
సాక్షి, అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఏ సిద్ధాంతాలతో బీజేపీకి దగ్గరవుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజ్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదాలాంటి అంశాలను పవన్ ఎందుకు పక్కన పెట్టారని ప్రశ్నించారు. అధికారం కోసం అర్రులు చాచి నిన్నటివరకు టీడీపీతో చీకటి ఒప్పందం సాగించి ఇప్పుడు బీజేపీకి దగ్గరై ఏపీ ప్రజలకు ఏం చేస్తారని విమర్శించారు. అయినా పవన్ ఎవరితో కలిసినా సాధించేది ఏమీ లేదని ఎద్దేవా చేశారు.
ఇప్పటికే గత ఎన్నికల్లో ప్రజలు ఇవ్వాల్సిన తీర్పు ఇచ్చేశారని ఎమ్మెల్యే అదీప్‌రాజ్ తెలిపారు. ఆటో డ్రైవర్లకు, రైతులకు, చేనేత వర్గాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందించిన సహాయం ఆయనకు ఇష్టం లేదా అని ప్రశ్నించారు. ఇక పవన్ కళ్యాణ్‌కు వైఎస్సార్ సీపీ పాలనను విమర్శించే నైతిక అర్హత లేదని తేల్చి చెప్పారు. గతంలో బీజేపీ.. ఏపీకి పాచిపోయిన లడ్డూలు ఇచ్చారన్న ఆయనకు ఇప్పుడది నెయ్యి వేసిన లడ్డూలా కనిపించిందా అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నిన్నటివరకు భారతీయ తెలుగు పార్టీ అయిన బీజేపీని ఇకనుంచి భారతీయ జనసేన పార్టీ అనాలా అని విమర్శించారు.
చదవండి: పవన్ కల్యాణ్.. చెంగువీరా అయ్యారు..
ఫ్రెష్ లడ్డులు ఏమైనా పంపారా?