Street Fight
-
Viral Video: రోడ్డుపైనే జుట్లు పట్టుకొని తన్నుకున్న బాలికలు
-
ఎవ్వరూ తగ్గేదేలే!.. రోడ్డుపైనే జుట్లు పట్టుకొని తన్నుకున్న బాలికలు
బెంగళూరు: కర్ణాటకలోని ఓ పాఠశాలకు చెందిన కొంతమంది బాలికలు రోడ్డుపై తగువులాడుకున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ విషయంపై రెండు వర్గాల విద్యార్థుల మధ్యం వాగ్వాదం చోటుచేసుకోగా.. కొద్ది సేపటికే ఈ చర్చ గొడవకు దారి తీసింది. దీంతో పాఠశాల ముందే ఓ వర్గానికి చెందిన బాలికల గుంపు మరొక గుంపుపై దాడికి పాల్పడ్డారు. ఇరువర్గాల అమ్మాయిలు ఒకరినొకరు జుట్టు పట్టుకొని లాక్కున్నారు. గట్టిగా కేకలు వేస్తూ, కర్రలతో దాడిచేస్తూ, తన్నుకున్నారు. ఈ ఘర్షణలో కొంతమంది అబ్బాయిలు కూడా ఉన్నట్లు కనిపిస్తోంది. గొడవ పడుతున్న బాలికలందరూ స్కూల్ యూనిఫాం ధరించి ఉన్నారు. వీరంతా బెంగుళూరులోని బిషప్ కాటన్ గర్ల్స్ కాలేజీకి చెందిన విద్యార్థులుగా తేలింది. అయితే ఏ విషయంలో ఇంతలా గొడవ పడ్డారనే విషయంపై సమాచారం లేదు. అంతేగాక ఈ సంఘటన ఎప్పుడు జరిగిందో కూడా తెలియరాలేదు. ఈ దృశ్యాలను అక్కడే ఉన్న కొంతమంది తన ఫోన్లలో రికార్డ్ చేశారు. దీంతో నెట్టింట్లో ఈ వీడియో మాత్రం తెగ హల్చల్ చేస్తోంది. చదవండి: ఈ ప్రపంచానికి ఏమైంది? మొన్న మ్యాంగో మ్యాగీ.. ఈసారి పేస్ట్రీ మ్యాగీ! Y'all need to even if y'all haven't already 😭😭😭 pic.twitter.com/fBbJv9CXoc — T.sh (@Taha_shah0) May 17, 2022 -
తగ్గేదే లే.. నడిరోడ్డుపై జుట్లు పట్టుకొని కొట్టుకున్న అమ్మాయిలు
తప్ప తాగి ఇద్దరు వ్యక్తులు, గ్యాంగ్‌లు కొట్టుకోవడం చూశాం. ఏదైనా విషయంలో రెండు వర్గాలు తగువులాడుకోడమూ తెలుసు. అమ్మాయిల ఇద్దరు అబ్బాయిలు గొడవ పడటం గురించి కూడా విన్నాం. కానీ ఇందుకు భిన్నంగా ఇద్దరు స్కూల్ విద్యార్థినీలు కొట్టుకోవడం ఎప్పుడైనా చూశారా.. ఇప్పుడు చెప్పబోయే వార్త అలాంటిదే. నడిరొడ్డు మీద స్కూల్ యూనిఫాం ధరించిన ఇద్దరు ఆమ్మాయిలు నడిరోడ్డుపై వీరంగం సృష్టించారు. పదుల సంఖ్యలో జనాలు చూస్తున్నా భయం లేకుండా జుట్లు పట్టుకొని పిచ్చిపిచ్చిగా గొడవ పడ్డారు. ఈ విచిత్ర ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని తిరువళ్లూరు జిల్లా ఆవడిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న ఇద్దరి అమ్మాయిలకు పరీక్షలో వచ్చి ర్యాంకుల్లో తేడాలు వచ్చాయి. దీంతో వీరి మధ్య గొడవ పెద్దదిగా మారడంతో ఇలా రెండు గ్రూపులుగా విడిపోయి నడిరోడ్డుపై ఫైట్‌కు దిగారు. ఒకరి జుట్టు ఒకరు పట్టుకొని కొట్టుకున్నారు. కింద పడినా వదలకుండా వీరావేశంలో ఊగిపోయారు. అక్కడున్న పెద్దలు వీరిని ఆపేందుకు ప్రయత్నించినా ఆగలేదు. ఒకరినొకరు చెంపలు వాయించుకున్నారు. చదవండి: నన్ను ఎందుకు కొట్టావు? పోలీసులకు చుక్కలు చూపించిన వ్యక్తి అయితే అమ్మాయిలు అలా నడిరోడ్డుపై కొట్టుకుంటుంటే అక్కడున్న వాళ్లంతా నోరెళ్లబెట్టి సినిమా చూసినట్టు చూశారు. ఈ గొడవనంతా అక్కడున్న వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో స్కూల్ విద్యార్థుల స్ట్రీట్ ఫైట్ వీడియో నెట్టింటా వైరల్‌గా మారింది. ఈ దృశ్యాలను చూసిన నెటిజన్లు అమ్మాయిలు అంటే ఆమాత్రం ఉండాలి. ఆడవాళ్లతో పెట్టుకుంటే రిజల్ట్స్ ఇలా ఉంటాయి. స్త్రీ శక్తి’ . అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: Bipin Rawat : హెలికాప్టర్ ప్రమాదం.. వైరల్ అవుతున్న ఫేక్ వీడియో -
ఒంగోలులో స్ట్రీట్ ఫైట్.. వీడియో వైరల్
సాక్షి, ప్రకాశం: ఒంగోలు శివారు మంగమూరు రోడ్డులో జరిగిన ఓ స్ట్రీట్ ఫైట్ వీడియో వైరల్‌గా మారింది. కారు కొనుగోలు విషయంలో కబాడీపాలెంకు చెందిన ఇరువర్గాల మధ్య వివాదం ఘర్షణకు దారితీసింది. ఓ యువకుడిని మరో వర్గానికి చెందిన యువకులు విచక్షణారహితంగా కొట్టారు. రాడ్లు, కర్రలతో కొట్టడంతో ఆ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఘర్షణ సమయంలో అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్.. వద్దని వారిస్తున్నా ఆ యువకులు లెక్క చేయలేదు. సోషల్ మీడియాలో ఈ కొట్లాట దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇవీ చదవండి: గణేష్ ఉత్సవాల్లో విషాదం: చూస్తుండగానే యువకుడు మృతి కుసంస్కారం: టీడీపీ పిచ్చి పరాకాష్టకు.. -
అమ్మాయి కోసం కొట్టుకున్నారు...
సాక్షి, బెంగళూరు : అమ్మాయి కోసం ఇద్దరు యువకులు నడిరోడ్డుపై కొట్టుకున్న సంఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం రాత్రి హలసూరు గేట్ సమీపంలోని ధర్మరాయ దేవాలయం వద్ద జరిగింది. వివరాల్లోకి వెళితే... హలసూరు ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు ఒకే అమ్మాయిని ఇష్టపడ్డారు. ఇదే విషయమై ఇద్దరి మధ్య చాలా రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. గతంలో కూడా అమ్మాయి కోసం ఇద్దరు యువకులు ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో మొన్న రాత్రి హలసూరు గేట్ సమీపంలోని ధర్మరాయ దేవాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన కరగ ఉత్సవం చూడడానికి వెళ్లిన ఇద్దరు యువకులు ఎదురెదురుగా తారసపడ్డారు. దీంతో మరోసారి అమ్మాయి విషయమై ఇద్దరి మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం శృతి మించడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. హలసూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. -
హైదరాబాద్ చిలకలగూడలో మైనర్ల స్ట్రీట్ ఫైట్
-
విద్యార్థి ఉసురు తీసిన ‘కేసు’
సిద్దిపేటటౌన్ : తోటి స్నేహితులతో జరిగిన చిన్నపాటి గొడవ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి కేసు కావడంతో మనస్థాపం చెందిన ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట రూరల్ మండలం రావురూకులకు చెందిన మడప రోహిత్‌రెడ్డి అలియాస్ బబ్లూ (18) సిద్దిపేట పట్టణంలోని మాస్టర్స్ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం పాత బస్టాండ్ పక్కన ఉన్న గల్లీలో అతడికి, కొందరు స్నేహితులకు చిన్నపాటి ఘర్షణ జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఫిర్యాదు మేరకు ఇరువర్గాలపై కేసు నమోదు చేశారు. పెద్దల సమక్షంలో ఇరు పక్షాల వారిని మందలించి ఉదయం మళ్లీ స్టేషన్‌కు రావాలని పంపించారు. మంగళవారం రాత్రి రోహిత్ ఇంటికి వెళ్లకుండా గ్రామ శివారులోని వారి సంబందీకులకు చెందిన వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు రాత్రంతా గ్రామంలో వెతికినా ఆచూకీ దొరకలేదు. రోహిత్ తండ్రి యాదిరెడ్డి ఉదయం బావి వద్దకు వెళ్తున్న క్రమంలో దొంగల చంద్రయ్య బావి వద్దకు చేరుకోగానే అక్కడే ఉన్న కానుగు చెట్టుకు ఉరివేసుకుని రోహిత్ చనిపోయి ఉన్నాడు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. విషయం సిద్దిపేట రూరల్ పోలీసులకు తెలియడంతో పంచనామా జరిపి పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. దోషుల పేర్లు చెప్పాలని బాధితుల డిమాండ్.. తమ కుమారుడి మృతికి మంగళవారం జరిగిన గొడవే కారణమని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. సుమారు రెండు గంటల పాటు ఆస్పత్రి వద్ద ఆందోళన చేసినా పోలీసులు గొడవకు పాల్పడిన అతని స్నేహితుల పేర్లు చెప్పకపోవడంతో శవంతో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేయడానికి ట్రాక్టర్లో బయలుదేరారు. కొద్ది దూరంలో వారిని పోలీసులు అడ్డుకోగా అక్కడే బైటాయించి ఆందోళనకు దిగారు. రోహిత్‌రెడ్డి మృతికి కారణమైన వారి పేర్లు చెప్పి వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సీపీ జోయల్ డేవిస్ సంఘటనా స్థలానికి చేరుకుని వారికి నచ్చజెప్నే ప్రయత్నం చేశారు. అయినా ఎవరూ వినకపోవడంతో ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. శవాన్ని పోలీసుల వాహనంలో తిరిగి పోస్టు మార్టం రూంకు తీసుకువచ్చారు. కాసేపటికి అడిషనల్ డీసీపీ నర్సింహారెడ్డి మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ.. దోషులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆందోళన విరమించాలని కోరడంతో గొడవ సద్దుమనిగింది. గొడవకు కారణమైన వారిపై సైతం కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్ తెలిపారు. దోషులను కఠినంగా శిక్షించాలి... మా కొడుకు మీద ఫిర్యాదు వచ్చింది పోలీస్ స్టేషన్‌కు రావాలని మంగళవారం సాయంత్రం సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. స్టేషన్‌కు వస్తే బుధవారం ఉదయం రావాలని చెప్పి పోలీసులు పంపించారు. వెళ్లే సమయంలో కేసు అయింది స్టేషన్‌కు రావాలి, జైలుకు పంపిస్తాం అని చెప్పారు. కేసు నమోదు కావడంతోనే మనస్థాపం చెంది నా కొడుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు పెట్టిన వారు ఎవరో మాకు చెప్పకుండా పోలీసులు దాస్తున్నారు. వారి వద్ద నుంచి డబ్బులు తీసుకుని మాకు అన్యాయం చేస్తున్నారు. గొడవ ఎందుకు అయ్యిందో చెప్పడం లేదు. మా అబ్బాయి మీద కేసు పెట్టిన వారి వివరాలు చెప్పాలి. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. – యాదిరెడ్డి, మృతుని తండ్రి చట్ట ప్రకారం చర్యలు.. రోహిత్‌రెడ్డి తన స్నేహితునితో కలిసి పాత బస్టాండ్ వద్ద వారు చదువుకునే కాలేజీ స్నేహితులతో గొడవ పెట్టుకుని వారిని కొట్టాడు. వారు వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో వారి పెద్దలను పిలిపించి మాట్లాడి కోర్టుకు పిలిచినపుడు రావాలని చెప్పి పంపించాం. అమ్మాయి విషయంలో స్నేహితుల మద్య గొడవ జరిగినట్లు మా దృష్టికి వచ్చింది. పంపించిన తర్వాత రోహిత్ ఉరివేసుకుని చనిపోయాడు. ఈ విషయంలో అతనిపై కేసు నమోదు అవడం వల్లనే మనస్థాపం చెంది చనిపోయినట్టు తెలుస్తోంది. మృతుని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేసి దోషులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. – రామేశ్వర్, సిద్దిపేట ఏసీపీ -
హడ్కోకాలనీలో స్ట్రీట్‌ఫైట్
శ్రీకాకుళం రూరల్ : సమయం రాత్రి 7.15 నిమిషాలు...కాలనీ వాసులంతా తమతమ ఇళ్లముందు కాస్తా సేదతీరుతున్నారు. మరికొంతమంది టీవీలు చూస్తున్నారు. ఇంతలో కొంతమంది ఆటోలపై, మరికొంతమంది బైక్‌లపైన వచ్చారు. ఇష్టం వచ్చినట్లుగా రోడ్డుపై ఉన్న సామాన్లు తన్నుకుంటూ పోయారు. దొరి కిన వారిని పిడుగుద్దులతో గుద్దడం, కర్రలతో కొట్టడం...వీధుల్లో పరుగులు పెట్టించడం అంతా ఓ స్ట్రిట్ఫైట్ను తలపించిం ది. ఈ వ్యవహారమంతా ఎక్కడో కాదు.. నగర పరిధిలోని స్థానిక హడ్కోకాలనీలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే.. నగరపరిధిలోని హడ్కోకాలనీ మున్సిపల్ స్కూల్ వద్ద అదే కాలనీకి చెందిన అమ్మాయిలను రెల్లివీధికి చెందిన కొంతమంది కుర్రకారు ప్రతినిత్యం ఈవ్‌టీజింగ్ చేయడం జరుగుతుంది. ఈ విషయంపై పలుదఫాలుగా పోలీసులకు చెప్పినా పట్టించుకునే దాఖలాలు మాత్రం కనిపించలేదు. ఆదివారం మధ్యాహ్నం 3గంటల సమయంలో రెల్లివీధికి చెందిన ఓ వ్యక్తి పూటుగా మద్యం సేవించి హడ్కోకాలనీకి చెందిన ఓ అమ్మాయిపై అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీన్ని గమనించిన ఆకాలనీ యువత కలుగజేసుకుని వివరాలు తెలుసుకున్నారు. తమ కాలనీ అమ్మాయిలకు ర్యాగింగ్ చేయడం సరికాదంటూ సర్దిచెప్పి అక్కడ నుంచి పంపేశారు. సాయంత్రం మరో ఆరుగురు రెండు బైక్‌లపై వచ్చి కాలనీ వాసులతో మాటామాటా పెంచుకొని తగాదా పడి వెళ్లిపోయారు. ఈలోగా ఆర్.కె.నగర్‌కు చెందిన హేమసుందర్ అనే వ్యక్తి అటువైపుగా వస్తుండుగా రెల్లివీధికి చెందిన కొంతమంది వ్యక్తులు అడ్డగించి పిడుగుద్దలు గుద్దుతూ అక్కడ నుంచి పారిపోయారు. అప్పటికే జరిగిన సంఘటనపై కాలనీ వాసులు డైల్ 100కు, టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ కానిస్టేబుల్ వచ్చి సర్దిచెప్పినట్లు సమాచారం. అక్కడితో ఆగకుండా రాత్రి 7.30 సమయంలో రెల్లివీధికి చెందిన సుమారు 40 మంది ఆటోలు, బైక్‌లపై వచ్చి కాలనీలోని మహిళలు, యువత, చిన్నారులపై సైతం ఇష్టానుసారంగా కర్రలతో దాడిచేసినట్లు తెలిసింది. ఈ దాడిలో దుర్గా, కృష్ణ, బిందుసాగర్లకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. రోడ్డుపై బైఠాయింపు విషయం తీవ్రతరం కావడంతో కాలనీ వాసులంతా మాకుమ్మడిగా బలగ జంక్షన్ వద్ద రాస్తారాకో చేపట్టారు. రెండువైపులా బారికేడ్లను ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను అడ్డుకున్నారు. తమకు న్యాయం జరిగేవరకూ ఆందోళన విరమించేదిలేదని హడ్కోకాలనీ వాసులంతా రోడ్డుపైనే సుమారు గంటవరకూ నినాదాలు తీశారు. పరిస్థితి కాస్తా ఉద్రిక్తతకు దారితీయడంతో విషయం తెలుసుకున్న రెండో పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సమీక్షించినా బాధితులెవ్వరూ వినిపించుకోలేదు. దీంతో సంఘటన స్థలంలోనే కాలనీకు చెందిన మహిళలు సీఐకు ఫిర్యాదు రాసి ఇచ్చారు. అనంతరం ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఆంబులెన్స్ ఆసుపత్రి ప్రధాన మార్గం గుండా వెళ్లే ఆంబులెన్స్ ట్రాఫిక్‌లో చిక్కుకుంది. ఓ పేషేంట్‌ను అత్యవసర విభాగానికి తరలిస్తుంది. ఎంత హరన్ కొట్టినా ఎవ్వరూ పట్టించుకోలేదు. దీంతో కొంతమంది వ్యక్తులు కలుగుజేసుకుని ఆ అంబులెన్స్‌కు వేరే దారిగుండా ఆస్పత్రికి దారిచూపించారు. బాధితుడు కల్లేపల్లి బిందుసాగర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రవి, కూర్మా రావు, సత్తిబాబు, రాజు, నారాయణ, జ్యోతిలపై టూ టౌన్ సీఐ తిరుపతిరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మా కాలనీలో ఈవ్‌టీజింగ్ ఎక్కువ మా కాలనీలోని మున్సిపల్ స్కూల్ వద్ద ప్రతీనిత్యం ఈవ్‌టీజింగ్ జరుగుతుంది. స్కూల్ ఉన్నప్పుడైతే ఈ ప్రాంతంలో ఈవ్‌టీజింగ్ జరగడం పరిపాటిగా మారింది. ప్రస్తుతం స్కూల్‌కి సెలవులైనప్పటికీ కాలనీకి చెందిన అమ్మాయిలపై రెల్లివీధికి చెందిన ఆకతాయిలు ఈవ్‌టీజింగ్ చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదులు చేసినా మాకు న్యాయం జరగలేదు. – బద్రినాథ్ (హడ్కోకాలనీ) మాకుమ్మడిగా దాడిచేశారు నాతో పాటు మా కాలనీ వాసులపై రెల్లివీధికి చెందిన కొంతమంది వ్యక్తులు మాకుమ్మడిగా దాడిచేశారు. ఓ అమ్మాయికి ఈవ్‌టీజింగ్ చేయడంతో నేను వెళ్లి వారికి అడిగాను. ఆ తగాదా సాయంత్రమే పెద్దల సమక్షంలో సద్గుమణింది. దాన్ని మనుసులో పెట్టుకుని ఆకతాయిలు మాపై కర్రలతో వెంటాడి కొట్టారు. కె.బిందుసాగర్ (హడ్కోకాలనీ) -
వీధి వ్యాపారుల ఘర్షణ: ఒకరి మృతి
విశాఖపట్నం(పెందుర్తి): విశాఖ జిల్లా పెందుర్తిలో తాగిన మైకంలో ఇద్దరు వీధి వ్యాపారులు పరస్పరం దాడి చేసుకున్నారు. మజీద్ అనే వ్యాపారి దిలీప్ ధర్మదాస్‌ను కర్రతో కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు దిలీప్ స్వస్థలం ఉత్తరప్రదేశ్. కాగా, మధ్యప్రదేశ్‌కు చెందిన వాడైన నిందితుడు మజీద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
ఢిల్లీలో స్ట్రీట్ ఫైట్
-
నడిరోడ్డుపై మహిళలు ఎలా తన్నుకున్నారంటే..
యార్క్‌షైర్: చుట్టు మనుషులు ఉన్నారన్న ధ్యాస కూడా మర్చిపోయి ఇద్దరు మహిళలు బరితెగించారు. చూసిన నలుగురు నవ్వుతారనే సోయి కూడా మరిచి నడిరోడ్డుపై తన్నుకున్నారు. అది కూడా అలాంటిలాంటి తన్నుకోవడం కాదు.. ముష్టి యుద్ధం చేసినట్లుగా నేలపై పొర్లిపొర్లి తన్నుకున్నారు. ఈ ఘటన దక్షిణ యార్క్ షైర్లోని డోంకాస్టర్లో చోటుచేసుకుంది. ఇలా తన్నుకోవడం అక్కడ తప్పు కావడంతో పోలీసులు వారికోసం ఇప్పుడు తెగ గాలిస్తున్నారు. ఈ వీడియోలో ఏం ఉందంటే రోడ్డుపక్కనే రెండు కార్లు ఆగి ఉండగా.. అందులో నుంచి ఆరెంజ్ కలర్ టాప్ అండ్ బాటమ్ సూట్లో ఓ మహిళ దిగింది. అక్కడే లావుగా బొద్దుగా నల్లటి బనియన్ హాప్ షాట్ వేసుకున్న మరో మహిళ ఆమెను అమాంతం కిందపడేసింది. అనంతరం ఆమెపై కూర్చొని అసభ్యపదజాలంతో తిడుతూ పిడిగుద్దులు కురిపించింది. అనంతరం చేతులు, కాళ్లు విరుస్తూ చుక్కలు చూపించింది. వీరికి తోడుగా వెనుకాలే మరో ఇద్దరు మహిళలు ముష్టిఘాతాలకు దిగారు. ఈ తతంగాన్నంత కారులో వెళుతున్న కొందరు వ్యక్తులు వీడియో తీసి ఫేస్బుక్లో పెట్టారు. ఇప్పుడది కాస్త వైరల్ అయ్యింది. -
స్ట్రీట్ ఫైట్‌లో యువకుడు మృతి
హైదరాబాద్: పాతబస్తిలో స్ట్రీట్ ఫైట్ మరో యువకున్ని బలితీసుకుంది. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ తరహాలో ఆదివారం జరిగిన స్ట్రీట్ ఫైట్ లో ఇర్ఫాన్ అనే యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన ఓల్డ్ సిటీలోని రెయిన్ బజార్లో చోటు చేసుకుంది. రెయిన్ బజార్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. ఇర్ఫాన్‌తో ఫైట్ చేసిన మరో వ్యక్తి పరారీలో ఉన్నట్టు సమాచారం. ప్రెండ్లీగా స్ట్రీట్ ఫైట్ చేశారా లేక బెట్టింగ్‌కు పాల్పడ్డారా అన్న విషయం తెలియాల్సి ఉంది. ఇర్ఫాన్ పెట్రోల్ బంక్‌లో పని చేసేవాడని స్థానికులు చెబుతున్నారు. ఇదే తరహాలో నబిల్ అనే యువకుడు స్ట్రీట్ ఫైట్ చేస్తూ మృతి చెందిన విషయం తెలిసిందే. గత ఏడాదిలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వీడియో బయటకు రావడంతో అసలు విషయం బయటకు వచ్చింది. -
బంజారాహిల్స్‌లో స్ట్రీట్‌ఫైట్
హైదరాబాద్ : బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని స్కైపార్క్ హుక్కా సెంటర్లో యువకుల మధ్య స్ట్రీట్ ఫైట్ జరిగింది. మంచినీళ్ల బాటిళ్లు ఎగిరేసుకుంటూ బెట్టింగ్‌లకు పాల్పడిన యువకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలు... రోడ్ నెం.12లోని స్కై పార్క్ హుక్కా సెంటర్‌కు ఆనంద్‌నగర్‌కు చెందిన ఇంటర్ విద్యార్థి సాద్ జాబ్రి తన స్నేహితుల తో కలిసి వచ్చాడు. అక్కడ హుక్కాతో పాటు మద్యం తాగుతూ సహచరులతో నీళ్ల బాటిళ్లు విసురుకునే బెట్టింగ్‌కు పాల్పడ్డాడు. అయితే హుక్కా సెంటర్ యజమాని ముక్రం ఈ క్రీడను అడ్డుకున్నాడు. దీంతో బౌన్సర్లు రంగ ప్రవేశం చేశారు. రెండు గ్రూపులు గొడవకు దిగాయి. హుక్కా సెంటర్లో బీభత్స వాతావరణం నెలకొనడంతో వీరందరినీ బౌన్సర్లు బయటకి పంపేశారు. అక్కడ కూడా తీవ్ర గొడవ జరగడంతో ముక్రం వారిని వారించే ప్రయత్నంలో జాబ్రికి దెబ్బ తగిలింది. మా స్నేహితుడిని కొడతారా అంటూ వెళ్లిన నవనీత్సింగ్పై కూడా దాడి చేశారు. అటు పాతిక మంది, ఇటు పాతికమంది గ్రూపులుగా ఏర్పడి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. నిమజ్జన శోభాయాత్ర విధుల్లో ఉన్న పోలీసులు ఈ స్ట్రీట్‌ఫైట్‌ను చూసి అక్కడికి వచ్చి రెండు వర్గాలను చెల్లాచెదురు చేశారు. గాయాలపాలైన జాబ్రి, నవనీత్‌ను సమీపంలోని ఆస్పత్రిలో చేర్చారు. దాడికి పాల్పడిన ముక్రంపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తమ్ముళ్ల బాహాబాహీ
టీడీపీ సమన్వయ సమావేశంలో రచ్చ నేతల ఎదుటే వాకాటి వర్సెస్ వేనాటి... రసాభాసగా మారిన సమావేశం. అర్థంతరంగా వాయిదా.. నెల్లూరు(సూళ్లూరుపేట): టీడీపీ అగ్రనేతల ఎదురుగానే నియోజకవర్గ తెలుగు తమ్ముళ్లు బాహాబాహీకి దిగారు. నువ్వెంత అంటే నువ్వెంతరా.. అనుకునే స్థాయిలో సుమారు గంటకుపైగా వాదులాడుకోవడంతో కార్యకర్తలు నిశ్చేష్టులయ్యారు. వారంతా సమావేశం నుంచి బయటకు వెళ్లడం కనిపించింది. సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ సమన్వయ సమావేశాన్ని సోమవారం రాత్రి స్థానిక సత్యసాయి కల్యాణమండపంలో నియోజకవర్గ సమన్వయకర్త ఆనం జయకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, పార్టీ అగ్రనేతలు కొండేపాటి గంగాప్రసాద్, వేనాటి రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పరసా వెంకటరత్నయ్య, నెలవల సుబ్రమణ్యంలు హాజరయ్యారు. ముందుగా వాకాటి టీడీపీ, సీఎం గురించి పొగుడుతుండగా తడ మండలం భీములవారిపాళెంకు చెందిన అవుల మనోహర్ లేచి పార్టీలో సీనియర్లం మేం... నువ్వు నిన్న వచ్చావు. నువ్వు చెప్పితే నేర్చుకునే పరిస్థితిలో లేం’ అని అనడంతో వాకాటి ఆగ్రహంతో కూర్చోవోయ్.. మాకు తెలుసుగాని అన్నారు. వెంటనే తడ నాయకులు వేనాటి పరంధామిరెడ్డి లేచి వాకాటి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏం తెలుసని మాట్లాడుతున్నావ్.. నువ్వు నిన్న పార్టీలో చేరావ్.. నువ్వు చెబితే నేర్చుకుంటామా! మా పార్టీ కార్యకర్తను అరే ఒరేయ్ అంటావా! అని వాదనకు దిగడంతో ఈ గొడవ చినికిచినికి గాలివానగా మారిపోయింది. బాబు రమ్మని కోరితే పార్టీలో చేరా..! నువ్వు చెప్పేది ఏందీ అని వాకాటి కూడా ఎదురుదాడికి దిగారు. వాకాటి పార్టీలో చేరినప్పటి నుంచి వారిద్దరి మధ్య వివాదం నివురుగప్పిన నిప్పులా రగులుతూనే వుంది. వాకాటి, వేనాటి పరంధామిరెడ్డిది ఒకే గ్రామం కావడం, రాజకీయ ప్రత్యర్థులుగా చిరకాలంగా కొనసాగుతున్నారు. సమన్యయ సమావేశాన్ని ఆదునుగా తీసుకుని వేనాటి వర్గీయులు వాకాటిపై పథకం ప్రకారం దాడిచేయాలని ముందుగా ప్లాన్ చేసుకున్నారనే ఆరోపణలు విని పించాయి. దీంతో వేనాటి వర్గీయులంతా వాకాటిపై మాటల దాడి మొదలుపెట్టడంతో వాకాటి ఒంటరిగా మిగిలారు. ఆయనకు మద్దతుగా మాట్లాడేవారు కరువయ్యారు. వెంటనే సమన్వయకర్త జయకుమార్‌రెడ్డి, గంగాప్రసాద్, ఇతర నాయకులు సర్దుబాటు చేసినా వ్యవహారం సద్దుమణగలేదు. సుమారు గంటపాటు వివాదం భారీస్థాయిలో జరిగింది. అరేయ్.. ఒరేయ్.. అని తిట్టాడు కదా! దానికి క్షమాపణ చెప్పాలని, కాంగ్రెస్ పార్టీలో ఉన్నపుడు తమపై అన్యాయంగా పెట్టించిన అట్రాసిటీ కేసులు ఎత్తించేసి పార్టీలోకి రమ్మనండి.. అని వేనాటి వర్గీయులు పట్టుబట్టారు. వెంటనే పరంధామిరెడ్డికి మద్దతుగా వేనాటి సురేష్‌రెడ్డి ప్రవేశించి పదేళ్లు దెబ్బలుతిన్నాం. అవమానాలు పడ్డాం. ఆ పార్టీలో ఉన్నపుడు ఆవమానాలు పడ్డాం. మళ్లీ ఆ పార్టీలో నాయకులు మాపార్టీలోకి వచ్చి పెత్తనం చలాయిస్తే ఊరుకోం అంటూ గొడవకు దిగారు. 30 ఏళ్లుగా పార్టీకి పనిచేస్తుంటే ఈరోజున వచ్చిన వాళ్లు పెత్తనం చేస్తే ఊరుకునేది లేదన్నారు. ఇంత వివాదంలో వేనాటి రామచంద్రారెడ్డి ప్రేక్షకుడిలా ఉండిపోయారు. ఆ తర్వాత జయకుమార్‌రెడ్డి, గంగాప్రసాద్, పరసా, నెలవలలు సమావేశాన్ని అర్ధంతరంగా రద్దు చేసి అందరూ కలిసి అంతర్గతంగా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో కూడా ఈ ఇద్దరు నాయకులు వారి అనుచరులు వాగ్వాదానికి దిగినట్టు సమాచారం. మొత్తానికి సూళ్లూరుపేట తెలుగుదేశంలో ముసలం పుట్టింది. ఒకే ఒరలో మూడు కత్తులన్నట్టుగా పరిస్థితి తయారైంది. సూళ్లూరుపేట టీడీపీ మూడుముక్కలుగా మారిందని ఈ సమావేశం బహిర్గతం చేసింది. కార్యకర్తలు స్పందిస్తూ మీరు కొట్లాడుకునే దానికి మమ్మల్ని ఎందుకు రమ్మన్నారని నాయకులను నిలదీశారు. -
పాతబస్తీలో ‘ఆపరేషన్ లేట్‌నైట్’
- 282 మంది యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు - తల్లిదండ్రులకు డీసీపీ కౌన్సెలింగ్ చాంద్రాయణగుట్ట: పాతబస్తీలో ఇటీవల జరిగిన స్ట్రీట్ ఫైట్ ఘటనలో ఓ యువకుడు మృతి చెందడంతో పోలీసులు మేల్కొన్నారు. దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ పర్యవేక్షణలో శుక్రవారం రాత్రి 10 ప్రత్యేక బృందాలు 17 పోలీస్స్టేషన్ల పరిధిలో ‘ఆపరేషన్ లేట్ నైట్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. అర్ధరాత్రి రోడ్లపై ఆవారాగా తిరిగే యువకులతో పాటు హుక్కా సెంటర్లు, స్విమ్మింగ్ పూళ్లు, స్మోకింగ్ ఏరియాలు, టిఫిన్ సెంటర్లు, బస్తీ చబుత్రాల్లో మంతనాలు చేస్తున్న 282 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తీగలకుంట, తలాబ్‌కట్ట, చాంద్రాయణగుట్ట, బాబానగర్, సంతోష్‌నగర్ బస్తీలకు చెందిన యువకులు పెద్ద సంఖ్యలో పట్టుబడ్డారు. కాగా పట్టుబడిన వారిలో 30 మంది 16-17 ఏళ్ల వయసున్న మైనర్లు కాగా మిగతా వారు 18-25 ఏళ్ల వయసున్న వారు. వారి తల్లిదండ్రులను పిలిపించి దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. నెలలోపు పిల్లలు ప్రవర్తన మార్చుకోకపోతే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సమాజంలో మంచిగా మెలుగుతామని పట్టుబడిన యువకులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మండలం అదనపు డీసీపీ కె.బాబురావు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. క్రమశిక్షణ అలవర్చేందుకే : డీసీపీ సత్యనారాయణ ఆవారాగా తిరుగుతున్న యువకుల్లోక్రమశిక్షణ అలవర్చేందుకు నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి ఆదేశానుసారం ఆపరేషన్ లేట్‌నైట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ తెలిపారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపంతో స్ట్రీట్ ఫైట్ ఘటన జరిగి నబీల్ అనే విద్యార్థి మృతి చెందాడని అన్నారు. చాంద్రాయణగుట్ట పరిసరాల్లో అర్ధరాత్రి స్విమ్మింగ్ పూళ్ల వద్ద బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్లు తేలిందన్నారు. కొందరు యువకులు రౌడీషీటర్లతో కూడా స్నేహాన్ని పెంచుకుంటున్నారని తెలిపారు. -
బడాయి కోసం... ప్రాణం పణం పెట్టారు
-
తల్లిదండ్రుల నిర్లక్ష్యం, బడాయిలే.. హత్యకు కారణం
హైదరాబాద్ : తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యం, యువకుల మధ్య ఎచ్చులు, బడాయిల వల్లే నబీల్ మహ్మద్ హత్యకు కారణమని డీసీపీ వి. సత్యనారాయణ తెలిపారు. పాతబస్తీ మీరాలంమండికి చెందిన నబీల్ అహ్మద్ స్ట్రీట్ ఫైట్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులను...పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. వారి వద్ద నుంచి 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ గురువారం మీడియా సమావేశంలో వివరించారు. బడాయి మాటలు, ఎచ్చులతో యువకులు సైటెర్లు వేసుకుని... ఒకరిపై ఒకరు ఆధిపత్యం చూపించుకునేలా ప్రవర్తించడం.. అది కాస్తా ముదిరి స్ట్రీట్ ఫైట్‌కు దారి తీసినట్లు చెప్పారు. అలాగే యువకుల తల్లిదండ్రులకు పిల్లల్ని గారాభం చేయటం, వారిని పట్టించుకోకపోవటం జరిగిందన్నారు. స్ట్రీట్‌ఫైట్‌లో నబీల్ మహ్మద్ మృతి చెందగా, స్నేహితులు ఆ విషయాన్ని దాచిపెట్టి సాక్ష్యాలను తారుమారు చేసినట్లు చెప్పారు. అయితే వైద్యుల నివేదికలో తలకు బలమైన దెబ్బలు తగలడం వల్లే నబీల్ మృతి చెందినట్లు నివేదిక రావటంతో తాము అన్ని కోణాల్లో విచారణ జరిపినట్లు డీసీపీ వెల్లడించారు. అలాగే సోషల్ మీడియాలో వచ్చిన వీడియోను కూడా తమ సిబ్బంది పరిశీలించి, విచారణ జరపడంతో అసలు విషయం బయటపడిందన్నారు. నబీల్ తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు తొమ్మిదిమందిపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. వారిలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. వీరందర్ని కోర్టుకు హాజరు పరచనున్నట్లు చెప్పారు. -
పోలీసుల అదుపులో స్ట్రీట్ ఫైట్ నిందితులు
హైదరాబాద్: స్ట్రీట్ ఫైట్‌లో మృతి చెందిన నబీల్ కేసులో మీర్‌చౌక్ పోలీసులు బుధవారం తొమ్మిది మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. మీరాలంమండి పోలీసు లైన్ ప్రాంతానికి చెందిన నబీల్ మహ్మద్ (17) స్ట్రీట్ ఫైట్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు తొమ్మిది మంది యువకులపై కేసులు నమోదు చేశారు. మహ్మద్ ఒవేస్ అలియాస్ పటేల్ (19), మహ్మద్ ఉమర్ బేగ్ (20), ఇర్ఫాన్ పఠాన్ (22), సుల్తాన్ మీర్జా (22), ఎం.ఎ. కవి ఆలియాస్ ఓబేద్ (18), షహబాజ్ అలియాస్ వసీం డాలర్ (20), అబుబాకర్ (19), సులేమాన్ (18), సయ్యద్ యూసుఫ్ అహ్మద్ (19)లపై పోలీసులు ఐపీసీ 302, 201, 109, ఆర్/డబ్ల్యూ 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. -
నబీల్ మృతదేహానికి ఆరుచోట్ల గాయాలు
-
నబీల్ మృతదేహానికి ఆరుచోట్ల గాయాలు
హైదరాబాద్: నగరానికి చెందిన ఫంజెషాలో జరిగిన స్ట్రీట్ ఫైట్‌లో మృతి చెందిన నబీల్ మహ్మద్(17)కు బార్కాస్‌లోని బడా శ్మశాన వాటికలో సోమవారం పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా అతని మృతదేహంపై ఆరుగాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఉదయం 11 గంటలకు బండ్లగూడ మండల తహసీల్దార్ మహ్మద్ జహురుద్దీన్, కలెక్టర్ కార్యాలయం నుంచి వచ్చిన ఇంక్వెస్ట్ డిప్యూటీ తహసీల్దార్ అమర జ్యోతిలు పోలీసుల సమక్షంలో శవ పంచనామా జరిపారు. అనంతరం 12.30 గంటల సమయంలో శ్మశాన వాటికకు వచ్చిన ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ దేవరాజు బృందం నబీల్ మృతదేహానికి పోస్ట్‌మార్టం జరిపారు. ఈ సందర్భంగా నబీల్ శరీరంపై ఆరు ప్రదేశాలలో గాయాలున్నట్లు వైద్యులు గుర్తించారు. గాయపడ్డ భాగాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిస్తున్నామని మంగళవారం ఉదయానికి నివేదికను సిద్ధంచేసి పోలీసులకు అందజేస్తామని వైద్యుల బృందం తెలిపింది. పోస్ట్‌మార్టం జరుగుతున్న సమయంలో దక్షిణ మండలం అదనపు డీసీపీ కె.బాబూరావు, చార్మినార్ ఏసీపీ కె.అశోక చక్రవర్తిలు శ్మశాన వాటికకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. పోస్ట్‌మార్టం పూర్తయ్యాక మధ్యాహ్నం 3 గంటల సమయంలో మృతదేహాన్ని తిరిగి పూడ్చారు. నివేదిక అందగానే హత్య కేసు నమోదు చేస్తామని దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ ఈ సందర్భంగా తెలిపారు. కాగా ఈ కేసులో ప్రేమ వ్యవహారం అన్న కోణంలో ప్రత్యేకంగా దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు. పోలీసుల అదుపులో 9మందిఙఞ్చటకాగా నబీల్ కేసులో పోలీసులు తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో మహ్మద్ ఒవేస్ అలియాస్ పటేల్ (19), మహ్మద్ ఉమర్ బేగ్ (20), ఇర్ఫాన్ పఠాన్ (22), సుల్తాన్ మీర్జా (22), ఎం.ఎ. కవి ఆలియాస్ ఓబేద్ (18), షహబాజ్ అలియాస్ వసీం డాలర్ (20), అబుబాకర్ (19), సులేమాన్ (18), సయ్యద్ యూసుఫ్ అహ్మద్ (19)లపై పోలీసులు ఐపీసీ 302, 201, 109, ఆర్/డబ్ల్యూ 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలి తన కుమారుడికి మరో రెండు నెలల్లో మైనార్టీ తీరనుండడంతో అతడ్ని దుబాయికి పంపాలని భావించాననీ నబీల్ తండ్రి దస్తగిర్ తెలిపారు. ఈ నెల మూడో తేదీ తెల్లవారు జాము 3 గంటల వరకూ తమ కుమారుడు తమ బంధువుల ఇంటి వద్దే ఉన్నాడనీ, అతని స్నేహితులు స్ట్రీట్ ఫైటింగ్ పేరిట తీసుకెళ్లి హత్యచేశారని ఆవేదన వ్యక్తపరిచారు. ఇందులో ఉమర్ బేగ్ అనే అతని ప్రమేయ ముందని నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. తన ఒక్కగానొక్క కుమారుడికి ఇలా జరగడం పట్ల కన్నీరు పెట్టారు. -
మృత్యువుతో సయ్యాట
- రాత్రంతా షికార్లు..పొద్దంతా నిద్ర - పాతబస్తీలో కొందరు యువకుల తీరు ఇదీ - కొన్ని సందర్భాల్లో అసాంఘిక శక్తులుగా మారుతున్న వైనం. - ఇటీవల తల్లిదండ్రులకు డీసీపీ కౌన్సెలింగ్ - తాజాగా వెలుగులోకి వచ్చిన స్ట్రీట్ ఫైట్ చాంద్రాయణగుట్ట: పాతబస్తీలోని కొందరు యువకులు సరదాలు ప్రాణాంతంగా మారుతున్నారు. సరదాకోసం కొందరు ఎంతటి సాహసానికైనా ఒడిగట్టడం ఆందోళన కలిగిస్తోంది. గ్రూప్‌లుగా ఏర్పడి రాత్రి పూట బైక్‌లపై సవారీ చేయడం, పగటి పూట జరిగిన చిన్నచిన్న సంఘటనలను సాకుగా తీసుకుని ప్రతీకార దాడులకు పాల్పడటం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో కొన్ని సందర్భాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఒక్కోసారి మరీ హద్దు మీరి ప్రవర్తిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. ఇందులో భాగంగానే హిమాయత్ సాగర్‌పై బైక్ రేసింగ్‌లకు పాల్పడుతున్న దాదాపు వంద మంది యువకులు ఇటీవల పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. చార్మినార్, డబీర్‌పురా, మీర్‌చౌక్, యాకుత్‌పురా, బహదూర్‌పురా, హసన్‌నగర్, కామాటీపురా, కాలాపత్తర్, ఫలక్‌నుమా, జంగమ్మెట్, జీఎం కాలనీ, చాంద్రాయణగుట్ట, బాబానగర్, బండ్లగూడ, బార్కాస్, పహాడీషరీఫ్, షాయిన్‌నగర్, ఎర్రకుంట, రియాసత్‌నగర్, సంతోష్‌నగర్, ఈదిబజార్, తలాబ్‌కట్టా తదితర బస్తీల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. ఒక్కోసారి క్రికెట్, ఫుట్‌బాల్ తదితర ఆటల్లో తలెత్తే వివాదాలు కూడా దాడులు, ప్రతిదాడులకు కారణమవుతున్నాయి. స్నేక్ గ్యాంగ్ నుంచి స్ట్రీట్ ఫైట్ వరకు. ఈ సంసృ్కతి నగర శివారు బస్తీలకు విస్తరించింది. ఈ క్రమంలోనే పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో స్నేక్‌గ్యాంగ్ ఘటన వెలుగు జూసిన విషయం తెలిసిందే. దాదాపు పది మంది యువకులు గ్యాంగ్‌గా ఏర్పడి ఇలాంటి అరాచకాలకు నాంది పలికారు. ఎన్నో ఘటనలకు పాల్పడిన ఈ ముఠా చివరకు ఫాం హౌస్‌లో యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడటంతో వారి అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ సంఘటన తరువాత కూడా వారిలో మార్పు రాకపోగా, కొత్త కోణాలు వెలుగులోకి రావడం గమనార్హం. తాజాగా స్ట్రీట్ ఫైట్ ఘటనలో నబీల్ అనే ఇంటర్ విద్యార్థి మృతి చెందడం నగరంలో చర్చనీయాంశంగా మారింది. పిల్లలపై దృష్టి సారించాలి తమ పిల్లల వ్యవహారశైలిపై తల్లిదండ్రులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బయటికి వెళ్లిన కుమారుడు ఇంటికి రాగానే ఎక్కడికి వెళ్లావు...? ఏ పని మీద వెళ్లావు..? అనే విషయాలపై ఆరా తీస్తే వారిలో భయం ఏర్పడుతుంది. అయితే కొందరు తల్లిదండ్రులు కనీసం పట్టించుకోకపోవడంతో పిల్లలు ఆడిందే ఆట....పాడిందే పాట అన్న చందంగా మారింది. ఈ నేపథ్యంలో కొందరు యువకులు దారితప్పుతున్న సంఘటనలూ వెలుగులోకి వస్తున్నాయి. 2012లో ఉప్పుగూడలోని గుల్షన్ ఎక్బాల్ కాలనీకి చెందిన విద్యార్థి ఒబేద్‌కు ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలున్నాయని కర్ణాటక పోలీసులు తీసుకెళ్లేంత వరకు కూడా తల్లిదండ్రులకు తెలియకపోవడం గమనార్హం.