లిక్విడిటీ సపోర్టు హామీ ఇచ్చిన రాజన్
ముంబై: బ్రెగ్జిట్ పరిణామాలపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ప్రశాంతంగా ఉండాలని ఆర్థిక మార్కెట్లను కోరారు. ఇతర స్థూల సూచికలను తో పాటు భారతదేశం యొక్క ఆర్థిక మూలాల బలంగా ఉన్నాయని, ఎలాంటి భయాలు అవసరం లేదని హామీ ఇచ్చారు.
అటు కేంద్ర బ్యాంకు ఆర్ బీఐ గవర్నర్ రఘురామ రాజన్ కూడా స్పందించారు. అన్ని మార్కెట్లను నిశితంగా గమనిస్తున్నామని, రూపాయి విలువను కాపాడేందుకు జోక్యం చేసుకుంటామని ప్రకటించారు. లిక్విడిటీ సపోర్టు ఇవ్వనున్నట్టు తెలిపారు. పరిస్థితుల కనుగుణంగా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఇతర కరెన్సీల తో పోలిస్తే రూపాయి బాగా పతనంమైందనీ, అవసరమైనప్పుడు జోక్యం చేసుకుంటామని హామీ ఇచ్చారు.
మరోవైపు డాలర్ తో పోలిస్తే దేశీయ కరెన్సీ మరింత క్షీణించకుండా రిజర్వు బ్యాంకు జోక్యం చేసుకుంటుందని ఎనలిస్టులు తెలిపారు. కరెన్సీ విలువ మరింత పడిపోకుండా డాలర్ అమ్మకాలకు దిగొచ్చని తెలుస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల సంక్షేమం దృష్ట్యా చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.