
శ్రీరంగరాజపురం(చిత్తూరు జిల్లా): ‘పవన్‌కళ్యాణ్.. నీకంటే ఊసరవెల్లి నయం’ అని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. మండలంలోని ములురు గ్రామంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ ఊసరవెల్లి తన స్వభావంతో ఆత్మరక్షణ కోసం రంగు మార్చుకుంటుందని తెలిపారు.
జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ మాత్రం టీడీపీ ఎంత ఎక్కువ ప్యాకేజీ ఇస్తుందో.. అంత ఎక్కువగా రంగులు మారుస్తాడని విమర్శించారు. చంద్రబాబు పాపపు సొమ్ముతో లాయర్లు పండుగ చేసుకుంటున్నారని పేర్కొన్నారు. రాజుల సొమ్ము రాళ్ల పాలు.. అన్న చందంగా పరిస్థితి తయారైందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment