Pendurthi
-
ప్రభుత్వంపై జనసేన ఎమ్మెల్యే అసంతృప్తి.. గన్మెన్ల సరెండర్
సాక్షి,అనకాపల్లిజిల్లా: కూటమి ప్రభుత్వంపై పెందుర్తి జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు అసంతృప్తి వ్వక్తం చేశారు. ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తూ తన ఇద్దరు గన్మెన్లను సరెండర్ చేశారు. తాను సిఫారసు చేసిన కాపు సామాజికవర్గం సీఐకి పోస్టింగ్ ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లాలోని పరవాడ పోలీస్ స్టేషన్‌కు కాపు సామాజికవర్గానికి చెందిన సీఐని రమేష్‌బాబు సిఫారసు చేశారు. రమేష్‌బాబు సిఫారసును పక్కన బెట్టి కమ్మ సామాజిక వర్గానికి చెందిన మల్లిఖార్జున్‌కి మంత్రి నారా లోకేష్ పోస్టింగ్ ఇప్పిచ్చినట్లు సమాచారం. కాగా, జనసేన ఎమ్మెల్యేల సిఫార్సులను టీడీపీ నాయకులు పక్కన బెడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. -
చంద్రబాబులో అలాంటి విలువలు లేవు: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: ఎమ్మెల్సీ ఎన్నికలో మెజార్టీ లేకుండా టీడీపీ పోటీచేస్తుందంటే దాని అర్థం ఏంటి?.. కొనుగోలుచేసి ఎమ్మెల్సీ ఎన్నికలో గెలవాలని చూస్తోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నర్సీపట్నం, పెందుర్తి, పాయకరావుపేట నియోజకవర్గ స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులతో నియోజకవర్గం ఎంపీటీసీ, జడ్పీటీసీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ, ‘‘ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడన్నదానిపై సమాజం చూస్తుంది. కాని చంద్రబాబులో అలాంటి విలువలు లేవు. చంద్రబాబు లాంటి దుర్మార్గుడితో యుద్ధంచేస్తున్నాం. 2024 ఎన్నికల్లో చంద్రబాబు ప్రజలను మోసం చేశాడు. సూపర్ సిక్స్ హామీ ఇచ్చాడు, కాని మోసం చేస్తున్నాడు. నీకు రూ.15వేలు, నీకు రూ.18వేలు అని ప్రచారం చేశాడు. ఎన్నికల్లో చంద్రబాబులా హామీలు ఇవ్వాలని నాపై ఒత్తిడి తెచ్చారు. మనం అబద్ధాలు చెప్పి, ఆ కిరీటాన్ని మనం నెత్తిన పెట్టుకుంటే మనకు ఏం సంతృప్తి వస్తుంది’’ అంటూ వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.‘‘కార్యకర్తల నుంచి, ఎమ్మెల్యేల వరకూ తిరిగి గ్రామాల్లో తిరిగే పరిస్థితి ఉంటుందా?. జగన్ మాట చెప్పాడు, కాని అమలు చేయలేదనే మాట అనిపించుకోకూడదు. మన పార్టీ పేరు చెప్తే కార్యకర్తలు, నాయకులు కాలర్ ఎగరేసుకునేలా ఉండాలి. అందుకే నేను మోసపూరిత హామీలు ఇవ్వలేదు. 2014లో చంద్రబాబు కూడా ఇలాంటి హామీలు ఇచ్చి, మాట తప్పాడు. ఇది ప్రజలకు అర్థమైంది, అందుకే 2019లో ఆయన డిపాజిట్లు గల్లంతయ్యాయి. 2019లో మనం అధికారంలోకి వచ్చి ఇచ్చిన ప్రతిమాటనూ నిలబెట్టాం. ఇవ్వాల్టికీ ప్రజల దగ్గరకు వెళ్లి మనం ఇది చేశామని చెప్పుకోగలిగాం’’ అని వైఎస్ జగన్ చెప్పారు.‘‘కష్టకాలంలో మనం ఎలా ఉంటున్నామనేది ప్రజలు చూస్తారు. ప్రజలకు మనకు శ్రీరామ రక్షగా ఉంటారు. విలువలు కోల్పోయిన రోజు మనకు ప్రజలనుంచి ప్రశ్నలు ఎదురవుతాయి. విలువలు, విశ్వసనీయతగా మనం అడుగులేశాం. కష్టాలు లేకుండా ఏదీ ఉండదు. చీకటి తర్వాత వెలుగు రాక మానదు. పలానా వాడు మన నాయకుడు అని చెప్పుకునే రీతిలో మనం ఉండాలి. జగన్ గురించి మాట్లాడితే ఎవరిని అడిగినా.. పలావు పెట్టాడు అంటారు. చంద్రబాబు గురించి అడిగితే.. బిర్యానీ పెడతానని మోసం చేశాడని అంటున్నారు. ఇప్పుడు పలావు పోయింది.. బిర్యానీ పోయింది’’ అంటూ వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.‘‘స్కూళ్లు, ఆస్పత్రులను నిర్వీర్యం చేస్తున్నారు. రైతులంతా ఇబ్బందులు పడుతున్నారు. గడపవద్దకే మనం సేవలు అందిస్తే ఇప్పుడు టీడీపీ నాయకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. పాలన దెబ్బతింది, లా అండ్ ఆర్డర్ దెబ్బతింది. వ్యవసాయం దెబ్బతింది. చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ అబద్ధాలు, మోసాలని తేలిపోతున్నాయి. మీ జగన్ సీఎంగా ఉండి ఉంటే అమ్మ ఒడి, రైతుభరోసా, విద్యాదీవెన, వసతి దీవెన, సున్నావడ్డీ, మత్స్యకార భరోసా అంది ఉండేది. మీ జగన్ సీఎంగా ఉండి ఉంటే.. కాలెండర్ ప్రకారం పథకాలు వచ్చేవి. తేడాను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ప్రజలకు మనం దగ్గరంగా ఉంటే చాలు. ప్రజలే చంద్రబాబును నామరూపాల్లేకుండా చేసే పరిస్థితి వస్తుంది’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.ప్రభుత్వం నుంచి వేధింపులు ఎదుర్కొంటున్న ప్రతి కార్యకర్తకూ నేను భరోసా ఇస్తున్నాను. వీటిని ఎదుర్కొని ఉన్నప్పుడు ప్రజలు మనల్ని కచ్చితంగా ఆదరిస్తారు. రాజకీయ వేధింపుల్లో భాగంగా నన్ను 16 నెలలు జైలుకు పంపారు. కాని ప్రజలకోసం మనం చేసిన పోరాటాలతో మళ్లీ మంచి స్థానంలో పెట్టారు. ఈ విషయాన్ని అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. ధనబలం, అధికార బలంతో చంద్రబాబు దారుణాలు చేస్తున్నాడు. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. అధర్మం, అన్యాయం సాగదన్న సందేశం ఇవ్వాలి. ప్రతి ఒక్కరినీ కొనలేరనే మెసేజ్ పంపాలి’’ అని వైఎస్ జగన్ సూచించారు.‘‘విశాఖపట్నం స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అన్యాయంగా వ్యవహరించారు. వైఎస్సార్సీపీకి చుక్కెదురు అంటూ ఈనాడు పత్రిక ఏదో ఘనకార్యం జరిగినట్టుగా రాసింది. మెజార్టీలేని చోట ప్రలోభాలు పెట్టి, పోలీసులతో భయపెట్టి ఓట్లు వేయించుకున్నందుకు ఘనకార్యమా?. దొంగతనం, హత్యలు చేస్తే దాన్ని కూడా ఘనకార్యంగా రాసే స్థితిలో ఉన్నారు. చంద్రబాబు ఇలాంటి చెత్త కార్యక్రమాలు చేస్తున్నా కూడా ఘన కార్యాలుగా రాస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం ఇచ్చే తీర్పు చాలా కీలకం’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
పోలింగ్ బూత్ లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు యత్నించిన సీఎం రమేష్
-
విశాఖజిల్లా పెందుర్తిలో రెచ్చిపోయిన టీడీపీ నాయకుడు
-
యాత్రకు అడుగడుగునా నీరాజనం పలుకుతున్న ప్రజలు
-
చంద్రబాబు ఓటు బ్యాంకుగానే బీసీలను చూశారు: బూడి ముత్యాలనాయుడు
-
వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర.. 21వ రోజు షెడ్యూల్ ఇదే..
సాక్షి, అమరావతి: ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తోన్న మేలును వివరించడానికి వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర శనివారం కాకినాడ జిల్లా తుని, అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గాల్లో జరగనుంది. అనకాపల్లి జిల్లా: పెందుర్తిలో ఎమ్మెల్యే అదీప్ రాజు అధ్వర్యంలో జరగనున్న బస్సు యాత్ర జరగనుంది. ఉదయం 10:30 గంటలకు జీవీఎంసీ కళ్యాణ మండపంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. 11:30 గంటలకు వేపగుంట నుంచి పాలిటెక్నిక్ కాలేజీ వరకు భారీ ర్యాలీ జరపనున్నారు. 12 గంటలకు నూతనంగా ఏర్పాటు చేసిన పాలిటెక్నిక్ కళాశాల ప్రారంభోత్సవం అనంతరం 3 గంటలకు వెల్ఫే ర్ కాలేజీ నుంచి సబ్బవరం వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు సబ్బవరం జంక్షన్లో జరిగే బహిరంగ సభలో పార్టీ రీజనల్ ఇంఛార్జి వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు బూడి ముత్యాలనాయుడు, గుడివాడ అమర్నాథ్, స్పీకర్ తమ్మినేని సీతారాం తదితరులు హాజరుకానున్నారు. కాకినాడ జిల్లా: తునిలో ఎమ్మెల్యే మంత్రి దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో బస్సు యాత్ర సాగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు తుని ఆర్అండ్బి అతిథి గృహంలో వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం అనంతరం ర్యాలీ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రాజా మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో పార్టీ రీజనల్ ఇంఛార్జ్ పిల్లి సుభాస్ చంద్రబోస్, మంత్రులు సీదిరి అప్పలరాజు, ధర్మాన ప్రసాదరావు, మేరుగ నాగార్జున, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తదితరులు హాజరుకానున్నారు. -
ఆకలే ఆమెకు శాపమైంది.. ఒక్కగానొక్క కూతురు ఇలా..
సాక్షి, పెందుర్తి: తమ కూతురు భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు విధి తీరని విషాదం నింపింది. భోజనం చేసేందకు రోడ్డు దాటేందుకు ప్రయత్నించడమే ఆమె పాలిట శాపమైంది. బైక్ ఢీకొనడంతో ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. నంద్యాల పట్టణానికి చెందిన ముల్లా షహీద(23) కుటుంబం ఉపాధి కోసం విశాఖ వలస వచ్చారు. ఆమె తల్లిదండ్రులు పెందుర్తి గాంధీనగర్‌లో ఉంటూ కూలి పనులు చేసుకుంటున్నారు. కాగా, వీరికి ఒక్కగానొక్క కుమార్తె షహీద. అయితే, షహీద.. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పని చేస్తోంది. ఈ క్రమంలో సోమవారం పాఠశాలకు వెళ్లిన ఆమె.. స్కూల్లో ఒక విద్యార్థి భోజనం తీసుకురాకపోవడంతో తన భోజనాన్ని సదరు విద్యార్థికి ఇచ్చేశారు. ఇక, సాయంత్రం ఇంటికి వెళ్లే ముందు ఆకలి వేయడంతో ఆమె ఇంటికి సమీపంలోనే ఓ బండి వద్ద పునుగులు తిన్నారు. అనంతరం నడుచుకుంటూ రోడ్డు దాటుతుండగా అతి వేగంగా దూసుకొచ్చిన బైక్.. ఆమెను ఢీకొట్టింది. దీంతో, షహీదా కుప్పకూలి కిందపడిపోయింది. ఈ ప్రమాద ఘటనలో ఆమె కాలు విరిగిపోగా, చేతికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి ట్రాఫిక్ పోలీసుల సహకారంతో 108 వాహనంలో కేజీహెచ్‌కు తరలిస్తుండగా తీవ్ర రక్తస్రావం కావడంతో మార్గ మధ్యలోనే మృతి చెందారు. దీంతో, ఒక్కగానొక్క కూతురు ఇలా అర్ధాంతరంగా మృతిచెందడంతో పేరెంట్స్ కన్నీటిపర్యంతమవుతున్నారు. ఇక, ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పెందుర్తి సీఐ మరడాన శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ప్రమాదానికి కారణమైన పురుషోత్తపురం ప్రాంతానికి చెందిన యువకుడు రవితేజను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతివేగం ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు నిర్ధారించారు. ఇది కూడా చదవండి: రూ. కోట్లకొద్దీ డబ్బు, బంగారం స్వాధీనం -
పెందుర్తిలో వృద్ధురాలు దారుణ హత్య
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో ఓ వృద్దురాలు దారుణ హత్యకు గురైంది. పెందుర్తిలోని సుజాతనగర్‌కు చెందిన వరలక్ష్మి దంపతులు(70) ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతున్నారు. ఇటీవల వారి వద్ద ఉల్లిపాయలు కట్ చేసే వర్కర్‌గా వెంకటేష్ ఉద్యోగంలో చేరాడు. ఈ క్రమంలో వరలక్ష్మి ఇంట్లో డబ్బు ఉందని భావించిన వెంకటేష్.. నిన్న రాత్రి ఆమె ముఖంపై దిండుతో అదిమి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని ఎత్తుకెళ్లాడు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పెందుర్తి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. నిందితుడు వృద్ధురాలు నివాసముంటున్న అపార్ట్మెంట్ లోపలికి వచ్చి బయటకు వెళ్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజ్‌లో గుర్తించారు. వీటి ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు గాలిస్తున్నారు. అయితే నెల రోజుల క్రితమే వెంకటేష్ పనిలో చేరినట్లు పోలీసులు గుర్తించారు. -
పెందుర్తి లెండీవనం రిసార్ట్‌లో ఐదేళ్ల బాలుడు అనుమానాస్పద మృతి
-
మీకిచ్చిన సెంటు భూమి శవం పూడ్చడానికి సరిపోతుంది: చంద్రబాబు
సాక్షి, విశాఖపట్నం: పేదల సొంతింటి కల నెరవేర్చేలా అక్కచెల్లెమ్మలకు రూ.లక్షలు విలువ చేసే ఆస్తిని అందించేందుకు ప్రభుత్వం ఇస్తున్న సెంటు స్థలాలపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అహంకారపూరిత వ్యాఖ్యలు చేశారు. మీకిచ్చే సెంటు భూమి శవాన్ని పూడ్చడానికి సరిపోతుందంటూ కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. బుధవారం పెందుర్తిలో నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెందుర్తి ఎన్టీఆర్ జంక్షన్లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. సెంటు భూమిలో ఇళ్లు కడతామని జగన్ చెబుతున్నారని, ఆ సెంటు భూమి బరియల్ గ్రౌండ్‌కు మాత్రమే ఉపయోగపడుతుందని ఎద్దేవా చేశారు. ఎవరైనా చనిపోతే అందులో పూడ్చడానికి మాత్రమే దీన్ని ఉపయోగించవచ్చని అన్నారు. టీడీపీ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లోని పేదలకు 2 సెంట్లు ఇచ్చామని తెలిపారు. తాము కరెంట్ చార్జీలు పెంచలేదని, కరెంట్ కూడా ఒక్కసారి కూడా ఆపకుండా సరఫరా చేశామని అన్నారు. విశాఖలో వీధిదీపాలు వేసింది తానేనని, ఈ ప్రభుత్వానికి వాటికి రిపేర్లు కూడా చేసే స్థోమత లేదన్నారు. అమరావతిని రాజధానిగా, విశాఖపట్నం ఐటీ, ఆర్థిక రాజధానిగా, టూరిజం హబ్‌గా తయారు చేస్తామని చెప్పానని చెప్పారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు బాధ్యత టీడీపీ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. విశాఖపట్నం, ఉత్తరాంధ్ర సహా రాష్ట్రంలో ఏ మూల నుంచైనా అమరావతికి వచ్చి ఇళ్లు కట్టుకోవడానికి 5 శాతం భూమి రిజర్వ్ చేశానన్నారు. ఇప్పుడా భూముల అంశం సుప్రీంకోర్టుకు వెళ్లిందని తెలిపారు. అమరావతిలో తానుండే అద్దె ఇంటిని కూల్చేసేందుకు ప్రయత్నించి.. ఇప్పుడు దానిపై క్విడ్‌ప్రోకో పేరుతో కేసు పెట్టారన్నారు. చదవండి: లోకేష్‌కు నలుగురూ వేర్వేరుగా స్వాగతం.. అక్కడే ఉంది అసలు ట్విస్ట్..! రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి రావాలంటే తన ఒక్కడి బలమే సరిపోదని, అందరం కలిసి సమష్టిగా పోరాడాలని అన్నారు. ధనిక ముఖ్యమంత్రికి, నిరుపేదలకు మధ్య జరుగబోతున్న కురుక్షేత్ర పోరాటంలో అందరం కలిసి కౌరవుల్ని ఓడించాలన్నారు. ఇక జగన్ పని, వైఎస్సార్సీపీ పని అయిపోయిందని, ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కరూ కూడా గెలవరని అన్నారు. రాబోయే ఎన్నికల్లో 175 కాదు.. వైఎస్సార్సీపీకి గుండుసున్నాయే మిగులుతుందన్నారు. నవంబర్, డిసెంబర్లో ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారని, ధైర్యం ఉంటే.. రేపే ఎన్నికలు పెట్టాలని సవాల్ విసిరారు. తన దగ్గర డబ్బులు లేవని వాళ్లనుకుంటున్నారని, తనది ప్రజాబలం, వాళ్లది ధనబలమని అన్నారు. ఇంకా జనం రాలేదా? షెడ్యూల్ ప్రకారం చంద్రబాబు విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా వేపగుంట జంక్షన్‌కు చేరుకొని రోడ్ షోలో పాల్గొనాల్సి ఉంది. కానీ మధ్యాహ్నం 4 గంటలకు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న చంద్రబాబు.. జనం లేరని తెలిసి మారియట్ హోటల్‌కు వెళ్లిపోయారు. ఈలోగా జనాల్ని నాయకులు తీసుకొచ్చి సమాచారం ఇవ్వడంతో రోడ్ షోకు వెళ్లారు. అప్పటికీ జనం లేకపోవడంతో స్థానిక నేతలపై బాబు అసహనం వ్యక్తం చేశారు. పెందుర్తి సభకు కూడా జనాల్ని తీసుకొచ్చారు. అది కూడా చిన్న రహదారిలో రెండువైపులా హోర్డింగ్‌లు పెట్టి.. ఇరుకు రోడ్డులోనే భారీగా జనం వచ్చినట్లు షో చేసి.. మమ అనిపించారు. -
‘పుష్ప’ తరహాలో గంజాయి రవాణా.. క్యాబేజీ బుట్టల మాటున దాచి..
సాక్షి, విశాఖపట్నం: ‘పుష్ప’ సినిమా తరహాలో గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన విశాఖ జిల్లా పెందుర్తిలో చోటుచేసుకుంది. బొలెరో వాహనంలో ఇద్దరు వ్యక్తులు క్యాబేజీ బుట్టల మాటున గంజాయి అక్రమంగా తరలించే ప్రయత్నం చేశారు. అయితే బొలెరోలో గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులకు సమచారం అందింది దీంతో పెందుర్తి వద్ద పోలీసులు వాహనంలో తనిఖీలు చేపట్టగా గుట్టు రట్టైంది. క్యాబేజీ బుట్టలు కింద 14 బ్యాగుల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బొలెరో వాహనంలో ఒడిశా నుంచి గంజాయిని క్యాబేజీ బుట్టల లోడుతో తీసుకొస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గంజాయితో ఉన్న బొలెరో వాహనాన్ని, ఇద్దరు వ్యక్తులను పెందుర్తి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
కిడ్నీ బాధితుడు వినయ్ కుమార్ ఇంటికి వైద్య బృందం
-
కిడ్నీ రాకెట్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం
-
దొంగలను ఎదిరించిన మహిళ.. కత్తులతో పొడిచినా..
సాక్షి, విశాఖపట్నం: చీమలాపల్లిలోని ఓ ఇంట్లో దొంగతనానికి దొంగలు స్కెచ్ వేశారు. మంగళవారం అర్ధరాత్రి ఒంటి సమయంలో ఆ ఇంటి కిటికీ స్రూ్కలు విప్పి.. మెస్ తొలగించి లోపలికి ప్రవేశించారు. దొంగతనానికి ప్రయత్నిస్తుండగా వారిని అడ్డుకున్న వివాహితను కత్తితో పొడిచారు. ఓ వైపు రక్తం కారుతున్నా.. ఆమె వారిని ప్రతిఘటించడంతో అక్కడి నుంచి పరారయ్యారు. జీవీఎంసీ 95వ వార్డు పరిధి చీమలాపల్లిలో కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించి బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలివీ.. చీమలాపల్లిలో ఆళ్ల అప్పారావు, లలితకుమారి దంపతులు పెద్ద కుమారుడు వినయ్‌కుమార్, చిన్నకుమారుడు అవినాష్ కుమార్, కోడలు లావణ్య(అవినాష్ భార్య)తో కలిసి సొంత ఇంట్లో నివాసం ఉంటున్నారు. అవినాష్ నగరంలోని ఒక ప్రైవేట్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి అతను నైట్ డ్యూటీకి వెళ్లాడు. ఇంట్లో ఓ గదిలో లావణ్య(25) నిద్రిస్తుండగా.. మరో గదిలో అప్పారావు, లలితకుమారి, వినయ్‌కుమార్ పడుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట సమయంలో ఇంటి హాలులోని కిటికీ గ్రిల్ స్రూ్క లు విప్పి, మెస్ కట్ చేసి.. కిటికీ తలుపు గడియ విరగొట్టి.. ఇద్దరు దొంగలు లోపలికి చొరబడ్డారు. అప్పారావు, లలితకుమారి, వినయ్‌కుమార్ పడుకుని ఉన్న గది తలుపునకు బయట గడియపెట్టారు. లావణ్య పడుకుని ఉన్న గది తలుపును గట్టిగా తన్నడంతో బోల్టు ఊడి.. తలుపు తెరుచుకుంది. దీంతో వారు లోపలకి ప్రవేశించారు. ఈ హఠాత్పరిణామానికి నిద్రలేచిన లావణ్య తేరుకునే లోపే గదిలో ఉన్న బీరువాను తెరిచేందుకు యత్నించారు. ఈ క్రమంలో లావణ్య వారిని గట్టిగా పట్టుకుని కేకలు వేసింది. ఆమె అరుపులకు ఏం జరిగిందో అని పక్క గదిలో ఉన్న అప్పారావు, లలితకుమారి, వినయ్‌కుమార్ నిద్రలేచారు. బయటకు వద్దామని ప్రయత్నిస్తే గది బయట గడియవేసి ఉండటంతో వాళ్లు రాలేని పరిస్థితి నెలకుంది. ఆ సమయంలో తన గది నుంచి ఇంటి హాలు వరకు ఇద్దరు దొంగలను లావణ్య ప్రతిఘటిస్తూనే ఉంది. ఆమెతో పాటు కుటుంబ సభ్యులు కూడా పెద్దగా కేకలు వేయడంతో దొంగలు తప్పించుకునేందుకు లావణ్యను పొట్ట భాగం, కాళ్లపైన కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు. కారుతున్న రక్తంతోనే లావణ్య.. అత్తమామలు, బావ నిద్రిస్తున్న తలుపు గడియ తీసింది. వెంటనే ఆమెను నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. క్రైం డీసీపీ నాగన్న, ఏడీసీపీ దుర్గాప్రసాద్, గంగాధర్, ఏసీపీ పెంటారావు, క్రైమ్ సీఐ దుర్గాప్రసాద్, పెందుర్తి లా అండ్ సీఐ నాగేశ్వరరావు తదితరులు ఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రంగంలోకి దిగిన క్లూస్ టీమ్ వేలిముద్రలను సేకరించింది. డాగ్ స్క్వాడ్ ఇంటి పరిసర ప్రాంతాలు, సమీపంలో ఉన్న కొన్ని ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టింది. కాగా.. మొత్తం నలుగురు దుండగులు దొంగతనానికి వచ్చి.. ఇద్దరు ఇంట్లోకి ప్రవేశించినట్టు స్థానికులు చెబుతున్నారు. ఇంటి ప్రహరీ దూకి వీరంతా వచ్చినట్టు భావిస్తున్నారు. అప్పారావు ఇంటి పక్కనే ఉన్న మరో ఇంటి బయట ఆరేసున్న దుస్తులను ముక్కలుగా చేసి ముఖానికి కట్టుకుని లోపలికి ప్రవేశించినట్లు తెలుస్తోంది. వాటిని దొంగలు ఇంటి బయట కుర్చీలో వదిలేసి వెళ్లారు. డాగ్ స్క్వాడ్ బృందం పరిశీలనలో ప్రహరీ బయట ఒక టార్చ్‌లైట్, డ్రింక్ బాటిల్‌ను గుర్తించారు. కాగా ఇంటి కిటికీ గ్రిల్స్ తొలగించి లోపలికి ప్రవేశించిన దుండగులు.. పారిపోయేటప్పుడు ప్రధాన ద్వారం తాళం తీసుకుని వెళ్లినట్లు బాధితులు చెబుతున్నారు. దొంగతనానికి వచ్చిన వారు చెడ్డీగ్యాంగ్‌గా ప్రచారం జరుగుతోంది. -
రైతు బజార్ ధరలు
పెందుర్తి: స్థానిక రైతు బజార్లో సోమవారం నాటికి కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి. బోర్డులో పెట్టిన ధర కంటే ఎక్కువకు విక్రయాలు జరిపితే వినియోగదారులు 1902 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయవచ్చు. రకం(కిలో), ధర(రూపాయిల్లో) ఉల్లిపాయలు(పాతవి)మధ్యప్రదేశ్ 20, ఉల్లిపాయలు రైతువారి జంట పాయలు 20, టమాటా దేశవాలి/హైబ్రిడ్ 30, వంకాయలు(తెల్లవి) 28, వంకాయలు(నలుపు) 30, వంకాయలు(పొడవు) 30, వంకాయలు(కలకత్తా)/డిస్కో 26, వంకాయలు(వెల్లంకి),కాశీపట్నం 40, బెండకాయలు 36, పచ్చిమిర్చి(నలుపుసన్నాలు)శ్రీకాకుళం మిర్చి 48/ 40, బజ్జి మిర్చి/పకోడ మిర్చి 50/64, కాకరకాయలు 32, బీరకాయలు 32, ఆనపకాయలు 16, కాలీఫ్లవర్/బ్రకోలి 30/60, క్యాబేజీ(గ్రేడింగ్)/ఊదా రెడ్ క్యాబేజీ 30/32, క్యారెట్(డబల్ వాషింగ్)/వాషింగ్/మట్టి 48/36, దొండకాయలు 20, బంగాళదుంపలు పాతవి/కొత్తవి అరకు 23/25, అరటి కాయలు పెద్ద/చిన్న(ఒకటి) 7/4, మునగకాడలు(కిలో) 44, అల్లం 48, బరబాటి 46, ముల్లంగి 24, నిమ్మకాయలు 50, గోరు చిక్కుడు 36, దోసకాయలు 20, బీట్రూట్ 34, వెల్లుల్లిపాయలు(బాంబ్)/మీడియం 48/30, కొబ్బరికాయ(పెద్దది) 18, బీన్స్ పెన్సిల్/రౌండ్/పిక్కలు 84/60/70, ఆగాకర దేశవాలి/హైబ్రిడ్ 76/50, పొటల్స్ 24, కీరదోస 22, క్యాప్సికం 52, పొట్లకాయ పెద్దవి/చిన్నవి/కిలో 16/12/24, చామదుంపలు మట్టివి/కడిగినవి 38/32, చిలగడ దుంపలు 34, కంద దుంప 34, దేముడు చిక్కుడు 62, బద్ద చిక్కుడు 62, చౌచో(బెంగళూరు వంకాయలు) 20, ఉసిరికాయలు 54, కరివేపాకు 40, కొత్తిమీర 130, పుదీన(కట్ట) 5, చుక్కకూర(కట్ట) 3, పాలకూర(కట్ట) 5, మెంతికూర(కట్ట) 3, తోటకూర(కట్ట) 3, బచ్చలికూర(కట్ట) 3, గోంగూర(కట్ట) 3, తమలపాకులు(100 ఆకులు) 50, నూల్‌కోల్/రాజ్మా పిక్కలు 24/120, మామిడి కాయలు కలెక్టర్/పరియాలు/ కొలనుగోవ/ బారమస 26/ 28/46, స్వీట్ కార్న్/ మొక్కజొన్న 28/ 60/ 80, బూడిద గుమ్మడి/తీపి గుమ్మడి 22/18, కూర పెండలం 18, మామిడి పళ్లు బంగినపల్లి/రసాలు/సువర్ణరేఖ/పరియాలు/పనుకులు/కొత్తపల్లి కొబ్బరి మామిడి రూ.70/70/70/50/130, వేరుశనగ 50, పువ్వులు: చామంతి హైబ్రిడ్/దేశవాలి 400, గులాబీ 300, గులాబీ డజను 20, బంతి దండ పసుపు/ఆరెంజ్/మిక్సిడ్ 25/30, మల్లెపూలు మూర/కిలో 30/500, కనకాంబరాలు మూర/కిలో 35/1600, విరాజాజి మూర/కిలో 25/200, కాగడ మల్లె మూర/లిల్లీ కిలో 30/200, తులసి మాల మూర/నందివర్థనాలు (50పువ్వులు) 20/10, బంతి పువ్వులు కిలో 120, మందార మొగ్గలు (20) 10, పండ్లు: పైనాపిల్ కిలో/చిన్నది/పెద్దది 40/25/30, దానిమ్మ 190, నేరేడు 150, బొప్పాయి 24, ఆపిల్ (మొదటి, రెండో రకం)/రాయల్ ఆపిల్ 150/100/ 190, అరటి పండ్లు(కిలో) 40, కమలాలు క్వీన్/నాగపూర్ 100/80, సపోట 50, జామకాయలు తైవాన్/దేశీ 50/45, ద్రాక్ష సీడ్/సీడ్లెస్90/145, ద్రాక్ష తెలుపు/నలుపు(కిస్మిస్) 80/150, కివి 180, బత్తాయి 60, ఉల్లికాడలు/మోసులు 60, పుచ్చకాయలు దేశి/కిరణ్/పసుపు/కర్బుజా 15/16/24/28, పనసతొనలు కిలో 90, చింతపండు పిక్క తీసింది/పిక్కతో 380/120 , చింతచిగురు/కాయలు 65/40, గుడ్డు(ఒకటి) 5.40. -
Visakhapatnam: భవానిని చంపిందెవరు?
సింహాచలం(పెందుర్తి): అడవివరం నుంచి శొంఠ్యాం వెళ్లే ప్రధాన రహదారిలో భైరవవాక వద్ద సింహాచలం దేవస్థానం స్థలంలోని బావిలో ఆదివారం ఓ యువతి మృతదేహం బయటపడింది. రోజూ ఆమెను తీసుకెళ్లే ఆటోడ్రైవరే హత్య చేశాడని కుటంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అన్ని కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని వెస్ట్ ఏసీపీ శ్రీపాదరావు వెల్లడించారు. యువతి తల్లిదండ్రులు బంధువులు, శొంఠ్యాం గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలివీ.. ఆనందపురం మండలం శొంఠ్యాంనకు చెందిన సిమ్మ సత్యం, లక్ష్మి దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె భవాని(22) ఉన్నారు. భవాని రెండేళ్ల నుంచి సింహాచలం కొండపై ఓ షాపులో పనిచేస్తోంది. శొంఠ్యాం సమీపంలోని కణమాం గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ ఎన్ని రాజు రోజూ భవానిని సింహాచలం తీసుకెళ్లి.. తిరిగి ఇంటికి తీసుకొస్తుంటాడు. అలానే ఈ నెల 3వ తేదీ శుక్రవారం ఉదయం 7 గంటలకు తన ఆటోలో భవానిని శొంఠ్యాం నుంచి తీసుకెళ్లాడు. అదే రోజు ఉదయం 11.30 గంటలకు యువతి ఇంటికి వచ్చాడు. మీ అమ్మాయి ఇంటికి వచ్చిందా అని ఆమె తల్లిదండ్రులను అడిగాడు. నువ్వే కదా ఆటోలో తీసుకెళ్లావు అని వారు సమాధానం ఇవ్వగా.. మీ అమ్మాయి ఫొటో ఉందా అని రాజు వారిని అడిగాడు. ఏంటి కొత్తగా ఫొటో అడుగుతున్నావు? అని గట్టిగా అడగ్గా.. అక్కడి నుంచి అతను వెళ్లిపోయాడు. వెంటనే వారు రాజుకు ఫోన్ చేయగా.. పొంతనలేని సమాధానాలిచ్చాడు. దీంతో వారు భవాని పనిచేసే షాపు యజమానికి ఫోన్ చేశారు. ఆమె రాలేదని యజమాని చెప్పడంతో అనుమానం వచ్చి మళ్లీ రాజుకు ఫోన్ చేయగా స్పందించలేదు. 4న ఉదయం 6 గంటల సమయంలో యువతి తల్లిదండ్రులకు రాజే స్వయంగా ఫోన్ చేసి.. భైరవవాకలోని బావి వద్ద భవాని చెప్పులు, పర్సు, మొబైల్ ఫోన్ ఉన్నాయని, తాను అక్కడే ఉన్నానని చెప్పాడు. వెంటనే ఆమె తల్లిదండ్రులు, బంధువులు భైరవవాకకు చేరుకుని.. బావి దగ్గర ఉన్న భవాని వస్తువులను చూశారు. ఇవన్నీ భావి దగ్గర ఉన్నాయని నీకెలా తెలుసని.. మా అమ్మాయి ఎక్కడని రాజును ప్రశ్నించారు. నా స్నేహితుడు ఫోన్ చేసి చెప్పాడని పొంతన లేని సమాధానాలు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత భవాని తల్లిదండ్రులు ఆనందపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రాజును అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసులు, భవాని బంధువులు బావి దగ్గర వెతకగా.. ఆమె ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం బావిలో భవాని మృతదేహం బయటపడింది. సమాచారం అందుకున్న భవాని బంధువులు, గ్రామస్తులు భైరవవాక వద్దకు చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న నార్త్ ఏసీపీ శ్రీపాదరావు, గోపాలపట్నం లా అండ్ ఆర్డర్ సీఐ మళ్ల అప్పారావు, పెందుర్తి సీఐ అశోక్ మృతదేహాన్ని పరిశీలించారు. డాక్ స్క్వాడ్, క్లూస్‌టీంలు వివరాలు సేకరించాయి. భవాని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాలెన్నో.. భవాని మృతి మిస్టరీగా మారింది. ఆమె ముఖంపై గాయాలు ఉండటంతో కచ్చితంగా ఇది హత్యేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజు, భవాని ప్రేమించుకున్నారని, రాజు తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదని సంఘటన స్థలంలో పలువురు మీడియాకు తెలిపారు. ఈ నెల 3న తన ఆటోలోనే భవానిని తీసుకెళ్లిన రాజు కొన్ని గంటల్లోపే తిరిగి ఆమె ఇంటికి వెళ్లడం, ఆమె ఫొటో అడగడం, ఆ తర్వాత పొంతన లేని సమాధానాలు, తర్వాత రోజు తానే స్వయంగా ఫోన్ చేసి బావి వద్ద భవాని వస్తువులు ఉన్నాయని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. 4న పోలీసుల సమక్షంలో బావిలో అణువణువూ గాలించినా భవాని ఆచూకీ లభ్యం కాలేదు. ఆదివారం ఉదయం మాత్రం బావిలో మృతదేహం కనిపించింది. తన కూతురిని ఎక్కడో చంపేసి.. ఆదివారం ఉదయం బావిలో పడేశారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే భవానిని హత్య చేశారని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఆ తల్లిదండ్రులకు ఇది అంతులేని వేదన!
సాక్షి, పెందుర్తి: ఆరు నెలల క్రితం అనారోగ్యంతో కుమార్తె మృతి చెందింది. ఆ బాధలోంచి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఇంకా తేరుకోలేదు.. చేతికందిన కొడుకును కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆ కుమారుడు కూడా తనువు చాలించాడు. ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చాడు. ఇలా ఆరు నెలల వ్యవధిలోనే కుమార్తె, కుమారుడు మృతి చెందడంతో వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. ఇంకెందుకు మేం బతకాలంటూ వారి వేదన అక్కడ ఉన్నవారిని కలచివేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్.రాయవరం దార్లపూడి గ్రామానికి చెందిన గొంతుమూర్తి లోవరాజు, లక్ష్మి దంపతుల కుమారుడు మల్లేష్ (22) పోటీ పరీక్షలకు హాజరవుతున్నాడు. ఈ క్రమంలో నగరంలో జరుగుతున్న ఓ పరీక్ష రాసేందుకు సోమవారం ఉదయం దార్లపూడి నుంచి స్నేహితుడు భీముని ధనరాజుతో కలిసి బైక్‌పై బయలుదేరాడు. పెందుర్తి కూడలి వద్దకు వచ్చే సరికి వీరి బైక్‌ను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. మల్లేష్ తీవ్రంగా గాయపడగా, ధనరాజు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. చదవండి: (నిరుద్యోగులను ముంచేసిన మహిళా హోంగార్డు) మల్లేష్‌ను హుటాహుటిన కేజీహెచ్‌కు తరలించగా...చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందాడు. పెందుర్తి సీఐ కె.అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా వివాహిత అయిన మల్లేష్ సోదరి ఆరునెలల క్రితం తీవ్ర అనారోగ్యంతో మృతి చెందింది. కుమార్తె మరణించిన కొద్ది రోజులకే కుమారుడు కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లిదండ్రులు లోవరాజు, లక్ష్మి గుండెలవిసేలా రోదిస్తున్నారు. చదవండి: (అద్దెకున్న మహిళే హంతకురాలు) -
జుత్తాడ ఫ్యామిలీ మర్డర్: అదును చూసి ఆరుగురిని చంపాడు
విశాఖ పట్నం: విశాఖ జిల్లా జుత్తాడ అంటే అందరికీ గుర్తొచ్చేది ప్రశాంత పల్లె. రాజకీయ దురందులతో పాటు మంచి మనసులను సమాజానికి అందించిన పల్లె అలాంటి పల్లెలో రక్తం పారింది. ఓ సమస్య విషయంలో తనకు అన్యాయం జరిగిందని ఓ వ్యక్తి కత్తి పట్టడంతో ఆరుగురు ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. విశాఖ నగరానికి దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరంలో జుత్తాడ గ్రామం ఉంది. అన్ని కులాలకు చెందిన వ్యక్తులతో పాటు 500 వరకు ఇల్లు ఉన్న ఈ గ్రామంలో ఎక్కువ శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. కొత్త తరం యువత మాత్రం మార్బుల్ ఫ్లోరింగ్ పనులు చేస్తున్నారు. ఈ దశలో గ్రామంలో బమ్మిడి రమణ, బత్తిన అప్పలరాజు కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. రమణ కుమారుడు విజయ్ కిరణ్ మూడేళ్ల క్రితం ఒక విషయంలో అప్పలరాజు కుటుంబంతో వివాదం ఏర్పడింది. దీనిపై అప్పట్లో పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ప్రస్తుతం కేసు ట్రయుల్ లో వుంది. ఈ ఘటన నేపథ్యంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడటంతో విజయ్ కిరణ్ ఉపాధి రీత్యా విజయవాడకి వెళ్లిపోయాడు. అతని భార్య ఉష ముగ్గురు పిల్లలతో అక్కడే జీవిస్తున్నాడు. తండ్రి మాత్రం విశాఖలోనే ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఈ దశలో అప్పలరాజు తన కుటుంబానికి అన్యాయం జరిగిందనే భావనలో ఉండేవాడు. అయితే, ఈ వివాదం తర్వాత రమణ కుటుంబం ఇతరులతో కొంత దూరంగా ఉంటూ వస్తోంది. ఈ దశలో రెండు రోజుల క్రితం రమణ దగ్గర బంధువుల వివాహానికి సంబంధించి పెళ్లి కార్డులు, కొత్త బట్టలు కొనుగోలు చేయాలని భావించారు. విజయ్ కిరణ్ భార్య, ముగ్గురు పిల్లలు, ఇద్దరు మేనత్తలు జుత్తాడ వచ్చారు. నిన్న రాత్రి నగరంలోని శివాజీ పార్క్ వద్ద ఉన్న బంధువుల ఇంట్లో ఉన్నారు. మరి కొన్ని పెళ్లి కార్డులు విజయనగరంలో పంపిణీ చేయాలని వారు వచ్చారు. అయితే విజయ్ కుమార్ పెద్ద కొడుకు మాత్రం బంధువులు వెంట ఉండిపోతానని మారాం చేయడంతో శివాజీని అక్కడే విడిచిపెట్టారు. ఈ దశలో తెలవారు జామున ఐదున్నర గంటల సమయంలో వాకిలి శుభ్రం చేసేందుకు రమణ సోదరి అరుణ బయటికి వచ్చింది. అదే అదనుగా భావించిన అప్పలనాయుడు ఒక్కసారిగా ఆమెపై విచక్షణ రహితంగా నరికేశాడు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న బత్తిన రమణ, అతని కోడలు ఉషశ్రీ, చిన్నారులు ఉదయ్, మూడు నెలల పాపతో పాటు మరో మహిళను అత్యంత కిరాతకంగా చంపేశాడు. అనంతరం ఆరుగురిని చంపేశానంటూ ఊర్లో కేకలు వేసుకుంటూ అప్పలరాజు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఎంత అమానుష ఘటన తమ గ్రామంలో ఎప్పుడూ చూడలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజా కేసులో నిందితుడు అప్పలనాయుడు ఇచ్చిన ఫిర్యాదుపై పెందుర్తి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడంతో పాటు అతన్ని అరెస్టు చేశారు. గతంలో విజయ్ కిరణ్, అతని కుటుంబ సభ్యులపై కూడా కేసులు కొనసాగుతున్నాయి. వివాదాలకు దూరంగా ఉండాలని విజయవాడకు మారిన ఆ కుటుంబంపై అప్పలనాయుడు కక్ష గట్టినట్టు తాజా పరిస్థితి బట్టి తెలుస్తోంది. పోలీసుల ఎదుట లొంగిపోయిన అప్పలనాయుడును పోలీసులు విచారిస్తున్నారు. దాడికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అతని మానసిక పరిస్థితిని కూడా ఆరా తీస్తున్నారు. అయితే, తన కుటుంబం వీధిన పడడానికి విజయ్ కిరణ్ కుటుంబమే కారణమన్న కోపంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్టు అప్పలరాజు పోలీసులకు చెప్తున్నాడు. ఇతనే అభిప్రాయం ఎలా ఉన్నా మానవ సమాజం ఎటు వెళుతుందా అన్నట్టు తాజా సంఘటన జరిగిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. చదవండి: ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దారుణ హత్య -
విశాఖపట్నం: పెందుర్తి మండలం జుత్తాడలో దారుణం
-
ఒకే కుటుంబంలో ఆరుగురిని నరికేసిన మానవ మృగం
సాక్షి, విశాఖపట్నం: నగర శివారులోని వాలిమెరక జుత్తాడ గ్రామం గురువారం ఉదయం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. పాతకక్షల నేపథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని కిరాతకంగా హత్య చేయడంతో విషాదఛాయలు అలముకున్నాయి. జుత్తాడ నుంచి విజయవాడ వెళ్లి నివసిస్తున్న సివిల్ కాంట్రాక్టర్ బొమ్మిడి విజయ్‌కిరణ్ కుటుంబ సభ్యులు ఆరుగురిని అదే గ్రామానికి చెందిన బత్తిన అప్పలరాజు అతి కిరాతకంగా హత్య చేశాడు. ఉదయం 5.45 గంటల సమయంలో వాకిలి కడిగేందుకు బయటికి వచ్చిన విజయ్ అత్త అల్లు రమాదేవి (63)పై అక్కడే మాటువేసి ఉన్న అప్పలరాజు ఒక్క ఉదుటున వచ్చి ఈత కల్లు కత్తితో దాడి చేశాడు. ఈ హఠాత్పరిణామం నుంచి కోలుకోకముందే మెడపై వేటు పడటంతో ఆమె కుప్పకూలిపోయింది. చేతిని నరికేసి.. ఇంటి లోపలికి వెళ్లి నిద్రలో ఉన్న విజయ్ భార్య బొమ్మిడి ఉషారాణి (35), ఆమె ఇద్దరు పిల్లలు బొమ్మిడి ఉదయనందన్(02), బొమ్మిడి రిషిత (06 నెలలు)ను కిరాతకంగా హత్య చేశాడు. పిల్లలిద్దరి మెడపై బలంగా కత్తితో వేటేశాడు. ఉషారాణి పొట్టపై విచక్షణారహితంగా నరికి పేగులు బయటికి తీసేశాడు. ఈ హఠాత్పరిణామానికి నిద్రలేచిన విజయ్ మేనత్త నెక్కళ్ల అరుణ (45) బాత్రూమ్లో ఉన్న విజయ్ తండ్రి బమ్మిడి రమణ (63) వద్దకు పరుగులు తీసింది. బాత్రూమ్ డోర్ కొట్టింది. అంతలో ఆమె మెడపై దాడి చెయ్యడంతో రమణ డోర్ తీసిన వెంటనే అరుణ కుప్పకూలిపోయింది. ఏం జరుగుతుందో ఊహించేలోపే రమణపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఇష్టం వచ్చినట్లు నరకడంతో ఇల్లంతా రక్తపు మడుగులా మారిపోయింది. చంపేశా.. తీసుకెళ్లండి.. కుటుంబంలో అందర్నీ కత్తితో అతి కిరాతకంగా నరికేసి, అందరూ చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత.. బయటకు వచ్చిన అప్పలరాజు.. రమాదేవి మృతదేహం పక్కనే అరగంట సేపు కూర్చున్నాడు. ఆ తర్వాత 100 నంబర్‌కు డయల్ చేశాడు. ‘జుత్తాడ గ్రామంలో ఆరుగురిని చంపేశాను. నేను ఇక్కడే ఉన్నాను. లొంగిపోతాను’ అంటూ తాను చేసిన నరమేధం గురించి చెప్పగా.. అక్కడి నుంచి పెందుర్తి పోలీసులకు సమాచారం అందడంతో వారు హుటాహుటిన వచ్చి అప్పలరాజును అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి కోసం విజయవాడ నుంచి వచ్చి.. విజయ్ మేనత్త నక్కెళ్ల అరుణ బంధువు కుమారుడు సాయి వివాహం ఈ నెల 17న శివాజీపాలెంలో జరగనుంది. పెళ్లి కబురు చెప్పేందుకు శివాజీపాలెం నుంచి బుధవారం ఉదయం అరుణ జుత్తాడకు చేరుకుంది. పెళ్లికి హాజరయ్యేందుకు విజయవాడ నుంచి విజయ్ కిరణ్ భార్య ఉషారాణి, ఇద్దరు పిల్లలు, తల్లి రమాదేవితో కలిసి బుధవారం మధ్యాహ్నం గ్రామానికి చేరుకుంది. విజయ్ మాత్రం తన పెద్ద కుమారుడు అఖిల్‌తో విజయవాడలోనే ఉండిపోయాడు. తన ఇంటికి వెళ్తున్న సమయంలో అప్పలరాజు తారసపడగా.. విజయ్ భార్య నవ్వుతూ పలకరించిందని సమీప బంధువులు చెబుతున్నారు. అప్పటికే కక్ష పెంచుకున్న అప్పలరాజు వారి రాకతో మరింత రగిలిపోయి.. ఈ నరమేధానికి పాల్పడ్డాడని బంధువులు చెబుతున్నారు. అభం శుభం తెలియని ఆరు నెలల చిన్నారి రిషిత పైనా తన కర్కశత్వాన్ని ప్రదర్శించి.. శరీరాన్ని ముక్కలు చేసేసిన హృదయ విదారక దృశ్యం చూసిన ప్రతి ఒక్కరూ కన్నీరు మున్నీరయ్యారు. మృతులు రమాదేవి, రమణ, రిషిత, ఉషారాణి, ఉదయనందన్, అరుణ (ఫైల్) బంధువుల ఆందోళన విజయవాడ నుంచి సాయంత్రం 4 గంటలకు జుత్తాడకు విజయ్‌కిరణ్ తన పెద్దకుమారుడు అఖిల్‌తో కలిసి చేరుకోగానే ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆరుగురితోపాటు హంతకుడి శవాన్ని తగలబెట్టాలంటూ బంధువులు ఆందోళనకు దిగారు. విజయ్ ఇంటి పక్కనే ఉన్న హంతకుడు అప్పలరాజు సోదరుడి ఇంటి తలుపులు పగలగొట్టేందుకు విజయ్ ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న ఎంపీ విజయసాయిరెడ్డి ఫోన్లో విజయ్‌తో మాట్లాడి ప్రభుత్వం తరఫున న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఘటనా స్థలికి పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వెళ్లి.. దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న విజయ్, బంధువులతో మాట్లాడారు. ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతదేహాల్ని కేజీహెచ్‌కు తరలించారు. హత్యకు గురైంది విజయవాడ వారే గుణదల (విజయవాడ తూర్పు) : విశాఖ జిల్లా పెందుర్తి మండలం జుత్తాడలో హత్యకు గురైన ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురూ విజయవాడ వాసులే. మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రహ్మానందరెడ్డి నగర్ ప్రాంతానికి చెందిన వారు. ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖ వెళ్లారు. వీరు సుమారు 20 ఏళ్ల కిందట విజయవాడ వచ్చి స్థిరపడ్డారు. విషయం తెలిసిన బంధువులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనలో ముక్కు పచ్చలారని ఇద్దరు పసికందులు సైతం మృత్యు ఒడికి చేరటం పలువురిని కలిచి వేసింది. నా క్షోభ విజయ్‌కి తెలియాలనే చంపేశా పోలీసుల అదుపులో ఉన్న హంతకుడు అప్పలరాజులో ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించడం లేదు. ‘నా కూతురు విషయంలో విజయ్ వల్ల నా కుటుంబం, బంధువులు తీరని మానసిక క్షోభకు గురయ్యాం. ఊళ్లో తలెత్తుకోలేకపోయాం. ప్రతి రోజూ నరకం అనుభవిస్తున్నాం. మేము పడే బాధ వాడికి తెలియాలనే.. వాడిని వదిలేసి.. కుటుంబం మొత్తాన్ని చంపేశాను’ అని అక్కడికి వెళ్లిన స్థానికులతో చెప్పినట్లు తెలుస్తోంది. పాత కక్షలే ప్రధాన కారణం ఇళ్లు, అపార్ట్మెంట్స్ కడుతూ సివిల్ కాంట్రాక్టర్‌గా బమ్మిడి విజయ్‌కిరణ్ పనిచేసేవాడు. తల్లి చనిపోవడంతో తండ్రి రమణతో కలిసి వి.జుత్తాడలో నివాసం ఉండేవాడు. విజయవాడలో ఉంటున్న తన మేనత్త రమాదేవి కుమార్తె ఉషారాణిని 2007లో వివాహం చేసుకున్నాడు. కుటుంబం విజయవాడలో ఉండగా.. పనుల నిమిత్తం జుత్తాడలో నివసించేవాడు. ఈ సమయంలో అదే గ్రామానికి చెందిన బత్తిన అప్పలరాజు కుమార్తె పార్వతితో పరిచయం పెంచుకోజూడటంతో ఇరు కుటుంబాల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. గ్రామంలో పెద్దల మధ్య పంచాయతీ కూడా జరిగింది. ఈ క్రమంలో అప్పలరాజు తన కుమార్తె పార్వతితో విజయ్‌కిరణ్‌పై 2018లో పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించాడు. పోలీసులు 245/2018 నంబర్‌తో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి సెక్షన్ 376, 506(2) కింద అత్యాచారం, బెదిరింపు కేసు నమోదు చేశారు. ఇదే సమయంలో తమని వేధిస్తున్నారంటూ విజయ్ కుటుంబ సభ్యులు కూడా అప్పలరాజు కుటుంబంతో పాటు ఆయన సోదరుల కుటుంబాలపైనా కేసు పెట్టారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో అప్పలరాజు పగ పెంచుకొని.. అదునుచూసి విజయ్ కుటుంబాన్ని క్రూరంగా చంపేశాడు. వాస్తవానికి రాష్ట్రంలో 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలపై లైంగిక వేధింపులను అత్యంత సీరియస్‌గా పరిగణించింది. ఇందులో భాగంగా దిశ చట్టాన్ని రూపొందించింది. దీంతో మహిళలపై లైంగిక వేధింపులు బాగా తగ్గాయి. ఈ క్రమంలో ప్రస్తుత ఘటన 2018లో జరిగిన గొడవ కారణంగా, పాత కక్షలను మనసులో పెట్టుకుని చోటుచేసుకున్నది కావడం గమనార్హం. చదవండి: విశాఖలో ఎన్ఆర్ఐ కుటుంబం అనుమానాస్పద మృతి చదవండి: ఎన్ఆర్ఐ కుటుంబం అనుమానాస్పద మృతి -
విశాఖపట్నం: 70 ఎకరాల భూమిని ఆక్రమించుకున్న బడాబాబులు
-
విశాఖలో భారీగా ప్రభుత్వ భూమి స్వాధీనం
సాక్షి, విశాఖపట్నం : విశాఖలో భారీ ఎత్తున ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. అడవివరం నుంచి శోత్యాం వెళ్లే మార్గంలో రామ అగ్రహారం వద్ద దాదాపు 110 ఎకరాల భూమి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి మొక్కలను పెంచుతున్నారు. ఇందులో పది ఎకరాల భూమిని మినహాయిస్తే మిగతా భూమి అంతా ప్రభుత్వానిది. టీడీపీ హయాంలో కొందరు బడా బాబులు ఈ భూమిని ఆక్రమించుకుని అనుభవిస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఈ దశలో రెవెన్యూ అధికారులు శనివారం ఉదయం ఆ ప్రాంతానికి వెళ్లి ప్రహరీ గోడను తొలగించి భూమిని స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 70 ఎకరాల ఖరీదైన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం పట్ల ఆ ప్రాంతవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. (టీడీపీ అండతో ఇదీ ‘గీతం’ బాగోతం) -
పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలు తప్పనిసరి..
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలు అమలు జరిగేలా చర్యలు చేపట్టారు. పాఠశాల ప్రారంభానికి ముందే ప్రతి విద్యార్థి చేతులు శానిటేషన్తో శుభ్రం చేసుకున్న తర్వాతే లోపలికి అనుమతిస్తారు. అదే సమయంలో ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థి టెంపరేచర్‌ను కూడా పరీక్షిస్తారు. అనుమానిత లక్షణాలు ఉంటే దగ్గరలో ఉన్న ప్రాథమిక వైద్య కేంద్రానికి కూడా తల్లిదండ్రుల ద్వారా తీసుకువెళ్లే ఏర్పాట్లు కూడా చేశారు. జిల్లాలోని 942 ప్రభుత్వ పాఠశాలలో ఈ చర్యలు చేపట్టారు. తాజా అంచనాల బట్టి దాదాపు 98 వేల మంది విద్యార్థులు సగటున ప్రతి రోజు తరగతులకు హాజరవుతున్నట్టు విద్యా శాఖ చెబుతోంది. అదే సమయంలో ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఇప్పటికే వివిధ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక అనుమానిత లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు నిర్వహించుకోవాలని కూడా అధికారులు ఆదేశించారు. ప్రతిరోజు కోవిడ్ నిబంధనల అమలుపై జిల్లా విద్యాశాఖ అధికారి తనిఖీలు నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం పెందుర్తి జిల్లా పరిషత్ పాఠశాలలో డీఈవో లింగేశ్వర రెడ్డి తనిఖీలు చేపట్టి కోవిడ్ నిబంధనలు అమలు తీరుపై ఆరా తీశారు. -
శిరోముండనం బాధితుడికి మంత్రి ముత్తంశెట్టి భరోసా
-
శ్రీకాంత్‌కు ప్రభుత్వం అండగా ఉంటుంది
సాక్షి, విశాఖపట్నం/పెందుర్తి: విశాఖపట్నంలో శిరోముండనం బాధితుడు పర్రి శ్రీకాంత్‌కు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. జనసేన సానుభూతిపరుడు, టీడీపీ నేతలతో వ్యాపార భాగస్వామి, సినీ దర్శక, నిర్మాత నూతన్‌నాయుడు ఇంట్లో దాష్టీకానికి గురైన దళిత యువకుడు శ్రీకాంత్ ఫిర్యాదు చేసిన 24 గంటల్లోనే ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. బాధితుడు శ్రీకాంత్‌ను మంత్రి ముత్తంశెట్టి, ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్ ఆదివారం పరామర్శించారు. ► శ్రీకాంత్‌కు ప్రభుత్వం తరఫున రూ.లక్ష సాయం అందజేయటంతో పాటు ఔట్సోర్సింగ్ ద్వారా ఉపాధి కల్పిస్తామని మంత్రి ప్రకటించారు. ► కేసు విషయంలో పోలీసులు, అధికారులు వ్యవహరించిన తీరు ప్రశంసనీయమన్నారు. భవిష్యత్‌లో మరెవరూ ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలని కోరారు. ► బాధితులకు అండగా ఉండాల్సిన ప్రతిపక్షాలు నిస్సిగ్గుగా రాజకీయాలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ► బాధితుడు శ్రీకాంత్‌కు ఎమ్మెల్యే అదీప్‌రాజ్ తన సొంత నిధులు రూ.50 వేలు మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ► ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, ఆర్డీవో పెంచల కిశోర్ తదితరులు పాల్గొన్నారు. జ్యుడీషియల్ రిమాండ్‌కు ఏడుగురు నిందితులు శ్రీకాంత్‌ను హింసించిన ఘటనలో అరెస్ట్ చేసిన ఏడుగురు నిందితులను జ్యుడీషియల్ రిమాండ్‌కి పంపించారు. నిందితులను ఎస్సీ, ఎస్టీ స్పెషల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా.. వారికి సెప్టెంబర్ 11 వరకు రిమాండ్ విధించారు. ఆరిలోవలో ఉ¯న్న విశాఖ జిల్లా సెంట్రల్ జైలుకు నూతన్‌నాయుడి భార్య ప్రియామాధురితో సహా బ్యూటీషియన్ ఇందిరారాణి, వరహాలు, ఝాన్సీ, సౌజన్యలను తరలించగా బార్బర్ రవికుమార్, బాల గంగాధర్‌ను అనకాపల్లి సబ్ జైలుకు పంపించినట్లు డీసీపీ (క్రైం) సురేష్‌బాబు తెలిపారు. -
తలబిరుసు.. లెక్కలేనితనం..
పెందుర్తి: యువకుడి శిరోముండనం ఘటనపై దళితులు భగ్గుమన్నారు. న్యాయం చేయాలంటూ రోడ్డెక్కారు. తక్షణం స్పందించిన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. నిందితుల్ని కొద్ది గంటల్లో అరెస్ట్ చేసింది. భర్త అనుమతి తీసుకోకుండా నూతన్ భార్య మధుప్రియ ఈ దాష్టీకానికి ఒడిగడుతుందా..? అని దళిత సంఘాలు సూటిగా ప్రశ్నిస్తున్నాయి. లెక్కలేనంత డబ్బుందని.. సమాజం అంటే ఆయనకు లెక్కలేదని గతంలో ఆయన వ్యవహార శైలిని ఈ ఘటనతో గుర్తు చేసుకున్నారు స్థానికులు. సెలబ్రిటీ హోదాను ఇచ్చిన ప్రజల్ని మరిచి విచక్షణా రహితంగా ప్రవర్తించడం ఆయనకు కొత్తేమీ కాదని చెబుతున్నారు గోపాల్కృష్ణనగర్ వాసులు. (చదవండి: కర్రలు విరిగేటట్లు కొట్టి.. వీడియో తీశారు) ‘తమ ప్రాంతానికి నూతన్‌నాయుడు వచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్నాం.. అతడిది అంతా హైఫ్రొఫైల్. ఎవరినీ లెక్క చేయడు. ఇతరులంటే చాలా చులకన. కనీసం మానవత్వం ఉండదు.’ తన ఇంటి గార్డెన్ కోసం ఇంటి ముందు ఉన్న 40 అడుగుల రోడ్డులో చాలా భాగం ఆక్రమించేశాడు. ఈ విషయంపై అడుగుదాం అని ఇంటికి వెళితే కనీసం లోపలకు కూడా వెళ్లనివ్వలేదు. సమాజంపై పూర్తిగా నిర్లక్ష్యం భావంతో ఉంటాడు’ ఇవీ సుజాతనగర్‌లోని గోపాలకృష్ణనగర్ వాసులు ఆరోపణలు. తన ఇంట్లో పని మానేశాడన్న నెపంతో ఏకంగా దళిత యువకుడు శ్రీకాంత్‌పై తన మనుషులు దాడి చేసి శిరోముండనం చేయించిన ఘటనతో నూతన్‌నాయుడు వ్యవహారశైలి స్థానికంగా చర్చకు వచ్చింది. సినీ నిర్మాతగా.. దర్శకుడిగా చెలామణి అవుతున్న నూతన్ నాయుడు నగరంలోని మాజీ మేయర్, టీడీపీ నేతకు వ్యాపార భాగస్వామిగా ఉన్నాడు. 2014 వరకు సమాజానికి పెద్దగా పరిచయం లేని నూతన్‌నాయుడు జై సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థిగా వెలుగులోకి వచ్చాడు. నాటి ఎన్నికల సమయంలో నూతన్‌నాయుడు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అప్పుడు నూతన్ ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో కొన్ని తప్పుడు పత్రాలు కూడా ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే అతడి ప్రభావం అంతగా లేకపోవడంతో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు అతడ్ని ‘లైట్’ తీసుకున్నారు. తరువాత కొన్నాళ్ల అజ్ఞాతంలో ఉన్న నూతన్ బిగ్‌బాస్–2తో మళ్లీ బాహ్యప్రపంచంలోకి వచ్చాడు. ఆ తరువాత చిన్నాచితకా సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. తాజాగా ప్రముఖ సినీదర్శక నిర్మాత రామ్‌గోపాల్‌వర్మ తీసిన పవర్‌స్టార్ సినిమాకు కౌంటర్‌గా పరాన్నజీవి సినిమాతో దర్శక అవతారం ఎత్తాడు. (చదవండి: శిరోముండనం కేసు: ఏడుగురు అరెస్ట్) రోడ్డును ఆక్రమించి తీర్చిదిద్దిన గార్డెన్.. నాడు అధికారంతో.. నేడు డబ్బుమదంతో మూడేళ్ల క్రితం పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెంలో ఓ దళిత మహిళను టీడీపీ నాయకులు ఘోరాతిఘోరంగా అవమానించారు. ఆ ఘటనతో టీడీపీ పతనం ప్రారంభమైంది. మళ్లీ ఇప్పుడు నూతన్‌నాయుడు ఇంట్లో జరిగిన తాజా ఘటన మరింత సంచలనం రేపింది. తన ఇంట్లో పని మానేశాడన్న నెపంతో సెల్‌ఫోన్ దొంగతనం అంటగట్టిన నూతన్నాయడు భార్య మధుప్రియ, బ్యుటీషియన్ ఇందిర సహా ఏడుగురు వ్యక్తులు శ్రీకాంత్‌కు శిరోముండనం చేయించారు. డబ్బుందన్న అహంకారంతో సభ్యసమాజం తలదించుకునే ఘటనకు పాల్పడ్డారు. నిజంగా శ్రీకాంత్ సెల్‌ఫోన్ దొంగతనం చేసుంటే అతడు పనిమానేసి దాదాపు నెల రోజులు కావస్తుంది. మరి ఇన్నాళ్ళు నూతన్ కుటుంబ సభ్యులు, పనివారు అతడిపై ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.. అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అంటే హోదా ఉందన్న తలబిరుసు.. బాధితుడికి ఎవరూ లేరన్న ఆలోచనతో ఈ దాడికి పాల్పడినట్లు తేటతెల్లం అవుతుంది. ఇందులో నూతన్‌నాయుడు పాత్ర నేరుగా లేకపోయినా.. భర్త అనుమతి తీసుకోకుండా నూతన్ భార్య మధుప్రియ ఈ దాష్టీకానికి ఒడిగడుతుందా..? అని దళిత సంఘాలు సూటిగా ప్రశ్నిస్తున్నాయి. -
కర్రలు విరిగేటట్లు కొట్టి.. వీడియో తీశారు
సాక్షి, విశాఖపట్నం: ‘సెల్‌ఫోన్ దొంగలించాడన్న అనుమానంతో దళితుడైన పర్రి శ్రీకాంత్‌ను దారుణంగా హింసించారు. కర్రలు విరిగేటట్టు కొట్టారు. చిత్రహింసలు పెడుతూ వీడియోలు తీశారు. శిరోముండనం చేశారు. ఇందుకు సంబంధించిన అన్ని సాక్ష్యాలు సేకరించాం. ఈ దారుణ ఘటనలో ఉన్నవారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశాం. ఏడుగురిని అరెస్టు చేశాం’ అని విశాఖపట్నం పోలీస్ కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హా తెలిపారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అభిమాని, బిగ్‌బాస్ ఫేమ్, సినీ దర్శకుడు నూతన్‌నాయుడు ఇంట్లో 20 ఏళ్ల దళిత యువకుడు పర్రి శ్రీకాంత్‌కు శిరోముండనం చేసి దారుణంగా హింసించిన సంఘటనకు సంబంధించిన వివరాలు కమిషనర్ శనివారం మీడియాకు వివరించారు. కమిషనర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటికి పిలిచి కొట్టారు.. ► విశాఖలోని గోపాల్కృష్ణనగర్లో నివాసం ంటున్న నూతన్‌నాయుడు ఇంట్లో శ్రీకాకుళం జిల్లా పలాస ప్రాంతానికి చెందిన శ్రీకాంత్ నాలుగు నెలల క్రితం పనికి చేరాడు. వ్యక్తిగత కారణాలతో నెల రోజుల క్రితం పని మానేశాడు. ► తమ ఇంట్లో ఐఫోన్ పోయిందని.. దాని గురించి మాట్లాడాలి ఇంటికి రావాలని నూతన్‌నాయుడి భార్య ప్రియామాధురి గతంలో శ్రీకాంత్‌ని పిలిచి విచారించారు. ► మళ్లీ శుక్రవారం మధ్యాహ్నం మరోసారి శ్రీకాంత్‌ను ఇంటికి పిలిచి తన సిబ్బందితో కొట్టించారు. బార్బర్‌ను పిలిపించి గుండు గీయించారు. ఈ దారుణాన్ని సెల్ఫోన్లో చిత్రీకరించారు. ► అనంతరం అక్కడ నుంచి బయటపడిన శ్రీకాంత్ పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే ఆధారాల సేకరణ ► ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు నూతన్‌నాయుడి ఇంటికి వెళ్లి సీసీ కెమెరాల ఫుటేజీతో పాటు ఇతర ఆధారాలను సేకరించారు. ► వీటి ఆధారంగా నూతన్‌నాయుడి భార్య ప్రియా మాధురి, బ్యూటీషియన్ ఇందిరారాణి, సూపర్వైజర్ వరహాలు, బార్బర్ రవికుమార్, పనిమనుషులు బాల గంగాధర్, సౌజన్య, ఝాన్సీలను అరెస్టు చేశారు. ► వీరికి కోవిడ్ పరీక్ష అనంతరం జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తామని సీపీ తెలిపారు. ► ఈ సంఘటనలో నూతన్‌నాయుడి ప్రమేయంపై కూడా దర్యాప్తు చేస్తున్నామని, ఏ ఒక్కరినీ విడిచిపెట్టబోమని స్పష్టం చేశారు. ► మీడియా సమావేశంలో డీసీపీ(క్రైం) సురేష్‌బాబు, ఏసీపీ శ్రావణ్‌కుమార్, ఎస్సీ, ఎస్టీ ఏసీపీ త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. పగబట్టి కొట్టారు తాను వాళ్ల ఇంట్లో ఉద్యోగం మానేసి వేరోచోట చేరాననే పగతోనే తనను కొట్టి, గుండు గీయించారని బాధితుడు శ్రీకాంత్ మీడియాతో చెప్పాడు. సెల్‌ఫోన్‌తో తనకేమీ సంబంధం లేదంటున్నా వినకుండా ఇందిరారాణి దారుణంగా కొట్టిందన్నారు. తన ఫోటోలు స్కాన్ చేసి బయట పెట్టావంటూ ఇందిర ఆరోపించిందని తెలిపాడు. తానిచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు చేపట్టడం సంతోషంగా ఉందన్నాడు. -
సీసీ టీవీ ఫుటేజ్‌లో గుండు చేసిన దృశ్యాలు
సాక్షి, విశాఖపట్నం : దళిత యువకుడు శిరో ముండనం కేసులో మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని విశాఖ సీపీ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు. ఈ కేసులో నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. విశాఖ సీపీ శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బిగ్‌బాస్ కంటెస్టెంట్ నూతన్ నాయుడు భార్య మధుప్రియతో పాటు ఏడుగురిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు. ఇందుకు సంబంధించి సీసీ ఫుటేజ్‌ను కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. బాధితుడిని కర్రలు, రాడ్లతో కొట్టినట్లు వీడియోలో ఉందన్నారు. అయితే అందులో కొన్ని దృశ్యాలు తొలగించినట్లు కనిపిస్తోందని.. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా లోతుగా దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ఇక దళిత యువకుడు శ్రీకాంత్‌కు శిరో ముండనం చేసిన కేసులో నూతన్ నాయుడు భార్య ప్రధాన నిందితురాలుగా ఉన్నారు. అలాగే వారి ఇంట్లో పనిచేసే వారిపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: నూతన్ నాయుడు భార్యపై కేసు నమోదు) పని మానేశాడన్న కోపంతో.. విశాఖ నగర శివారులో బిగ్‌బాస్ కంటెస్టెంట్, జనసేన నాయకుడు నూతన్ నాయుడు ఇంట్లో ఈ సంఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. చెప్పకుండా పని మానేశాడన్న కోపంతో శ్రీకాంత్ అనే యువకుడిపై ఈ దారుణానికి పాల్పడ్డారు. నిన్నమధ్యాహ్నం (శుక్రవారం) రెండు గంటల సమయంలో ఇంట్లో మొబైల్ ఫోన్ పోయిందని బాధితుడిని పిలిపించి నూతన్ నాయుడు కుటుంబ సభ్యులతో పాటు పలువురు దాడిచేసి కొట్టడమే కాకుండా జుట్టు తొలగించేశారు. దీంతో అతను తనకు జరిగిన అన్యాయంపై పెందుర్తి పోలీసులను ఆశ్రయించాడు. ఈ కేసులో A1గా ఉన్న నూతన్ నాయుడు భార్య మధుప్రియతో పాటు ఇంట్లో సహాయకులుగా ఉన్న వరహాలు, ఇందిర, ఝూన్సీ, సౌజన్య, బాలు, రవిపై సెక్షన్ 307...342..324..323..506 r/w34ipc 3(1) b ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. -
'చంద్రబాబు చేస్తున్న కుట్రే సునామీ అలజడి'
సాక్షి, విశాఖపట్నం: సముద్రాన్ని అడ్డంపెట్టుకుని విశాఖపట్నంపై పచ్చనేతలు విషప్రచారం చేస్తున్నారని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రోజున విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా విశాఖ నగరం భద్రంగా నిలిచింది. హుద్‌హుద్ నుంచి కైలాసగిరి విశాఖ నగరాన్ని కాపాడిన విషయం టీడీపీ నేతలకు గుర్తు లేదా..? ప్రపంచంలోని చాలా నగరాలు సముద్రతీరంలోనే ఉన్నాయి. అవన్నీ సునామీలో కొట్టుకుపోతాయా? (ఇది జీవితంలో మరిచిపోలేని రోజు: మోపిదేవి) గతంలో సునామీ వచ్చినప్పుడు కూడా విశాఖ నగరానికి ఎలాంటి నష్టం జరగలేదు. విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలన్న సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని అన్ని రకాలుగా అడ్డుకోవడానికి తెలుగు తమ్ముళ్లు ప్రయత్నిస్తున్నారు. ప్రపంచంలో ఎన్నో నగరాలు సముద్ర తీరంలోనే విలసిల్లుతున్నాయని ఆ నగరాలకు లేని ప్రమాదం విశాఖ నగరానికి ఏ రకంగా వస్తుందంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కాగా.. విశాఖ అభివృద్ధిని అడ్డుకునే క్రమంలో చంద్రబాబు నాయుడు చేస్తున్న కుట్రే సునామి అలజడిగా అదీప్ రాజు అభిప్రాయపడ్డారు. (‘ఏమిటీ రాతలు.. ఎవరిది చెప్పింది’) . -
విశాఖలో మరో అధికారిపై పెట్రోల్ దాడి..!
సాక్షి, పెందుర్తి: వేపగుంటలోని జీవీఎంసీ జోన్ – 6 ప్రధాన కార్యాలయంలో శనివారం పెట్రోల్ దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. జోన్ – 6 ఏఎంహెచ్‌వోగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ లక్ష్మీ తులసిపై శానిటరీ సూపర్వైజర్ గార అన్నామణి పెట్రోల్‌తో దాడి చేసినట్లు పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు అందింది. అయితే ఏఎంహెచ్‌వోతోపాటు ఇతర అధికారుల వేధింపులు భరించలేక తానే ఆత్మహత్య చేసుకునేందుకు పెట్రోల్ వెంట తెచ్చుకున్నానని అన్నామణి చెబుతోంది. ఇరువురి మధ్య కొంతకాలంగా ఉన్న వివాదమే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది. సంచలనం రేపిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. లక్ష్మీతులసి జోన్ – 6తో పాటు జోన్ – 5కు ఇన్చార్జి ఏఎంహెచ్‌వోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చినముషిడివాడకు చెందిన గార అన్నామణి జీవీఎంసీ 68వ వార్డు గోపాలపట్నంలో శానిటరీ సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం జోన్ – 5 కార్యాలయానికి వెళ్లిన కొద్దిసేపటి తర్వాత వేపగుంటలోని జోన్ – 6 కార్యాలయానికి ఆమె వచ్చారు. అదే సమయంలో కార్యాలయానికి సంచితో వచ్చిన అన్నామణి తనకు అన్యాయం జరుగుతుందంటూ ఏఎంహెచ్‌వోతో వివాదానికి దిగారు. కొద్దిసేపటికి సంచిలో ఉన్న పెట్రోల్ సీసా బయటకు తీసి తనపై పోసిందని లక్ష్మీతులసి ఆరోపిస్తున్నారు. పెందుర్తి పోలీస్ స్టేషన్ వద్ద అన్నామణి, ఆమె తీసుకొచ్చిన పెట్రోల్ వెంటనే గదిలోని విద్యుత్ ఉపకరణాలు, దేవుని పటాల వద్ద దీపం ఆపడంతో పెను ప్రమాదమే తప్పిందని చెబుతున్నారు. తాను కేకలు వేయడంతో అన్నామణిని కార్యాలయం సిబ్బంది బయటకు లాక్కుని వెళ్లారని చెబుతున్నారు. తనపై దాడి చేసిన అన్నామణిపై పెందుర్తి పోలీసులకు లక్ష్మీతులసి ఫిర్యాదు చేశారు. దీంతో అన్నామణిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కొద్దిరోజుల క్రితం అధికారుల అనుమతి లేకుండా 20 రోజులపాటు విధులకు హాజరు కాకపోవడంతో అన్నామణి జీతంలో కోత విధించారు. ఈ అంశమే వివాదానికి కారణమని సమాచారం. వేధింపులు తాళలేకే: అన్నామణి తన పిల్లల అనారోగ్యం కారణంగా కొద్ది రోజులు సెలవు పెట్టినందుకు తన జీతంలో కోత విదించారని అన్నామణి అన్నారు. దీంతోపాటు చాలాకాలంగా అధికారులు తనను తీవ్రంగా వేధిస్తున్నారని ఆరోపించారు. శనివారం తాను ఆత్మహత్య చేసుకుందామని పెట్రోల్ తెచ్చుకున్నానని... ఎవరిపైనా దాడి చేసే ఉద్దేశ్యం తనకు లేదని వివరించారు. ఉన్నతాధికారులు కలుగజేసుకుని సమగ్ర దర్యాప్తు చేపట్టి తనకు న్యాయం చేయాలని కోరారు. చదవండి: రూ.3 వేల కోసం ఐదుగురి హత్య -
గాజువాకలో జనసేనకు భారీ ఝలక్
సాక్షి, విశాఖ : జనసేన పార్టీకి షాక్‌లు మీద షాక్‌లు తగులుతున్నాయి. ఈ ఏడాది జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన కేవలం ఒక్క సీటును మాత్రమే దక్కించుకోగలిగింది. ఎన్నికల ఫలితాల అనంతరం పలువురు నేతలు జనసేనను వీడుతున్న విషయం తెలిసిందే. నిన్నటికి నిన్న ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ఆకుల సత్యనారాయణ పార్టీని వీడితే తాజాగా గాజువాకలోనూ ఆ పార్టీ నేత, గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య ఝలక్ ఇచ్చారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన తరఫున పెందుర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన వెంకట్రామయ్య పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన నిన్న పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు లేఖ రాశారు. గాజువాక నియోజకవర్గ ప్రజలు, అభిమానులు, కార్యకర్తల కోరిక మేరకు తాను జనసేన పార్టీకి, పార్టీ ప్రాథమిక సభ్యత్యానికి రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. తాను గత 15 ఏళ్లుగా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాలతో పాలు పంచుకుంటూ అయిదేళ్లుగా శాసనసభ్యుడిగా పని చేసి... ప్రజలందరికి అనునిత్యం చేదోడు వాదోడుగా ఉన్నాను. భవిష్యత్‌లో కూడా రాజకీయంగా గాజువాక నియోజకవర్గంలో మాత్రమే ఉండాలని కార్యకర్తల, శ్రేయోభిలాషుల కోరిక మేరకు జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నానని వెంకట్రామయ్య తెలిపారు. ఇంతవరకూ తనపై చూపిన అదరాభిమానాలకు కృతజ్ఞుడినని ఆయన అన్నారు. ఇక చింతలపూడి వెంకట్రామయ్య రాజీనామాతో గాజువాకలో జనసేన పార్టీ ఖాళీ అయినట్లే. కాగా పవన్ నేతృత్వంలోని జనసేన ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన నేపథ్యంలో కొన్ని రోజులుగా పలువురు సీనియర్ నేతలు పార్టీని వీడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రావెల కిషోర్‌బాబు, చింతల పార్థసారథి, మారంశెట్టి రాఘవయ్య, అద్దేపల్లి శ్రీధర్, డేవిడ్ రాజు, ఆకుల సత్యనారాయణ జనసేనకు గుడ్‌బై చెప్పారు. వీరి బాటలోనే మరికొందరు నడవనున్నట్లు సమాచారం. -
ఏం కష్టమొచ్చిందో..!
సాక్షి, పెందుర్తి: ఏం కష్టమొచ్చిందో ఏమో తల్లీకూతురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తల్లి పరిస్థితి విషమించి మృత్యువాత పడగా కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. భర్త బయట నుంచి ఇంటికి వచ్చేసరికి భార్య, కుమార్తె అపస్మారకస్థితిలో పడి ఉండడం చూసి కంగారులో అటూఇటూ పరిగెడుతూ జారిపడడంతో అతనూ తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యాడు. ఈ విషాద ఘటన పెందుర్తి పోలీస్‌స్టేషన్ పరిధిలోని జీవీఎంసీ 70వ వార్డు పురుషోత్తపురం సమీపంలోని గోకుల్ధామ్కాలనీలో శనివారం చోటు చేసుకుంది. వివరాలు...వ్యవసాయశాఖ విశ్రాంత అధికారి మేడేదల దివాకర్, లక్ష్మి (56) దంపతులు. గోకుల్ధామ్ కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరి కుమార్తె గిరిజా ప్రసన్నరాణి భర్త కొన్నాళ్ల క్రితం మరణించడంతో ఆమె కూడా వీరితో పాటే ఉంటోంది. గిరిజ ఓ ప్రవేటు పాఠశాలలో పనిచేసి ఇటీవల మానేసింది. కాగా దివాకర్ శనివారం ఉదయం మెడికల్ రిపోర్ట్‌ల కోసం ఆసుపత్రికి వెళ్ళాడు. మంచినీరు సరఫరా చేసే వ్యక్తి మధ్యాహ్నం దివాకర్ ఇంటికి వచ్చి తలుపు తట్టగా ఎవరూ బయటకు రాలేదు. అనుమానం వచ్చి అతను కిటికిలో నుంచి చూడగా తల్లీకూతుళ్లు లక్ష్మి, గిరిజ ఇంటి హాల్లో అపస్మారకస్థితిలో పడి ఉన్నారు. వెంటనే ఆ వ్యక్తి స్థానికులను పిలవగా వారు 100 డయల్ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి తలుపులు తెరిచి 108 ద్వారా ఇద్దరినీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో లక్ష్మి మృతి చెందింది. గిరిజను కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు తాగి వీరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు నిర్థారించారు. సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎస్ఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే వీరి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు. మరోవైపు బయటకు వెళ్లిన దివాకర్‌కు పోలీసులు ఇంటి వద్ద పరిస్థితిపై సమాచారం ఇవ్వగా ఆయన ఇంటికి వచ్చారు. భార్య, కుమార్తెల పరిస్థితి చూసి హడలిపోయారు. పరిగెత్తుకుంటూ వెళ్లిన క్రమంలో జారి కిందపడిపోయారు. దీంతో ఆయన పక్కటెముక విరిగిపోయింది. దివాకర్‌ను కూడా అదే 108లో ఆసుపత్రికి తరలించారు. -
టీడీపీ నేతకు ప్రభుత్వం నోటీసులు
సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్న టీడీపీ నేత మొగ్గ సీతారామయ్యకు రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. మూడు గంటల్లోగా స్థలాన్ని ఖాళీ చేయాల్సిందిగా సీతారామయ్యను ప్రభుత్వం హెచ్చరించింది. పెందుర్తి మండలం సుజాతనగర్ బీహెచ్‌పీవీ లేఅవుట్లో స్థలాన్ని ప్రభుత్వం రైతు బజార్ ఏర్పాటుకు కేటాయించింది. ఈ స్థలంపై కన్నేసిన టీడీపీ నేత మొగ్గ సీతారామయ్య ఆక్రమణకు పూనుకున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీవో తేజ్ భరత్ క్షేత్ర పరిశీలనకు వెళ్లగా మొగ్గ సీతారామయ్య బిల్డింగ్ మెటీరియల్ వేసి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్నారని తేలింది. దీంతో స్థానిక ఎమ్మార్వో, పోలీసులతో కలిసి కబ్జాకు గురైన భూమిని పరిశీలించి, మూడు గంటల్లో స్థలాన్ని ఖాళీ చేయాల్సిందిగా టీడీపీ నాయకుడు మొగ్గ సీతారామయ్యకు నోటీసులు జారీ చేశారు. ఇచ్చిన గడువులోగా ఖాళీ చేయకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
వైఎస్సార్ సీపీలో చేరిన రఘురాజు
సాక్షి, విశాఖపట్నం: విజయనగరం జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పర్వం ప్రారంభమైంది. భారతీయ జనతా పార్టీ నేత, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఇందుకూరి రఘురాజు ఆ పార్టీకి రాజీనామా చేసి బుధవారం వైఎస్సార్ సీపీలో చేరారు. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ సమక్షంలో ఆయన పార్టీలోకి వచ్చారు. పార్టీ కండువాతో ఆయనను వైఎస్ జగన్ సాదరంగా ఆహ్వానించారు. రఘురాజుతో పాటు 500 మంది నేతలు, కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరారు. అంతకుముందు శృంగవరపు కోట నుంచి ఐదు వందల బైకులతో ర్యాలీగా వీరంతా పెందుర్తికి తరలివచ్చారు. విశాఖకు చెందిన ప్రముఖ వైద్యుడు, కళా ఆస్పత్రి అధినేత పైడి వెంకట రమణమూర్తి, పలువురు వైశ్యులు కూడా ఈ రోజు వైఎస్సార్ సీపీలో చేరారు. సైనికుల్లా పనిచేస్తాం.. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రభంజనం సృష్టిస్తారని రఘురాజు ఈ సందర్భంగా అన్నారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలు వైఎస్సార్ సీపీ కైవశం చేసుకుంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సైనికుల్లా పనిచేసి పార్టీని బలోపేతం చేస్తామన్నారు. రాజన్న ఆశయ సాధన కోసం జగన్ అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారని, ఆయన కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. రాజన్న రాజ్యం రావాలంటే జగన్ వల్లే సాధ్యమన్నారు. బేషరతుగా వైఎస్సార్ సీపీలో చేరినట్టు తెలిపారు. ఎస్ కోట నియోజకవర్గాన్ని గెలిచి జగన్‌కు కానుకగా ఇస్తామన్నారు. మన మద్దతుదారులతో రఘురాజు బైకు ర్యాలీ -
నాడు పోలీస్.. నేడు దొంగ
సాక్షి, పెందుర్తి: అతడు ఒకప్పడు పోలీస్. దురాశ, వ్యసనాల కారణంగా నేడు అతడు కరుడుగట్టిన గజదొంగ. అనేక దొంగతనాల్లో నిందితుడిగా ఉన్న అతడిని విశాఖపట్నం జిల్లా పెందుర్తి పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి 442 గ్రాముల బంగారు ఆభరణాలు, 812 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. పెందుర్తి పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో క్రైం ఏసీపీ ఫాల్గుణరావు వివరాలు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నారాయణపురానికి చెందిన అన్నాబత్తుల సత్యశ్రీనివాసరావు అలియాస్ అద్దాల శ్రీను 1998లో సివిల్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం పొందాడు. పోలీస్‌గా ఉన్న సమయంలో అదే ప్రాంతానికి చెందిన ప్రసాద్ అనే వ్యక్తితో రైస్ పుల్లింగ్ కాయిన్స్ వ్యాపారం ప్రారంభించాడు. అందులో నష్టం రావడంతో 2015 నుంచి దొంగతనాల బాట పట్టాడు. అదే సమయంలో పోలీస్ ఉద్యోగాన్ని కూడా వదిలేశాడు. ఈ క్రమంలో రాజమండ్రికి చెందిన మరో దొంగ రవిచంద్రతో శ్రీనివాసరావుకు పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ విశాఖ వచ్చి దొంగతనాలు చేసేవారు. ఉదయం రెక్కీ నిర్వహించి మధ్యాహ్నం ఇళ్లను దోచేసేవారు. అలాగే ద్విచక్ర వాహనంపై తిరుగుతూ ఒంటరిగా వెళుతున్న మహిళల మెడలో బంగారు ఆభరణాలు చాకచక్యంగా తెంపుకుపోయేవారు. వీరిపై పెందుర్తి, పోతినమల్లయ్యపాలెం, గాజువాక, దువ్వాడ పోలీస్స్టేషన్లలో 9 కేసులు నమోదయ్యాయి. వీరిపై నిఘాపెట్టిన పోలీసులు ఈ నెల 14న కృష్ణరాయపురంలో రవిచంద్రను అరెస్ట్ చేశారు. అతడు ఇచ్చిన సమాచారంతో నారాయణపురంలో ఉన్న సత్యశ్రీనివాసరావును మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. దొంగను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన వెస్ట్‌జోన్ క్రైం సీఐ పి.సూర్యనారాయణ, పెందుర్తి క్రైం బ్రాంచ్ సబ్ఇన్స్పెక్టర్ జి.డి బాబు, కానిస్టేబుళ్లు కె.నరసింగరావు, ఎస్.దేముడునాయుడు, ఆర్.సంతోష్‌కుమార్‌లను ఏసీపీ అభినందించారు. -
అనుమానం పెనుభూతమై..
పెందుర్తి: కట్టుకున్న భార్యపై అనుమానం పెనుభూతమైంది. చివరకు కాలయముడైన భర్త అతి కిరాతకంగా హతమార్చాడు. పెందుర్తి నడిబొడ్డున సంచలనం రేపిన ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. పెందుర్తిలోని యాతపేటకు చెందిన మునస మహాలక్ష్మినాయుడు, రాజరాజేశ్వరి(38) దంపతులు పాతూరులోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరికి 20 ఏళ్ల కిందట వివాహమైంది. మహాలక్ష్మినాయుడు ఓ ఇంజినీరింగ్ కళాశాలలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా రాజరాజేశ్వరి గాజువాకలోని బ్యూటీ పార్లర్లో పనిచేస్తుంది. కొన్నాళ్లుగా వీరి మధ్య మనస్పర్థలు ఉన్నాయి. తరచూ అనుమానాలతో భార్యాభర్తలకు గొడవలు జరిగేవి. ఈ క్రమంలో శుక్రవారం వీరి మధ్య ఇంట్లో మరోసారి గొడవ జరిగింది. మాటమాట పెరిగి క్షణికావేశానికి గురైన మహాలక్ష్మి భార్య రాజరాజేశ్వరి తలపై ఇంట్లో ఉన్న క్రికెట్ బ్యాట్‌తో కొట్టాడు. కుప్పకూలిపోయిన రాజేశ్వరి తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మరణించింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. రాజరాజేశ్వరి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. వీరి సంతానం కుమార్తె శ్వేత డిగ్రీ, కుమారుడు సాయి ఇంటర్మీడియెట్ చదువుతున్నారు. పెందుర్తి సీఐ జె.మురళీ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
జనపథం - పెందుర్తి, ముదపాక
-
పండుగకు వెళ్లి శవమయ్యాడు
► యువకుడి అనుమానాస్పద మృతి ► కుమారుడిని చంపేశారంటూ పోలీస్ స్టేషన్ ఎదుట తల్లిదండ్రుల ఆందోళన విశాఖపట్నం : స్నేహితులతో కలిసి పండుగకు వెళ్లిన ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తమ కుమారుడి మృతికి కొంత మంది యువకులే కారమణమని తల్లిదండ్రులు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా కేంద్రంలోని పెందుర్తిలో గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. మృతుని కుటుంబ సభ్యులు, స్నేహితులు, పోలీసుల కథనం ప్రకారం... స్థానిక ద్రోణంరాజునగర్ కాలనీలో నివాసముంటున్న మీసాల అప్పారావు, అప్పలకొండ దంపతులకు నలుగురు కుమారులు. వీరిలో రెండో కుమారుడు దామోదర్ అలియాస్ దమ్ముఅలియాస్ జానీ(27) స్థానికంగా బాక్సింగ్ నేర్చుకున్నాడు. ఈ క్రమంలో పెందుర్తి, చినముషిడివాడ, కృష్ణరాయపురం ప్రాంతాల్లో బాక్సింగ్ వచ్చిన యువకులతో సన్నిహితంగా ఉండేవాడు. కొన్నాళ్ల కిందట దామోదర్ స్నేహితులకు, మరికొంత మంది బాక్సర్లకు కొట్లాట జరిగింది. అనంతరం ఆ గొడవలు సద్దుమణిగాయి. ఇదిలా ఉండగా గురువారం రాత్రి వేపగుంటలో జరిగిన పండుగకు దామోదర్ తన స్నేహితులతో ఆటోలో వెళ్లాడు. ఇంతలో రాత్రి పది గంటల సమయంలో కృష్ణరాయపురంలో జరిగిన ప్రమాదంలో దామోదర్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది. దీంతో ఆందోళనకు గురైన వారు ఘటానాస్థలికి చేరుకోగా అక్కడ ప్రమాదం ఆనవాళ్లు అంతగా లేవు. దామోదర్ ఒంటిపై గాయాలు, నోట్లో నురగ వచ్చినట్లు గుర్తించారు. దీంతో దామోదర్ మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. ఇది వరకే పాతకక్షలు ఉండడంతో ఏడుగురు యువకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమారుడి కోసం కొందరు యువకులు గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వరుసగా ఫోన్లు చేశారని చెబుతున్నారు. దామోదర్ కూడా ఉదయం నుంచి ఆందోళనగా ఇంట్లోనే ఉన్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఫోన్లు చేసిన యువకులను విచారిస్తే నిజాలు బయటకు వస్తాయని వారు కోరుతున్నారు. పీఎస్ వద్ద ఆందోళన దామోదర్ మృతదేహాన్ని గురువారం రాత్రి కేజీహెచ్‌కు తరలించి పోస్టుమార్టం అనంతరం శుక్రవారం సాయంత్రం పెందుర్తి తీసుకువచ్చిన క్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. దామోదర్ మృతదేహంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు భారీ ఎత్తున నినాదాలు చేస్తూ పెందుర్తి పోలీస్‌స్టేషన్, నాలుగు రోడ్ల కూడలి వద్ద ఆందోళనకు దిగారు. రోడ్డును దిగ్బంధించి దామోదర్ మృతికి కారణమైన వాళ్లను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో సీఐ మురళి రంగప్రవేశం చేసి ఆందోళనకారులకు సర్ది చెప్పారు. కేసు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని వారికి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనుమానాస్పద మృతి కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు. -
వీధి వ్యాపారుల ఘర్షణ: ఒకరి మృతి
విశాఖపట్నం(పెందుర్తి): విశాఖ జిల్లా పెందుర్తిలో తాగిన మైకంలో ఇద్దరు వీధి వ్యాపారులు పరస్పరం దాడి చేసుకున్నారు. మజీద్ అనే వ్యాపారి దిలీప్ ధర్మదాస్‌ను కర్రతో కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు దిలీప్ స్వస్థలం ఉత్తరప్రదేశ్. కాగా, మధ్యప్రదేశ్‌కు చెందిన వాడైన నిందితుడు మజీద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
ప్రమాణాలొద్దు.. విచారణకు సిద్ధం కండి
ఎమ్మెల్యే పెందుర్తికి జక్కంపూడి ప్రతి సవాల్ ఫరిజల్లిపేట (రాజానగరం) : అవినీతి ఆరోపణలను నిరూపించేందుకు గుడిలో ప్రమాణాలు కాదు, ధైర్యం ఉంటే సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా స్థానిక ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌కు ప్రతి సవాల్ చేశారు. నియోజకవర్గంలో మట్టి, ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలపై స్పందించిన ఎమ్మెల్యే పెందుర్తి స్థానిక గాంధీ బొమ్మ సెంటర్లో ఆదివారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మట్టి, ఇసుక మాఫియాను ఏనాడు ప్రోత్సహించలేదని, కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తన తల్లిపై ప్రమాణం చేయడానికి తాను సిద్ధమని, మీరూ సిద్ధమా? అంటూ సవాల్ చేయడంపై రాజా ప్రతిస్పందించారు. ప్రమాణాలతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయవద్దని, చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణను కోరాలని డిమాండ్ చేశారు. అందుకు గవర్నర్‌ను, సీఎంను కలిసేందుకు తాను కూడా వస్తానని చెప్పారు. ముగ్గళ్ల, కాటవరం, వంగలపూడి, సింగవరం ర్యాంపుల్లో ఎక్కడెక్కడ, ఎవరి వద్ద ఎంత తీసుకున్నారనేది ప్రజలందరికీ తెలుసని రాజా పేర్కొన్నారు. కాటవరం ర్యాంపులో శనివారం రాత్రి రూ.10 లక్షలు తీసుకుని, కార్యకర్తలకు ఆదివారం భోజనాలు పెట్టిన మాట నిజం కాదా? అని ప్రశ్నించారు. సీతానగరం మండలంలో ఇసుక అక్రమ రవాణా ద్వారా సుమారు రూ.ఆరు కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఇసుక అక్రమ రవాణా కారణంగా జాలిముడి వద్ద దుర్గ అనే పేద మహిళ మరణిస్తే, ఇంతవరకు ఆ కుటుంబానికి ఎటువంటి సాయం అందించలేదని చెప్పారు. చెవిలో పువ్వు, ముక్కున వేలుతో నిరసన సీఎం చంద్రబాబు, నియోజకవర్గంలో ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ ప్రజలను మభ్యపెడుతున్నారంటూ రాజాతో పాటు పార్టీ నేతలు చెవిలో పూలు పెట్టుకుని, ముక్కున వేలు పెట్టి ఫరిజల్లిపేటలో నిరసన ప్రదర్శన చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే వెంకటేష్ తగిన సమాధానం చెప్పలేక, నల్లబ్యాడ్జీలతో నిరసన అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. అలాగే ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి కూడా, న్యాయాన్ని ఎదుర్కొనే ధైర్యం లేక చంద్రబాబు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడం నీతిమాలిన చర్యగా పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఉండమట్ల రాజబాబు, పార్టీ మండల కన్వీనర్ మండారపు వీర్రాజు, రాష్ట్ర, జిల్లా కమిటీల నాయకులు పేపకాయల విష్ణుమూర్తి, అనదాస సాయిరామ్, అడబాల చినబాబు, నాతిపాము సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. కేసు నుంచి తప్పించుకునేందుకే స్టే ఈదరాడ (మామిడికుదురు) : ఓటుకు నోటు కేసులో సాక్ష్యాధారాలతో దొరికిపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆరోపించారు. పార్టీ మండల శాఖ అధ్యక్షుడు బొలిశెట్టి భగవాన్ అధ్యక్షతన ఆదివారం ఇక్కడ జరిగిన సమావేశంలో రాజా మాట్లాడారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఓటుకు నోటు కేసులో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. దోపిడీ, బరితెగింపు ధోరణిలో టీడీపీ ప్రభుత్వ విధానం ఉందని ఎద్దేవా చేశారు. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలోచన అని, అదే బాటలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పయనిస్తున్నారని రాజోలు కో–ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు నల్లి డేవిడ్, తోరం సూర్యభాస్కర్, జక్కంపూడి వాసు, రావి ఆంజనేయులు, విస్సా నాగేశ్వరరావు, అడబాల బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు. -
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పై సామూహిక అత్యాచారం
విశాఖపట్నం: విశాఖ నగరంలో ఒక యువతి అత్యాచారానికి గురైంది. హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ నెల 4వ తేదీన విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం వేపగుంటలో ఓ వివాహ వేడుకకు వచ్చింది. అక్కడి నుంచి రాంనగర్‌లోని పెళ్లికూతురు ఇంటికి వెళ్లి నిద్రించింది. 5వ తేదీ తెల్లవారుజామున హైదరాబాద్‌కు వెళ్లేందుకు ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరకు వచ్చింది. అక్కడ శివ శేఖర్, కిరణ్, మణికంఠ, చందు అనే నలుగురు యువకులు ఆ యువతిని అపహరించి కారులో సర్క్యూట్ హౌస్ వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ ఆ నలుగురిలో ఒకరు ఆమెపై అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను ఆర్టీసీ బస్టాండ్ వద్ద వదిలి వెళ్లారు. బాధితురాలు ఈ విషయాన్ని రెల్లి వీధిలోని స్నేహితులకు తెలిపింది. దీంతో వారు వచ్చి ఆమెను తీసుకువెళ్లి ఆశ్రయం ఇచ్చారు. కాగా, 6వ తేదీ సాయంత్రం నిందితుల్లో ఒకడైన శివశేఖర్ ఆమెకు ఫోన్ చేసి హైదరాబాద్ టిక్కెట్ తీసి పంపిస్తానని, ఆర్టీసీ కాంప్లెక్స్‌కు రమ్మని చెప్పాడు. దీంతో స్నేహితుల సాయంతో ఆమె కాంప్టెక్స్‌కు చేరుకుంది. శివశేఖర్ అక్కడకు రాగానే అతనిని పట్టుకుని కాంప్లెక్స్ వద్ద నున్న అవుట్‌పోస్ట్ పోలీసులకు అప్పగించారు. దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
కిడ్నాపర్ల చెరలోనే దామోదర్
విశాఖపట్నం: అపహరణకు గురైన పెందుర్తి బాలుడు కోరుబిల్లి దామోదర్(9) కిడ్నాప్ మిస్టరీ ఇంకా వీడలేదు. కిడ్నాప్ జరిగి ఏడు జరిగినా అతడి ఆచూకీ లభించలేదు. కుమారుడి జాడ తెలియకపోవడంతో దామోదర్ తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. తమ కొడుకు సురక్షితంగా రావాలని వారు కోరుకుంటున్నారు. వడ్డీ వ్యాపారి కోరుబిల్లి శ్రీనివాసరావు కుమారుడైన దామోదర్... పెందుర్తి మండలం చింతలగ్రహారంలో ఈ నెల 8న కిడ్నాపయ్యాడు. రూ.30 లక్షలు ఇవ్వకుంటే తన కొడుకును చంపుతామంటూ కిడ్నాపర్లు బెదిరించారని శ్రీనివాసరావు తెలిపారు. ఏడాది కాలంగా రూ.30 లక్షల రుణం వ్యవహారంలో శ్రీనివాసరావుకు, మరో వ్యక్తికి వివాదం నడుస్తున్నట్లు తెలుస్తుంది. -
విశాఖలో.. వినాయకుడి లడ్డూ 12.75 లక్షలు
విశాఖపట్నం: విశాఖలో గణపతి లడ్డూ రూ.12.75 లక్షల ధర పలికింది. మాధవధార వద్ద కళింగనగర్‌లో విజయ వినాయక ఉత్సవ కమిటీ నేతృత్వంలో గణపతి ఉత్సవాలు జరిగాయి. సోమవారం 27 కిలోల లడ్డూను గణపతికి నైవేద్యంగా సమర్పించారు. అనంతరం ఈ లడ్డూకు వేలం నిర్వహించారు. గాజువాకకు చెందిన వాడపల్లి రమాదేవి, మద్దిలపాలెం ప్రాంత వాసి దువ్వారపు భాస్కరరెడ్డి, పెందుర్తికి చెందిన కర్రి కృష్ణభార్గవ్ ముగ్గురూ కలిసి ఏకంగా వేలంలో రూ. 12.75 లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. కాగా, వేలంలో వచ్చిన మొత్తాన్ని సీఎం సహాయ నిధికి, చిన్న పిల్లల గుండె శస్త్ర చికిత్సలకు ఖర్చు చేస్తామని ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా లడ్డూ లక్షల రూపాయల ధర పలకడం విశేషం. -
'నాపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోంది'
విశాఖ: తనపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని విశాఖ జిల్లా పెందుర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండి బాబ్జీ ఆరోపించారు. ఓటర్లను అర్థిస్తాం ...తప్ప తెలుగుదేశం పార్టీ నేతల్లా బెదిరించమని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని గండి బాబ్జీ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు దేశం పార్టీ, ఎల్లో మీడియా మైండ్ గేమ్ ఆడుతోందని ఆయన మండిపడ్డారు. ఈ కుట్రలు, కుతంత్రాలను ప్రజలు అర్థం చేసుకున్నారని గండి బాబ్జీ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం
పెందుర్తి రూరల్, న్యూస్‌లైన్:పెందుర్తి-అనకాపల్లి ప్రధాన రోడ్డులో రైల్వే వంతెన సమీపాన సిటీ బస్సును భారీ ట్రాలర్ ఢీకొట్టిన ప్రమాదంలో విజయనగరం జిల్లాకు చెందిన ఓ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా ఇతని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. శనివారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు, పెందుర్తి పోలీసుల కథనం మేరకు వివరాలిలావున్నాయి. సబ్బవరం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్‌కు వెళ్లే 300 నంబర్ సిటీ బస్సు రైల్వే వంతెన దిగుతోంది. అదే సమయంలో ఎదురుగా ఫ్యాబ్రికేటింగ్ యాంగలర్తో వస్తున్న భారీ ట్రాలర్ ఆగివున్న లారీని తప్పించే ప్రయత్నంలో బస్సు వెనుక భాగాన కుడివైపున బలంగా ఢీకొట్టింది. ట్రాలర్‌పై ఉన్న యాంగలర్ బస్సు కుడివైపు అద్దంలోంచి ఓ వైపు ధ్వంసం చేస్తూ దూసుకు పోవడంతో వెనుక సీట్లో కూర్చున్న కిలాడి ఆనందరావు(17) అనే విద్యార్థి అక్కడికక్కదే దుర్మరణం పాల య్యాడు. ఆ పక్క సీట్లో కూర్చున్న శీరంరెడ్డి కిరణ్ కుడిచేయి, తలకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థాని కులు ఆటోలో ఆస్పత్రికి తరలించారు. మృతుడిది విజయనగరం జిల్లా కొత్తవలస మండలం దెందేరు సంతపాలెం గ్రామం. సబ్బవరంలో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న తండ్రి అప్పారావును కలిసి తిరిగి పెందుర్తిలోని కళాశాలకు వెళ్లేం దుకు బస్సులో వస్తుండగా దుర్ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రుడు కిరణ్ది చోడవరం మండలం లక్కవరం గ్రామం. ట్రాఫిక్ ఎస్ఐ కొండలరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 108 రాక స్థానికులు ఆగ్రహం ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, ప్రయాణికులు 108కి సమాచారం అందించినా గంట వరకూ వాహనం రాలేదు. దీంతో స్థానికులు, ప్రయాణికులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. క్షతగాత్రుని పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో స్థానికులు చొరవ తీసుకుని అతన్ని ఆస్పత్రికి తరలించారు. రోడ్డు విస్తరణ జరగక పోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, అయినా అధికారులు స్పందించక పోవడం దారుణమని స్థానికులు వ్యాఖ్యానించారు. -
పెందుర్తిలో వైయస్ఆర్సిపి నిరసన
-
జగనన్నది కాంగ్రెస్ డీఎన్ఏ కానే కాదు: షర్మిల