Adeep Raj
-
బాబు 100 రోజుల పాలనపై అన్నంరెడ్డి అదీప్ రాజ్ ఫైర్
-
ఆ వదంతులు నమ్మొద్దు: అదీప్ రాజ్
సాక్షి, విశాఖపట్నం: తాను ఆత్మహత్య చేసుకున్నానంటూ వచ్చిన వదంతులను నమ్మొద్దని పెందుర్తి వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే అదీప్‌రాజ్ పేర్కొన్నారు. తాను ఆత్మహత్య చేసుకున్నట్టు సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలపై అదీప్ రాజ్ స్పందించారు. అవన్నీ అవాస్తవాలని చెప్పారుఆదివారం సాయంత్రం నేతలతో సమావేశం అనంతరం గ్యాస్టిక్ నొప్పి రావడంతో ఆసుపత్రిలో చేరానని, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యానని, రేపటి నుంచి కార్యకర్తలకు అందుబాటులో ఉంటామని వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. -
మా జగన్ అన్న పాలనలోనే సామాజిక న్యాయం
-
బాబు, లోకేష్ కు విమానం మోతే..
-
జగనన్న సుపరిపాలనను వివరిస్తూ జనంలోకి నేతలు
-
టీడీపీ హయాంలో డ్రగ్స్ మాఫియా కనిపించలేదా..?
సాక్షి, విశాఖ జిల్లా: టీడీపీ కష్టాల్లో వున్నప్పుడు మాత్రమే పవన్ కల్యాణ్ తెరపైకి వస్తారని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజ్ ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు హయాంలో విశాఖ డ్రగ్స్ మాఫియా కనిపించలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో గంజాయి సాగు జరిగినట్లు అప్పటి మంత్రి గంటానే అంగీకరించారన్నారు. (చదవండి: కష్టం.. కలవలేం: చంద్రబాబుకు అపాయింట్మెంట్ ఇవ్వని మోదీ, అమిత్ షా) టీడీపీ హయాంలో భారీగా గంజాయి అమ్మకాలు: కరణం ధర్మశ్రీ విశాఖలో గంజాయి తాగేవాళ్లే లేరని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. చంద్రబాబు సిగ్నల్ ఇవ్వగానే పవన్ డ్రగ్స్‌పై ట్వీట్ పెట్టాడని మండిపడ్డారు. టీడీపీ హయాంలోనే భారీగా గంజాయి అమ్మకాలు జరిగాయన్నారు. చదవండి: పచ్చదళం దుష్ప్రచారం -
విశాఖ లో ఉధృతంగా పరిషత్ ఎన్నికల ప్రచారం
-
టీడీపీ కార్యాలయం కూడా ఆక్రమణలోనే..
సాక్షి, విశాఖపట్నం: గీతం యూనివర్సిటీ ఆక్రమణలో 40 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. భూ ఆక్రమణలపై అధికారులు వారి బాధ్యతను వారు నిర్వహిస్తే టీడీపీ నేతలు ఎల్లో మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. నారా లోకేష్ తోడల్లుడు, బాలకృష్ణ అల్లుడు, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడి భూమి స్వాధీనం చెసుకుంటే టీడీపీ నేతలు ఎందుకు గోగ్గులు పెడుటున్నారని దుయ్యబట్టారు. రూ.800 కోట్లు విలువ చేసే 40 ఎకరాలు భూమిని గీతం యూనివర్సిటీ అక్రమించిందని, భూ ఆక్రమణలు తొలగిస్తే టీడీపీ నేతలు రాద్దాంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గీతం యూనివర్సిటీ ఆక్రమించిన భూమిపై కోర్టులో కేసుల్లో లేదు, ఓ ప్రైవేట్ యాజమాన్యం భూమి అక్రమిస్తే వాటిని స్వాధీనం చేసుకోవడం తప్పా అని మండ్డిపడ్డారు. టీడీపీ పొలిట్‌బ్యూరోలో ఉన్నవారంతా అత్యంత అవినీతికి పాల్పడ్డవారే అని, ఈఎస్ఐ స్కామ్‌లో ఉన్న అచ్చెన్నాయుడికి టీడీపీ అధ్యక్ష పదవి ఇచ్చిందని దుయ్యబట్టారు. భూములు కాజేసినవారికే టీడీపీలో పదవులు ఇస్తున్నారని, టీడీపీ కార్యాలయం కూడా ఆక్రమణలోనే ఉందన్నారు. ఆక్రమించిన భూమికి నోటీసీలు ఇవ్వకుండా, వందల కోట్ల విలువ చేసే భూమి అక్రమిస్తే చూస్తూ ఉరుకోవాలా అని నిలదీశారు. ప్రభుత్వం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై కక్ష సాధింపుతో టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. విశాఖలో ఆక్రమణకు గురైన విలువైన భూములు కాపాడుతామని సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. టీడీపీ హయంలో వేసిన సిట్ వాస్తవాలు బైటకు రాలేదని, గజం భూమి కూడా సీఎం వైఎస్ జగన్ పాలనలో కబ్జాకు గురికాదని అన్నారు. చదవండి: గీతం యూనివర్సిటీలో ఆక్రమణల తొలగింపు గీతం యూనివర్సిటీలో గాంధీ పేరు చెప్పుకొని గాడ్సే పనులు జరుగుతున్నాయని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు మండిపడ్డారు. విలువైన భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో విశాఖ ప్రజల్లో సంతోషం ఉందని తెలిపారు. గీతంలో ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో ఆ పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున విశాఖలో భూములను మింగేశారని అన్నారు. మాజీ మేయర్ సబ్బంహరితో పాటు పలువురు ప్రభుత్వ ఆధీనంలో ఉంచుకున్నారని మండిపడ్డారు. యూనివర్సిటీ యాజమాన్యం గాంధీ పేరు చెప్పుకొని గాడ్సే పనులు చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ భూములు ఎవరు ఆక్రమించినప్పటికీ తిరిగి స్వాధీనం చేసుకోవడం ఖాయం అన్నారు. ఆక్రమణలు తొలగిస్తే రాజకీయం చేయడం తగదని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ పేర్కొన్నారు. -
శిరోముండనం బాధితుడికి మంత్రి ముత్తంశెట్టి భరోసా
-
శ్రీకాంత్‌కు ప్రభుత్వం అండగా ఉంటుంది
సాక్షి, విశాఖపట్నం/పెందుర్తి: విశాఖపట్నంలో శిరోముండనం బాధితుడు పర్రి శ్రీకాంత్‌కు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. జనసేన సానుభూతిపరుడు, టీడీపీ నేతలతో వ్యాపార భాగస్వామి, సినీ దర్శక, నిర్మాత నూతన్‌నాయుడు ఇంట్లో దాష్టీకానికి గురైన దళిత యువకుడు శ్రీకాంత్ ఫిర్యాదు చేసిన 24 గంటల్లోనే ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. బాధితుడు శ్రీకాంత్‌ను మంత్రి ముత్తంశెట్టి, ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్ ఆదివారం పరామర్శించారు. ► శ్రీకాంత్‌కు ప్రభుత్వం తరఫున రూ.లక్ష సాయం అందజేయటంతో పాటు ఔట్సోర్సింగ్ ద్వారా ఉపాధి కల్పిస్తామని మంత్రి ప్రకటించారు. ► కేసు విషయంలో పోలీసులు, అధికారులు వ్యవహరించిన తీరు ప్రశంసనీయమన్నారు. భవిష్యత్‌లో మరెవరూ ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలని కోరారు. ► బాధితులకు అండగా ఉండాల్సిన ప్రతిపక్షాలు నిస్సిగ్గుగా రాజకీయాలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ► బాధితుడు శ్రీకాంత్‌కు ఎమ్మెల్యే అదీప్‌రాజ్ తన సొంత నిధులు రూ.50 వేలు మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ► ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, ఆర్డీవో పెంచల కిశోర్ తదితరులు పాల్గొన్నారు. జ్యుడీషియల్ రిమాండ్‌కు ఏడుగురు నిందితులు శ్రీకాంత్‌ను హింసించిన ఘటనలో అరెస్ట్ చేసిన ఏడుగురు నిందితులను జ్యుడీషియల్ రిమాండ్‌కి పంపించారు. నిందితులను ఎస్సీ, ఎస్టీ స్పెషల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా.. వారికి సెప్టెంబర్ 11 వరకు రిమాండ్ విధించారు. ఆరిలోవలో ఉ¯న్న విశాఖ జిల్లా సెంట్రల్ జైలుకు నూతన్‌నాయుడి భార్య ప్రియామాధురితో సహా బ్యూటీషియన్ ఇందిరారాణి, వరహాలు, ఝాన్సీ, సౌజన్యలను తరలించగా బార్బర్ రవికుమార్, బాల గంగాధర్‌ను అనకాపల్లి సబ్ జైలుకు పంపించినట్లు డీసీపీ (క్రైం) సురేష్‌బాబు తెలిపారు. -
‘డూప్‌తో మాట్లాడిస్తున్నారా..?’
సాక్షి, విశాఖపట్నం: అమరావతిలో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికే విశాఖలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని టీడీపీ, పచ్చమీడియా దుష్ప్రచారం చేస్తోందని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతిలో జరిగిన అక్రమాలను అసెంబ్లీలో సాక్ష్యాలతో సహా నిరూపించామని తెలిపారు. విశాఖలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని టీడీపీ నిరూపించాలని ఆయన సవాల్ విసిరారు. ('చంద్రబాబును నమ్మితే రాజకీయ సమాధి ఖాయం') టీడీపీ హయాంలో విశాఖ ఫార్మాసిటీలో జరిగిన ప్రమాదాల్లో 53 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పుడు జరిగిన చిన్న ప్రమాదాలను కూడా రాజకీయం చేసి విశాఖపై విషం చిమ్ముతున్నారని నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడు ఉన్నారా.. లేక డూప్‌తో మాట్లాడిస్తున్నారో అర్థం కావడం లేదు. నాలుగు నెలలుగా ఆయన అడ్రస్సే లేరని అదీప్ రాజ్ ఎద్దేవా చేశారు. -
'చంద్రబాబు చేస్తున్న కుట్రే సునామీ అలజడి'
సాక్షి, విశాఖపట్నం: సముద్రాన్ని అడ్డంపెట్టుకుని విశాఖపట్నంపై పచ్చనేతలు విషప్రచారం చేస్తున్నారని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రోజున విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా విశాఖ నగరం భద్రంగా నిలిచింది. హుద్‌హుద్ నుంచి కైలాసగిరి విశాఖ నగరాన్ని కాపాడిన విషయం టీడీపీ నేతలకు గుర్తు లేదా..? ప్రపంచంలోని చాలా నగరాలు సముద్రతీరంలోనే ఉన్నాయి. అవన్నీ సునామీలో కొట్టుకుపోతాయా? (ఇది జీవితంలో మరిచిపోలేని రోజు: మోపిదేవి) గతంలో సునామీ వచ్చినప్పుడు కూడా విశాఖ నగరానికి ఎలాంటి నష్టం జరగలేదు. విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలన్న సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని అన్ని రకాలుగా అడ్డుకోవడానికి తెలుగు తమ్ముళ్లు ప్రయత్నిస్తున్నారు. ప్రపంచంలో ఎన్నో నగరాలు సముద్ర తీరంలోనే విలసిల్లుతున్నాయని ఆ నగరాలకు లేని ప్రమాదం విశాఖ నగరానికి ఏ రకంగా వస్తుందంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కాగా.. విశాఖ అభివృద్ధిని అడ్డుకునే క్రమంలో చంద్రబాబు నాయుడు చేస్తున్న కుట్రే సునామి అలజడిగా అదీప్ రాజు అభిప్రాయపడ్డారు. (‘ఏమిటీ రాతలు.. ఎవరిది చెప్పింది’) . -
'ఆయన శవరాజకీయాలు మానుకుంటే మంచిది'
సాక్షి, విశాఖపట్నం : విశాఖ నగరంలోని పరవాడలో సాయినార్ లైఫ్ సెన్సైస్ ఫార్మా కంపెనీలో మంగళవారం తెల్లవారుజామున విష వాయువు లీకైన సంగతి తెలిసిందే. కాగా గ్యాస్ లీకేజీ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, నలుగురు అస్వస్థతకు గురయ్యారు. ఈ సందర్భంగా పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ గాజవాక ఆర్ కె ఆసుపత్రికి చేరుకొని ప్రమాద ఘటనలో అస్వస్థతకు గురైన బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ప్రమాదంలో నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.(విశాఖలో విషాదం.. మరో గ్యాస్ లీక్) అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఈ ఘటనపై టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ శవ రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఇదే ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగి ముగ్గురు చనిపోతే నష్టపరిహారంగా 12 లక్షలు ఇచ్చి చేతలు దులుపుకోలేదా అని ప్రశ్నించారు. అప్పట్లో 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని మా వైఎస్సార్సీపీ తరపున డిమాండ్ చేస్తే పట్టించుకోకుండా ఇపుడు కోటి రూపాయిలు డిమాండ్ చేసే అర్హత వారికి ఎక్కడిదన్నారు. మీరు అప్పట్లో ఎమ్మెల్యేగా ఉండి బాధితులకి నష్టపరిహారం ఎంత ఇప్పించారో గుర్తు లేదా అంటూ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ తీరును ప్రశ్నించారు. పెద్ద మనిషినని చెప్పుకునే మీకు మా ప్రభుత్వాన్ని విమర్శించే హక్కులేదన్నారు.ఇప్పటికైనా టీడీపీ నేతలు శవ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు, ప్రభుత్వం కూడా స్పందించినట్లు పేర్కొన్నారు. ప్రమాద ఘటన తెలియగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరా తీశారన్నారు.(విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై సీఎం ఆరా) ముఖ్యమంత్రి ఆదేశాలతో ఫ్యాక్టరీని ప్రస్తుతం షట్ డౌన్ చేస్తున్నామని, ఈ ప్రమాదంపై కలెక్టర్ విచారణకి ఆదేశించారన్నారు. కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని, ఒకవేళ ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం చేసినట్లు కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మాది యాజమాన్యాలకి కొమ్ముకాసే ప్రభుత్వం కాదని...ప్రజల సంక్షేమమే మాకు ముఖ్యమన్నారు. ఫ్యాక్టరీ యాజమాన్య నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా అనిపిస్తున్నట్లు ఎమ్మెల్యే అదీప్ రాజ్ తెలిపారు. -
‘ఇది కేవలం ట్రైలర్ మాత్రమే! అసలు చిట్టా..’
సాక్షి, విశాఖపట్నం : తమ అక్రమాలు బయటపడుతుడటంతో చంద్రబాబు, లోకేష్ విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ దుయ్యబట్టారు. చంద్రబాబు, లోకేష్‌ల పాస్ పోర్టులు స్వాధీనం చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఐటీ దాడులపై లోతైన విచారణ జరపాలని, బాబును కూడా విచారించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అక్రమాస్తులను వెంటనే స్వాధీనం చేసుకుని ఖజానాకు జమ చేయాలని హితవు పలికారు. చంద్రబాబు అవినీతికి పాల్పడుతున్నాడని గతంలోనే తమ పార్టీ ఆరోపించిందని, అమరావతి, పోలవరం పేరుతో కోట్ల రూపాయిల ప్రజాధనాన్ని దోచుకున్నారని మండిపడ్డారు. డొల్ల కంపెనీల పేరుతో అక్రమ లావాదేవీలు నడిపించి కోట్లు వెనకేసుకున్నారని సత్యనారాయణ ఆరోపించారు. (‘టీడీపీ దివాళాకోరు తనానికి నిదర్శనం’) బయట పడిన రెండు వేల కోట్ల అక్రమాలు వ్యవహారం కేవలం ట్రైలర్ మాత్రమేనని.. అసలు అక్రమాల సినిమా ఇంకా బయటపడాల్సి ఉందని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ అన్నారు. మొదటి నుంచి టీడీపీ అక్రమాల గురించి వైఎస్సార్సీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వచ్చిందని తెలిపారు. విశాఖలో తక్కువ ధరకే కంపెనీలకు భూముల కేటాయింపు.. రికార్డులు మార్చి భూములు సొంతం చేసుకోవడం వంటి విషయాలు కూడా త్వరలో బయటకు వస్తాయని పేర్కొన్నారు. అక్రమార్కులు శిక్షకు సిద్ధంగా ఉండాల్సిందేనన్నారు. (‘ఇది ఉల్లిపాయపై పొర మాత్రమే’) చదవండి : ‘బాబు ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారు..’ రూ. 2 వేల కోట్లు: హైదరాబాద్‌కు చంద్రబాబు పయనం! చంద్రబాబు అవినీతి బట్టబయలు -
పాచిపోయిన లడ్డు.. నెయ్యి వేసినట్లుందా?
సాక్షి, అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఏ సిద్ధాంతాలతో బీజేపీకి దగ్గరవుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజ్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదాలాంటి అంశాలను పవన్ ఎందుకు పక్కన పెట్టారని ప్రశ్నించారు. అధికారం కోసం అర్రులు చాచి నిన్నటివరకు టీడీపీతో చీకటి ఒప్పందం సాగించి ఇప్పుడు బీజేపీకి దగ్గరై ఏపీ ప్రజలకు ఏం చేస్తారని విమర్శించారు. అయినా పవన్ ఎవరితో కలిసినా సాధించేది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికే గత ఎన్నికల్లో ప్రజలు ఇవ్వాల్సిన తీర్పు ఇచ్చేశారని ఎమ్మెల్యే అదీప్‌రాజ్ తెలిపారు. ఆటో డ్రైవర్లకు, రైతులకు, చేనేత వర్గాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందించిన సహాయం ఆయనకు ఇష్టం లేదా అని ప్రశ్నించారు. ఇక పవన్ కళ్యాణ్‌కు వైఎస్సార్ సీపీ పాలనను విమర్శించే నైతిక అర్హత లేదని తేల్చి చెప్పారు. గతంలో బీజేపీ.. ఏపీకి పాచిపోయిన లడ్డూలు ఇచ్చారన్న ఆయనకు ఇప్పుడది నెయ్యి వేసిన లడ్డూలా కనిపించిందా అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నిన్నటివరకు భారతీయ తెలుగు పార్టీ అయిన బీజేపీని ఇకనుంచి భారతీయ జనసేన పార్టీ అనాలా అని విమర్శించారు. చదవండి: పవన్ కల్యాణ్.. చెంగువీరా అయ్యారు.. ఫ్రెష్ లడ్డులు ఏమైనా పంపారా? -
రాజధానిని తరలిస్తున్నామని ఎవరు చెప్పారు?
సాక్షి, విశాఖపట్నం : రాజధాని విషయంలో చంద్రబాబు నాయుడు చేసే డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అదీప్‌రాజు అన్నారు. సొంత లాభం కోసం ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సొంత లాభం కోసం అమాయకపు రైతులను చంద్రబాబు మోసం చేస్తున్నారని మండిడ్డారు. రాజధానిని తరలిస్తున్నట్లు ఎవరు చెప్పారని ప్రశ్నించారు. కావాలనే చంద్రబాబు నాయుడు అనుకూల మీడియా ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తోందన్నారు. తన బినామీల భూముల రేట్లు తగ్గిపోతాయనే చంద్రబాబు ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు. తన స్వార్థం కోసం విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు భిక్షాటన దేని కోసమని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు సతీమణి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఐదేళ్లలో రాష్ట్ర అభివృద్ధి కోసం ఏనాడు జోలె పట్టని చంద్రబాబు.. ఇప్పుడు భిక్షాటన చేయడం సిగ్గుచేటన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే సీఎం జగన్ లక్ష్యమన్నారు. చంద్రబాబుకు రెఫరెండం కావాలంటే విశాఖపట్నం నుంచే మొదలుపెడదాం అన్నారు. విశాఖ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు.