేదల్లో ఆనందాలు నింపుతోంది. సాక్షి, మచిలీపట్నం: ఉగాది నాటికి జిల్లాలోని అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. వివిధ రూపాల్లో అందిన దరఖాస్తులను ఇంటింటి సర్వేలో గ్రామ, వార్డు వలంటీర్లు క్షేత్ర స్థాయి పరిశీలన జరిపారు. దరఖాస్తు చేయని అర్హుల నుంచి కూడా దరఖాస్తులు స్వీకరించారు. కులాలు, మతాలు, పార్టీలకతీతంగా జరిపిన సర్వేలో అర్హుల గుర్తింపు పూర్తి పారదర్శకంగా సాగింది. ఈ జాబితాలను ఇప్పటికే పంచాయతీలతో పాటు గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించి అభ్యంతరాలను స్వీకరించి వాటిని కూడా ఇటీవల జరిగిన గ్రామసభల్లో పరిష్కరించారు. ఇప్పటి వరకు సొంత ఇల్లు, ఇంటి స్థలం లేని అర్హులైన జాబితాను వివిధ కోణాల్లో పరిశీలన అనంతరం జిల్లాలో 2,71,033 మంది అర్హులుగా లెక్కతేల్చారు. వీరిలో గ్రామీణ జిల్లాలో 1,31,660 మంది, అర్బన్ ప్రాంతంలో 1,39,373 మంది అర్హులున్నట్టుగా గుర్తించారు. వీరికి ప్రభుత్వం నిర్దేశించిన మేరకు ఇళ్ల స్థలాలు కేటాయిం చాలంటే కనీసం 4601.36 ఎకరాలు భూమి అవసరమని గుర్తించారు. ఎక్కువగా డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో అందుబాటులో 2132.02 ఎకరాల ప్రభుత్వ భూములను ఆ ఇళ్ల స్థలాలకు అనువైనవిగా నిర్ధారించారు. కాగా మరో 2497.79 ఎకరాలు సేకరించాల్సి ఉందని లెక్కతేల్చగా, ఇప్పటి వరకు భూసేకరణ కోసం 960.2 ఎకరాల ప్రైవేటు భూములు గుర్తించారు. మరో 1537.77 ఎకరాల భూముల కోసం అన్వేషిస్తున్నారు. భూసేకరణ కోసం రూ.2326.80 కోట్లు అవసరమని అంచనా వేశారు. కాగా ఆ భూముల లెవలింగ్ కోసం మరో రూ.306.75 కోట్లు ఖర్చవుతాయని లెక్కతేల్చారు. మొత్తం జిల్లాకు 2633.52 కోట్లు కావాలని ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. అర్బన్ ప్రాంతాల్లో అత్యధికంగా విజయవాడ కార్పొరేషన్ పరిధిలో 86,513 మంది అర్హులుగా లెక్క తేల్చగా, నందిగామలో కేవలం 1072 మంది మాత్రమే అర్హులుగా గుర్తించారు. వీరంతా అర్హులని సమాచారం కూడా అందించారు. ఒకటికి పదిసార్లు ఇంకా ఎవరైనా అర్హులున్నారేమో బూతద్దంతో గుర్తించే కార్యక్రమం కూడా చేశారు. చివరకు ఎవరూ లేరని తేలడంతో అర్హుల జాబితాలను ప్రభుత్వామోదం కోసం పంపించారు. వీరందరికీ వచ్చే ఏడాది ఉగాది రోజున ఇళ్ల స్థలాలు కేటాయించి ఇచ్చేందుకు అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటి వరకు గుర్తించిన ప్రైవేటు భూముల కోసం త్వరలోనే ప్రభుత్వాదేశాల మేరకు భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉగాది నాటికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఆ మేరకు జిల్లాలో అర్హులను గుర్తించారు. వారికి ఇళ్ల స్థలాల కోసం ఎంత భూమి అవసరమో లెక్కతేలింది. అందుబాటులో ప్రభుత్వ భూముల గుర్తింపు పూర్తయింది. ఇక సేకరించాల్సిన ప్రైవేటు భూములను ఇంకా గుర్తించాల్సి ఉంది. ప్రభుత్వాదేశాలతో త్వరలోనే గుర్తించిన ప్రైవేటు భూముల కోసం భూసేకరణ ప్రక్రియ మొదలు పెట్టనున్నాం. ఏదిఏమైనా ప్రభుత్వ లక్ష్యం మేరకు వచ్చే ఏడాది ఉగాది రోజున అర్హులైన ప్రతి ఒక్కరికీ సొంత ఇంటి స్థలం అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. – ఏఎండీ ఇంతియాజ్, కలెక్టర్ -
పేదింటి కల సాకారమయ్యేలా..
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు ఉండాలి.. ఇది రాష్ట్ర ప్రభుత్వం తనకు తాను విధించుకున్న లక్ష్యం. ప్రజాసంకల్పయాత్రలో కోట్లాదిమంది కష్టసుఖాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పదవి చేపట్టిన వెంటనే ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఉగాది నాటికి అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అధికారులకు దిశానిర్దేశం చేయడంతో ప్రభుత్వ యంత్రాంగం స్థలాల సేకరణలో నిమగ్నమైంది. గత ఐదేళ్లూ టీడీపీ పాలనలో జన్మభూమి కమిటీల పెత్తనంతో తమకు న్యాయం జరగదని నిరాశకు లోనైన బడుగువర్గాల్లో.. ప్రభుత్వ చర్యలతో మళ్లీ ఆశలు చిగురించాయి. జిల్లాలో సొంత ఇల్లు లేని వారు సుమారు 1.80 లక్షలమంది ఉన్నారు. వీరందరికీ ఇళ్ల స్థలాలు సమకూర్చాలంటే.. ఎం త స్థలం అవసరం, పట్టణాల్లో ఎంత కావాలి, గ్రామాల్లో ఎంత కావాలి.. తదితర వివరాలను సిద్ధం చేసిన అధికారులు భూ సేకరణకు కావా ల్సిన కసరత్తును ప్రారంభించారు. రెవెన్యూ అ«ధికారులు గ్రామాలవారీ, మండలాల వారీ, డివిజన్ల వారీగా భూసేకరణకు ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరం చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 1211.73 ఎకరాల ప్రభుత్వ భూములను గుర్తించారు. మహిళ పేరిట ఇళ్ల పట్టాలు, ఇళ్లు... రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. కుటుంబంలో మహిళ పేరిట ఇల్లు మంజూరు చేయనున్నారు. అంతే కాకుండా అన్ని హక్కులు కల్పిస్తూ వారి పేరిట రిజిస్ట్రేషన్ కూ డా చేసి మహిళకు హక్కులు కల్పించేందుకు నిబంధనలు రూపొందించారు. గ్రామీణ, పట్ట ణ, నగర ప్రాంతాల తేడాలు లేకుండా పేదలంతా పక్కా గృహాలు నిర్మించుకునేలా ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. సొంత ఇల్లు, స్థలం లేని వారే అర్హులు.. దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాల వారై ఉండి సొంత ఇల్లు లేని వారంతా ఈ పథకంలో లబ్ధి పొందేందుకు అర్హులే. కేంద్ర, రాష్ట్ర పథకాల ద్వారా గతంలో ఎలాంటి గృహ రాయితీ పొందకుండా ఉండాలి. 2.5 ఎకరాల మాగాణి లేదా అయిదు ఎకరాల మెట్టు కన్న తక్కువ భూమి ఉన్నవారే మాత్రమే అర్హులు. ఇంటి స్థలం కోసం ఏ ప్రాంతం నుంచి దరఖాస్తు చేసున్నారో ఆ ప్రాంతంవారై ఉండాలి, ఆధార్, రేషన్ కార్డు కలిగి ఉండాలి. వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రూ.3 లక్షల కంటే తక్కువ ఉండాలి. గ్రామం వార్డు, యూనిట్‌గా తీసుకొని ఈ దరఖాస్తు చేయా లి. ఆ గ్రామంలో ఉన్నారా లేదా తదితర వివరాలను గ్రామ వలంటీర్లు పరిశీలించి, అర్హుల జాబితాలను గ్రామ సచివాలయంలో ప్రదర్శిస్తారు. అనంతరం గ్రామ సభను నిర్వహించి అభ్యంతరాలుంటే వాటిని పరిశీలించి నిర్ణయాలు తీసుకొంటారు. తుది చర్చ అనంతరం ఎంపిక జాబితాను ప్రకటిస్తారు. పట్టణాల్లో జీ ప్లస్ 3, 4 పద్ధతిలోనూ, గ్రామాల్లో గ్రౌండ్ ఫ్లోర్‌తో ఇల్లు నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో అందుబాటులో ఉన్న భూమి.. ఇల్లుకు అనువైన భూమిని రెవెన్యూ అధికా రులు గ్రామాల వారీగా గుర్తిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో అనువైన స్థలం లేదు. దీంతో అక్కడ ప్రైవేటు భూముల్లో ఇళ్ల నిర్మాణానికి అనుకూలంగా ఉన్నవి గుర్తించే పనిలో ఉన్నారు. జిల్లాలో 1863 రెవెన్యూ గ్రామాలు న్నాయి. వీటిలో ఇప్పటి వరకు 1128 రెవె న్యూ గ్రామాల్లో 1211.73 ఎకరాల ప్రభుత్వ భూములను గుర్తించారు. ఇంకా కొన్ని గ్రామాల్లో భూములు గుర్తించాల్సి ఉంది. -శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్లో 13 మండలాల్లో 562 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. వీటిలో 333 రెవెన్యూ గ్రామాల్లో 418.04 ఎకరాలు గుర్తించారు. 226 గ్రామాల్లో అనువైన ప్రభుత్వ భూములు లేవు. -పాలకొండ డివిజన్లో 635 రెవెన్యూ గ్రామాలున్నాయి. వీటిలో 448 గ్రామాల్లో ప్రభుత్వ భూమి ఉంది. 282.24 ఎకరాలు గుర్తించారు. 187 గ్రామాల్లో అనువైన భూములు లేవని తేల్చారు. -టెక్కలి డివిజన్లో 666 రెవెన్యూ గ్రామాలున్నాయి. వీటిలో 347 గ్రామాలలో భూములు గుర్తించారు. 511.45 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ డివిజన్లో 319 గ్రామాల్లో ఇళ్లకు అనువైన ప్రభుత్వ భూమి లేదు. -
ఉగాదికి ఇళ్ల స్థలాల పంపిణీ: సీఎం జగన్
సాక్షి, అమరావతి: పేదవారి సొంతింటి కలను సాకారం చేసేందుకు ఉగాది నాడు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపడతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టర్ల సమావేశంలో ఆయన ఈ విషయం వెల్లడించారు. ఇళ్ల పట్టాలను మహిళల పేరుతో పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. ఇళ్ల పట్టాలకు సంబంధించి అధికారులు సమాయత్తం కావాలని, భూమి లభ్యత లేనిచోట కొనుగోలు చేయాలని సూచించారు. ఇంటి పట్టా ఇవ్వడమే కాదు, స్థలం ఎక్కడుందో లబ్ధిదారులకు స్పష్టం చూపించాలన్నారు. ఉగాది రోజున ఇళ్లస్థలాల రిజిస్ట్రేషన్ ఒక పండుగ లాగ చేయాలన్న ఆకాంక్షను సీఎం జగన్ వెలిబుచ్చారు. అధికారులు విశ్వసనీయత కాపాడుకోవాలని.. ఏ విధానమైనా అందరికీ ఒకేలా ఉండాలని తర, తమ భేదం వద్దని పేర్కొన్నారు. ప్రతి జిల్లాకు ప్రత్యేక వెబ్ పోర్టల్ ఏర్పాటు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. అన్ని విభాగాలు వెబ్ పోర్టల్‌కు అనుసంధానం చేయాలని, ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులను ఇందులో అందరికీ అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రభుత్వ పనుల వివరాలను కూడా వెబ్ పోర్టల్‌లో ఉంచాలన్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాను గ్రామ పంచాయతీ కార్యాలయ గోడలకు అతికించాలని, ఎవరెవరికీ లబ్ధి జరుగుతుందో గ్రామస్తులకు తెలియాలని ఆదేశించారు. లబ్ధిదారుల జాబితా పంచాయితీల స్థాయిలో తయారు కావాలని దీనివల్ల పాదర్శకత పెరుగుతుందన్నారు. జాబితాలో ఎవరు ఉండాలి, ఉండకూడదన్న దానిపై అవగాహన ఉంటుందని తెలిపారు. అధికారులకు వలంటీర్లు కళ్లు, చెవులుగా ఉంటారని.. గ్రామ సచివాలయం కూడా అక్కడే ఉంటుందని చెప్పారు. విధులను ఇష్టంతో నిర్వర్తించాలని, తమదైన ముద్ర వేసేలా పని చేయాలని కలెక్టర్లకు ప్రేరణ ఇచ్చారు. (చదవండి: ‘ప్రజావేదిక’పై సీఎం జగన్ సంచలన నిర్ణయం) -
త్వరలో మాజీ సైనికుల కల సాకారం
అనంతపురం సెంట్రల్ : జిల్లా కేంద్రంలోని మాజీ సైనికుల ఇంటిపట్టాల కల త్వరలో సాకారం కానుందని మాజీ సైనికుల సంఘం అధ్యక్షుడు కెప్టెన్ షేకన్న తెలిపారు. ఆదివారం హెచ్చెల్సీ కాలనీలోని సంఘం కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఇంటి పట్టాల మంజూరుకు మార్గం సుగమం అవుతోందని చెప్పారు. జిల్లాలో మాజీ సైనికుల భూమి ఆక్రమణకు గురైతే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ సమావేశంలో మాజీ సైనికులు శ్రీనివాసులు, అబ్దుల్‌ఖాదర్, ఆంజనేయులు, రమేష్‌రెడ్డి, నారాయణరెడ్డి, ఆజాద్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.