South Yorkshire
-
అర్జంట్ బాత్రూం: 185 కిమీ వేగంతో
లండన్: కొన్నిసార్లు అత్యంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి.. అవి మనకు తెలీకుండానే కొన్ని నిబంధనలను అతిక్రమించేలా చేస్తాయి. ఇంతకీ మ్యాటరేంటంటే.. ఇంగ్లండ్‌లోని సౌత్ యార్క్‌షైర్‌లో ఓ కారు డ్రైవర్‌కు పెద్ద కష్టమొచ్చిపడింది. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో అతనికి అర్జంటుగా బాత్రూం వచ్చింది. కానీ అప్పటికే హైవేపై ఎక్కాడు. దిగడానికి వీలు లేదు. దీంతో స్పీడు దంచి కొట్టాడు. ఏకంగా గంటకు 185 కి.మీ.(115 మైళ్లు) వేగంతో రయ్‌మని దూసుకుపోయాడు. ఇది పోలీసుల కంట పడింది. ఇంకేముందీ సినిమా సీన్ అక్కడ ప్రత్యక్షమైంది. సునామీలా దూసుకుపోతున్న ఆ వాహనాన్ని పట్టుకునేందుకు పోలీసులు వెంట పడ్డారు. ఇది గమనించని సదరు వ్యక్తి ఏమాత్రం స్పీడు తగ్గించలేదు. (ఫ్లోర్ విరిగి, ఇంటి కింద బావిలో పడ్డ వ్యక్తి) ఎట్టకేలకు పోలీసులు దాన్ని అడ్డుకుని డ్రైవర్‌ను ప్రశ్నించారు. అప్పుడు అతను చెప్పిన సమాధానం విని పోలీసులే నిర్ఘాంతపోయారు. అర్జంటుగా యూరిన్‌కు వెళ్లాలని, అందుకే ఇంత వేగంగా కారు నడుపుతున్నానని సమాధానమిచ్చాడు. లండన్ నుంచి నిర్విరామంగా డ్రైవింగ్ చేస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇక కారు వేగాన్ని నమోదు చేసిన స్పీడ్ గన్ ఫొటోను పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేసి, దాని గురించిన కథను రాసుకొచ్చారు. అయితే అతను తన సీటులో సాధారణంగా కూర్చున్నాడని, ఎలాంటి ఇబ్బంది పడుతున్నట్లు అనిపించలేదని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో మితిమీరిన వేగంతో డ్రైవింగ్ చేస్తున్నందుకుగానూ అతడిని కోర్టులో ప్రవేశపెట్టారు. (మదిని దోచేస్తున్న పానీపూరీ ఏటీఎం) -
నడిరోడ్డుపై మహిళలు ఎలా తన్నుకున్నారంటే..
యార్క్‌షైర్: చుట్టు మనుషులు ఉన్నారన్న ధ్యాస కూడా మర్చిపోయి ఇద్దరు మహిళలు బరితెగించారు. చూసిన నలుగురు నవ్వుతారనే సోయి కూడా మరిచి నడిరోడ్డుపై తన్నుకున్నారు. అది కూడా అలాంటిలాంటి తన్నుకోవడం కాదు.. ముష్టి యుద్ధం చేసినట్లుగా నేలపై పొర్లిపొర్లి తన్నుకున్నారు. ఈ ఘటన దక్షిణ యార్క్ షైర్లోని డోంకాస్టర్లో చోటుచేసుకుంది. ఇలా తన్నుకోవడం అక్కడ తప్పు కావడంతో పోలీసులు వారికోసం ఇప్పుడు తెగ గాలిస్తున్నారు. ఈ వీడియోలో ఏం ఉందంటే రోడ్డుపక్కనే రెండు కార్లు ఆగి ఉండగా.. అందులో నుంచి ఆరెంజ్ కలర్ టాప్ అండ్ బాటమ్ సూట్లో ఓ మహిళ దిగింది. అక్కడే లావుగా బొద్దుగా నల్లటి బనియన్ హాప్ షాట్ వేసుకున్న మరో మహిళ ఆమెను అమాంతం కిందపడేసింది. అనంతరం ఆమెపై కూర్చొని అసభ్యపదజాలంతో తిడుతూ పిడిగుద్దులు కురిపించింది. అనంతరం చేతులు, కాళ్లు విరుస్తూ చుక్కలు చూపించింది. వీరికి తోడుగా వెనుకాలే మరో ఇద్దరు మహిళలు ముష్టిఘాతాలకు దిగారు. ఈ తతంగాన్నంత కారులో వెళుతున్న కొందరు వ్యక్తులు వీడియో తీసి ఫేస్బుక్లో పెట్టారు. ఇప్పుడది కాస్త వైరల్ అయ్యింది. -
పట్టపగలే బరితెగించి శృంగారం
డోంకాస్టర్: చుట్టూ నలుగురు ఉన్నప్పుడు స్త్రీ,పురుషుడు పరస్పరం మాట్లాడుకోవాలంటేనే ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. అలాంటిది ఏకంగా రాసలీలకు దిగితే పరిస్థితి ఏమిటి. అది కూడా ఇద్దరు వివస్త్రలుగా అయితే చెప్పడానికి వీలుంటుందా. అవును ఇంగ్లాండ్‌లో ఓ జంట ఇలాగే చేసింది. సభ్యతను వదిలేసి తాము మనుషుల మధ్య ఉన్నామన్న స్పృహ కూడా లేకుండా ప్రవర్తించారు. పక్కనే పాఠశాల ఉంది.. అందులో వందల సంఖ్యలో విద్యార్థులు ఉన్నారన్న ఇంగీత జ్ఞానం విడిచిపెట్టింది. పట్టపగలు.. సూర్యుడి నడి నెత్తిమీదకు వచ్చి ఉన్న సమయంలో రోడ్డుపక్కనే కనీసం ఉండాల్సిన చాటు కూడా లేకుండానే సెక్స్ కార్యకలాపాల్లో మునిగిపోయారు. అందరినీ బిత్తరపోయేలా చేసిన ఈ ఘటన దక్షిణ యార్క్ షైర్ లోగల డోంకాస్టర్లో చోటుచేసుకుంది. అక్కడ ఉన్న క్యాష్ అండ్ క్యారీ డిపోట్ వెనుక భాగంలో పక్కనే పాఠశాల ఉండగా.. వందల మంది విద్యార్థులు కళ్లొప్పగించి చూస్తుండగా వారు ప్రపంచాన్ని మరిచిపోయి ప్రవర్తించారు. ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా నీలిచిత్రాల్లో మాదిరిగా ప్రవర్తించారు. ఇది చూసిన కొంతమంది వీడియో తీసి ఆన్ లైన్ లో పెట్టగా ఇప్పుడది పెద్ద దుమారం రేపుతోంది. అసలు వాళ్లు మనుషులా.. అలా ప్రపంచాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. పక్కనే చేపలు పట్టే లేక్ ఉందని, అక్కడికి ఎంతోమంది వస్తుంటారని.. సమీపంలోనే ఓ రైల్వేలైన్ ఉందని, సైక్లింగ్ కోసం కూడా చాలా మంది వస్తుంటారని ఈ విషయాలన్ని మర్చిపోవడం సభ్యత కాదు అని నిలదీస్తున్నారు. -
ఓ బామ్మ.. 80 మంది మనుమలు..
ఈ బామ్మ పేరు మేరీ సోలే.. వయసు 82 ఏళ్లు. ఈమెకు ఆరుగురు కుమార్తెలు, నలుగురు కుమారులతోపాటు 33 మంది మనుమలు, 44 మంది ముని మనుమలు, ముగ్గురు మహా మునిమనుమలు ఉన్నారు. అంటే.. మొత్తం 80 మంది మనుమలు! త్వరలో మరో ముగ్గురు మహా మునిమనుమలు రాబోతున్నారు. ఇంగ్లండ్‌లోని సౌత్యార్క్షైర్లో భర్త రేమండ్‌తో కలిసి ఉంటున్న ఈమె.. ఇప్పుడు తన మనుమలు, మనుమరాళ్ల కోసం క్రిస్మస్ బహుమతులు కొనే విషయంలో చాలా బిజీగా ఉన్నారు. ఆమే స్వయంగా షాపింగ్‌కు వెళ్లి, మనుమల వయసుకు తగ్గ బహుమతులు కొని తీసుకురావడమే కాకుండా వాటిని తానే గిఫ్ట్ ప్యాకింగ్ చేస్తున్నారు. ఈ క్రిస్మస్ రోజున ఈమె కుటుంబం మొత్తం కలిసి వేడుక చేసుకోనుంది. అన్నట్టు.. తన కుటుంబంలో చిట్ట చివరి మహా మునిమనువడి పేరుతో సహా అందరి పేర్లూ సోలేకు గుర్తే! ఈ వయసులో కూడా ఇలా అందరి పేర్లూ గుర్తుకుపెట్టుకోవడం ఆషామాషీ విషయం కాదని, తల్లితో పోలిస్తే ఈ విషయంలో తనకు జ్ఞాపకశక్తి చాలా తక్కువని సోలే పెద్ద కుమారుడు స్టీఫెన్ గ్రెగరీ (60) చెబుతున్నారు. ఈ బామ్మ గ్రేట్ కదూ!