'చంద్రబాబు చేస్తున్న కుట్రే సునామీ అలజడి' | Pendurthi MLA Adeep Raj Fires On TDP Leaders Over Capital Issue | Sakshi
Sakshi News home page

ఆ విషయం టీడీపీ నేతలకు గుర్తు లేదా..?

Published Wed, Jul 22 2020 4:04 PM | Last Updated on Wed, Jul 22 2020 4:52 PM

Pendurthi MLA Adeep Raj Fires On TDP Leaders Over Capital Issue - Sakshi

సాక్షి, విశాఖపట్నం: సముద్రాన్ని అడ్డంపెట్టుకుని విశాఖపట్నంపై పచ్చనేతలు విషప్రచారం చేస్తున్నారని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌ రాజ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రోజున విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా విశాఖ నగరం భద్రంగా నిలిచింది. హుద్‌హుద్ నుంచి కైలాసగిరి విశాఖ నగరాన్ని కాపాడిన విషయం టీడీపీ నేతలకు గుర్తు లేదా..? ప్రపంచంలోని చాలా నగరాలు సముద్రతీరంలోనే ఉన్నాయి. అవన్నీ సునామీలో కొట్టుకుపోతాయా?  (ఇది జీవితంలో మరిచిపోలేని రోజు: మోపిదేవి)

గతంలో సునామీ వచ్చినప్పుడు కూడా విశాఖ నగరానికి ఎలాంటి నష్టం జరగలేదు. విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలన్న సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి నిర్ణయాన్ని అన్ని రకాలుగా అడ్డుకోవడానికి తెలుగు తమ్ముళ్లు ప్రయత్నిస్తున్నారు. ప్రపంచంలో ఎన్నో నగరాలు సముద్ర తీరంలోనే విలసిల్లుతున్నాయని ఆ నగరాలకు లేని ప్రమాదం విశాఖ నగరానికి ఏ రకంగా వస్తుందంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కాగా.. విశాఖ అభివృద్ధిని అడ్డుకునే క్రమంలో చంద్రబాబు నాయుడు చేస్తున్న కుట్రే సునామి అలజడిగా అదీప్ రాజు అభిప్రాయపడ్డారు. (‘ఏమిటీ రాతలు.. ఎవరిది చెప్పింది’)

.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement