పట్టపగలే బరితెగించి శృంగారం
డోంకాస్టర్: చుట్టూ నలుగురు ఉన్నప్పుడు స్త్రీ,పురుషుడు పరస్పరం మాట్లాడుకోవాలంటేనే ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. అలాంటిది ఏకంగా రాసలీలకు దిగితే పరిస్థితి ఏమిటి. అది కూడా ఇద్దరు వివస్త్రలుగా అయితే చెప్పడానికి వీలుంటుందా. అవును ఇంగ్లాండ్లో ఓ జంట ఇలాగే చేసింది. సభ్యతను వదిలేసి తాము మనుషుల మధ్య ఉన్నామన్న స్పృహ కూడా లేకుండా ప్రవర్తించారు. పక్కనే పాఠశాల ఉంది.. అందులో వందల సంఖ్యలో విద్యార్థులు ఉన్నారన్న ఇంగీత జ్ఞానం విడిచిపెట్టింది.
పట్టపగలు.. సూర్యుడి నడి నెత్తిమీదకు వచ్చి ఉన్న సమయంలో రోడ్డుపక్కనే కనీసం ఉండాల్సిన చాటు కూడా లేకుండానే సెక్స్ కార్యకలాపాల్లో మునిగిపోయారు. అందరినీ బిత్తరపోయేలా చేసిన ఈ ఘటన దక్షిణ యార్క్ షైర్ లోగల డోంకాస్టర్లో చోటుచేసుకుంది. అక్కడ ఉన్న క్యాష్ అండ్ క్యారీ డిపోట్ వెనుక భాగంలో పక్కనే పాఠశాల ఉండగా.. వందల మంది విద్యార్థులు కళ్లొప్పగించి చూస్తుండగా వారు ప్రపంచాన్ని మరిచిపోయి ప్రవర్తించారు. ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా నీలిచిత్రాల్లో మాదిరిగా ప్రవర్తించారు.
ఇది చూసిన కొంతమంది వీడియో తీసి ఆన్ లైన్ లో పెట్టగా ఇప్పుడది పెద్ద దుమారం రేపుతోంది. అసలు వాళ్లు మనుషులా.. అలా ప్రపంచాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. పక్కనే చేపలు పట్టే లేక్ ఉందని, అక్కడికి ఎంతోమంది వస్తుంటారని.. సమీపంలోనే ఓ రైల్వేలైన్ ఉందని, సైక్లింగ్ కోసం కూడా చాలా మంది వస్తుంటారని ఈ విషయాలన్ని మర్చిపోవడం సభ్యత కాదు అని నిలదీస్తున్నారు.