provide
-
‘గిరి’ సీమల్లో ‘జుగా’ వెలుగులు
హన్మకొండ: అన్ని గిరిజన గ్రామాల్లో విద్యుత్ కాంతులు విరజిమ్మనున్నాయి. ప్రతీ ఇంటిని విద్యుదీకరించాలని కేంద్ర ప్రభుత్వం తాజగా నిర్ణయించింది. మెజారిటీ గిరిజన జనాభా ఉండి ఇప్పటివరకు విద్యుత్ సౌకర్యానికి నోచుకోని గ్రామాల్లో వెలుగులు నిండనున్నాయి. ప్రతీ ఇంటికి ఉచితంగా విద్యుత్ కనెక్షన్ ఇస్తారు. అవసరమైన చోట నూతనంగా విద్యుత్ లైన్లు వేయడంతోపాటు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తారు. అటవీ ప్రాంతంతోపాటు ఇతర కారణాలతో విద్యుత్ లైన్లు వేయలేని గ్రామాల్లో సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పిస్తారు.తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్) పరిధిలో మెజారిటీ గిరిజన జనాభా కలిగిన 1,049 గ్రామాలు, తెలంగాణ సదరన్ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీఎస్ఎల్) పరిధిలో 229 గ్రామాల్లోని గిరిజన ఇళ్లలో వెలుగులు నింపనున్నారు. ఈ మేరకు ఎన్పీడీసీఎల్ సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ను తయారు చేసింది. మెజారిటీ గిరిజన జనాభా ఉన్న 695 గ్రామాల్లోని 25,393 గృహాలకు, 732 ప్రభుత్వ, ప్రభుత్వ రంగ కార్యాలయాలకు విద్యుత్ సౌకర్యం కల్పించనున్నారు. మొత్తం రూ.144.42 కోట్ల వ్యయం అంచనాతో డీపీఆర్ రూపొందించగా.. దీన్ని కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపనున్నారు.దేశంలో 5 కోట్ల మందికి లబ్ధిగిరిజనులకు మెరుగైన సామాజిక, ఆర్థిక స్థితిగతులను మెరుగు పరిచేందుకు, గ్రామాల్లో కనీస వసతులు, సౌకర్యాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధా న మంత్రి జన్‌జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ (పీఎం జుగా) అమలు చేస్తోంది. దేశవ్యాప్తంగా 63 వేల గ్రామాల్లో 5 కోట్ల మంది గిరిజనులకు ప్రయోజనం చేకూర్చాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని తెచ్చింది. ఈ స్కీమ్ ద్వారా 25 రకాల సహాయాలు అందుతాయి. 17 మంత్రిత్వ శాఖలు అమలు చేస్తున్నాయి. సామాజిక మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, విద్య, జీవనోపాధిలో ఉన్న కీలకమైన అంతరాలను పూడ్చేలా ఈ స్కీమ్‌ను రూపొందించారు.రూ.144.42 కోట్ల వ్యయంతో..ఇప్పటికే ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ ద్వారా జనసమూహాలకు దూరంగా ఉండి మౌలి క సదుపాయాలకు నోచుకోని కోలం, తొట్టి గిరిజనులు నివా సముండే ఎన్పీడీసీఎల్ పరిధిలోని ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లోని 257 అవా సాల్లో 3,345 గృహాల్లో విద్యుత్ సౌకర్యం కల్పించారు. అదే విధంగా దీన్‌దయాల్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి ద్వారా రూ.125కే విద్యుత్ పంపిణీ సంస్థ సొంతగా ఖర్చులు భరించి పేదలకు విద్యుత్ సౌకర్యం కల్పించింది. అయినా ఇప్పటి కీ విద్యుత్ సౌకర్యానికి దూరంగా ఉన్న మెజారిటీ గిరిజను లున్న గ్రామాలు, గృహాల కోసం కేంద్రం ‘పీఎం జుగా’ను తెచ్చింది.ఎన్పీడీసీఎల్ పరిధిలోని 15 జిల్లాల్లో జగిత్యా ల, పెద్దపల్లి జిల్లాల్లో విద్యుత్ సౌకర్యం లేని గృహాలేమీ లేవు. మిగతా 13 జిల్లాల్లో 1,049 మెజారిటీ గిరిజన జనాభా కలిగిన గ్రామాలు ఉన్నట్లు గుర్తించా రు. ఇందులో 25,393 గృహాలు, 732 ప్రభు త్వ కార్యాలయాలు (మొత్తం 26,125) ఉన్నా యి. కాగా ఆన్ గ్రిడ్ ద్వారా విద్యుత్ సౌకర్యం కల్పించే వీలున్న గ్రామాలు 24,753 ఉన్నా యి. వివిధ కారణాలవల్ల విద్యుత్ సౌకర్యం క ల్పించడం వీలుకాని 640 గ్రామాల్లో సోలార్ ద్వారా గృహాలను విద్యుదీకరించనున్నారు. ఈ గ్రామాలు, గృహాల కు విద్యుత్ సౌకర్యం కల్పించడానికి రూ.144.42 కోట్ల వ్య యంతో 352 కిలోమీటర్ల మేర 11 కేవీ లైన్, 592 కి.మీ. సింగిల్ లైన్, 1,668 కి.మీ. ఎల్టీ లైన్ నిర్మించనున్నారు. 1,565 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు బిగించనున్నారు. ఈ స్కీమ్ అమలుకు కావాల్సిన ఖర్చులన్నీ కేంద్రమే భరిస్తుంది. -
దివ్యాంగులకు రైల్వేశాఖ అందించే ప్రత్యేక సౌకర్యాలివే..
మనలో చాలామంది దూర ప్రయాణాలకు రైలునే ఇష్టపడతారు. రైలు ప్రయాణంలో అనేక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. దివ్యాంగులకు రైల్వేశాఖ ప్రత్యేక సదుపాయాలు, సౌకర్యాలు కల్పిస్తోంది. అంగ వైకల్యం కలిగినవారు, మానసిక వ్యాధిగ్రస్తులు, అంధులు తమ రైలు ప్రయాణంలో ఈ సదుపాయాలను వినియోగించుకోవచ్చు. దివ్యాంగులకు రైలు టిక్కెట్ ధరలోనూ రాయితీ లభిస్తుంది. అయితే ఇందుకోసం దివ్యాంగులు తమ అంగవైకల్యానికి సంబంధించిన ధృవీకరణ పత్రం కలిగివుండాలి. సీటు సౌకర్యం దివ్యాంగులైన ప్రయాణికులకు ఇది వరం లాంటిది. దివ్యాంగులకు స్లీపర్ క్లాస్‌లో రెండు లోయర్, రెండు మిడిల్ బెర్త్‌లు, ఏసీ-3లో ఒక లోయర్, ఒక మిడిల్ బెర్త్, త్రీఈ కోచ్‌లో ఒక లోయర్ బెర్త్, ఒక మిడిల్ బెర్త్ కేటాయిస్తారు. టిక్కెట్లపై తగ్గింపు దివ్యాంగులైన ప్రయాణీకులకు రైలు టిక్కెట్లలో రాయితీ లభిస్తుంది. దివ్యాంగులైన ప్రయాణికులు టిక్కెట్ల ధరలో 25 శాతం నుండి 75 శాతం వరకు రాయితీని పొందవచ్చు. దివ్యాంగులైన ప్రయాణికులకు స్లీపర్ క్లాస్, ఏసీ-3 నుండి సాధారణ తరగతి వరకు అన్నింటా రాయితీలు లభిస్తాయి. ఈ రాయితీని పొందడానికి, టిక్కెట్‌ను కొనుగోలు చేసేటప్పుడు అంగవైకల్య ధృవీకరణ పత్రాన్ని చూపించడం తప్పనిసరి. చక్రాల కుర్చీ సౌకర్యం భారతీయ రైల్వే దివ్యాంగులైన ప్రయాణికులకు చక్రాల కుర్చీ సౌకర్యాన్ని అందుబాటులో ఉంచింది. స్టేషన్ నుండి రైలు వద్దకు వచ్చేందుకు దివ్యాంగులు ఈ వీల్‌చైర్‌ను వినియోగించుకోవచ్చు. ఈ వీల్ చైర్ సౌకర్యం పొందేందుకు దివ్యాంగులు ముందుగా సంబంధిత అధికారి లేదా స్టేషన్ మాస్టర్‌ను సంప్రదించాల్సివుంటుంది. తరువాత రైల్వే సిబ్బంది వీల్ చైర్‌ను దివ్యాంగుల దగ్గరకు తీసుకువస్తారు. అయితే ఈ సౌకర్యం పొందేందుకు దివ్యాంగులు కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇది కూడా చదవండి: ఆ 17 రోజులు ఎలా గడిచాయంటే.. -
గ్రామానికో ట్రాక్టర్.. ఏపీ సర్కార్ కసరత్తు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రెండు వేల జనాభా దాటిన ప్రతి గ్రామానికి ఒక్కొక్క ట్రాక్టర్ చొప్పున సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆ ట్రాక్టర్లను సంబంధిత గ్రామ పంచాయతీలు బహుళ ప్రయోజనాలకు వినియోగించుకునేలా ప్రణాళికలు రచిస్తోంది. తద్వారా ట్రాక్టర్ల నిర్వహణకు అయ్యే వ్యయాన్ని ఆదాయం రూపంలో సదరు గ్రామ పంచాయతీలకు లభించేలా చర్యలు చేపడుతోంది. ఇలా చేయడం ద్వారా గ్రామాల్లో రోడ్ల పక్కన పెంచే మొక్కలకు ఆ ట్రాక్టర్ ద్వారానే నీటి తడులు అందించడం, నూరు శాతం మొక్కలను బతికించడం, గ్రామాల్లో ఇళ్ల నుంచి సేకరించే చెత్తను తరలించడం వంటి పనులను సులభతరం అవుతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. 5,228 గ్రామాలకు ఉచితంగా అందజేత రాష్ట్రంలో 13,371 గ్రామ పంచాయతీలు ఉండగా, అందులో 5 వేలకు పైబడి జనాభా ఉండే గ్రామాలు 1,252 ఉన్నాయి. వీటిలో 1,161 గ్రామ పంచాయతీలకు ఇప్పటికే సొంత ట్రాక్టర్లు అందుబాటులో ఉన్నాయి. 5 వేల జనాభాకు పైబడిన గ్రామాల్లో 91 చోట్ల మాత్రమే పంచాయతీలకు సొంతంగా ట్రాక్టర్లు లేవు. ఇవి కాకుండా 2 వేలకు పైబడి, 5 వేల లోపు జనాభా ఉండే గ్రామాలు 5,137 వరకు ఉన్నాయి. వీటికి కూడా సొంత ట్రాక్టర్లు లేవు. ఈ నేపథ్యంలో 5 వేలకు పైబడిన జనాభా కలిగి సొంత ట్రాక్టర్లు లేని 91 పంచాయతీలతోపాటు, 5 వేల లోపు జనాభా కలిగిన 5137 పంచాయతీలకు కలిపి మొత్తం 5,228 గ్రామాలకు ప్రభుత్వం కొత్తగా ట్రాక్టర్లు అందజేయాలని నిర్ణయించింది. పంచాయతీరాజ్ శాఖ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా వీటిని ఉచితంగా సమకూరుస్తుంది. గ్రామాల్లో రోడ్లపక్కన పోగయ్యే చెత్తను తరలించడానికి, రోడ్ల పక్కన నాటే మొక్కలకు గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో నీటి తడులు అందించడం ద్వారా ప్రతి మొక్కను బతికించేందుకు ఈ ట్రాక్టర్లను ఉపయోగిస్తారు. అంతేకాకుండా గ్రామ పంచాయతీ ఇతర అవసరాలకు కూడా అవే ట్రాక్టర్లను ఉపయోగించుకునేలా చూస్తారు. పంచాయతీలపై నిర్వహణ భారం పడకుండా.. ట్రాక్టర్ రోజువారీ నిర్వహణ సంబంధించి పంచాయతీకి భారం కాకుండా ఉండేలా కొన్నేళ్లపాటు ఆ గ్రామానికి అదనపు ఆదాయం పొందేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. దానిపై పంచాయతీ అధికారులకు అవగాహన కల్పిస్తారు. రోడ్ల పక్కన నాటే మొక్కల పెంపకానికి గాను.. నాటిన ప్రతి మొక్కకు రెండేళ్లలో 56 విడతలుగా నీటి తడులు ఇవ్వడానికి (ఒక్కొక్క తడికి రూ.5 చొప్పున) రూ.280 చొప్పున ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు చెల్లిస్తోంది. ఇలా 400 మొక్కలు ఒక యూనిట్‌గా చేసుకుని ప్రతి యూనిట్‌కు రూ.1.12 లక్షల చొప్పున అందజేస్తోంది. ఇకపై మొక్కలకు నీటి తడులు ఇచ్చే బాధ్యత ప్రైవేట్ వ్యక్తులకు కాకుండా గ్రామ పంచాయతీలకే అప్పగిస్తారు. తద్వారా ఆ మొత్తం గ్రామ పంచాయతీకి అదనపు ఆదాయంగా సమకూరుతుంది. గ్రామీణాభివృద్ధి శాఖ గత ఏడాది రాష్ట్రంలో 15 వేల కిలోమీటర్ల మేర, ఈ ఏడాది 10 వేల కిలోమీటర్ల మేర మొక్కలు నాటింది. సగటున ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో 1.60 కిలోమీటర్ల పొడవున ప్రస్తుతం మొక్కల పెంపకం కొనసాగుతుంది. పంచాయతీల ఆధ్వర్యంలోనే ట్రాక్టర్ ద్వారా నీటి తడులు అందజేస్తే ఒక్కొక్క గ్రామ పంచాయతీకి సరాసరి రూ.1.80 లక్షల వరకు అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ సొమ్మును ట్రాక్టర్ డీజిల్, డ్రైవర్, మరమ్మతు ఖర్చులకు వినియోగించుకునే వీలుంటుందని అధికారులు చెప్పారు. -
పేదింటి కల సాకారమయ్యేలా..
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు ఉండాలి.. ఇది రాష్ట్ర ప్రభుత్వం తనకు తాను విధించుకున్న లక్ష్యం. ప్రజాసంకల్పయాత్రలో కోట్లాదిమంది కష్టసుఖాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పదవి చేపట్టిన వెంటనే ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఉగాది నాటికి అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అధికారులకు దిశానిర్దేశం చేయడంతో ప్రభుత్వ యంత్రాంగం స్థలాల సేకరణలో నిమగ్నమైంది. గత ఐదేళ్లూ టీడీపీ పాలనలో జన్మభూమి కమిటీల పెత్తనంతో తమకు న్యాయం జరగదని నిరాశకు లోనైన బడుగువర్గాల్లో.. ప్రభుత్వ చర్యలతో మళ్లీ ఆశలు చిగురించాయి. జిల్లాలో సొంత ఇల్లు లేని వారు సుమారు 1.80 లక్షలమంది ఉన్నారు. వీరందరికీ ఇళ్ల స్థలాలు సమకూర్చాలంటే.. ఎం త స్థలం అవసరం, పట్టణాల్లో ఎంత కావాలి, గ్రామాల్లో ఎంత కావాలి.. తదితర వివరాలను సిద్ధం చేసిన అధికారులు భూ సేకరణకు కావా ల్సిన కసరత్తును ప్రారంభించారు. రెవెన్యూ అ«ధికారులు గ్రామాలవారీ, మండలాల వారీ, డివిజన్ల వారీగా భూసేకరణకు ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరం చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 1211.73 ఎకరాల ప్రభుత్వ భూములను గుర్తించారు. మహిళ పేరిట ఇళ్ల పట్టాలు, ఇళ్లు... రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. కుటుంబంలో మహిళ పేరిట ఇల్లు మంజూరు చేయనున్నారు. అంతే కాకుండా అన్ని హక్కులు కల్పిస్తూ వారి పేరిట రిజిస్ట్రేషన్ కూ డా చేసి మహిళకు హక్కులు కల్పించేందుకు నిబంధనలు రూపొందించారు. గ్రామీణ, పట్ట ణ, నగర ప్రాంతాల తేడాలు లేకుండా పేదలంతా పక్కా గృహాలు నిర్మించుకునేలా ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. సొంత ఇల్లు, స్థలం లేని వారే అర్హులు.. దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాల వారై ఉండి సొంత ఇల్లు లేని వారంతా ఈ పథకంలో లబ్ధి పొందేందుకు అర్హులే. కేంద్ర, రాష్ట్ర పథకాల ద్వారా గతంలో ఎలాంటి గృహ రాయితీ పొందకుండా ఉండాలి. 2.5 ఎకరాల మాగాణి లేదా అయిదు ఎకరాల మెట్టు కన్న తక్కువ భూమి ఉన్నవారే మాత్రమే అర్హులు. ఇంటి స్థలం కోసం ఏ ప్రాంతం నుంచి దరఖాస్తు చేసున్నారో ఆ ప్రాంతంవారై ఉండాలి, ఆధార్, రేషన్ కార్డు కలిగి ఉండాలి. వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రూ.3 లక్షల కంటే తక్కువ ఉండాలి. గ్రామం వార్డు, యూనిట్‌గా తీసుకొని ఈ దరఖాస్తు చేయా లి. ఆ గ్రామంలో ఉన్నారా లేదా తదితర వివరాలను గ్రామ వలంటీర్లు పరిశీలించి, అర్హుల జాబితాలను గ్రామ సచివాలయంలో ప్రదర్శిస్తారు. అనంతరం గ్రామ సభను నిర్వహించి అభ్యంతరాలుంటే వాటిని పరిశీలించి నిర్ణయాలు తీసుకొంటారు. తుది చర్చ అనంతరం ఎంపిక జాబితాను ప్రకటిస్తారు. పట్టణాల్లో జీ ప్లస్ 3, 4 పద్ధతిలోనూ, గ్రామాల్లో గ్రౌండ్ ఫ్లోర్‌తో ఇల్లు నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో అందుబాటులో ఉన్న భూమి.. ఇల్లుకు అనువైన భూమిని రెవెన్యూ అధికా రులు గ్రామాల వారీగా గుర్తిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో అనువైన స్థలం లేదు. దీంతో అక్కడ ప్రైవేటు భూముల్లో ఇళ్ల నిర్మాణానికి అనుకూలంగా ఉన్నవి గుర్తించే పనిలో ఉన్నారు. జిల్లాలో 1863 రెవెన్యూ గ్రామాలు న్నాయి. వీటిలో ఇప్పటి వరకు 1128 రెవె న్యూ గ్రామాల్లో 1211.73 ఎకరాల ప్రభుత్వ భూములను గుర్తించారు. ఇంకా కొన్ని గ్రామాల్లో భూములు గుర్తించాల్సి ఉంది. -శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్లో 13 మండలాల్లో 562 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. వీటిలో 333 రెవెన్యూ గ్రామాల్లో 418.04 ఎకరాలు గుర్తించారు. 226 గ్రామాల్లో అనువైన ప్రభుత్వ భూములు లేవు. -పాలకొండ డివిజన్లో 635 రెవెన్యూ గ్రామాలున్నాయి. వీటిలో 448 గ్రామాల్లో ప్రభుత్వ భూమి ఉంది. 282.24 ఎకరాలు గుర్తించారు. 187 గ్రామాల్లో అనువైన భూములు లేవని తేల్చారు. -టెక్కలి డివిజన్లో 666 రెవెన్యూ గ్రామాలున్నాయి. వీటిలో 347 గ్రామాలలో భూములు గుర్తించారు. 511.45 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ డివిజన్లో 319 గ్రామాల్లో ఇళ్లకు అనువైన ప్రభుత్వ భూమి లేదు. -
క్యాన్సర్ సోకిన పిల్లలకు ఇక్కడ ఉచిత వైద్యం
పంజాబ్: పంజాబ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. క్యాన్సర్ బారిన పడిన పిల్లలు( 18సంవత్సరాలలోపు) ఉచితంగా వైద్యం అందించేందుకు నిర్ణయించింది. క్యాన్సర్ వ్యాధిపై పత్ర్యేక అవగాహనా కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం శుక్రవారం ఈ ప్రకటన చేసింది. ఈ పథకం అమలుకోసం లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థ క్యాన్‌కిడ్స్‌తో పంజాబ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఒక అవగాహనా ఒప్పందంపై సంతకం చేసింది. సీఎం క్యాన్సర్ రిలీఫ్ ఫండ్ పథకంలో క్యాష్ లెస్ ట్రీట్మెంటును రోగులుకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో రూ. 1.5లక్షల మేర చికిత్స కు కేటాయించనున్నారు. ఇప్పటివరకు ఇది పెద్దలకు మాత్రమే పరిమితమైన ఈ క్యాష్‌లెస్ ట్రీట్మెంటును ఇకపై పిల్లలకుకూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. పీడియాట్రిక్ ఆంకాలజీ పై నిర్వహించిన రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్‌లో రాష్ట్ర ఆరోగ్య మంత్రి బ్రహ్మ మహీంద్రా ప్రకటించారు. రాష్ట్రంలో క్యాన్సర్‌తో బాధపడుతున్న ప్రతి శిశువుకు ఆరోగ్య సేవలను అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇందుకు లాభాపేక్ష లేని సంస్థ స్వచ్ఛంద సంస్థ క్యాన్‌కిడ్స్‌తో పంజాబ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఒక అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపారు. క్యాన్సర్‌పై మరింత అవగాహన కల్పించడానికి వచ్చే వారం రాష్ట్ర వ్యాప్త కార్ల ర్యాలీ నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ క్రమంలో పటియాలా, అమృత్సర్ మెడికల్ కాలేజీతో సహా ఇతర క్యాన్సర్ ఆసుపత్రుల్లో సౌకర్యాలను మెరుగు పర్చేపథకాలను అమలు చేసినట్టు పేర్కొనన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలు, మహిళలకు పరీక్షలు నిర్వహించడానికి వైద్య అధికారులు, సిబ్బంది నర్సులు, సహాయక నర్సింగ్ మంత్రసానులకు ఏఎన్ఎం ఆరోగ్య శాఖ ప్రత్యేక శిక్షణను అందిస్తోంది. -
మీకు న్యాయం చేస్తాం..
నయీం బాధితులకు ఎస్పీ హామీ భువనగిరి : నయీం, అతడి అనుచరుల బాధితులందరికీ న్యాయం చేస్తామని ఎస్పీ ఎన్.ప్రకాశ్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో టీచర్స్ కాలనీ పక్కన ఉన్న శ్రీలక్ష్మీనర్సింహస్వామి నగర్ ప్లాట్ల ఓనర్ల వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు 150 మందితో ఎస్పీ రెండు గంటల పాటు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితుల నుంచి ఎస్పీ వివరాలు తెలుసుకున్నారు. ప్రధానంగా నయీం అనుచరుడు షేక్ షకీల్ మరికొంత మంది తమను కత్తులు, తుపాకులు చూపించి బెదిరించి ప్లాట్ల వద్దకు వెళ్లకుండా అడ్డుకోవడంతో పాటు, తమ డాక్యుమెంట్లు లాక్కున్నారని వివరించారు. తమ భూములను కబ్జా చేసుకున్నారని, ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఈ స్థలం అంతా బాయ్‌సాబ్‌దని చెప్పి బెదిరించారని వివరించారు. తమకు న్యాయం చేయాలని బాధితుల సంఘం కార్యదర్శి పులికంటి నరేష్ ఎస్పీని వేడుకున్నాడు. కాగా, బాధితులు తెలిపిన విషయాలను సమగ్రంగా విన్న ఎస్పీ ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నిబంధనల ప్రకారం అందరికీ తప్పకుండా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఎస్పీ వెంట డీఎస్పీ ఎస్.మోహన్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ ఎం.శంకర్‌గౌడ్, రూరల్ సీఐ అర్జునయ్య ఉన్నారు. -
కేజీబీవీల్లోవసతులు కల్పించాలి
–విద్యార్థులకు మంచి బోధన కల్పించాల్సిన బాధ్యత స్పెషల్ ఆఫీసర్లదే –తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయెుద్దు –కలెక్టర్ సత్యనారాయణరెడ్డి సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్, పాల్గొన్న అధికారులు నల్లగొండ : జిల్లాలోని కస్తూరిబాగాంధీ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా మౌలిక సౌకర్యాలన్నీ కల్పించాలని కలెక్టర్ పి.సత్యనారాయణ రెడ్డి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కస్తూరిబా గాంధీ ఆశ్రమ పాఠశాలల స్పెషల్ ఆఫీసర్లు, ఇంజనీరింగ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని 46 కస్తూరిబాగాంధీ ఆశ్రమ పాఠశాలలు ఉండగా వాటిలో కొన్నింటికీ తలుపులు, కిటికీలు సరిగా లేవన్నారు. వెంటనే వాటిని బిగించాలని సూచించారు. 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు స్పెషల్ ఆఫీసర్లు ముందస్తు ప్రణాళికతో విద్యార్థులను తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఎంతో నమ్మకంతో ఆశ్రమ పాఠశాలల్లో చేర్చిస్తున్నారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా చూడాల్సిన బాధ్యత స్పెషల్ ఆఫీసర్లదేనన్నారు. విద్యార్థులకు మంచి బోధన అందేలా చూడాలన్నారు. ప్రభుత్వం ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు పేద విద్యార్థుల విద్య కోసం ఖర్చు చేస్తుందని, దాని ప్రతిఫలంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని కోరారు.ఉపాధ్యాయులు కొరత ఉన్నట్లయితే గెస్ట్ టీచర్లను నియమించుకోవాలని సూచించారు. ప్రతి పాఠశాలలో తాగునీరు, ప్రహరీలు, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలు ఉండే విధంగా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. స్పెషల్ ఆఫీసర్లు విద్యార్థులకు అందుబాటులో ఉండాలన్నారు. సమావేశంలో ఏజేసీ వెంకట్రావు, డీఈఓ చంద్రమోహన్, సర్వశిక్షా అభియాన్ పీడీ కిరణ్‌కుమార్, కస్తూరిబా గాంధీ ఆశ్రమ పాఠశాలల స్పెషల్ ఆఫీసర్లు, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి విద్యార్థికి సీటు కల్పించాలి
గద్వాల : డిగ్రీ కళాశాలలో చేరడానికి దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి సీటు కల్పించాలని ఏబీవీపీ నగర కార్యదర్శి వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆన్లైన్ ప్రవేశాల కారణంగా చాలామంది విద్యార్థులు నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని నిరసిస్తూ ఏబీవీపీ నాయకులు బుధవారం కళాశాల ప్రాంగణంలో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, యూనివర్సిటీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆన్లైన్ ప్రవేశాల కారణంగా పేద విద్యార్థులు అనేక మంది సక్రమంగా నమోదు చేసుకోలేదని, దీంతో వారు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని యూనివర్సిటీ అధికారులు ప్రభుత్వంతో చర్చించి తక్షణ ప్రవేశాలు కల్పించాలని కోరారు. లేనిపక్షంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు నాగరాజు, సతీష్, నంద, ప్రసాద్, జితేందర్, మాధవ్, అనిల్, భాను, సాయి, శ్రీకాంత్, నర్సింహ తదితరులు పాల్గొన్నారు. -
పీయూలో పీహెచ్‌సీని ఏర్పాటుచేయాలి
పాలమూరు యూనివర్సిటీ: పీయూలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని, సమస్యలను పరిష్కారించాలని కొరుతూ ఎస్ఎఫ్ఐ నాయకులు సోమవారం పీయూ వీసీ భూక్యా రాజారత్నంకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు ఆంజనేయులు మాట్లాడుతూ పీయూలో వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని, గ్రంథాలయం, ఫార్మసీ కళాశాలలో ఉన్న కంప్యూటర్లకు ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలని తెలిపారు. ఫార్మసీ ఆడిటోరియాన్ని పూర్తిచేయాలని, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ, ఫార్మసీ హాస్టల్స్ సమీపంలో మైదానం నిర్మించాలని, ప్రతి హాస్టల్లో మంచినీటి సౌకర్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో అంజి, రవి, రజినికాంత్, రాఘవేందర్, సందీప్ పాల్గొన్నారు. -
జిల్లాకు లక్షకోట్ల ప్యాకేజీ కేటాయించాలి
– బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాండుయాదవ్ ధన్వాడ : వలస జిల్లాగా పేరుగాంచిన పాలమూరు జిల్లాకు ప్రభుత్వం లక్షకోట్ల ప్యాకేజీని కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాండుయాదవ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడారు. అన్ని రంగాల్లో వెనకబడిన బీసీల అభివద్ధికి ప్రభుత్వం రూ. 25వేల కోట్ల ప్యాకేజీని అమలు చేస్తే నిరుద్యోగులకు ఉపాధి కల్పించే అవకాశం ఉందన్నారు. బీసీలకు చట్టసభలో కూడా రిజర్వేషన్ కల్పించకుండా అగ్రకులాల వారు కుట్రకు దిగుతున్నారని మండిపడ్డారు. గ్రామస్థాయి నుంచి బీసీలు బలోపేతం అయినప్పుడే సామాజిక అధికారం బీసీలకు దక్కుతుందన్నారు. మనలో చైతన్యం రావడం కోసమే గ్రామ గ్రామాన బీసీ చైతన్య సదస్సులు నిర్వహిస్తున్నమని తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా గౌవర అధ్యక్షుడు ఆచారి, జిల్లా కార్యదర్శి కష్ణయ్య, వెంకటేష్, రాజ్‌యాదవ్, ఉదయబాను తదితరులు పాల్గొన్నారు. -
పుష్కరఘాట్లలో వసతులు కల్పించాలి
రాంనగర్ : కష్ణా పుష్కర ఘాట్లలో భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్న వసతి సౌకర్యాలను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పుష్కరాల ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పుష్కర ఘాట్ల వద్ద మంచి నీరు, విద్యుత్ సౌకర్యం, మరుగుదొడ్ల నిర్మాణం, కల్పించడంతో పాటు ఘాట్ నుంచి నదిలోనికి వెళ్లకుండా పెన్షింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే దుస్తులు మార్చుకునే గదులు, దుస్తులు తగిలించుకునేందుకు అనువుగా కొక్కాలు తదితర మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఘాట్ల వద్ద జరుగుతున్న పనులను ఎప్పటికప్పుడు ఫొటోలతో సహా తెలియజేయాలని ఆదేశించారు. పుష్కరఘాట్లలో ఏ సమయంలోనైనా తనిఖీలు నిర్వహిస్తామని, పనుల్లో లేని సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ డాక్టర్ యన్.సత్యనారాయణ, డీఆర్వో రవి, ఘాట్ ఇన్చార్జిలు తదితరులు పాల్గొన్నారు. -
బ్యాంకర్లు ముందుకు వస్తే ఆన్లైన్ సేవలు
టీటీడీ బోర్డు సభ్యుడు రమణ కొడంగల్ : బ్యాంకర్లు సహకరిస్తే టీటీడీ కల్యాణమంటపాల్లో ఆన్లైన్ సేవలు అందించడానికి టీటీడీ అనుమతి ఇస్తుందని పాలకవర్గం సభ్యుడు ఏవీ రమణ అన్నారు. ఆదివారం స్థానిక వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఆయన సందర్శించారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని ఆయన విలేకరులతో మాట్లాడారు. టీటీడీలో సిబ్బంది కొరత ఉన్నందున తాము ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేయలేకపోతున్నామన్నారు. కొడంగల్ ఆలయానికి వైభవోత్సవ మంటపాన్ని మంజూరు చేయడానికి దరఖాస్తు చేసుకోవాలని ఆలయ ధర్మకర్తలకు సూచించారు. భక్తుల కోరిక మేరకు కొడంగల్ ఆలయ అభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సిములు, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి వెంకటేశ్వర్లు, జిల్లా నాయకుడు తిరుపతి రెడ్డి, నందారం ప్రశాంత్, అనురాధ ఉన్నారు. -
రోగులకు మెరుగైన సేవలు అందించాలి
నకిరేకల్ : రోగులకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సమన్వయాధికారి డా.పద్మజ కోరారు. బుధవారం నకిరేకల్‌లోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మికంగా తనిఖీ చేసి ఆస్పత్రిలోని రిజిస్టర్లను పరిశీలించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న మహిళలను పరామర్శించి వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. అనంతరం ఆస్పత్రి ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఆసుపత్రి ప్రధాన వైద్యాధికారి డాక్టర్ రఫీ, డాక్టర్లు శేఖర్, రజిత, రమణారెడ్డి, తెలంగాణ వైద్య ఉద్యోగుల సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కాంపాటి శ్యామ్, సిబ్బంది ఝాన్సీరాణి, ప్రసాద్, సువర్ణ ఉన్నారు. -
క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి
కోదాడఅర్బన్: క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 11న ఆలిండియా దళిత క్రైస్తవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ పక్షాన సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మలపల్లి భాస్కర్ తెలిపారు. మంగళవారం పట్టణంలో జరిగిన కార్యక్రమంలో ఆయన దీనికి సంబంధించిన పోస్టర్‌ను , సంఘం నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చలో ఢిల్లీ కార్యక్రమంలో అధిక సంఖ్యలో దళిత క్రైస్తవులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత క్రైస్తవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఉదయ్‌బాబు, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కర్ల సుందర్‌బాబు, జిల్లా కార్యదర్శి దేవిరెడ్డి లింగారెడ్డి, కొండా రవి, కొత్తపల్లి ప్రశాంత్, జాన్ వెంకటేష్, జిల్లా అధ్యక్షుడు గంటా జీవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అవకతవకలకు పాల్పడితే చర్యలు
మానవపాడు: విద్యార్థులకు అందించే భోజనం విషయంలో అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని జిల్లా పీఓ గోవిందరాజులు అన్నారు. మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ విద్యాలయాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. కస్తూర్బాలో చాలీచాలని భోజనం పెడుతున్నారని, మంచినీటికి తీవ్ర ఇబ్బంది పడుతున్నామని విద్యార్థులు పేర్కొంటూ ఎస్ఓ, టీచర్లను గదిలో బంధించి ధర్నా చేసిన విషయం విధితమే. ఈమేరకు పీఓ కస్తూర్బాను తనిఖీ చేశారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి ఎస్ఓ శ్రీదేవి, టీచర్లను ఎందుకు నిర్బంధించాల్సి వచ్చిందో అడిగి రాతపూర్వకంగా సమస్యలు స్వీకరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సోమవారం చోటుచేసుకున్న సంఘటన కేవలం టీచర్ల సమన్వయం లేకపోవడమే తప్ప విద్యార్థులకు అందించే ఆహారంలో కాదన్నారు. మరుగుదొడ్లు, బాత్రూంలు సరిగాలేనట్లు మా పరిశీలనలో తేలిందని వాటిపై కాంట్రాక్టర్‌ను మందలించి మరమ్మతులు చేయిస్తామన్నారు. ఇదిలాఉండగా, జిల్లా అధికారులు వస్తే మా సమస్యలు తీరతాయనుకున్నామని, కానీ పైపై రిపోర్టు తీసుకొని పోవడంపై కొందరు విద్యార్థులు ‘సాక్షి’తో అసంతృప్తి వ్యక్తంచేశారు. -
అవకతవకలకు పాల్పడితే చర్యలు
మానవపాడు: విద్యార్థులకు అందించే భోజనం విషయంలో అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని జిల్లా పీఓ గోవిందరాజులు అన్నారు. మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ విద్యాలయాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. కస్తూర్బాలో చాలీచాలని భోజనం పెడుతున్నారని, మంచినీటికి తీవ్ర ఇబ్బంది పడుతున్నామని విద్యార్థులు పేర్కొంటూ ఎస్ఓ, టీచర్లను గదిలో బంధించి ధర్నా చేసిన విషయం విధితమే. ఈమేరకు పీఓ కస్తూర్బాను తనిఖీ చేశారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి ఎస్ఓ శ్రీదేవి, టీచర్లను ఎందుకు నిర్బంధించాల్సి వచ్చిందో అడిగి రాతపూర్వకంగా సమస్యలు స్వీకరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సోమవారం చోటుచేసుకున్న సంఘటన కేవలం టీచర్ల సమన్వయం లేకపోవడమే తప్ప విద్యార్థులకు అందించే ఆహారంలో కాదన్నారు. మరుగుదొడ్లు, బాత్రూంలు సరిగాలేనట్లు మా పరిశీలనలో తేలిందని వాటిపై కాంట్రాక్టర్‌ను మందలించి మరమ్మతులు చేయిస్తామన్నారు. ఇదిలాఉండగా, జిల్లా అధికారులు వస్తే మా సమస్యలు తీరతాయనుకున్నామని, కానీ పైపై రిపోర్టు తీసుకొని పోవడంపై కొందరు విద్యార్థులు ‘సాక్షి’తో అసంతృప్తి వ్యక్తంచేశారు. -
లిక్విడిటీ సపోర్టు హామీ ఇచ్చిన రాజన్
ముంబై: బ్రెగ్జిట్ పరిణామాలపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ప్రశాంతంగా ఉండాలని ఆర్థిక మార్కెట్లను కోరారు. ఇతర స్థూల సూచికలను తో పాటు భారతదేశం యొక్క ఆర్థిక మూలాల బలంగా ఉన్నాయని, ఎలాంటి భయాలు అవసరం లేదని హామీ ఇచ్చారు. అటు కేంద్ర బ్యాంకు ఆర్ బీఐ గవర్నర్ రఘురామ రాజన్ కూడా స్పందించారు. అన్ని మార్కెట్లను నిశితంగా గమనిస్తున్నామని, రూపాయి విలువను కాపాడేందుకు జోక్యం చేసుకుంటామని ప్రకటించారు. లిక్విడిటీ సపోర్టు ఇవ్వనున్నట్టు తెలిపారు. పరిస్థితుల కనుగుణంగా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఇతర కరెన్సీల తో పోలిస్తే రూపాయి బాగా పతనంమైందనీ, అవసరమైనప్పుడు జోక్యం చేసుకుంటామని హామీ ఇచ్చారు. మరోవైపు డాలర్ తో పోలిస్తే దేశీయ కరెన్సీ మరింత క్షీణించకుండా రిజర్వు బ్యాంకు జోక్యం చేసుకుంటుందని ఎనలిస్టులు తెలిపారు. కరెన్సీ విలువ మరింత పడిపోకుండా డాలర్ అమ్మకాలకు దిగొచ్చని తెలుస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల సంక్షేమం దృష్ట్యా చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
భారత్ లో పారిశుద్ధ్యం కోసం కిలిమంజారో ఎక్కాడు!
భారతదేశంలోని పాఠశాలల్లో పారిశుధ్య సౌకర్యాలే లక్ష్యంగా అతడు నడుం బిగించాడు. విద్యార్థుల అవస్థలు తీర్చేందుకు సిద్ధపడ్డాడు. అందుకు సొమ్ము సమకూర్చుకోడానికి పర్వతారోహణ ప్రారంభించాడు. ఇండో కెనడియన్ వ్యాపారవేత్త గిరీష్ అగర్వాల్ ఫిబ్రవరి 29న ఆఫ్రికాలోని అత్యంత ఎత్తైన పర్వతం కిలిమంజారో ఎక్కి రూ. 40 లక్షల నిధులు సేకరించాడు. 'సమిట్ ఫర్ డిగ్నిటీ పేరున' ప్రచారం చేపట్టి ఇండియాలోని పాఠశాల విద్యార్థులకు మౌలిక సౌకర్యాల కల్పనకు పూనుకున్నాడు. పాఠశాల వయసు నుంచే పిల్లల్లో పరిశుభ్రతపై అవగాహనతో పాటు, మంచి అలవాట్లను పెంపొందించాలన్న ఉద్దేశంతో గిరీష్ అగర్వాల్ తన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాడు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇండియాలోని 60 కోట్ల మంది ప్రజలు పారిశుధ్య సమస్యతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. అందులోనూ పాఠశాలల్లో ఈ సమస్య మరింతగా ఉంది. సుమారు 45 శాతం స్కూళ్లలో మౌలిక సమదుపాయాలు లేవు. ప్రధాని పిలుపు మేరకు స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టినా పాఠశాలల్లో 40 మంది విద్యార్థులకు ఒక టాయిలెట్ చొప్పున ఉన్నాయి. ఒక్కో స్కూల్లో సుమారు 250 మంది విద్యార్థులకు ఒకే టాయిలెట్ ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు అనేక ఇన్ఫెక్షన్లకు గురౌతున్నారు. డ్రాపవుట్స్ సంఖ్య కూడా పెరుగుతోంది. ఒక్క జంషెడ్ పూర్ లోనే 200 మంది విద్యార్థినులు మౌలిక సదుపాయాల లేమి కారణంగా డ్రాపవుట్స్ గా మారారు. ఈ విషయంపై దృష్టి సారించిన అగర్వాల్ నిధుల సేకరణ కోసం పర్వతారోహణ ప్రారంభించాడు. అత్యంత ప్రమాదకరమైన ప్రయత్నమే అయినా.. ఛాలెంజింగ్ గా తీసుకున్న అగర్వాల్ 5900 మీటర్ల ఎత్తైన పర్వతం కిలిమంజారో అధిరోహించాడు. పర్వతారోహణకు కావలసిన ఆరోగ్యం కోసం అగర్వాల్ కఠిన నియమాలు పాటించాడు. అందుకు తనకు భార్య శృతి, స్నేహుతులు ఎంతో సహకరించారని చెప్తున్నాడు. ముంబైలో పుట్టి, ఢిల్లీలో పెరిగిన అగర్వాల్ ప్రస్తుతం కెనడాలో నివసిస్తున్నాడు. అక్కడి వ్యాపారవేత్తల్లో టాప్ 25 గా నిలవడమే కాక, కెనడా వలస పెట్టుబడిదారుల గ్రూప్ గోల్డ్ మెడలిస్ట్ అవార్డును కూడా అందుకున్నాడు. తాను పేదరికంలో పుట్టినా, అయితే తన తల్లిదండ్రులకు ఇరుగు పొరుగులు, బంధువులు సహకరిచండంతో చదువుకోగాలిగానని, అందుకు కృతజ్ఞుడినని అగర్వాల్ చెబుతున్నాడు. వివిధ దేశాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి వీలుగా అగాఖాన్ డెవలప్మెంట్ నెట్‌వర్క్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్న అగర్వాల్... ఇళ్ళల్లో లక్ష మరుగుదొడ్లు, సూళ్ళలో 528 టాయిలెట్ బ్లాకులు, అలాగే 26 కమ్యూనిటీ టాయిలెట్ కాంప్లెక్సుల నిర్మాణం కోసం రూ. 1.67 కోట్ల నిధుల సేకరణే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తన ఫండ్ రైజర్ పేజిలో రాశాడు. అందుకోసం ఒక్కో పర్వతం ఒక్కోసారి ఎక్కి తన కల నెలవేర్చుకోవాలన్న ఆలోచనలో ఉన్నాడు. -
సినిమా హాళ్లలో ఉచితంగా నీరు అందిచాల్సిందే..
-
అభయ ఘటన్ నేపధ్యంలో మహిళా ఉద్యోగులకు భద్రత
-
ఈస్టర్న్ ఫ్రీవేపై స్పీడ్గన్లు
సాక్షి, ముంబై: ఇటీవల ఈస్టర్న్ ఫ్రీవేపై రెండు రోడ్డు ప్రమాదాలు జరగడంతో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎంఎంఆర్డీఏ), ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా ఈ మార్గంపై స్పీడ్ గన్లను అమర్చాలని యోచిస్తున్నారు. స్పీడ్గన్ల ఏర్పాటు వలన మితిమీరిన వేగంతో వచ్చే వాహనాలపై నిఘా ఉంచేందుకు వీలు కలుగుతుందని అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఈ మార్గంపై 20 సీసీటీవీలను కూడా అమర్చనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఫ్రేవేపై వేగ పరిమితిని ఉల్లఘించిన వారిపై ఇక మీదట కఠిన చర్యలు తీసుకోనున్నామని పోలీసులు తెలిపారు. ఒకోసారి వాహనదారులు ఈ స్పీడ్ గన్‌లో నమోదైన వేగాన్ని అంగీకరించడంలేదు. తాము వాహనాన్ని అంత వేగంగా నడపలేదని బుకాయించి పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. దీంతో ఈ స్పీడ్గన్లను సీసీటీవీ కెమరాలతో అనుసంధానం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో వేగంగా వచ్చే వాహనాల దృశ్యాలు ఈ కెమరాలో నమోదు కావడంతో సదరు వాహన దారుడు తప్పించుకోలేడని డిప్యూటి పోలీసు కమీషనరు (ట్రాఫిక్) సుభాష్ నిలేవడ్ తెలిపారు. ఇదిలా వుండగా ఈ స్పీడ్ గన్ల కోసం నిధులను సమకూర్చేందుకు ఎంఎంఆర్డీఏని పోలీసులు ఆశ్రయించారు. దీంతో ఈ సంస్థ ఎనిమిది స్పీడ్ గన్లను కొనుగోలు చేయడానికి నిర్ణయించింది. వీటితోపాటు ఎంఎంఆర్డీఏ 20 సీసీటీవీలను అమర్చేందుకు నిధులను కేటాయించనుంది. ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఈ ఫ్రీవేను అనుక్షణం పరిశీలించడం సాధ్యం కావడం లేదనీ, అయితే ఈ ఫ్రీవేను ఉపయోగిస్తున్న ద్విచక్రవాహన దారులను నిషేధించడానికి ప్రవేశ ద్వారం వద్ద ఇద్దరు పోలీసులను నియమించామన్నారు. రాత్రి వేళలో పోలీసులు ఇక్కడ విధులు నిర్వహించని సమయం చూసి ద్విచక్ర వాహన దారులు ఈ మార్గాన్ని ఉపయోగిస్తున్నారు. దీంతో రాత్రి వేళలో ఈ ఫ్రీవేలను పర్యవేక్షించమని సివిల్ పోలీసులను కోరనున్నట్లు నిలేవడ్ తెలిపారు. -
పునరావాస పాట్లు
సాక్షి, ముంబై: నగరంలో శిథిలావస్థకు చేరుకున్న భవనాల్లో నివసిస్తున్న వారిని ఖాళీ చెయ్యించాలంటే మహారాష్ట్ర హౌసింగ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ(మాడా)కు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ట్రాన్సిట్ క్యాంపుల్లో తగినన్ని ఇళ్లు ఖాళీగా లేకపోవడంతో అక్కడకు వెళ్లేందుకు అనేక మంది నిరాకరిస్తుండటంతో అధికారులకు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. నగరంలో గత కొన్నిరోజులుగా పాత భవనాలు పేకమేడల్లా కూలుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో ప్రాణ, ఆస్తి నష్టం పెద్ద మొత్తంలోనే వాటిల్లుతోంది. నగరంలో వందలాది భవనాలు ప్రమాదకర స్థితిలో ఉన్నాయని ఇటీవల ఓ అధ్యయనంలో వెల్లడైంది. ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేందుకు సాధమైనంత త్వరగా వాటిని ఖాళీ చేయించాలని మాడా, బీఎంసీలను ప్రభుత్వం అదేశించింది. అయితే ప్రమాదకర భవనాల్లో నివాసముంటున్న సదరు వేలాది కుటుంబాలకు పునరావాసం ఎక్కడ కల్పించాలనేది అధికారులకు సమస్యగా మారింది. ఇందుకోసం మాడా ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతోంది. నగరంలో మూత పడిన మిల్లు స్థలాల్లో మాడా వాటాలోకి వచ్చిన స్థలంలో నిర్మిస్తున్న, నిర్మించనున్న భవనాల్లో ట్రాన్సిట్ క్యాంపుల కోసం కొన్ని ఇళ్లను కేటాయించింది. ఇటీవల కాళా చౌకి ప్రాంతంలో ఓ మిల్లు స్థలంలో మాడా దాదాపు 10 వేల ఇళ్లు నిర్మించింది. ఇందులో 6,925 ఇళ్లు మిల్లు కార్మికులకు కేటాయించగా, మిగతా 3,075 ఇళ్లు ట్రాన్సిట్ క్యాంపుల కోసం కేటాయించింది. అయితే ముంబైలో 15 మిల్లులకు చెందిన 62,507 చదరపు మీటర్ల స్థలం కార్మికులకు ఇళ్లు నిర్మించేందుకు మాడా ఆధీనంలో ఉంది. ఈ స్థలంలో భవన నిర్మాణం పనులు చేపడితే కార్మికులకు ఇళ్లు లభించడంతోపాటు ట్రాన్సిట్ క్యాంపుల కోసం 3,283 ఇళ్లు అందుబాటులోకి వస్తాయి. అందుకు ప్రభుత్వం, మాడా సమన్వయంతో సకాలంలో పనులు ప్రారంభించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఇళ్లు మాడా ఆధీనంలో ఉంటే అత్యవసర సమయంలో బాధితులకు పునరావాసం కల్పించడానికి ఎంతో దోహదపడతాయి. అయితే ఇప్పుడు మాడా వద్ద ఇళ్లు ఖాళీ లేకపోవడంతో పురాతన భవనవాసుల తరలింపు తలనొప్పిగా మారింది. ట్రాన్సిట్ క్యాంపుల భవనాల నిర్మాణం కోసం ప్రత్యేకంగా స్థలం వెతకాల్సిన పని లేదని,అందుబాటులో ఉన్న మిల్లు స్థలాల్లోనే ఇళ్లు నిర్మిస్తే చాలు పునరావాస సమస్య పరిష్కరమవుతుందని మాడా గృహనిర్మాణ శాఖ అధికారులు అంటున్నారు. ఇవి అందుబాటులోకి రావాలంటే ముందు మిల్లు కార్మికుల కోసం ఇళ్లు నిర్మించాలి. వాటిని కార్మికులకు చౌక ధరకు విక్రయించాలి. వీటి ద్వారా వచ్చే నిధులతో ట్రాన్సిట్ క్యాంపు భవనాలు నిర్మించేందుకు సాధ్యపడుతుందని ఓ అధికారి వెల్లడించారు. నగరం, పశ్చిమ, తూర్పు శివారు ప్రాంతాల్లో సుమారు 58 మిల్లులు ఉన్నాయి. ప్రస్తుతం అవన్నీ మూతపడడంతో నియమాల ప్రకారం మిల్లు స్థలాన్ని మూడు భాగాలు చే యాలి. ఇందులో ఒక భాగం మిల్లు యజమానికి, రెండో భాగం ప్రభుత్వానికి, మూడో భాగం మాడాకు అందజేయాల్సి ఉంటుంది. మాడా వాటాలోకి వచ్చిన మొత్తం స్థలంలో కార్మికుల ఇళ్లకు పోనూ మిగతా స్థలంలో మాడా తమ ట్రాన్సిట్ క్యాంపులకు వినియోగించుకుంటుంది. ఇలా నిర్మించిన ఇళ్లు ప్రస్తుతం కాళాచౌకిలో మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. మిగతా మిల్లు స్థలాలు మాడా అధీనంలోకి వస్తే ఇక్కడ వేలాది ఇళ్లు నిర్మించి పునరావాస గృహాలుగా వినియోగించుకునేందుకు వీలు కలగనుంది.