speed gun
-
నల్లమల ఘాట్ రోడ్‌లోనూ డ్రంక్ అండ్ డ్రైవ్
అసలే దట్టమైన నల్లమల అభయారణ్యం.. ఎత్తయిన ఘాట్ రోడ్డు.. భారీ మలుపులు.. వాహనదారుల అజాగ్రత్తలతో నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగితే రెండువైపులా భారీగా నిలిచిపోతున్న వాహనాలు.. గంటల తరబడి ట్రాఫిక్ జామ్.. సంఘటన స్థలానికి అంబులెన్స్, పోలీసు వాహనాలు చేరుకునేందుకు కూడా అష్టకష్టాలు పడాలి.. ఈలోపు క్షతగాత్రుల ప్రాణాలు పోయే పరిస్థితి నెలకొని ఉంది. వీటిని దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం, కర్నూలు ఘాట్ రోడ్లలో వాహన ప్రమాదాల నివారణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. స్పీడ్ గన్లు, బ్రీత్ ఎనలైజర్లతో తనిఖీలు చేయడం.. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలతో చెక్ పెడుతున్నారు. పెద్దదోర్నాల: ► శ్రీశైలం వైపు వేగంగా వెళ్తున్న ఓ టూరిస్టు బస్సు ఎదురుగా వస్తున్న వాహనానికి దారి ఇవ్వబోయి అదుపుతప్పి తుమ్మలబైలు వద్ద బోల్తాపడిన సంగతి పాఠకులకు విధితమే. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ► మూడు రోజుల కిందట ఓ కారు శ్రీశైలం ఘాట్ రోడ్డులో సాక్షి గణపతి ఆలయ సమీపంలో బోల్తా పడి నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదానికి అతివేగమే కారణంగా తెలుస్తోంది. ఇలాంటి ప్రమాదాల నివారణకు పోలీసు శాఖ ప్రత్యేక కార్యాచరణతో రంగంలోకి దిగింది. అధిక శాతం వాహనదారులకు ఘాట్ రోడ్లపై అవగాహన లేకపోవడం, మితిమీరిన వేగంతో ప్రయాణించడం వలనే ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించింది. అతివేగం కారణంగా జరుగుతున్న అనర్థాలపై వాహనదారులకు అవగాహన కల్పిస్తోంది. ప్రమాదాల నివారణకు కసరత్తు చేస్తోంది. జిల్లాలోని సమస్యాత్మక రోడ్లతో పాటు అత్యంత ప్రమాదకర రోడ్లుగా నల్లమల అభయారణ్యంలోని శ్రీశైలం, కర్నూలు ఘాట్ రోడ్లను గుర్తించారు. ఘాట్ రోడ్లలో తరచూ జరుగుతున్న ప్రమాదాల నివారణకు లేజర్ స్పీడ్ గన్లతో పరిశీలించి వాహనాల మితిమీరిన వేగాన్ని కట్టడి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి కూడా జరిమానాలు విధించేందుకు బ్రీత్ ఎనరైజర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. బ్రీత్ ఎనలైజర్‌తో వాహనదారులకు పరీక్షలు.. మండల పరిధిలోని శ్రీశైలం ఘాట్ రోడ్డుతో పాటు కర్నూలు రహదారిపై వాహనదారులకు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించే కార్యక్రమాన్ని పోలీసులు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న పలువురిపై కేసులు నమోదు చేస్తున్నారు. వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపటం వలన అధిక శాతం ప్రమాదాలు జరుగుతున్నాయని తేలడంతో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠినంగా వ్యవహరిస్తున్నారు. వ్యక్తిగత తప్పిదాల వలనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. దానివలన ఏ తప్పూ చేయని ఎదుటి వ్యక్తుల ప్రాణాలు కూడా పోతున్నాయి. ఘాట్ రోడ్లపై 40 కి.మీ వేగానికి మించి ప్రయాణించడం ప్రమాదకరమని, సెల్ఫోన్లు మాట్లాడుతూ వాహనాలు నడపరాదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మితిమీరిన వేగంతోనే తరుచూ ప్రమాదాలు.. మితిమీరిన వేగం, వాహనాలను నడిపే సమయంలో నిర్లక్ష్యం కారణంగానే ఘాట్ రోడ్లపై ఎక్కువగా వాహన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని అధికారులు గుర్తించారు. పెద్దదోర్నాల మండల కేంద్రం నుంచి శ్రీశైల పుణ్యక్షేత్రానికి 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అదేవిధంగా కర్నూలు రోడ్డులోని రోళ్లపెంట నుంచి మండల కేంద్రం వరకు 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ రెండు రహదారులూ ఘాట్ రోడ్లే. ఈ మార్గాలలో నిత్యం వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. రాష్ట్రంతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన లక్షలాది మంది ప్రయాణికులు, భక్తులు వందలాది వాహనాల్లో శ్రీశైలం వెళ్తారు. కొన్నేళ్లుగా ఘాట్ రోడ్లలో అధికంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాలకు అతివేగమే ప్రధాన కారణమని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిని అరికట్టేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. జిల్లాలోని ముఖ్య రహదారులపై ప్రయాణించే వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు అధికారులు లేజర్ గన్లను వినియోగిస్తున్నారు. పరిమితికి మించిన వేగంతో వెళ్లే వాహనాలకు జరిమానాలు, ఈ–చలానాలు విధిస్తున్నారు. రాయలసీమ ప్రాంతం నుంచి రాజధానికి వెళ్లే రహదారులతో పాటు, అత్యంత క్లిష్టమైన శ్రీశైలం ఘాట్ రోడ్డులో స్పీడ్ గన్లను ఏర్పాటు చేసి వేగ నియంత్రణకు చర్యలు చేపడుతున్నారు. మితిమీరిన వేగంగా వెళ్తున్న వాహనాలను కంట్రోలు చేసేందుకు స్పీడు గన్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. వేగ నియంత్రణకు పటిష్ట చర్యలు మితిమీరిన వేగంతో ప్రయాణించే వాహనాల వలనే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అందువలన అతివేగంతో ప్రయాణించే వాహనాలను గుర్తించేందుకు ఘాట్ రోడ్లలో స్పీడ్ గన్లను వినియోగిస్తున్నాం. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు కూడా నిర్వహించి జరిమానాలు విధిస్తున్నాం. దీనివలన రోడ్డు ప్రమాదాలను నియంత్రించగలుగుతున్నాం. వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపటం నేరం. సెల్ఫోన్లు మాట్లాడుతూ వాహనాలు నడపటం అనర్థదాయకం. - మారుతీకృష్ణ, సీఐ, యర్రగొండపాలెం -
అర్జంట్ బాత్రూం: 185 కిమీ వేగంతో
లండన్: కొన్నిసార్లు అత్యంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి.. అవి మనకు తెలీకుండానే కొన్ని నిబంధనలను అతిక్రమించేలా చేస్తాయి. ఇంతకీ మ్యాటరేంటంటే.. ఇంగ్లండ్‌లోని సౌత్ యార్క్‌షైర్‌లో ఓ కారు డ్రైవర్‌కు పెద్ద కష్టమొచ్చిపడింది. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో అతనికి అర్జంటుగా బాత్రూం వచ్చింది. కానీ అప్పటికే హైవేపై ఎక్కాడు. దిగడానికి వీలు లేదు. దీంతో స్పీడు దంచి కొట్టాడు. ఏకంగా గంటకు 185 కి.మీ.(115 మైళ్లు) వేగంతో రయ్‌మని దూసుకుపోయాడు. ఇది పోలీసుల కంట పడింది. ఇంకేముందీ సినిమా సీన్ అక్కడ ప్రత్యక్షమైంది. సునామీలా దూసుకుపోతున్న ఆ వాహనాన్ని పట్టుకునేందుకు పోలీసులు వెంట పడ్డారు. ఇది గమనించని సదరు వ్యక్తి ఏమాత్రం స్పీడు తగ్గించలేదు. (ఫ్లోర్ విరిగి, ఇంటి కింద బావిలో పడ్డ వ్యక్తి) ఎట్టకేలకు పోలీసులు దాన్ని అడ్డుకుని డ్రైవర్‌ను ప్రశ్నించారు. అప్పుడు అతను చెప్పిన సమాధానం విని పోలీసులే నిర్ఘాంతపోయారు. అర్జంటుగా యూరిన్‌కు వెళ్లాలని, అందుకే ఇంత వేగంగా కారు నడుపుతున్నానని సమాధానమిచ్చాడు. లండన్ నుంచి నిర్విరామంగా డ్రైవింగ్ చేస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇక కారు వేగాన్ని నమోదు చేసిన స్పీడ్ గన్ ఫొటోను పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేసి, దాని గురించిన కథను రాసుకొచ్చారు. అయితే అతను తన సీటులో సాధారణంగా కూర్చున్నాడని, ఎలాంటి ఇబ్బంది పడుతున్నట్లు అనిపించలేదని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో మితిమీరిన వేగంతో డ్రైవింగ్ చేస్తున్నందుకుగానూ అతడిని కోర్టులో ప్రవేశపెట్టారు. (మదిని దోచేస్తున్న పానీపూరీ ఏటీఎం) -
3కి.మీ దూరంలోని శత్రువు చంపేసే తుపాకీ
న్యూఢిల్లీ : మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మనిషిని లేదా జంతువును గురిపెట్టి సునాయాసంగా చంపేసే అత్యంత ప్రమాదరకమైన స్నైపర్ తుపాకీని రష్యాకు చెందిన లొబోవ్ ఆర్మ్స్ కనిపెట్టింది. ఎస్‌వీఎల్‌కే–14ఎస్‌గా వ్యవహరించే పది కిలోల బరువుగల ఇది తుపాకుల విభాగంలోనే విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతుందని భావిస్తున్నారు. ఈ తుపాకీలో నుంచి బుల్లెట్ సెకండ్‌కు 900 మీటర్ల దూరం చొప్పున అంటే, ధ్వని వేగంకన్నా మూడు రెట్లు ఎక్కువ. దీని ధర అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు 29 లక్షల రూపాయలు. (‘విద్యుత్ బిల్లులను ఆన్లైన్లో చెల్లించాలి’ ) ఈ తుపాకీ నుంచి వెలువడే బుల్లెట్ మూడు సెంటీమీటర్ల మందం గల ఇనుప దిమ్మ నుంచి దూసుకుపోతుందని, ఎలాంటి బుల్లెట్ ప్రూఫ్ ధరించిన వ్యక్తి కూడా ఈ బుల్లెట్ తగిలితే మరణించాల్సిందేనని ఈ తుపాకీని తయారు చేసిన కంపెనీ చీఫ్ ఇంజనీరు యూరి సించ్కిన్ తెలిపారు. ఈ తుపాకీ నుంచి వెలువడే బుల్లెట్ మూడున్నర కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలదని, గురి తప్పకుండా ఉండాలంటే మూడు కిలోమీటర్లకు మించి లక్ష్యం ఉండరాదని ఆయన తెలిపారు. ప్రస్తుతం బ్రిటీష్ సైన్యం ఉపయోగిస్తున్న ‘ఎల్115ఏ3’ తుపాకీ 1500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. ఇదే ఇంతవరకు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన తుపాకీగా చెలామణి అవుతోంది. (ధోనికి ఎలా చోటిస్తారు..? ) -
వామ్మో. స్పీడ్ గన్!
కామారెడ్డికి చెందిన రాజు కారులో హైదరాబాద్‌కు బయలుదేరాడు. స్పీడ్‌గన్ భయంతో వాహనాన్ని 80 కిలోమీటర్ల వేగం దాటనివ్వలేదు. అయితే ఇతర వాహనాలు ఓవర్టేక్ చేస్తుండడంతో కొంత అసహనానికి గురై వేగం పెంచాడు. హైదరాబాద్ సమీపానికి వెళ్లేసరికి అతడి మొబైల్ ఫోన్‌కు మెస్సేజ్ వచ్చింది. అతివేగంతో వాహనాన్ని నడిపినందుకు రూ. 9 వందల ఫైన్ పడింది. దీంతో అతడు కంగుతిన్నాడు. తిరుగు ప్రయాణంలో పరిమిత వేగంతోనే వాహనాన్ని నడుపుతూ ఇంటికి చేరుకున్నాడు. బాల్కొండకు చెందిన కారు ఓనర్ కం డ్రైవర్ ఎయిర్‌పోర్టుకు కిరాయికి వెళ్లాడు. ఎప్పటిలాగే కారు నడుపుతున్నాడు. అయితే మేడ్చల్ వద్ద స్పీడ్‌గన్ ఉంటుందనే ఉద్దేశంతో వేగం తగ్గించాడు. పోలీసులు స్పీడ్ గన్ ఉంచిన ప్రదేశాన్ని మార్చారు. దీన్ని గమనించని సదరు కారు యజమాని మేడ్చల్ దాటగానే కారు వేగం పెంచాడు. కారు ఎయిర్‌పోర్టుకు చేరిందో లేదో అతడి ఫోన్‌కు స్పీడ్ లిమిట్ అతిక్రమించినట్టు పేర్కొంటూ రూ.1100 జరిమానా విధిస్తూ మెసేజ్ వచ్చింది. సాక్షి, కామారెడ్డి: అతివేగంగా వెళ్లే వాహనదారులకు చెక్ పెట్టేందుకు పోలీస్‌శాఖ ప్రవేశపెట్టిన ‘స్పీడ్‌గన్’ సత్ఫలితాలు ఇస్తోంది. 44వ నంబర్ జాతీయ రహదారిపై పలు చోట్ల స్పీడ్ గన్లు ఏర్పాటు చేసి, అతివేగంగా వెళ్తున్న వాహనాలకు జరిమానాలు విధిస్తున్నారు. దీంతో జరిమానాలకు భయపడుతున్న చాలామంది వాహనదారులు 80 కిలోమీటర్ల వేగాన్ని దాటడానికీ జంకుతున్నారు. ప్రమాదాల నివారణకు పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. రహదారి నిబంధనలను అతిక్రమిస్తున్నవారిని గుర్తించేందుకు స్పీడ్ గన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటిని ప్రధాన రహదారులపై అక్కడక్కడ అమర్చి, వేగ నిబంధనలను అతిక్రమించేవారిని గుర్తించి, జరిమానాలు విధిస్తున్నారు. ఎన్‌హెచ్–44 పై అక్కడక్కడ స్పీడ్ గన్ల ను అమర్చుతున్నారు. నిర్ణీత వేగం కన్నా ఎక్కు వ స్పీడ్‌తో వాహనాన్ని నడిపితే.. ఇవి గుర్తించి, వెంటనే సంబంధిత వాహన యజమాని సెల్‌ఫోన్‌కు జరిమానాకు సంబంధించిన మెసేజ్ పంపిస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో వెళ్లాల్సిన స్పీడ్ కన్నా ఎక్కువ స్పీడ్‌తో వెళ్తే చాలు భారీ జరిమానాలు పడుతున్నాయి. హైవేపై ఏ మూలమ లుపు వద్ద, ఏ చెట్టు నీడన వేగ నియంత్రణ కెమెరా దాగి ఉందోనని డ్రైవర్లు గమనిస్తూ వాహనాలను మెల్లిగా నడుపుతున్నారు. డ్రైవర్ల కళ్లు దాదాపుగా స్పీడ్గన్ల గురించి దారిపొడవునా వెతుకుతూనే ఉన్నాయి. బస్వాపూర్‌నుంచి బుస్సాపూర్ వరకు.. 44వ నంబరు జాతీయ రహదారి బెంగుళూరు నుంచి నాగ్‌పూర్ వరకు ఉంది. జాతీయ రహదారి కామారెడ్డి జిల్లాలోని భిక్కనూరు మండలం బస్వాపూర్ వద్ద మొదలై, నిజామాబాద్ జిల్లాలోని మెండోర మండలం బుస్సాపూర్ మీదుగా నిర్మల్ జిల్లాలోకి అడుగిడుతుంది. అయితే ఆర్మూర్, నిజామాబాద్, కామారెడ్డి ప్రాంతాల నుంచి నిత్యం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు వేలాది వాహనాలు పరుగులు తీస్తుంటాయి. ముఖ్యంగా సామగ్రిని తరలించే లారీలు, డీసీఎంలతో పాటు ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, కా ర్లు, జీపులు భారీ సంఖ్యలో వెళతాయి. కామారె డ్డి, నిజామాబాద్ జిల్లాలకు చెందిన వారు తమ పిల్లల ఉన్నత చదువుల విషయంలో, వ్యాపారరీత్యా కొందరు, ఉద్యోగరీత్యా కొందరు.. ఇలా నిత్యం వేలాది మంది తమ కార్లు, ఇతర వాహనాల్లో హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే దారి బాగుండడంతో వాహనాల వేగాన్ని పెంచేస్తుంటారు. అతివేగం ప్రమాదాలకు కారణమవుతుండడంతో దీనికి కళ్లెం వేయడానికి పోలీస్ శాఖ స్పీడ్ గన్లను తీసుకువచ్చింది. మేడ్చల్ పట్టణ పరిసరాలు, తూప్రాన్ పరిసరాలతో పాటు రామాయంపేట, భిక్కనూరు, కామారెడ్డి, సదాశివనగర్, ఇందల్వాయి, డిచ్పల్లి శివారు, ఆర్మూర్ తదితర ప్రాంతాల మీదుగా వెళ్లే జాతీయ రహదారిపై పలుచోట్ల స్పీడ్ గన్లను ఏర్పాటు చేశారు. అయితే వాహనాల యజమానులు దీనిని గమనించి, ఆయా ప్రాంతాలకు వెళ్లగానే స్పీడ్ తగ్గించి నడపడం, ఆ తర్వాత పెంచడం చేసేవారు. పోలీసులు దీనిని పసిగట్టి రూటు మార్చారు. రోజూ స్పీడ్ గన్లను ఒకే చోట ఉంచకుండా ప్రదేశాలు మార్చుతున్నారు. దీంతో అతివేగంగా వెళ్లేవారు దొరికిపోతున్నారు. జరిమానాలు కట్టాల్సి వస్తుండడంతో వేగాన్ని తగ్గించడమే మేలని చాలామంది పరిమిత వేగంతోనే వెళ్తున్నారు. దీంతో ప్రమాదాలూ తగ్గుతున్నాయి. జాతీయ రహదారిపై ఇటీవలి కాలంలో ప్రమాదాలు తగ్గడానికి స్పీడ్ గన్లే కారణమని పోలీసులు అధికారులు అభిప్రాయపడుతున్నారు. -
స్పీడ్ 'గన్' గురి తప్పిందా..?
సాక్షి, నిజామాబాద్: రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమవుతున్న వాహనాల అతి వేగానికి చెక్ పెట్టేందుకు పోలీసుశాఖ చేపట్టిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన స్పీడ్ లేజర్‌గన్ గురి తప్పింది. గురువారం ఉదయం 11.48 గంటలకు 44వ జాతీయ రహదారిపై ఓ వాహనం ఓవర్ స్పీడ్‌తో వెళుతుంటే.. మెదక్ జిల్లా రామాయంపేట్ వద్ద ఈ స్పీడ్ లేజర్‌గన్‌తో గుర్తించిన పోలీసులు.. జరిమానాకు సంబంధించిన చలానా మాత్రం మరో వాహనానికి పంపారు. ఫోర్డ్ ఎకో స్పోర్ట్ వాహనం ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడితే.. తన వాహనం టీఎస్ 16 ఈఆర్7299కు చాలనా విధిస్తూ ఎస్ఎంఎస్ సందేశాన్ని పంపారని మాక్లూర్‌కు చెందిన అమర్ వాపోయారు. హైస్పీడ్‌తో వెళ్లిన వాహనం నెంబర్ కూడా ఇదే నెంబరుకు కాస్త దగ్గరలోనే ఉండటంతో పొరపాటున ఈ చలానా జారీ అయి ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పొరపాటున జరిమానా విధించిన వాహనం ఇది -
ప్రమాదాల జోరుకు కళ్లెం..!
ప్రమాదాల జోరుకు కళ్లెం వేసేందుకు పోలీస్ శాఖ ‘స్పీడ్‌గన్’లను ఎక్కుపెట్టింది. జాతీయ, ప్రధాన రోడ్లలో వేగంగా వాహనాలు నడిపేవారిని గుర్తించి ఇ–చలానాలతో ఆర్థిక భారం వేయనుంది. మార్పురాకుంటే వాహనదారుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచనుంది. రోజురోజుకు పెరుగుతున్న వాహనాల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ప్రమాదాలను తగ్గించేందుకు, ప్రయాణికుల ప్రాణాలు కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. రోడ్డు నిబంధనలను కఠినతరం చేసింది. సాక్షి, విజయనగరం టౌన్ : అతివేగం ప్రమాదాలకు కారణమవుతోంది. ప్రాణాలు తీస్తోంది. పోలీస్ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. అపరాధ రుసుం వసూలు చేస్తున్నా చాలామంది వాహనచోదకుల్లో మార్పురావడం లేదు. రోడ్డు నిబంధనలు పాటించడం లేదు. ప్రమాదాలకు కారణమవుతూ ఎదుటివారి ప్రాణాలను హరిస్తున్నారు. దీనిని నివారించేందుకు పోలీస్ శాఖ సిద్ధమైంది. అతివేగంగా వాహనాలు నడిపే వారికి కళ్లెంవేసే చర్యలు చేపట్టింది. స్పీడ్ గన్‌తో వాహన వేగాన్ని లెక్కించి మితిమీరితే కొరడా ఝుళిపించనుంది. ఇటీవల పోలీస్ అధికారులు జిల్లాకు నాలుగు స్పీడ్ కంట్రోల్ లేజర్ గన్స్‌ను తెప్పించారు. జాతీయ రహదారిపై ఎక్కువ ప్రమాదాలు సంభవించే ప్రాంతాలు, రద్దీ ఏరియాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. అతివేగంగా వచ్చే వాహనాల ఫొటో తీసి డాప్లర్ సిద్ధా్దంతం ఆధారంగా స్పీడ్ లేజర్ గన్ పరికరంతో వేగాన్ని లెక్కిస్తారు. పరిమితికి మించి వేగం ఉంటే ఇ–చలానా ద్వారా ఇంటివద్దకే జరిమానా రసీదులు పంపిస్తారు. గాలిలో కలుస్తున్న ప్రాణాలు అతివేగంతో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా రోడ్డుపై ప్రయాణించే వాహనచోదకులు, ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ ఏడాది జిల్లాలో 454 ప్రమాదాలు సంభవించారు. ఇందులో 157 మంది వరకు మృత్యువాత పడ్డారు. 758 మంది తీవ్రగాయాలపాలయ్యారు. ఇందులో టూ వీలర్స్ ప్రయాణికులు 179 మంది ఉంటే ఆటోల్లో ప్రయాణించేవారు 77 మంది, కారులు, జీపుల్లో ప్రయాణించేవారు 85 మంది, బస్సుల ద్వారా 30మంది, ట్రక్లు, ట్రాక్టర్స్ ద్వారా 96 మంది, ఇతర వాహనాల వల్ల 17 మంది వరకు రోడ్డు ప్రమాదాలకు గురయ్యారు. వీటిని నివారించేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టిసారించింది. జిల్లాలో ఉన్న ప్రధాన హైవేలను, ప్రమాదకర స్థలాలను గుర్తించింది. భోగాపురం హైవే, విశాఖ హైవే, గజపతినగరం హైవే, విజయనగరం తదితర ప్రాంతాల్లో ఈ గన్లను ఏర్పాటు చేసింది. ఎక్కువగా ప్రమాదాలు హైవేలపైన జరుగుతుండడంతో వాటిపైన దృష్టిసారించింది. పట్టణంలో స్పోర్ట్స్ బైక్‌లు వాడే విద్యార్థులు, రైడర్లతో ప్రయాణికులు భయపడుతున్నారు. వారిని గుర్తించేందుకు లేజర్‌గన్‌ను ఏర్పాటుచేశారు. అటువంటి వారికి చలానాతో పాటు శిక్ష కూడా వేసే అవకాశాలున్నాయని పోలీస్ అధికారులు పేర్కొంటున్నారు. స్పీడ్‌కి బ్రేక్... స్పీడ్ గన్‌తో వాహనాలు మితిమీరిన వేగానికి చెక్ పడే అవకాశం ఉంది. కేవలం 60 కిలోమీటర్ల వేగంతో వెళ్లాలని బోర్డులు చూపిస్తున్నా వంద కిలోమీటర్ల స్పీడ్‌లో వాహనాలు నడుపుతారు. జాతీయరహదారులపై అయితే కార్లు, లారీలు అతివేగంతో వెళ్తే స్పీడ్‌గన్‌తో దాన్ని వేగాన్ని లెక్కించి ఇ–చలాన్ ద్వారా ఇంటివద్దకే జరీమానాలు పంపుతారు. 14 కంటే ఎక్కువ జరీమానాలు పడిన వ్యక్తులు డబ్బులు చెల్లించకుంటే పోలీసులు సంబంధిత వాహన యజమానులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తారు. జరిమానా మొత్తంతో పాటు పెనాల్టీ కడితేనే వదిలిపెడతారు. నిబంధనలు పాటించాలి వాహన చోదకులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిందే. ఏ రోడ్డులో ఎంత వేగంతో వెళ్లాలనే విషయం సైన్ బోర్డులపై ఉంటుంది. ఆ వేగానికి మించి వెళ్తే స్పీడ్గన్ల ద్వారా ఇ–చలానా రూపంలో జరిమానాలు విధిస్తాం. మితిమీరిన వేగం ప్రమాద కరం. దీనివల్ల ప్రమాదాలు జరిగి విలువైన ప్రాణాలు పోగొట్టుకునే ప్రమాదముంది. వాహన పత్రాలు, లైసెన్సులు లేకుండా, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటివి చేయవద్దు. ప్రస్తుతం జాతీయరహదారిపై స్పీడ్గన్లు ఏర్పాటుచేశాం. – బి.రాజకుమారి, ఎస్పీ, విజయనగరం -
ఈస్టర్న్ ఫ్రీవేపై స్పీడ్గన్లు
సాక్షి, ముంబై: ఇటీవల ఈస్టర్న్ ఫ్రీవేపై రెండు రోడ్డు ప్రమాదాలు జరగడంతో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎంఎంఆర్డీఏ), ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా ఈ మార్గంపై స్పీడ్ గన్లను అమర్చాలని యోచిస్తున్నారు. స్పీడ్గన్ల ఏర్పాటు వలన మితిమీరిన వేగంతో వచ్చే వాహనాలపై నిఘా ఉంచేందుకు వీలు కలుగుతుందని అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఈ మార్గంపై 20 సీసీటీవీలను కూడా అమర్చనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఫ్రేవేపై వేగ పరిమితిని ఉల్లఘించిన వారిపై ఇక మీదట కఠిన చర్యలు తీసుకోనున్నామని పోలీసులు తెలిపారు. ఒకోసారి వాహనదారులు ఈ స్పీడ్ గన్‌లో నమోదైన వేగాన్ని అంగీకరించడంలేదు. తాము వాహనాన్ని అంత వేగంగా నడపలేదని బుకాయించి పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. దీంతో ఈ స్పీడ్గన్లను సీసీటీవీ కెమరాలతో అనుసంధానం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో వేగంగా వచ్చే వాహనాల దృశ్యాలు ఈ కెమరాలో నమోదు కావడంతో సదరు వాహన దారుడు తప్పించుకోలేడని డిప్యూటి పోలీసు కమీషనరు (ట్రాఫిక్) సుభాష్ నిలేవడ్ తెలిపారు. ఇదిలా వుండగా ఈ స్పీడ్ గన్ల కోసం నిధులను సమకూర్చేందుకు ఎంఎంఆర్డీఏని పోలీసులు ఆశ్రయించారు. దీంతో ఈ సంస్థ ఎనిమిది స్పీడ్ గన్లను కొనుగోలు చేయడానికి నిర్ణయించింది. వీటితోపాటు ఎంఎంఆర్డీఏ 20 సీసీటీవీలను అమర్చేందుకు నిధులను కేటాయించనుంది. ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఈ ఫ్రీవేను అనుక్షణం పరిశీలించడం సాధ్యం కావడం లేదనీ, అయితే ఈ ఫ్రీవేను ఉపయోగిస్తున్న ద్విచక్రవాహన దారులను నిషేధించడానికి ప్రవేశ ద్వారం వద్ద ఇద్దరు పోలీసులను నియమించామన్నారు. రాత్రి వేళలో పోలీసులు ఇక్కడ విధులు నిర్వహించని సమయం చూసి ద్విచక్ర వాహన దారులు ఈ మార్గాన్ని ఉపయోగిస్తున్నారు. దీంతో రాత్రి వేళలో ఈ ఫ్రీవేలను పర్యవేక్షించమని సివిల్ పోలీసులను కోరనున్నట్లు నిలేవడ్ తెలిపారు.