విశాఖపట్నం(పెందుర్తి): విశాఖ జిల్లా పెందుర్తిలో తాగిన మైకంలో ఇద్దరు వీధి వ్యాపారులు పరస్పరం దాడి చేసుకున్నారు. మజీద్ అనే వ్యాపారి దిలీప్ ధర్మదాస్‌ను కర్రతో కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు దిలీప్ స్వస్థలం ఉత్తరప్రదేశ్. కాగా, మధ్యప్రదేశ్‌కు చెందిన వాడైన నిందితుడు మజీద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.