పేదింటి కల సాకారమయ్యేలా.. | AP Government To Provide House Sites For The Poor By Ugadi | Sakshi
Sakshi News home page

పేదింటి కల సాకారమయ్యేలా..

Published Mon, Aug 19 2019 8:47 AM | Last Updated on Mon, Aug 19 2019 8:53 AM

AP Government To Provide House Sites For The Poor By Ugadi - Sakshi

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు ఉండాలి.. ఇది రాష్ట్ర ప్రభుత్వం తనకు తాను విధించుకున్న లక్ష్యం. ప్రజాసంకల్పయాత్రలో కోట్లాదిమంది కష్టసుఖాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పదవి చేపట్టిన వెంటనే ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఉగాది నాటికి అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అధికారులకు దిశానిర్దేశం చేయడంతో ప్రభుత్వ యంత్రాంగం స్థలాల సేకరణలో నిమగ్నమైంది. గత ఐదేళ్లూ టీడీపీ పాలనలో జన్మభూమి కమిటీల పెత్తనంతో తమకు న్యాయం జరగదని నిరాశకు లోనైన బడుగువర్గాల్లో.. ప్రభుత్వ చర్యలతో మళ్లీ ఆశలు చిగురించాయి. జిల్లాలో సొంత ఇల్లు లేని వారు సుమారు 1.80 లక్షలమంది ఉన్నారు. వీరందరికీ ఇళ్ల స్థలాలు సమకూర్చాలంటే.. ఎం త స్థలం అవసరం, పట్టణాల్లో ఎంత కావాలి, గ్రామాల్లో ఎంత కావాలి.. తదితర వివరాలను సిద్ధం చేసిన అధికారులు భూ సేకరణకు కావా ల్సిన కసరత్తును ప్రారంభించారు. రెవెన్యూ అ«ధికారులు గ్రామాలవారీ, మండలాల వారీ, డివిజన్ల వారీగా భూసేకరణకు ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరం చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 1211.73 ఎకరాల ప్రభుత్వ భూములను గుర్తించారు.

మహిళ పేరిట ఇళ్ల పట్టాలు, ఇళ్లు...
రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను జారీ చేసింది.  కుటుంబంలో మహిళ పేరిట ఇల్లు మంజూరు చేయనున్నారు. అంతే కాకుండా అన్ని హక్కులు కల్పిస్తూ వారి పేరిట రిజిస్ట్రేషన్‌ కూ డా చేసి మహిళకు హక్కులు కల్పించేందుకు నిబంధనలు రూపొందించారు. గ్రామీణ, పట్ట ణ, నగర ప్రాంతాల తేడాలు లేకుండా పేదలంతా పక్కా గృహాలు నిర్మించుకునేలా ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు.

సొంత ఇల్లు, స్థలం లేని వారే అర్హులు..
దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాల వారై ఉండి సొంత ఇల్లు లేని వారంతా ఈ పథకంలో లబ్ధి పొందేందుకు అర్హులే. కేంద్ర, రాష్ట్ర పథకాల ద్వారా గతంలో ఎలాంటి గృహ రాయితీ పొందకుండా ఉండాలి. 2.5 ఎకరాల మాగాణి లేదా అయిదు ఎకరాల మెట్టు కన్న తక్కువ భూమి ఉన్నవారే మాత్రమే అర్హులు. ఇంటి స్థలం కోసం ఏ ప్రాంతం నుంచి దరఖాస్తు చేసున్నారో ఆ ప్రాంతంవారై ఉండాలి, ఆధార్, రేషన్‌ కార్డు కలిగి ఉండాలి. వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రూ.3 లక్షల కంటే తక్కువ ఉండాలి. గ్రామం వార్డు, యూనిట్‌గా తీసుకొని ఈ దరఖాస్తు చేయా లి. ఆ గ్రామంలో ఉన్నారా లేదా తదితర వివరాలను గ్రామ వలంటీర్లు పరిశీలించి, అర్హుల జాబితాలను గ్రామ సచివాలయంలో ప్రదర్శిస్తారు. అనంతరం గ్రామ సభను నిర్వహించి అభ్యంతరాలుంటే వాటిని పరిశీలించి నిర్ణయాలు తీసుకొంటారు. తుది చర్చ అనంతరం ఎంపిక జాబితాను ప్రకటిస్తారు. పట్టణాల్లో జీ ప్లస్‌ 3, 4 పద్ధతిలోనూ, గ్రామాల్లో గ్రౌండ్‌ ఫ్లోర్‌తో ఇల్లు నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

జిల్లాలో అందుబాటులో ఉన్న భూమి.. 
ఇల్లుకు అనువైన భూమిని రెవెన్యూ అధికా రులు గ్రామాల వారీగా గుర్తిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో అనువైన స్థలం లేదు. దీంతో అక్కడ ప్రైవేటు భూముల్లో ఇళ్ల నిర్మాణానికి అనుకూలంగా ఉన్నవి గుర్తించే పనిలో ఉన్నారు. జిల్లాలో 1863 రెవెన్యూ గ్రామాలు న్నాయి. వీటిలో ఇప్పటి వరకు 1128 రెవె న్యూ గ్రామాల్లో 1211.73 ఎకరాల ప్రభుత్వ భూములను గుర్తించారు. ఇంకా కొన్ని గ్రామాల్లో భూములు గుర్తించాల్సి ఉంది. 
-శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్‌లో 13 మండలాల్లో 562 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. వీటిలో 333 రెవెన్యూ గ్రామాల్లో 418.04 ఎకరాలు గుర్తించారు. 226 గ్రామాల్లో అనువైన ప్రభుత్వ భూములు లేవు. 
-పాలకొండ డివిజన్‌లో 635 రెవెన్యూ గ్రామాలున్నాయి. వీటిలో 448 గ్రామాల్లో ప్రభుత్వ భూమి ఉంది. 282.24 ఎకరాలు గుర్తించారు. 187 గ్రామాల్లో  అనువైన భూములు లేవని తేల్చారు. 
-టెక్కలి డివిజన్‌లో 666 రెవెన్యూ గ్రామాలున్నాయి. వీటిలో 347 గ్రామాలలో భూములు గుర్తించారు. 511.45 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ డివిజన్‌లో 319 గ్రామాల్లో ఇళ్లకు అనువైన ప్రభుత్వ భూమి లేదు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement