నడిరోడ్డుపై మహిళలు ఎలా తన్నుకున్నారంటే..
యార్క్షైర్: చుట్టు మనుషులు ఉన్నారన్న ధ్యాస కూడా మర్చిపోయి ఇద్దరు మహిళలు బరితెగించారు. చూసిన నలుగురు నవ్వుతారనే సోయి కూడా మరిచి నడిరోడ్డుపై తన్నుకున్నారు. అది కూడా అలాంటిలాంటి తన్నుకోవడం కాదు.. ముష్టి యుద్ధం చేసినట్లుగా నేలపై పొర్లిపొర్లి తన్నుకున్నారు. ఈ ఘటన దక్షిణ యార్క్ షైర్లోని డోంకాస్టర్లో చోటుచేసుకుంది. ఇలా తన్నుకోవడం అక్కడ తప్పు కావడంతో పోలీసులు వారికోసం ఇప్పుడు తెగ గాలిస్తున్నారు.
ఈ వీడియోలో ఏం ఉందంటే రోడ్డుపక్కనే రెండు కార్లు ఆగి ఉండగా.. అందులో నుంచి ఆరెంజ్ కలర్ టాప్ అండ్ బాటమ్ సూట్లో ఓ మహిళ దిగింది. అక్కడే లావుగా బొద్దుగా నల్లటి బనియన్ హాప్ షాట్ వేసుకున్న మరో మహిళ ఆమెను అమాంతం కిందపడేసింది. అనంతరం ఆమెపై కూర్చొని అసభ్యపదజాలంతో తిడుతూ పిడిగుద్దులు కురిపించింది. అనంతరం చేతులు, కాళ్లు విరుస్తూ చుక్కలు చూపించింది. వీరికి తోడుగా వెనుకాలే మరో ఇద్దరు మహిళలు ముష్టిఘాతాలకు దిగారు. ఈ తతంగాన్నంత కారులో వెళుతున్న కొందరు వ్యక్తులు వీడియో తీసి ఫేస్బుక్లో పెట్టారు. ఇప్పుడది కాస్త వైరల్ అయ్యింది.