లండన్: కొన్నిసార్లు అత్యంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి.. అవి మనకు తెలీకుండానే కొన్ని నిబంధనలను అతిక్రమించేలా చేస్తాయి. ఇంతకీ మ్యాటరేంటంటే.. ఇంగ్లండ్‌లోని సౌత్ యార్క్‌షైర్‌లో ఓ కారు డ్రైవర్‌కు పెద్ద కష్టమొచ్చిపడింది. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో అతనికి అర్జంటుగా బాత్రూం వచ్చింది. కానీ అప్పటికే హైవేపై ఎక్కాడు. దిగడానికి వీలు లేదు. దీంతో స్పీడు దంచి కొట్టాడు. ఏకంగా గంటకు 185 కి.మీ.(115 మైళ్లు) వేగంతో రయ్‌మని దూసుకుపోయాడు. ఇది పోలీసుల కంట పడింది. ఇంకేముందీ సినిమా సీన్ అక్కడ ప్రత్యక్షమైంది. సునామీలా దూసుకుపోతున్న ఆ వాహనాన్ని పట్టుకునేందుకు పోలీసులు వెంట పడ్డారు. ఇది గమనించని సదరు వ్యక్తి ఏమాత్రం స్పీడు తగ్గించలేదు. (ఫ్లోర్ విరిగి, ఇంటి కింద బావిలో పడ్డ వ్యక్తి)
ఎట్టకేలకు పోలీసులు దాన్ని అడ్డుకుని డ్రైవర్‌ను ప్రశ్నించారు. అప్పుడు అతను చెప్పిన సమాధానం విని పోలీసులే నిర్ఘాంతపోయారు. అర్జంటుగా యూరిన్‌కు వెళ్లాలని, అందుకే ఇంత వేగంగా కారు నడుపుతున్నానని సమాధానమిచ్చాడు. లండన్ నుంచి నిర్విరామంగా డ్రైవింగ్ చేస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇక కారు వేగాన్ని నమోదు చేసిన స్పీడ్ గన్ ఫొటోను పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేసి, దాని గురించిన కథను రాసుకొచ్చారు. అయితే అతను తన సీటులో సాధారణంగా కూర్చున్నాడని, ఎలాంటి ఇబ్బంది పడుతున్నట్లు అనిపించలేదని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో మితిమీరిన వేగంతో డ్రైవింగ్ చేస్తున్నందుకుగానూ అతడిని కోర్టులో ప్రవేశపెట్టారు. (మదిని దోచేస్తున్న పానీపూరీ ఏటీఎం)
Comments
Please login to add a commentAdd a comment