ఈస్టర్న్ ఫ్రీవేపై స్పీడ్‌గన్‌లు | MMRDA decided to provide speed gun on free way | Sakshi
Sakshi News home page

ఈస్టర్న్ ఫ్రీవేపై స్పీడ్‌గన్‌లు

Published Tue, Oct 22 2013 11:53 PM | Last Updated on Fri, Sep 1 2017 11:52 PM

MMRDA decided to provide speed gun on free way

సాక్షి, ముంబై: ఇటీవల ఈస్టర్న్ ఫ్రీవేపై రెండు రోడ్డు ప్రమాదాలు జరగడంతో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎంఎంఆర్డీఏ), ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా ఈ మార్గంపై స్పీడ్ గన్‌లను అమర్చాలని యోచిస్తున్నారు. స్పీడ్‌గన్‌ల ఏర్పాటు వలన మితిమీరిన వేగంతో వచ్చే వాహనాలపై నిఘా ఉంచేందుకు వీలు కలుగుతుందని అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఈ మార్గంపై 20 సీసీటీవీలను కూడా అమర్చనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఫ్రేవేపై వేగ పరిమితిని ఉల్లఘించిన వారిపై ఇక మీదట కఠిన చర్యలు తీసుకోనున్నామని పోలీసులు తెలిపారు.  ఒకోసారి వాహనదారులు ఈ స్పీడ్ గన్‌లో నమోదైన వేగాన్ని  అంగీకరించడంలేదు. తాము వాహనాన్ని అంత వేగంగా నడపలేదని బుకాయించి పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. దీంతో ఈ స్పీడ్‌గన్‌లను సీసీటీవీ కెమరాలతో అనుసంధానం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో వేగంగా వచ్చే వాహనాల దృశ్యాలు ఈ కెమరాలో నమోదు కావడంతో సదరు వాహన దారుడు తప్పించుకోలేడని డిప్యూటి పోలీసు కమీషనరు (ట్రాఫిక్) సుభాష్ నిలేవడ్ తెలిపారు.
 
 ఇదిలా వుండగా ఈ స్పీడ్ గన్‌ల కోసం నిధులను సమకూర్చేందుకు ఎంఎంఆర్డీఏని పోలీసులు ఆశ్రయించారు. దీంతో ఈ సంస్థ ఎనిమిది స్పీడ్ గన్‌లను కొనుగోలు చేయడానికి నిర్ణయించింది. వీటితోపాటు ఎంఎంఆర్డీఏ 20 సీసీటీవీలను అమర్చేందుకు నిధులను కేటాయించనుంది. ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఈ ఫ్రీవేను అనుక్షణం పరిశీలించడం సాధ్యం కావడం లేదనీ, అయితే ఈ ఫ్రీవేను ఉపయోగిస్తున్న ద్విచక్రవాహన దారులను నిషేధించడానికి ప్రవేశ ద్వారం వద్ద ఇద్దరు పోలీసులను నియమించామన్నారు. రాత్రి వేళలో పోలీసులు ఇక్కడ విధులు నిర్వహించని సమయం చూసి ద్విచక్ర వాహన దారులు ఈ మార్గాన్ని ఉపయోగిస్తున్నారు. దీంతో రాత్రి వేళలో ఈ ఫ్రీవేలను పర్యవేక్షించమని సివిల్ పోలీసులను కోరనున్నట్లు నిలేవడ్ తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement