narayanaswamy
-
ఆ పచ్చ ‘సీఐ’ పై చర్యలేవి?
సాక్షి, నరసరావుపేట: ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ గూండాలు స్వైరవిహారం చేసిన సంగతి తెలిసిందే. వైఎస్సార్సీపీ నేతలు, వారి ఇళ్లపైన పచ్చ మూక దాడి చేస్తున్నా సీఐగా ఉన్న నారాయణస్వామి అడ్డుకుంటే ఒట్టు. పల్నాడు జిల్లాలో టీడీపీ రౌడీల దాడికి కొమ్ముకాసినందుకు పలువురు పోలీసు అధికారులను ఇప్పటికే ఎన్నికల సంఘం సస్పెండ్ చేసినా నారాయణస్వామిపై వేటు వేయకపోవడం గమనార్హం. పోలింగ్‌కు రెండు రోజుల ముందు ఆయనను కారంపూడి సీఐగా ఒక ఉన్నతాధికారి పంపారు. నాటి నుంచి టీడీపీ సేవలోనే నారాయణస్వామి తరించారు. పోలింగ్ నాడు టీడీపీ గూండాల దాడికి ఆయన అణువణువునా సహకరించారని బాధితులు ఆరోపిస్తున్నారు.వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలను పోలింగ్ కేంద్రాల వైపు వెళ్లనీయకుండా తన అధికారాన్ని సీఐ ఉపయోగించారు. ‘టీడీపీ నేతలు యథేచ్ఛగా రిగ్గింగ్ చేస్తున్నారు.. వచ్చి అడ్డుకోండి’ అని వైఎస్సార్సీపీ వాళ్లు సమాచారం ఇచ్చినా సీఐ నారాయణస్వామి పట్టించుకోలేదు. వైఎస్సార్సీపీకి ఓటు వేశారన్న అక్కసుతో బుడగ జంగాలపై టీడీపీ రౌడీలు దాడులు చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు. పైగా గొడవలో గాయపడిన, ఘటన ప్రదేశంలో లేని వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి జైలుపాలు చేశారు.ఆ సీఐపై ఇలా ఎన్ని ఫిర్యాదులు వచి్చనా పోలీసు ఉన్నతాధికారులు, ఎన్నికల సంఘం చర్యలు తీసుకోకపోవడం పట్ల బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీకి అనుకూలంగా ఉన్న కొందరు పోలీసు ఉన్నతా«ధికారులు పథకం ప్రకారం ఎన్నికలకు ముందు కారంపూడి సీఐ చిన్నమల్లయ్యను బదిలీ చేయించారు. ఆ స్థానంలో టీడీపీ నేతలు లావు శ్రీకృష్ణదేవరాయలు, యరపతినేని శ్రీనివాసరావుకు అనుకూలంగా ఉన్న, వారి సామాజికవర్గానికే చెందిన నారాయణస్వామిని సీఐగా పంపారు. నారాయణస్వామి అరాచకాలు అన్నీఇన్నీ కావు.. సీఐగా బాధ్యతలు తీసుకున్న మొదటి రోజు నుంచే నారాయణస్వామి చెలరేగిపోయారు. ఏకపక్షంగా వ్యవహరిస్తూ వైఎస్సార్సీపీ నేతలను వేధించారు. వైఎస్సార్సీపీ నేత వెంకటేశ్వరరెడ్డిని ఎన్నికల్లో క్రియాశీలకంగా ఉండొద్దని బెదిరించారు. రెంటచింతల మండలంలో టీడీపీ అనుకూల గ్రామాల్లో పర్యటించి ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడాలని.. తాను ఉన్నానని వారికి భరోసా ఇచ్చారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో రెంటచింతలలో వైఎస్సార్సీపీ నేత ఉమామహేశ్వరరెడ్డిని ఎన్నికలకు దూరంగా ఉండాలని బెదిరించినట్టు సమాచారం.ఇక ఎన్నికల రోజు రెంటచింతల, కారంపూడి మండలాల్లోని పాల్వాయి గేట్, తుమృకోట, ఒప్పిచర్ల, చింతలపల్లిలో టీడీపీ రౌడీ మూకలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలను పోలీంగ్ కేంద్రాల నుంచి తరిమికొడుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. తన వద్ద కేంద్ర బలగాలు ఉన్నా వాటిని ఉపయోగించి హింసను ఆపే ప్రయత్నం నారాయణస్వామి చేయలేదు. టీడీపీ గూండాలు పోలింగ్ బూత్‌ల్లో వైఎస్సార్సీపీ ఏజెంట్లపై దాడి చేసి తరిమేశారు. ఆ ఏజెంట్లు సీఐ నారాయణస్వామికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆయన మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం గమనార్హం. ఇక పోలింగ్ అనంతరం టీడీపీ మూక అర్ధరాత్రి గ్రామాల్లో వైఎస్సార్సీపీ శ్రేణుల ఇళ్లపై దాడికి దిగినా సీఐ స్పందించలేదు. నారాయణస్వామి అతీతుడా? పల్నాడు జిల్లాలో టీడీపీ గూండాల హింసపై ఎన్నికల సంఘం స్పందించింది. కారంపూడి ఎస్సై రామాంజనేయులు, గురజాల డీఎస్పీ, పల్నాడు ఎస్పీలపై వేటు వేసింది. కానీ హింస ప్రజ్వరిల్లడానికి అసలు కారకుడైన నారాయణస్వామిపై చర్యలు తీసుకోలేదు. ఈయనపై వేటు పడకుండా ఓ పోలీసు ఉన్నతాధికారి కాపాడారని అంటున్నారు. దీంతో సీఐ నారాయణస్వామి మరింత రెచి్చపోతున్నారు. టీడీపీ దాడుల్లో గాయపడిన వైఎస్సార్సీపీ నాయకులతో పాటు ఆ పారీ్టలో చురుగ్గా ఉంటున్న వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఎస్ఐగా పనిచేసినప్పుడూ అంతే.. మొదటి నుంచి సీఐ నారాయణస్వామి తీరు వివాదాస్పదమే. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కారంపూడి ఎస్ఐగా పని చేసిన సమయంలో కూడా ఆయన టీడీపీకి అనుకూలంగా పనిచేశారు. నరగామాలపాడు గ్రామ మాజీ సర్పంచ్, వైఎస్సార్సీపీ బీసీ సెల్ నాయకుడు అయిన రామ్మడుగు బ్రహ్మంను టీడీపీ నాయకులు అత్యంత దారుణంగా హత్య చేశారు. చివరకు ఆ హత్య కేసులో సాక్షిగా ఉన్న ఆయన తమ్ముడ్ని తన ప్రోద్భలంతోనే టీడీపీ నాయకులు కిడ్నాప్ చేశారనే ఆరోపణలను నారాయణస్వామి ఎదుర్కొన్నారు.అలాగే చినగార్లపాడులో టీడీపీ వర్గీయులు వైఎస్సార్సీపీ కార్యకర్త ఇంటిపై మారణాయుధాలతో దాడి చేసి వెంటాడి చంపారు. అయినా వారిపై నారాయణస్వామి చర్యలు తీసుకుంటే ఒట్టు. చివరకు ఎస్ఐగా ఉన్న ఆయన టోపీని టీడీపీ కార్యకర్తలు నెత్తిన పెట్టుకుని లాఠీతో ఫోజులిచ్చే స్థాయిలో వారితో అంటకాగారు. టీడీపీ నాయకులు పోలీస్ స్టేషన్‌ను అడ్డాగా మార్చుకుని వైఎస్సార్సీపీ నాయకులపై వేధింపులకు పాల్పడిన ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. దీంతో ఎట్టకేలకు ఎస్ఐగా పనిచేస్తున్న నారాయణస్వామిని అప్పట్లో ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. పిన్నెల్లిపై అక్రమంగా కేసు... కారంపూడిలో ఈ నెల 14న జరిగిన గొడవల్లో స్థానిక వీఆర్వో ఇచి్చన ఫిర్యాదు ఆధారంగా పది మంది వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై కేసు నమోదు చేశారు. ఇందులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తమ్ముడు వెంకటరామిరెడ్డిపై ఫిర్యాదు లేదు. అయితే ఈవీఎం పగలగొట్టారని నమోదు చేసిన కేసులో పిన్నెల్లికి బెయిల్ వస్తే కౌంటింగ్‌కు హాజరవుతారని, ఆయనను ఎలాగైనా నిలువరించాలన్న టీడీపీ నేతల కుట్రకు సీఐ నారాయణస్వామి సహకరించారు.ఇందులో భాగంగా ఈ నెల 22న ఆయన తన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇందులో తనను పిన్నెల్లి సోదరులు, ఆయన అనుచరులు గాయపరిచారని ఆరోపించారు. దీని ఆధారంగా కారంపూడి పోలీసులు పిన్నెల్లి సోదరులను ఏ24, ఏ25 నిందితులుగా చేర్చారు. మరోవైపు మే 14న సీఐ నారాయణస్వామికి చిన్న గాయమైతే ఐదారురోజులు యథావిధిగా విధులు నిర్వహించారు. అయితే కేసులో పిన్నెల్లిని ఇరికించాలన్న కుట్రతోనే మే 20న నరసరావుపేటలో టీడీపీ అనుకూల ఆస్పత్రిలో నారాయణస్వామి చికిత్స పొందారు.మా నాన్నను అక్రమంగా ఇరికించారు.. కారంపూడిలో జరిగిన గొడవలకు మా నాన్న కొత్త కాశిరెడ్డికి ఎటువంటి సంబంధం లేదు. పోలీసులు మా నాన్నను అన్యాయంగా ఈ కేసులో ఇరికించి జైలుకు పంపారు. ఆ సమయంలో మా నాన్న కారంపూడి చుట్టుపక్కల లేరు. సీఐ నారాయణస్వామి రమ్మంటున్నారని ఇద్దరు కానిస్టేబుళ్లు తీసుకెళ్లి జైలుకు పంపారు. – కొత్త నర్సిరెడ్డి, దేవారిపల్లి, కారంపూడి మండలం దళితులపై అక్రమ కేసులు పెట్టారు.. కారంపూడిలో హింసాత్మక ఘటనలకు ఏమాత్రం సంబంధం లేని మా మామ బంకా ప్రతాప్‌పై పోలీసులు అక్రమ కేసు బనాయించి జైలుకు పంపారు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మా మామ వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా ఉన్నందుకు కేసు పెట్టారు. బైండోవర్ సంతకం కోసం సీఐ నారాయణస్వామి పోలీస్‌స్టేషన్‌కు రమ్మన్నారు అని చెప్పి తీసుకెళ్లిన పోలీసులు అక్కడి నుంచి జైలుకు పంపారు. – ఎల్. ప్రభుకుమార్, చింతపల్లి -
నీ పాలన గురించి చెప్పి ఓట్లడిగే దమ్ముందా?
రేణిగుంట(తిరుపతి జిల్లా): ‘మీ ఇంటికి నేను మంచి చేశాను.. నన్ను ఆశీర్వదించండి. లేకుంటే నాకు ఓటేయొద్దు అని చెప్పగలిగే దమ్ముందా?’ అని చంద్రబాబును డిప్యూటీ సీఎం నారాయణస్వామి ప్రశ్నించారు. చంద్రబాబు అధికారం గురించి పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం వెదుళ్లచెరువు ఎస్టీ కాలనీలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నో పథకాలను అమలు చేశారని వివరించారు. చంద్రబాబు ఎప్పుడైనా ఎస్సీ, ఎస్టీ, బీసీలను రాజ్యసభకు పంపించారా? అని ప్రశ్నించారు. గొల్ల బాబూరావు అనే ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని, నలుగురు బీసీలను రాజ్యసభకు పంపిన ఘనత సీఎం జగన్‌కు దక్కిందన్నారు. ఎవరైనా ఎస్సీలుగా పుట్టాలనుకుంటారా? అంటూ చంద్రబాబు హేళన చేశారని మండిపడ్డారు. 2019లో పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన పవన్‌కళ్యాణ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. జనసేన కార్యకర్తలను నిలువునా ముంచేశారని విమర్శించారు. 24 సీట్లను కూడా చంద్రబాబు చెప్పిన వారికే ఇచ్చే దుస్థితిలో పవన్ ఉన్నారని దుయ్యబట్టారు. సీఎం జగన్ చేతిలో చంద్రబాబు, పవన్‌కు మళ్లీ ఘోర పరాభవం తప్పదన్నారు. ఎల్లప్పుడూ జగన్ వెంటే.. డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ.. ‘గంగాధరనెల్లూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ టికెట్‌ను నా కుమార్తెకు ఇస్తే చంద్రబాబుకు వచ్చిన నష్టమేంటి? నేనే సంతోషంగా నా కుమార్తెకు టికెట్ ఇవ్వాలని సీఎం జగన్‌ను అడిగాను. నా సేవలను పార్టీ మరో రకంగా వినియోగించుకుంటుంది. నేను ఎప్పుడూ వైఎస్ కుటుంబాన్ని వదలను. దళితుడినైన నన్ను గుర్తించి డిప్యూటీ సీఎం పదవి వరకు తీసుకెళ్లిన సీఎం జగన్ మేలును ఎప్పటికీ మరువను. ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లను అమ్ముకునే సంస్కృతి చంద్రబాబుది’ అని విమర్శించారు. -
ఈరోజు సిద్ధం సభతో..మా దమ్మెంటో మళ్లీ నిరూపిస్తాం
-
మైదుకూరులో సాధికార మహోత్సవం
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లా మైదుకూరులో సోమవారం జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్ర ఓ మహోత్సవంలా సాగింది. వేలాదిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు పాదయాత్రగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరికి వీధివీధిలో ప్రజలు ఘనస్వాగతం పలికారు. బాణాసంచా, డప్పు వాయిద్యాల నడుమ యాత్ర పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలికి చేరుకుంది. అక్కడ అశేష జనవాహిని మధ్య బహిరంగ సభ జరిగింది. సభలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు రాష్ట్రంలో సీఎం జగన్ సంక్షేమ పాలనను వివరించారు. సీఎం జగన్ పేరు విన్న ప్రతిసారీ ప్రజలు పెద్దపెట్టున జై జగన్ అని నినాదాలు చేస్తూ సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు. సామాజిక సాధికారత నినాదం కాదు మా విధానం: ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశంలో సామాజిక సాధికారత ఓ నినాదంగానే మిగిలిపోయిందని, ఆ కలను సాకారం చేసి బడుగు, బలహీనవర్గాల అభివృద్ధికి బాటలు వేస్తున్న తొలి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజాద్‌బాషా చెప్పారు. వైఎస్సార్సీపీ సామాజిక సాధికారతలను విధానంగా మార్చుకుందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను సీఎం వైఎస్ జగన్ అక్కున చేర్చుకొని, కేబినెట్ సహా అన్ని పదవుల్లో అధికభాగం ఇచ్చి, రాజకీయంగా ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. సంక్షేమ పథకాల్లోనూ అత్యధిక భాగం ఈ వర్గాలకే ఇస్తూ ఆర్థికంగా బలం చేకూరుస్తున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఒక్క మైనార్టీకీ మంత్రివర్గంలో స్థానం ఇవ్వలేదని, సీఎం జగన్ మంత్రి పదవితోపాటు నలుగురు మైనార్టీలను ఎమ్మెల్యేలుగా, మరో నలుగురికి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించారని తెలిపారు. జగన్ సీఎం అయ్యాక రాష్ట్రంలో వర్షాలు పుష్కలంగా కురుస్తున్నాయని, నదులు, రిజర్వాయర్లు, చెరువులు జలకళను సంతరించుకున్నాయని తెలిపారు. ఇటీవల జిల్లాలో చంద్రబాబు, లోకేశ్ అడుగు పెట్టగానే కరువు మొదలైందని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్‌కు బహుజనులు అండగా నిలవాలి: డిప్యూటీ సీఎం నారాయణస్వామి సీఎం వైఎస్ జగన్ పాలనలో సామాజిక న్యాయం దక్కుతోందని, ఆకలితో ఉన్నవాడు రాజ్యమేలాలని ఆయన సంకల్పించారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి చెప్పారు. చంద్రబాబు ఎస్సీలను కించపరుస్తూ మాట్లాడితే, అదే ఎస్సీలు తలెత్తుకొని బ్రతకాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్ పనిచేస్తున్నారని తెలిపారు. అందులో భాగంగానే అగ్రవర్ణాల పిల్లల్లానే పేదల పిల్లలూ ఉన్నత స్థితికి ఎదగాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టారని తెలిపారు. పేదలంతా చదువుకోవాలని కాంక్షిస్తూ అమ్మ ఒడి పథకం తెచ్చారన్నారు. పేదల కోసం పెత్తందారులతో పోరాడుతున్న జగన్ : మంత్రి విడదల రజిని సీఎం పేదల కోసం పెత్తందారులతో పోరాడుతున్నారని రాష్ట్ర మంత్రి విడదల రజిని అన్నారు. రాష్ట్రానికి గొప్ప నాయకత్వాన్ని అందించిన జిల్లాగా కడపలో ప్రతి గడప గర్వపడేలా వైఎస్ జగన్ పాలన సాగుతోందన్నారు. 25 మంది మంత్రుల్లో 17 మంది ఎస్సీ ఎస్టీ బీసీ, మైనార్టీలు ఉండడం సామాజిక సాధికారతకు నిదర్శనమన్నారు. బీసీల తోలు తీస్తా, తోకలు కత్తిరిస్తా అన్న చంద్రబాబుకు రాబోయే ఎన్నికల్లో ఆయన తోక కత్తిరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రణ నినాదం మోగుతోంది : ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకర్‌రావు సీఎం జగన్ ఏపీలో విప్లవాత్మక మార్పులు తెచ్చి, రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతున్నారని ప్రభుత్వ సలహాదారు (సాంఘిక సంక్షేమం) జూపూడి ప్రభాకర్‌రావు చెప్పారు. స్వార్థం లేకుండా పేదల తరపున సీఎం జగన్ యుద్ధం చేస్తున్నారన్నారు. పేదలకు భూములందించాలని అంబేడ్కర్ సంకల్పిస్తే, సీఎం జగన్ ఆచరిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే ఎస్ రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్ ప్రసంగించారు. -
పవన్.. నీకంటే ఊసరవెల్లి నయం
శ్రీరంగరాజపురం(చిత్తూరు జిల్లా): ‘పవన్‌కళ్యాణ్.. నీకంటే ఊసరవెల్లి నయం’ అని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. మండలంలోని ములురు గ్రామంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ ఊసరవెల్లి తన స్వభావంతో ఆత్మరక్షణ కోసం రంగు మార్చుకుంటుందని తెలిపారు. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ మాత్రం టీడీపీ ఎంత ఎక్కువ ప్యాకేజీ ఇస్తుందో.. అంత ఎక్కువగా రంగులు మారుస్తాడని విమర్శించారు. చంద్రబాబు పాపపు సొమ్ముతో లాయర్లు పండుగ చేసుకుంటున్నారని పేర్కొన్నారు. రాజుల సొమ్ము రాళ్ల పాలు.. అన్న చందంగా పరిస్థితి తయారైందన్నారు. -
‘మద్యం’పై మాట్లాడే అర్హత పురందేశ్వరికి లేదు
పుత్తూరు రూరల్: మద్యం పాలసీపై మాట్లాడే అర్హత ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరికి లేదని డిప్యూటీ సీఎం కె.నారాయణస్వామి అన్నారు. ఆదివారం తిరుపతి జిల్లా పుత్తూరులో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీ రామారావు మద్యపాన నిషేధం తీసుకొస్తే.. ఆయన స్థాపించిన పార్టీని చంద్రబాబు లాక్కుని మద్య నిషేధం ఎత్తివేసినప్పుడు పురందేశ్వరి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. చంద్రబాబు పాలించిన 2014–19 కాలంలోనే ఏకంగా 7 డిస్టిలరీలకు అనుమతులు ఇచ్చారని గుర్తు చేశారు. 2019లో ఏర్పడిన సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఇప్పటివరకు ఒక్క డిస్టలరీకి గానీ, ఒక్క బ్రూవరీకి గాని అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. పీఎంకే డిస్టలరీ యనమల రామకృష్ణుడిదని, శ్రీకృష్ణ డిస్టలరీ ఆదికేశవులనాయుడిదని, స్పై డిస్టిలరీ ఎస్పీవై రెడ్డిదని, విశాఖ డిస్టిలరీ అయ్యన్నపాత్రుడిదని వివరించారు. ఇప్పుడున్న ప్రతి బ్రాండు చంద్రబాబు పాలనలో తీసుకొచ్చినవే అని, అందుకే వాటిని ‘సీ’ బ్రాండ్లు అంటున్నారని తెలిపారు. కేజీహెచ్‌లో గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో నెలకు సుమారు 20 మంది పాడైన లివర్, పాంక్రియాస్ రోగులు అడ్మిట్ అవడమనేది పదేళ్లుగా జరుగుతున్న విషయమేనని స్పష్టం చేశారు. మద్యపానం చేస్తే లివర్ చెడిపోవచ్చు బ్రాండుతో సంబంధం లేకుండా మద్యాన్ని 8 నుంచి 10 ఏళ్ల పాటు తీసుకుంటే లివర్ చెడిపోవచ్చని మంత్రి నారాయణస్వామి పేర్కొన్నారు. దేశంలోనే మద్యం సేవించే వారి సంఖ్య 15 శాతానికి పెరిగిందని నిమ్హాన్స్ నివేదిక స్పష్టం చేసిందన్నారు. చంద్రబాబు పాలనలో మద్య నిషేధాన్ని ఎత్తివేయడాన్ని సమర్థిస్తూ ఈనాడు, ఆంధ్రజ్యోతి వార్తలు రాశాయని గుర్తు చేశారు. చంద్రబాబు తన అనుచర గణానికి 4,378 మద్యం షాపులను కట్టబెట్టడమే కాకుండా, 43 వేల బెల్ట్ షాపులు పెట్టి మద్యపానాన్ని ఏరులై పారించారని గుర్తు చేశారు. అందుకే పురందేశ్వరి మద్యం పాట పాడుతోంది పురందేశ్వరి తన మరిది చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్‌ను కాపాడేందుకే మద్యం పాట పాడుతున్నారని మంత్రి నారాయణస్వామి ఎద్దేవా చేశారు. పురందేశ్వరి బీజీపీ అధ్యక్షురాలా? టీడీపీ అధ్యక్షురాలా అర్థం కావడం లేదన్నారు. చంద్రబాబుతో కలిసి పురందేశ్వరి, ఆమె భర్త సైతం ఎన్టీఆర్ మృతికి కారకులయ్యారని, ఎన్టీఆర్ కూతురుగా చెప్పుకోవడానికి ఆమెకు అర్హత లేదని పేర్కొన్నారు. చంద్రబాబు ఆర్థిక నేరస్తుడని తొలిసారిగా చెప్పింది దేశ ప్రధాని నరేంద్ర మోదీ అని.. ఆ తరువాత చెప్పింది పవన్‌కళ్యాణ్ అని గుర్తు చేశారు. చంద్రబాబు అరెస్ట్ న్యాయపరంగానే జరిగిందని రాష్ట్ర ప్రజలు విశ్వసించారు కాబట్టే ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేక స్పందన రాలేదన్నారు. -
కల్తీ మద్యానికి అవకాశం లేకుండా విశాఖలో ఎక్సైజ్ లేబొరేటరీ
దొండపర్తి(విశాఖ దక్షిణ)/ఆనందపురం(భీమిలి) : కల్తీ మద్యాన్ని పరీక్షించేందుకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆంధ్రా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన అత్యాధునిక ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ లేబోరేటరీని గురువారం డిప్యూటీ సీఎం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కె.నారాయణస్వామి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి హాని కలగకుండా, కల్తీ మద్యానికి అవకాశం లేకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ల్యాబ్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పారు. ప్రజలకు మెరుగైన విద్య, ఆరోగ్యం, సంక్షేమం అందించడమే నిజమైన అభివృద్ధి అని, అదే సీఎం జగన్ సంకల్పమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఇటువంటి ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని ఎక్సైజ్ అధికారులు చంద్రబాబును కోరినప్పటికీ.. ఆయన పట్టించుకోలేదని విమర్శించారు. ఇదిలా ఉండగా ఆనందపురం మండలం గోరింటలో రూ.20 కోట్లతో నిరి్మంచనున్న ఎక్సైజ్ శాఖ కాంప్లెక్స్, ఏపీఎస్‌బీసీఎల్ డిపో నిర్మాణ పనులకు నారాయణస్వామి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ బొమ్మ పెట్టుకుని జగన్ రాష్ట్రమంతా తిరిగి సీఎం అయ్యారని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఫొటో పట్టుకుని తిరిగి లోకేశ్ ఒక్క సీటైనా గెలవాలని సవాల్ విసిరారు. చంద్రబాబు ఒక అవినీతి చక్రవర్తి అని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో రూ.1000 కోట్ల కుంభకోణానికి పాల్పడిందని, చంద్రబాబు అక్రమాలను రోడ్డు మీదకు లాగుతానని చెప్పిన దత్తపుత్రుడు పవన్.. ఇప్పుడు ఏం చేస్తున్నాడని ప్రశి్నంచారు. తండ్రి చావుకు కారకుడైన బాబుకు పురందేశ్వరి వత్తాసు పలకడం హాస్యాస్పదం కల్తీ మద్యం తాగడం వల్లే విశాఖలో ఇద్దరు చనిపోయారని పురందేశ్వరి అన్న వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన మండిపడ్డారు. కల్తీ మద్యం కారణంగానే ఎవరైనా చనిపోయారని నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమన్నారు. తండ్రి చావుకు కారణమైన బాబుకు పురందేశ్వరి వత్తాసు పలకడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మార్గదర్శి అక్రమాలపై విచారణ జరుపుతున్నందుకే ఈనాడులో రామోజీరావు తప్పుడు రాతలు రాస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమాల్లో మంత్రి గుడివాడ అమర్నాథ్, నగర మేయర్ గొలగాని హరివెంకటకుమారి, వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, డీసీసీబీ చైర్మన్ కోలా గురువులు, ఏయూ వీసీ ప్రసాదరెడ్డి తదితరులున్నారు. -
రాజ్యాంగ విలువలను పాటిస్తున్న ప్రభుత్వం ఏపీ
సాక్షి, అమరావతి/మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): రాజ్యాంగ విలువలను పాటిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌ను తీసుకొచ్చిందని కేంద్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఎ.నారాయణస్వామి కితాబిచ్చారు. తద్వారా బలహీన వర్గాల ప్రజలకు బాసటగా నిలుస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తోందన్నారు. విజయవాడలో సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సమరసత సమ్మేళనంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. చాలాచోట్ల రాజకీయ పార్టీలకు దళితుల అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని.. ఇప్పటికీ 15 రాష్ట్రాల్లో ఎస్సీ అభివృద్ధి కార్పొరేషన్ లేకపోవడం ఇందుకు నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేశారు. 75 ఏళ్ల స్వాతంత్ర భారతంలో ఎన్ని ప్లానింగ్, స్టాండింగ్ కమిషన్లు వచ్చినా అంబేడ్కర్ ఆశించినట్టు అస్పృశ్యతను రూపుమాపలేకపోయాయన్నారు. కుక్కను ముద్దాడుతున్న సమాజంలో దళితుడిని ముట్టుకోవడానికి ఆలోచిస్తున్నారన్నారు. ఈ దృక్పథంలో మార్పు తెచ్చేందుకు రాజకీయ నాయకులు, అధికారులు సామాజిక కార్యకర్తలుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ప్రత్యేక చీమా రెజ్మెంట్లో పోరాడిన దళిత యోధులను సైతం తర్వాత కాలంలో అంటరాని వాళ్లుగా చిత్రీకరించారన్నారు. జాతి వ్యవస్థను సంఘటితం చేస్తున్న అగ్రవర్ణాల్లోని వ్యక్తులు కూడా వెలికి గురయ్యారన్నారు. ఇప్పటికీ దళిత సీఎంలు గుళ్లలోకి వెళ్లలేని పరిస్థితి దేశంలో ఉందన్నారు. ప్రస్తుతం రిజర్వేషన్లపై చర్చ జరుగుతోందని.. దళితుల అంటరానితనంపై కూడా చర్చించాలని అభిప్రాయపడ్డారు. సమరసత, ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలు సామాజిక సమస్యలను ఎత్తి చూపుతూ.. సంస్కరణలకు బాటలు వేస్తున్నాయని కొనియాడారు. స్కూళ్లలో దళితులకు ప్రవేశం కల్పించిన కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు, బెనారస్ హిందూ వర్సిటీ తొలి దళిత విద్యార్థి కూర్మయ్య, సామాజిక సంస్కర్త భాగ్యరెడ్డి వర్మలను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. అంటరానితనం సోదర కులాల్లోనూ ఉండటం బాధాకరం: ఎమ్మెల్సీ డొక్కా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ.. అంటరానితనం కేవలం అగ్రకులాలకే పరిమితం కాలేదని, సోదర కులాల్లోనూ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దాని నివారణకు ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం చాలా పదునైన ఆయుధమని, దానిని జాగ్రత్తగా సామాజిక సంస్కరణల కోసం ఉపయోగించాలని కోరారు. ఆర్ఎస్ఎస్ జాతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా అనేక మతాలు ఇప్పటికీ మనుగడ కోసం సంఘర్షణ పడుతుంటే.. దేశంలో మాత్రం హైందవం ఐక్యతకు ప్రతీకగా నిలుస్తోందన్నారు. సమయానికి అనుగుణంగా కావాల్సిన సంస్కరణలతో ఐక్యతను పెంచుకోవాలన్నారు. గన్నవరంలోని శ్రీభువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతీస్వామి మాట్లాడుతూ.. కుల వ్యవస్థ దేశానికి వెన్నెముక అన్నారు. ప్రతి కులం వెనుక ఒక సైన్స్ ఉందన్నారు. ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కుల సంప్రదాయాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. వందేళ్ల కిందటే దళితుల బస్తీల్లో దేవాలయాలు నిర్మించుకున్నారని గుర్తు చేశారు. సామాజిక సమరసత వేదిక రాష్ట్ర అధ్యక్షుడు టి.విష్ణు మాట్లాడుతూ.. ఆది ఆంధ్రా సమ్మేళనం నిర్వహించి 105 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా సమరసత సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, శాసనసభ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్, సామాజిక సమరసత మహిళా విభాగం రాష్ట్ర కన్వీనర్ కోడూరు జయప్రద పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంగిపూడి వెంకటశర్మ రాసిన నిరుద్థ భారతం పునర్ముద్రణ, వచన వ్యాఖ్యానం, కృష్ణానదీ తీరాన సమతా ఉద్యమాలు అనే పుస్తకాలను ఆవిష్కరించారు. కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ముని మనుమరాలు రాధిక, వేముల కూర్మయ్య కుమారుడు డాక్టర్ రామలింగేశ్వరరావు, భాగ్యరెడ్డి వర్మ మనుమడు అజయ్ గౌతమ్‌లను నిర్వాహకులు సత్కరించారు. -
సదా.. మీ ‘చెప్పు’ చేతుల్లోనే..
నాటకాలు బాగా ప్రదర్శిస్తున్న రోజుల్లో ఓ సరదా సంభాషణ ప్రాచుర్యంలో ఉండేది. ‘ఏమోయ్.. నాటకం బాగా రక్తి కట్టిందటగా ఏ మాత్రం కలెక్ష వచ్చిందేమిటి?’.. కొంచెం వ్యంగ్యంగా అన్న ప్రశ్నకు.. ‘మహా బాగా వచ్చాయి.. బాటా తొంభై, నాటు నలభై.. అన్నీ ఎడమ కాలివే..’ అని నిష్ఠూరపు సమాధానం. ఇప్పుడు నాటకాలు పాలిటిక్స్‌లో బాగా రక్తి కడుతుండడంతో ఆ బాటా, నాటు జోళ్ల అవసరం, ప్రస్తావన ఇక్కడ బాగా పెరిగింది.. ఏదైనా పరస్పర విరుద్ధం అని చెప్పడానికి ఉప్పు, నిప్పు అంటారు. రాజకీయాల్లో విరుద్ధమైన రెండింటికీ ‘చెప్పు’ ఒక్కటే చాలు. స్వామిభక్తిని చాటడానికైనా. నిరసన తెలప డానికైనా.. ‘చెప్పు’ చేతపడితే చాలు. ఇలారండి .. భారత రాజకీయాలు ఎలా చెప్పుచేతుల్లో ఉన్నాయో చూద్దాం.. ‘షూ’ట్ ఎట్ షార్ట్‌కట్.. నిజానికి చెప్పుల కథ ఎప్పుడు మొదలైందో చెప్పడం కష్టంగానీ.. రామ భరతుల కాలంనాటి ‘పాదుకా పట్టాభిషేకం’ మనకు ఎరుకే. ఆ తర్వాత బాగా పాపులర్ అయ్యింది.. ఎమర్జెన్సీ రోజుల్లో నాటి యూపీ ముఖ్యమంత్రి ఎన్డీ తివారీ. అసలు ఏ అధికార పదవిలోనూ లేని సంజయ్ గాంధీ చెప్పులు తివారీ చేతందు కోవడం మొదలు తరచుగా నాయకులు పాదుకా స్పర్శలో ‘అమితా’నందాన్ని పొందుతూనే ఉన్నారు. నిన్నటి బండి సంజయ్ – అమిత్ షా చెప్పుల ఉదంతం చూశాం... ఎప్పుడో 2015 నాటి నారాయణసామి – రాహుల్ చెప్పుల కథను ప్రధాని మోదీ ప్రస్తావించడం.. ఇప్పుడది ట్రోల్ అవుతుండటం చూస్తున్నాం.. నాడు రాహుల్ కాళ్లకు ఎక్కడ బురద అంటుకుంటుందోనని.. కాంగ్రెస్ నేత నారా యణసామి చెప్పులు చేతబట్టుకుని మరీ కాపలా కాశారు. రాహుల్ బూట్లు అలా విప్పగానే చటుక్కున తన చెప్పులు ఆయన కాళ్ల వద్ద పెట్టి స్వామి భక్తిని ‘చెప్పు’కున్నారు. ‘రాహుల్ వంటి సీనియర్‌ను గౌరవించుకోవడం తప్పా..?’ అని కూడా ఈ 68 ఏళ్ల వయసున్న పెద్దాయన అప్పట్లో చెప్పారు. 2010లో మహారాష్ట్ర కాంగ్రెస్ మంత్రి రమేశ్ బాగ్వే ముంబైకి వచ్చిన రాహుల్ గాంధీ చెప్పులను కాసేపు ‘గౌరవం’గా చేత పట్టుకున్నారు. ఇదే రాహుల్‌గాంధీ ఆమధ్య కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై ‘చెప్పు’డు విమర్శ లకు దిగారు. తాము అమిత్‌షా నివాసానికి వెళితే ఇంటి బయటే చెప్పులు విప్పించారని, లోపల అమిత్‌షా మాత్రం చెప్పులు వేసుకునే ఉన్నారని మణిపూర్ ప్రజాప్రతినిధులు తనతో చెప్పారంటూ.. అమిత్‌షా క్షమాపణ చెప్పా లంటూ డిమాండ్ చేశారు కూడా. కొన్నేళ్ల కింద బీజేపీ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం ఉమా భారతి.. ప్రభుత్వ అధికారులు ఉన్నది తమ చెప్పులు మోసేందుకే అన్నట్టుగా మాట్లాడారు. తర్వాత క్షమాపణలు చెప్పుకున్నా రనుకోండి ‘షూ’ట్ ఎట్ ఫైట్ ఇక యూపీలోని సంత్ కబీర్‌నగర్‌లో ఇద్దరు బీజేపీ నేతలు పబ్లిక్ ముందే చెప్పులాటకు దిగారు. శిలాఫలకంపై తన పేరు లేదన్న ఆగ్రహంతో ఊగిపోయిన బీజేపీ ఎంపీ శరద్ త్రిపాఠీ.. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ బఘేల్‌ను చెప్పుతో కొడితే.. రాకేశ్ తిరిగి లెంపకాయతో బదులిచ్చారు. ‘షూ’ట్ ఎట్ సైట్ ఎప్పుడూ భక్తి తన్మయత్వమేనా.. అప్పు డప్పుడూ నిరసనల కోపం కూడా చెప్పులను చేతబట్టించింది. ► 2009లో దైనిక్ జాగరణ్ రిపోర్టర్ జర్నైల్ సింగ్ నాటి కేంద్ర మంత్రి చిదంబరంపై విసిరిన బూటు దేశంలో కలకలం రేపింది. ► 2016లో యూపీలోని సీతాపూర్ జిల్లాలో రోడ్‌షో చేస్తున్న రాహుల్ గాంధీ వైపు హరిఓం మిశ్రా అనే సామాజిక కార్యకర్త విసిరిన నిరసన బూటు దూసుకొచ్చింది. 2012లో డెహ్రాడూన్‌లో జరిగిన ఓ రాజకీయ సభలోనూ రాహుల్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ► 2016లోనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రెస్మీట్లో మాట్లాడుతుంటే.. వేద ప్రకాశ్ శర్మ అనే రాజకీయ కార్యకర్త చెప్పు విసిరి తన నిరసన చెప్పుకున్నాడు. ► విమానంలో బిజినెస్ క్లాస్ సీటు ఇవ్వలేదంటూ శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఎయిరిండియా సిబ్బందిని చెప్పుతో కొట్టిన ఘటనపై దేశవ్యాప్తంగా విమర్శలూ వచ్చాయి. ► అప్పట్లో కర్ణాటక సీఎంగా ఉన్న యడ్యూరప్పపై చెప్పుదాడి జరగడంతో.. చెప్పుల లొల్లి చెప్పలేనంత తలనొప్పిగా మారిందని నాటి ఎలక్షన్ కమిషనర్ ఖురేషీ తల పట్టుకున్నారు. ఈ ‘ట్రెండ్’ను ఆపడానికి ఏదో ఒకటి చేయాలనీ అన్నారు. ‘షూ’ట్ ఎట్ హైట్ కొందరు రాజకీయ నేతలు చెప్పుల ఎత్తు పెంచుకుని.. కొత్త ఎత్తులకు వెళ్లారని పాశ్చాత్య మీడియా అప్పుడప్పుడూ కోడై కూస్తుంటుంది. లీడర్ల అసలు ఎత్తుకు, అధికారికంగా చెప్పే ఎత్తుకు సంబంధం ఉండదని అంటూ ఉంటుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎత్తు బూట్లు వేసుకుని ఎత్తయిన వ్యక్తిలా కనిపించే ప్రయత్నం చేస్తారని అది ఆయన విజయ రహస్యమనీ చాలాసార్లు వార్తలూ వచ్చాయి. కొన్నేళ్ల కింద అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను కలవడానికి వెళ్లిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఎత్తు చెప్పులు వేసుకెళ్లారని గోల చేశారు కూడా. ఇక మన దీదీ మమతా బెనర్జీ హవాయి చెప్పుల ‘సింప్లిసిటీ’కి ఎంత ఇమేజ్ ఉందో తెలిసిందే కదా! నువ్వేం ‘షూ’టర్? అప్పట్లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న జార్జ్ బుష్‌పై ఓ నిరసనకారుడు బూటు విసిరాడు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో ఓ జోక్.. బూటు విసిరిన వ్యక్తికి జడ్జి మూడేళ్లు జైలుశిక్ష వేశారు. ‘కేవలం బూటు విసిరితే మూడేళ్లు జైలా?’ అని నిందితుడు వాపోతే.. ‘కాదు.. విసిరినందుకు ఒక్క ఏడాదే.. అది తగలకుండా మిస్సయినందుకు మిగతా రెండేళ్లు జైలు’ అని జడ్జి ఆగ్రహం! (క్లిక్: 75 ఏళ్లుగా ఉరుకుతున్నా... ఉన్నకాడే!) ఇది ‘షూ’పర్.. పిల్లలను క్రమశిక్షణలో పెట్టడానికి మన అమ్మల చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రం ‘చెప్పు’ లేనట.. ఆ భయం చూపి.. అల్లరిపిల్లలను దారిలో పెడుతున్నారని సరదా కామెంట్. ఇలా అమ్మలు వారి ఆయుధాన్ని విరివిగా వాడి పిల్లలను డిసిప్లిన్‌లో పెడితే... ముందు తరాల రాజకీయాల్లో చెప్పుల అవసరం బాగా తగ్గుతుందని ఓ నెటిజన్ ఉవాచ. -
AP New Cabinet: ముచ్చటగా మూడు.. చిత్తూరు జిల్లాకు అగ్రతాంబూలం
రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో చిత్తూరు జిల్లాకు అరుదైన గౌరవం దక్కింది. మునుపెన్నడూ లేనివిధంగా ముచ్చటగా మూడు మంత్రి పదవులు దక్కించుకుని రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. గతంలో ఉన్న మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కళత్తూరు నారాయణస్వామిని కొనసాగిస్తూ బోనస్‌గా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు మంత్రి వర్గంలో చోటుదక్కడంపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. స్వీట్లు పంచుతూ, బాణసంచా కాల్చుతూ కార్యకర్తలు, అభిమానులు సంబరాల్లో మునిగితేలారు. చదవండి: జయ, రాజేంద్రలకు మళ్లీ మంత్రి యోగం సాక్షి ప్రతినిధి, తిరుపతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తూరు జిల్లాపై మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నంతకాలం పార్టీ పదవులతో ప్రాధాన్యత కల్పించడమే కాకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన తొలి మంత్రి వర్గంలో జిల్లాలో ప్రధాన సామాజిక వర్గాలైన రెడ్డి, దళితులకు మంత్రి పదవుల్లో పెద్దపీట వేశారు. అంతేకాకుండా డిప్యూటీ సీఎం హోదాను సైతం జిల్లాకే కట్టబెట్టారు. పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరుగాంచి, రాయలసీమ జిల్లాల్లోనే పెద్దాయనగా పిలిచే సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు పార్టీ కష్టకాలంలో జిల్లా అ«ధ్యక్షుడుగా అందరినీ కలుపుకుని పార్టీని నడిపించిన కళత్తూరు నారాయణస్వామికి తొలి మంత్రివర్గంలో చోటు కల్పించారు. తాజాగా చేపట్టిన మంత్రివర్గ పునర్‌వ్యవస్తీకరణలోనూ ఏ జిల్లాకూ దక్కని అరుదైన గౌరవాన్ని ఉమ్మడి చిత్తూరు జిల్లాకు కట్టాబెట్టారు. పెద్దాయన పెద్దిరెడ్డి స్థానం పదిలం చేశారు. నారాయణస్వామి విధేయతను సుస్థిరం చేశారు. ఇద్దరినీ తిరిగి మంత్రులుగా కొనసాగిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు జిల్లాకు బోనస్‌గా మూడో మంత్రి రూపంలో ఫైర్‌బ్రాండ్‌గా పేరుగాంచిన నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు మంత్రి మండలిలో చోటు కల్పించారు. పునర్‌వ్యవస్తీకరణలోనూ మంత్రి పదవుల కేటాయింపుల్లో ప్రధాన సామాజిక వర్గాలు రెడ్డి, దళితులకు ముఖ్యమంత్రి పెద్దపీట వేశారు. దళిత సామాజిక వర్గానికి చెందిన గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి, రెడ్డి సామాజికి వర్గానికి చెందిన పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు మంత్రులుగా బెర్త్ ఖరారు చేశారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసి చూపించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకే మూడు మంత్రి పదవులతో అరుదైన గౌరవం కల్పించారు. జిల్లా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ముగ్గురికి మంత్రి పదవులు ఇవ్వడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అంబరాన్నంటిన సంబరాలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ముగ్గురు సీనియర్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు రావడంపై వైఎస్సార్సీపీ శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా పుంగనూరు, జీడీనెల్లూరు, నగరి నియోజకవర్గాల్లో సంబరాలు అంబరాన్ని అంటాయి. వైఎస్ జగన్ కేబినెట్లో రెండోసారి మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామితోపాటు రోజా అభిమానులు, నేతలు విజయవాడకు తరలివెళ్లారు. రోజా వికాసం.. వెల్లువెత్తిన హర్షం నగరి/నిండ్ర/పుత్తూరు రూరల్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేబినెట్లో ఎమ్మెల్యే ఆర్కే రోజాకు స్థానం దక్కడంపై నియోజకవర్గ వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. నిండ్రలో సైతం పార్టీ కార్యకర్తలు మిఠాయిలు పరస్పరం తినిపించుకుని ఆనందం వ్యక్తం చేశారు. రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రారెడ్డి, మొదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ బాలకృష్ణ, మున్సిపల్ వైస్ చైర్మన్లు బాలన్, వెంకటరత్నం, ఎంపీపీ భార్గవి, వైస్ ఎంపీపీలు వెంకటలక్ష్మి, కన్నియప్పన్, నగరి కో–ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ తిరుమలరెడ్డి, పార్టీ రాష్ట్ర యవజన విభాగం ప్రదాన కార్యదర్శి శ్యామ్‌లాల్, నిండ్ర ఎంపీపీ దీప, పార్టీ మండల కనీ్వనర్ వేణురాజు పాల్గొన్నారు. పుత్తూరులో నాయకుల సంబరాలు అంబరాన్నంటాయి. అ‘ద్వితీయ కళ’త్తూరు కార్వేటినగరం/వెదురుకుప్పం/పెనుమూరు : డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామికి రెండో పర్యాయం మంత్రి పదవి దక్కడంపై కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. పార్టీ మండల కన్వీనర్ ధనంజయవర్మ, కో–ఆప్షన్ సభ్యుడు పట్నం ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో బాణసంచా పేల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. వెదురుకుప్పం మండలం పచ్చికాపల్లంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బండి గోవర్ధన్‌రెడ్డి నేతృత్వంలో సంబరాలు నిర్వహించారు. పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండి హేమసుందర్‌రెడ్డి, దాసరి కార్పొరేషన్ డైరెక్టర్ సుమతి, నేతలు శేషాద్రి, సుమతి పాల్గొన్నారు. పెనుమూరులో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు మహాసముద్రం సురేష్‌రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. నేతలు దూది మోహన్, బండి కమలాకరరెడ్డి, కండిగ మధు, పి.కృష్ణారెడ్డి పాల్గొన్నారు. కాలినడకన కొండకు.. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడికి కేబినెట్లో మళ్లీ స్థానం దక్కాలని కోరుతూ కార్వేటినగరం ఎంపీపీ లతాబాలాజీ దంపతులు ఆదివారం అలిపిరి మార్గం గుండా తిరుమలకు కాలినడకన వెళ్లారు. ఎంపీపీ లతాబాలాజీ మాట్లాడుతూ పెద్దిరెడ్డి, నారాయణస్వామికి మంత్రి పదవులు దక్కడంపై హర్షం వ్యక్తం చేశారు. విధేయతకు పట్టం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అప్యాయత చూపే అతికొద్ది మంది నాయకుల్లో గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి ఒకరు. నిజాయతీ, వైఎస్సార్ కుటుంబంపై విధేయత ఆయనకు అభరణాలు అని నియోజకవర్గ ప్రజలు చెప్పుకుంటారు. అందుకే తొలి మంత్రి వర్గంలోనే మంత్రి పదవికి నారాయణస్వామిని తీసుకున్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి తర్వాత కీలకమైన ఉపముఖ్యమంత్రి హోదాను సైతం కల్పించారు ఎవ్వరూ ఊహించని విధంగా మంత్రివర్గ పునర్‌వ్యవస్తీకరణలోనూ ఆయనకు రెండోసారి మంత్రి మండలిలోకి తీసుకున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు వైఎస్ఆర్ కుటుంబానికి విధేయుడిగా ఉన్న నారాయణస్వామికి రెండోసారి మంత్రిమండలిలో చోటుదక్కడంపై హర్షతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కార్యకర్త స్థాయి నుంచి సమితి అధ్యక్షుడుగా, మూడు సార్లు ఎమ్మెల్యేగా, ఐదేళ్ల పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడుగా మూడేళ్ల పాటు మంత్రిగా ఆయనకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. తొలిసారి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో 2004 ఎన్నికల్లో సత్యవేడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాయన ఆ తర్వాత 2014, 2019 ఎన్నికల్లో గంగాధరనెల్లూరు నుంచి ఎమ్మెల్యేగా వరుసగా విజయం సాధించారు. వైఎస్సార్ దివంగతులయ్యాక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంట నడిచారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం తర్వాత ప్రప్రథమ జిల్లా అధ్యక్షుడుగా సుదీర్ఘకాలం పనిచేశారు. ప్రత్యేకించి దళిత సామాజికర్గానికి పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి తన మంత్రివర్గ విస్తరణలో ఆయనకు మళ్లీ చోటు కల్పించారు. రెండోసారి మంత్రిగా సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. సమర్థతకు గౌరవం ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలోనూ చోటుదక్కింది. 2009లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి క్యాబినెట్లో తొలిసారి ఆయన మంత్రి పదవి చేపట్టారు. రాష్ట్ర అటవీశాఖ మంత్రిగా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అకాలమరణం తర్వాత తన మంత్రి పదవికి రాజీనామా చేసి విధేయత చాటుకున్నారు. వైఎస్ కుటుంబంతో ఉన్న అనుబంధంతో ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంట నడిచారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం తర్వాత జిల్లాలో సర్వం తానై పార్టీ పటిష్టతకు ఎనలేని కృషి చేశారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ పట్టు సడలనీయకుండా అధికారంలో ఉన్న టీడీపీకి దీటుగా రాజకీయాలు నడిపారు. 2019 ఎన్నికల్లో జిల్లాలో వైఎస్సార్సీపీ కుప్పం మినహా క్లీన్‌స్వీప్ చేయడంలో కీలకపాత్ర పోషించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండో విడత చేపట్టిన మంత్రివర్గ విస్తరణలోనూ చోటుదక్కించుకుని, తండ్రి, తనయుడి మంత్రివర్గంలో పనిచేసిన అరుదైన రికార్డును పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత చేసుకున్నారు. సేవకు అందలం రాజకీయంగా ఎన్ని అవమానాలు, కష్టాలు ఎదురైనా వెన్నుచూపని ధీరురాలుగా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు రాష్ట్రవ్యాప్తంగా పేరు ఉంది. వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా సుదీర్ఘకాలం ఆమె పారీ్టలో కీలకభూమిక పోషించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ స్థాపించిన తర్వాత ఆయన వెంట నడిచారు. 2014, 2019లో నగరి ఎమ్మెల్యేగా వరుసగా విజయం సాధించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రజావ్యతిరేక విధానాలు, పాలకులు చేస్తున్న అవినీతి, అక్రమాలపై ఆసెంబ్లీలో తన వాగ్ధాటితో అధికార పక్షానికి ఆమె ముచ్చెమటలు పట్టిస్తూ ఫైర్‌బ్రాండ్ ఎమ్మెల్యేగా పేరు సంపాదించారు. అసెంబ్లీలో ఉంటే కష్టమని భావించిన నాటి టీడీపీ ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా ఆమెను అక్రమంగా ఏడాది పాటు అసెంబ్లీకి రాకుండా నిషేధం విధించారు. ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టినా జగన్మోహన్రెడ్డి వెంటే నడిచారు. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఆమెకు మంత్రి మండలిలో చోటు దక్కుతుందని ఆశించినా సామాజిక సమతుల్యత వల్ల చోటు దక్కలేదు. అయినా ఆమె సేవలను గుర్తించి కీలకమైన ఏపీఐఐసీ చైర్మన్‌గా రాష్ట్ర స్థాయి పదవిలో కూర్చోబెట్టారు. తాజాగా చేపట్టిన మంత్రివర్గ పునర్వ్యవస్తీకరణలో ఆమెకు మంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి చోటకల్పించారు. తొలిసారి మంత్రిగా ఆమె సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. మంచి వ్యక్తికి అవకాశం కోవిడ్ సమయంలో ఎమ్మెల్యే ఆర్కేరోజా సేవలు ప్రత్యక్షంగా చూశా. అందరికీ అందుబాటులో ఉంటూ, ఎందరినో ఆదుకున్నారు. పారీ్టలను పట్టించుకోకుండా సాయం అందించారు. అలాంటి మంచి వ్యక్తికి మంత్రిగా అవకాశమివ్వడం ఆహ్వానించాల్సిన అంశం. కేబినెట్ ఎంపికలో ముఖ్యమంత్రి చక్కటి కసరత్తు చేశారని అర్థమవుతోంది. – పి. బాలసుబ్రమణ్యం, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు, పుత్తూరు సమ న్యాయం చేశారు కేబినెట్ కూర్పులో అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం చేశారు. ప్రధానంగా 75శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయించడం ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజన్ అభినందనీయం. కొత్త మంత్రులు మరింతగా ప్రజలతో మమేకం కావాలని కోరుకుంటున్నాం. – రాజరత్నంరెడ్డి, ప్రజాహిత సేవా సంస్థ అధ్యక్షుడు, చిత్తూరు ఎంపిక బాగుంది నూతన మంత్రులను పక్కాగా ఎంపిక చేశారు. సీనియర్ల అనుభవాన్ని వదులుకోకుండా అవకాశం కల్పించారు. అన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా కొత్తవారిని తీసుకున్నారు. జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, ఆర్కే రోజాకు మంత్రి పదవులు దక్కడం సంతోషంగా ఉంది. -విజయశేఖర్, చిత్తూరు సమర్థతకు పట్టం నూతన మంత్రి వర్గంలో ఎస్సీలపై ప్రేమను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి చాటుకున్నారు. అనుభవజు్ఞడైన నారాయణస్వామికి మళ్లీ అవకాశం కలి్పంచి సమర్థతకు పట్టం కట్టారు. ప్రజలకు సేవ చేసే నాయకులను మరువకుండా పదవులు కట్టబెట్టారు. ఇది హర్షించదగ్గ విషయం. – వినాయకం, ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు -
చంద్రబాబుకు డిప్యూటీ సీఎం నారాయణస్వామి సవాల్
సాక్షి, తిరుపతి: చంద్రబాబుకు దమ్ము, ధైర్యముంటే కొత్త పార్టీ పెట్టి పోటీ చేయాలని డిప్యూటీ సీఎం నారాయణస్వామి సవాల్ విసిరారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడారు. మంత్రి పదవులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం శిరోధార్యమన్నారు. తమకు పదవులు ఉన్నా లేకున్నా వైఎస్ జగన్‌తోనే ఉంటామని స్పష్టం చేశారు. చదవండి: టీడీపీలో భగ్గుమన్న విభేదాలు.. జేసీపై పల్లె సంచలన వ్యాఖ్యలు సీఎం జగన్‌కు మరింత మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకున్నానని.. దేవుని అనుగ్రహం, ప్రజల ఆశీస్సులు ఉన్నంత కాలం వైఎస్ జగన్ సీఎంగానే ఉంటారని, అన్ని అనుకూలిస్తే 15 సంవత్సరాల తర్వాత సీఎం జగన్ ప్రధాని అవుతారని నారాయణ స్వామి అన్నారు. వేషాలు వేసుకునే వాళ్లు రాజకీయాలకు పనికిరారని.. ఎన్టీఆర్‌పై నేను పోటీ చేస్తా అన్న చంద్రబాబు.. నేడు ఆ తెలుగుదేశం పార్టీ వారసులుగా చలామణి అవుతున్నాడు. చంద్రబాబుకు దమ్ము ధైర్యం వుంటే.. కొత్త పార్టీ పెట్టి పోటీ చేయాలని.. అలా గెలిస్తే తాను రాజకీయాల నుండి తప్పుకుంటాని నారాయణ స్వామి సవాల్ విసిరారు. -
డ్రైవర్లకు వ్యాక్సినేషన్ తప్పనిసరి
కార్వేటినగరం (చిత్తూరు జిల్లా): ట్యాక్సీ, బస్సు డ్రైవర్లు వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు వ్యాక్సినేషన్ చేపట్టిన విధంగానే, ప్రజలతో నిత్యం సంబంధాలుంటున్న ట్యాక్సీ, బస్సు, ఆటో డ్రైవర్లకు వ్యాక్సిన్ అందించాలన్నారు. జిల్లా కలెక్టర్లు కరోనా నివారణపై యుద్ధ ప్రాతిపదికన అవగాహన కల్పించి కరోనా మరణాల సంఖ్యను తగ్గించేందుకు కృషి చేయాలన్నారు. మాస్కులు లేకుండా నిర్లక్ష్యంగా రోడ్లపైకి వచ్చే వారికి భారీగా జరిమానా విధించి కరోనా కట్టడికి పోలీస్ యంత్రాంగం కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలో అత్యధికంగా వ్యాక్సినేషన్ అందిస్తున్నారని గుర్తుచేశారు. -
గురుమూర్తి వెంట పార్టీ నేతలు ,మంత్రులు
-
కాంగ్రెస్‌లో సంక్షోభం: సీఎం రాజీనామా..!
సాక్షి, యానాం : కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి నారాయణస్వామిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటికే ఐదుగురు శాసససభ్యులు పదవులకు రాజీనామాలు సమర్పించగా.. ఆదివారం మరో ఇద్దరు ఎమ్మెల్యే సీఎంకు షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పిస్తున్నట్లు లక్ష్మీనారాయణన్, డీఎంకే ఎమ్మెల్యే వెంకటేషన్ ప్రకటించారు. రాజీనామా లేఖలను స్పీకర్‌కు పంపించారు. బలపరీక్షకు ముందే వీరు వైదొలగడం ప్రభుత్వంలో కలకలం రేపుతోంది. పుదుచ్చేరిలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈనెల 22న బలపరీక్షకు సిద్ధం కావాలని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) తమిళిసై సౌందరరాజన్ గురువారం ఆదేశించిన విషయం తెలిసిందే. బలపరీక్ష 22న సాయంత్రం 5 గంటలలోపు ముగించాలని, విశ్వాస పరీక్ష అనే ఏకైక ఎజెండాతో జరిగే ఈ సమావేశంలో సభ్యులు చేతులెత్తి మద్దతు తెలపాలని తమిళసై పేర్కొన్నారు. కాగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజీనామాలతో పుదుచ్చేరిలోని కాంగ్రెస్ ప్రభుత్వం మెజార్టీ కోల్పోయింది. 30 మంది సభ్యులు కలిగిన అసెంబ్లీలో 15 మంది సభ్యులతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇటీవల ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేపై అనర్హత వేటు, మరో నలుగురు రాజీనామాలతో ఆ సంఖ్య 10కి పడిపోయింది. తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కాంగ్రెస్ వైపు కేవలం 9 మంది మాత్రమే మిగిలిపోయారు. అయితే ఇద్దరు డీఎంకే, ఒక స్వతంత్ర సభ్యుడు అధికార పక్షం వైపు ఉన్నారు. అలాగే, ప్రతిపక్షంలో ఎన్ఆర్ కాంగ్రెస్ 7, అన్నాడీఎంకే 4, నామినేటెడ్ (బీజేపీ) ఎమ్మెల్యేలు 3లతో కలుపుకుని మొత్తం 14 మంది సభ్యుల బలం ఉంది. దీంతో అసెంబ్లీ బలపరీక్షకంటే ముందే నారాయణస్వామి రాజీనామా చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. బలపరీక్ష నిర్వహించిన సరిపడ బలం లేకపోవడంతో ముందుగానే రాజీనామాను సమర్పిస్తారని తెలుస్తోంది. -
ఎమ్మెల్యేల షాక్: సంక్షోభంలో కాంగ్రెస్ సర్కార్
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. ఒకేసారి నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ముఖ్యమంత్రి నారాయణస్వామి సర్కార్ మైనార్టీలో పడిపోయింది. కీలకమైన అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎమ్మెల్యే రాజీనామాలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. మరోవైపు ఎన్నికలపై సమీక్ష జరిపేందుకు ఆ పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీ బుధవారం పుదుచ్చేరిలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం ఆ పార్టీ నేతలను కలవరానికి గురిచేస్తోంది. రెండు రోజుల క్రితమే యానం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పించిన విషయం తెలిసిందే. ఈ షాక్ నుంచి తేరుకోకముందే మంగళవారం నాడు మరో నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో పుద్దుచ్చేరి రాజకీయాలు ఊహించని మలుపు తిరిగాయి. మరోవైపు తాజా పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి నారాయణస్వామి అప్రమత్తం అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు కెబినేట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యనేతలు, సీనియర్లతో విడివిడిగా సమావేశం అయ్యారు. కాగా మొత్తం 30 మంది శాసనసభ్యులు గల పుదుచ్చేరి అసెంబ్లీలో కాంగ్రెస్-డీఎంకే కూటమికి 16 మంది సభ్యుల మద్దతు ఉంది. విపక్షానికి 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే తాజా రాజీనామాలతో అధికార పార్టీ బలం 11కి పడిపోయింది. కాగా యానం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన మల్లాడి కృష్ణారావు.. నారాయణ స్వామి ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గత నెలలో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తాజాగా యానాం శాసనసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందిన మల్లాడి కృష్ణారావు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని యానాంకు 25 ఏళ్లుగా ఎమ్మెల్యేగా సేవలు అందిస్తున్నారు. పుదుచ్చేరిలో అనేక పదవులు చేపట్టారు. యానాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ప్రజల మనిషిగా పేరు పొందారు. తాజాగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆయన తరువాత ఏ పార్టీలో చేరతారు అనేది ఇంకా ప్రకటించలేదు. -
నిమ్మగడ్డ రమేష్ ఎన్నికలకు సిద్ధపడటం దారుణం..
సాక్షి, చిత్తూరు: స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం దుర్మార్గమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లాలో మంత్రి నారాయణ స్వామితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 'చంద్రబాబుకు నిమ్మగడ్డ రమేష్ తొత్తులా వ్యవహరిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయడం ఏకపక్ష నిర్ణయం. చంద్రబాబు ప్రయోజనాలు ఆశించే ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఎన్నికలను వాయిదా వేశారు. ఇప్పుడు వ్యాక్సినేషన్ దశలో ఎన్నికలు నిర్వహించాలనుకోవడం దుర్మార్గం. ఇప్పట్లో ఎన్నికలకు తాము సిద్ధంగా లేమని ప్రభుత్వ ఉపాధ్యాయులే అంటున్నారు. కానీ నిమ్మగడ్డ రమేష్ ఎన్నికలకు సిద్ధపడటం దారుణం. ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నాం' అని మంత్రులు తెలిపారు. గుంటూరు: కొంత మంది దుర్బుద్ధితో ఇళ్ల పట్టాల పంపిణీ ఆలస్యం చేయాలని చూస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన గుంటూరు జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. నూతన సంవత్సర, సంక్రాంతి కానుకగా ముఖ్యమంత్రి ఇళ్ల పట్టాలను ఇచ్చారు. ఎవరూ ఇళ్లు లేకుండా ఉండకూడదనే ఉద్దేశంతో ఇళ్ళ పట్టాలను పంపిణీ చేస్తున్నారు. అధికారం కోల్పోయిన చంద్రబాబు ఆయన తాబేదార్లు కుతంత్రంతో కోర్టులకు వెళ్ళారు. మరికొంతమంది దుర్బుద్ధితో పట్టాల పంపిణీ ఆలయస్యం చేయాలని ఎన్నికల కోడ్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చదవండి: ('పుట్టుకతోనే ఎన్నికల కమిషనర్‌గా ఫీలవుతున్నాడు') ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను అందకుండా అడ్డుకోవాలని టీడీపీ, ఇతర వ్యక్తులు చేస్తున్న కార్యక్యమాలపై ప్రజలు ఆలోచన చేయాలి. ఎన్నికలు అందరికీ అవసరమే. కాదనడం లేదు. రాష్ట్రంలో పరిస్థితులపై ఆలోచన చేయాలి. కరోనాతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రజల ఆరోగ్యం కోసం కృషి చేస్తున్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా.. ఇచ్చిన మాటను నెరవేర్చడమే ముఖ్యమంత్రి ధ్యేయం. విగ్రహాలను ధ్వంసం చేస్తూ ముఖ్యమంత్రిపై ఏలెత్తి చూపాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. కులాలు, మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టే కుట్రలు చేస్తున్నారు. నీచమైన ఆలోచనలతో రాజకీయాలు చేస్తున్నారు. దేవుడు అన్నీ చూసుకుంటాడనే ఆలోచనతో జగన్ ముందుకు వెళ్తున్నారు' అని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. చదవండి: (చంద్రబాబు ఓ మానసిక రోగి: జోగి రమేష్) -
2024 నాటికి మద్య రహిత రాష్ట్రంగా ఏపీ
నెల్లూరు(క్రైమ్): మద్యపాన వ్యసనాన్ని సమాజం నుంచి దూరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, 2024 నాటికి మద్య రహిత రాష్ట్రంగా ఏపీ మారబోతోందని రాష్ట్ర మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వి.లక్ష్మణ్‌రెడ్డి పేర్కొన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అన్ని వర్గాలవారు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన నెల్లూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ► ప్రస్తుతం మద్యం విక్రయాలను గత ప్రభుత్వ హయాంలోని విక్రయాలతో పరిశీలిస్తే.. 30 శాతం మద్యం, 60 శాతం బీర్లు విక్రయాలు తగ్గాయి. 2024 నాటికి త్రీస్టార్, ఫైవ్ స్టార్ హోటల్స్‌కే మద్యం పరిమితం కానుంది. ► మద్యంలేని సమాజాన్ని సృష్టించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోంది. ఈ మహాయజ్ఞంలో అందరూ భాగస్వాములు కావాలి. ► మద్య పానంతో కలుగుతున్న నష్టాలపై, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై షార్ట్‌ఫిల్మ్‌ల పోటీలకు ఎంట్రీలను ఆహ్వానిస్తున్నాం. విజేతలకు అక్టోబర్ 2 మహాత్మగాంధీజయంతి రోజున గుంటూరులో ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్‌శాఖ మంత్రి నారాయణస్వామి చేతుల మీదుగా బహుమతులు అందజేయనున్నాం. -
‘ప్రజల కోసం కూలీగా పనిచేస్తా’
సాక్షి, వెదురుకుప్పం: ‘రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కాదు.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలో ప్రజలకు సేవలందించే కూలీగా పనిచేస్తాను’ అని డిప్యూటీ సీఎం, ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి కళత్తూరు నారాయణస్వామి అన్నారు. బుధవారం మండలంలోని పచ్చికాపల్లం సమీపంలో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కేటాయించిన స్థలాన్ని ఉప ముఖ్యమంత్రి పరిశీలించారు. అంతకు ముందు తిరుమలరాజపురం గ్రామంలో తాగునీటి బోరును ప్రారంభించి కుళాయిల ద్వారా నీటిని సరఫరా చేశా రు. అనంతరం వివిధ∙శాఖాధికారులతో సమస్యలపై సమీక్షించారు. (ఎంపీ రంగయ్యకు ప్రధాని మోదీ లేఖ ) రూ.15 కోట్లతో డిగ్రీ కళాశాల అభివృద్ధి.. కొత్తగా మంజూరైన వైఎస్సార్ డిగ్రీ కళాశాల అభివృద్ధికి సంబంధించి రూ.15 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చెప్పారు. ఇది జిల్లాలోనే మోడల్ డిగ్రీ కళాశాలగా రూపుదిద్దుకోనుందన్నారు. ప్రజాసంకల్ప పాదయాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మండలానికి డిగ్రీ కళాశాల కావాలని తాను అడిగినట్లు తెలిపారు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే మండలంలో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు అనుమతిచ్చినట్లు తెలిపారు. డిగ్రీ కళాశాల ఏర్పాటుకు సంబంధించిన భూమిని అనుభవిస్తున్న రైతులకు న్యాయం చేయాలన్నారు. స్వచ్ఛందంగా ముందుకొచి్చన వారికి ప్రభుత్వ భూమి, ఇంటి స్థలాలు ఇచ్చి ఆదుకోవాలని తహసీల్దార్ కులశేఖర్‌ను ఆదేశించారు. (వాషింగ్టన్లో మహాత్మ గాంధీ విగ్రహం ధ్వంసం) డిగ్రీ కళాశాలకు కేటాయించిన స్థలాన్ని పరిశీలిస్తున్న ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి సాగునీటి కొరత నివారణకు చర్యలు గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో సాగునీటి కొరత నివారణ తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. కార్వేటినగరం మండలంలోని కృష్ణాపురం రిజర్వాయర్ పరిధిని పెంచి తద్వారా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చెప్పారు. వావిల్ చేను సమీపంలో ప్రాజెక్టు నిర్మించి రైతులకు నీళ్లందిస్తామన్నారు. నీటి సమస్య నివారణకు రూ. 225 కోట్లతో ప్రతిపాదనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. డిగ్రీ కళాశాల ప్రత్యేకాధికారి ఎస్. విజయలు రెడ్డి, హౌసింగ్ పీడీ నగేష్, డ్వామా పీడీ చంద్రశేఖర్, ఎంపీడీఓ సుధాకరరావు, సీఐ సురేంద్రరెడ్డి, జె డ్పీటీసీ సి.సుకుమార్, కళాశాల అభివృద్ధి కమి టీ చైర్మన్ బండి గోవర్ధన్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి ఢిల్లీ ప్రసాద్,నాయకులు బి.సుబ్రమణ్యం, పేట ధనుంజయరెడ్డి కే. పద్మనాభరెడ్డి పాల్గొన్నారు. (ఢిల్లీలో మరోసారి భూప్రకంపనలు ) -
'చంద్రబాబును రాష్ట్ర ప్రజలు క్షమించరు'
సాక్షి, తిరుపతి: ఎన్నికల కమిషన్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి ధ్వజమెత్తారు. తిరుపతిలో మంత్రి నారాయణస్వామి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఎన్నికలను వాయిదా వేయడం దారుణమని మండిపడ్డారు. చంద్రబాబు డైరెక్షన్లో ఈసీ రమేష్‌కుమార్ నడుస్తున్నారని, ఇందుకు బాబు మాటలే నిదర్శనమన్నారు. ఎన్నికలు ఆగిపోతే కేంద్ర నిధులు నిలిచిపోతాయని, దీని వల్ల రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలుగుతుందన్నారు. చదవండి: ‘అందుకే విలువలు లేని టీడీపీని వీడా’ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకొని ప్రజలను ఇబ్బందులపాలు చేయాలనే కుట్రతోనే ఈసీతో చేతులు కలిపి చంద్రబాబు ఎన్నికలు వాయిదా వేయించాడని ధ్వజమెత్తారు. స్థానిక ఎన్నికల్లో మద్యం, డబ్బు ప్రభావం లేకుండా, రాజకీయ వ్యవస్థలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో సీఎం విప్లవాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకునేందుకు టీడీపీ మొదటి నుంచి కుట్ర పన్నుతోందని మండిపడ్డారు. చంద్రబాబును రాష్ట్ర ప్రజలు క్షమించరని హెచ్చరించారు. చదవండి: ఎన్నికల వాయిదాకే గెలిచినట్టు ఫీలవుతున్నారు -
సీఎం జగన్ రైతుల పక్షపాతి : నారాయణ స్వామి
-
‘అందుకోసమే చంద్రబాబు డ్రామాలు’
సాక్షి, తిరుపతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజధాని రైతులకు న్యాయం చేస్తారని, ఆయన రైతుల పక్షపాతి అని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయటమే సీఎం జగన్ లక్ష్యమని పేర్కొన్నారు. శనివారం నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ.. ‘ ముఖ్యమంత్రి జగన్ 7 నెలల్లోనే 90 శాతం హామీలను నెరవేర్చారు. మూడు రాజధానుల ప్రతిపాదనను అన్ని వర్గాలు హర్షిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు తాత్కాలిక భవనాలు కట్టడం తప్ప ఏమీ చేయలేదు. తన ఆస్తులను కాపాడుకోవటం కోసమే చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారు. తన స్వార్థం కోసం చంద్రబాబు ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. పేదలు, విద్య, వైద్యం కోసం చంద్రబాబు ఎప్పుడూ ఆలోచించలేదు. పేదపిల్లల చదువుకోసం వైఎస్ జగన్ అమ్మ ఒడి పథకం తీసుకొచ్చారు. మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారం ఉండేలా మెను మార్పు చేశాం. వైద్యం ఖర్చు రూ. వెయ్యి దాటితే ఆరోగ్య శ్రీ వర్తింపజేస్తున్నా’మని తెలిపారు. -
జగనన్న పాలన చూసి బాబు వెన్నులో వణుకు
శ్రీరంగరాజపురం(చిత్తూరు జిల్లా): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగు నెలల పాలన చూసి చంద్రబాబునాయుడికి వెన్నులో వణుకు పుడుతోందని ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి అన్నారు. శుక్రవారం చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలం నెళవాయి గ్రామంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘చంద్రబాబు.. మీ పాలనలో ప్రజా సొమ్మును దోచుకోవడంతో ప్రజలు ప్రతిపక్ష పదవి కట్టబెట్టారు. ఏనాడూ ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చలేదు. అదే ప్రస్తుత సీఎం జగన్మోహన్రెడ్డి విశేష రీతిలో సంక్షేమ పథకాల అమలులో దూసుకుపోతున్న నేపథ్యంలో మీకు మనోవేదన వచి్చంది. త్వరలో మీ పార్టీ, మీ నాయకులు అడ్రస్ లేకుండా పోతారు. రివర్స్ టెండరింగ్‌తో రాష్ట్రానికి వేల కోట్ల ఆదాయం వస్తే మీకు వచ్చే నష్టమేమి? నేడు రైతులకు అందించిన రైతు భరోసా, ఇండ్ల స్థలాలు పంపిణీ, వార్డు వలంటీర్ల ఎంపిక, సచివాలయ ఉద్యోగాలను మా నేత పారదర్శకంగా అమలు చేశారు’ అని అన్నారు. బ్యాంకు మేనేజర్లు రైతుల ఖాతాలో పడిన రైతు భరోసా డబ్బును పాత అప్పులకు జమచేయడం సమంజసం కాదని నారాయణస్వామి సూచించారు. -
‘మీరు దళిత ఎంపీ.. మా గ్రామానికి రావద్దు’
సాక్షి, బెంగళూరు: దేశంలో కులవివక్ష జాఢ్యం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎప్పుడూ ఎక్కడో ఓ చోట అణగారిన వర్గాలపై వివక్ష చూపిస్తూనే ఉన్నారు. అల్ప కులస్తులను చిన్నచూపు చూస్తున్నారు. అయితే ఈ వివక్ష సామాన్య ప్రజలనే కాక ప్రజా ప్రతినిధులను సైతం వెంటాడుతోంది. తాజాగా కర్ణాటకలో బీజేపీ ఎంపీ దళితుడైనందున తమ గ్రామంలోకి అడుగుపెట్టొద్దని గ్రామస్తులు తీవ్ర అవమానానికి గురిచేశారు. వివరాలు.. బీజేపీ ఎంపీ నారాయణ స్వామి కర్ణాటకలోని చిత్రదుర్గ లోక్‌సభ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వర్షాకాలం కావడంతో తన లోక్‌సభ పరిధిలోని తూమకూరు జిల్లా పావగడ తాలూకులో పర్యటించారు. గ్రామంలో మెడికల్ క్యాంపును నిర్వహించేందుకు వైద్య బృందాన్ని కూడా తన వెంట తీసుకెళ్లారు. అయితే వీరికి స్థానికులు (ఓ కులానికి చెందిన వారు) నుంచి అనుకోని ఘటనను ఎదుర్కొవల్సి వచ్చింది. ‘మా గ్రామంలోకి దళితులు, అల్ప కులస్తులు రావడానికి వీళ్లేదు. మీరు అంటరానివారు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపొండి’ అంటూ ఎంపీ బృందాన్ని తీవ్ర అవమానానికి గురిచేశారు. గ్రామంలో ఎంట్రీకి స్థానికులు అనుమతించకపోవడంతో గత్యంతరం లేక ఎంపీ అక్కడి నుంచి వెనుదిరిగారు. అయితే ఆ గ్రామంలోని వారంత ఒకే వర్గానికి (గొల్ల) చెందిన వారిగా తెలుస్తోంది. ప్రజా ప్రతినిధులకే ఇలాంటి ఘటన ఎదురైన తమలాంటి వారి పరిస్థితి ఏంటని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎస్పీ ఘటనపై విచారణకు ఆదేశించారు. -
కౌలు రైతులకు రుణాలు పంపిణీ చేసిన ఉపముఖ్యమంత్రి
సాక్షి, చిత్తూరు అర్బన్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రైతుపక్షపాతి. వారికి ఏ కష్టమొచ్చినా నేనున్నానంటూ చాటిచెప్పేవారు. ఎలాంటి నష్టమొచ్చినా అండగా నిలిచేవారు. అందుకే ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం రైతు దినోత్సవంగా నామకరణం చేసింది. రైతు రాజ్య మని చాటిచెప్పింది. సోమవారం వైఎస్సార్ జయంతి సందర్భంగా జిల్లాలోని అన్ని మండల కేంద్రాలు, పట్టణాల్లో వైఎస్సార్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు సేవా కార్యక్రమాలను మిన్నంటించారు. వైఎస్ఆర్ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. గంగాధరనెల్లూరులో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆధ్వర్యంలో ఐదుగురు రైతులకు సన్మానం చేశారు. కలెక్టర్ నారాయణభరత్ గుప్త, అధికారులు, పార్టీ నేతలు పాల్గొన్నారు. స్వయం సహాయక సంఘాలకు రూ.14 కోట్లు, కౌలు రైతులకు రూ.40 లక్షల రుణాలను అందజేశారు. నియోజకవర్గ పరిధిలోని 217 పంచాయతీల్లో వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించారు. గంగాధర నెల్లూరులో కౌలు రైతులకు రుణాలు పంపిణీ చేస్తున్నఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, కలెక్టర్ నారాయణ భరత్ గుప్త తిరుపతిలో పింఛన్లుపంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి,ఎమ్మెల్సీ, యండపల్లి శ్రీనివాసులు రెడ్డి, తిరుపతి నగర కమిషనర్ గిరీషా ♦ తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో అక్కారాంపల్లెలో రైతు దినోత్సవం నిర్వహించి ఐదుగురు ఆదర్శరైతులను సన్మానించారు. ఆటోనగర్‌లో జరిగిన కార్యక్రమంలో పింఛన్లను పంపిణీ చేశారు. తుడా సర్కిల్ వద్ద ఇమాంసాహెబ్, నరేంద్రనాథ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. బైరాగిపట్టెడలో విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. పలుచోట్ల సేవా కార్యక్రమాలు చేపట్టారు. ♦ చంద్రగిరిలో ప్రభుత్వ విప్, తుడా చైర్మన్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. రైతులకు వ్యవసాయ పరికరాలను అందించారు. పెంచిన వైఎస్సార్ భరోసా కానుకలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. పలు ప్రాంతాల్లో కేక్ కట్ చేశారు. రూ.18.86 కోట్ల రుణాలను మహిళా సంఘాలకు అందజేశారు. ♦ నగరి నియోజకవర్గంలో జరిగిన రైతు దినోత్సవంలో ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు. నలుగురు ఆదర్శ రైతులకు దుశ్శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. ♦ పీలేరులో జరిగిన రైతు దినోత్సవంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఉత్తమ రైతుల ను సన్మానించి వారికి ప్రశంసాపత్రాలను పంపిణీ చే శారు. అనంతరం నిర్వహించిన రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీచేశారు. విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. ♦ చిత్తూరులో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆధ్వర్యంలో చిత్తూరు నగరంలో లబ్ధిదారులకు పింఛన్ అందచేశారు. గుడిపాల, చిత్తూరు రూరల్ మండలాల్లో పర్యటించి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డికి నివాళులర్పించారు. బుల్లెట్ సురేష్ ఆధ్వర్యంలో కేక్‌కట్ చేసి, పేదలకు అన్నదానం చేయగా, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గాయత్రీదేవి ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో అన్నదానం చేశారు. ♦ మదనపల్లెలో జరిగిన రైతు దినోత్సవంలో ఎమ్మెల్యే మహమ్మద్ నవాజ్ బాషా, సబ్ కలెక్టర్ చేకూరి కీర్తి పాల్గొన్నారు. ఆరుగురు ఉత్తమ రైతులను సన్మానిం చారు. అనంతరం కౌలు రైతులకు చెక్కులను అందించారు. ఆధునిక యంత్రాలతో కూడిన స్టాల్స్‌ను ఏర్పాటుచేశారు. వైఎస్సార్ పింఛన్ కానుక కార్యక్రమంలో లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. ♦ పలమనేరు నియోజకవర్గంలో రైతు దినోత్సవంలో ఎమ్మెల్యే వెంకటేగౌడ ఆధ్వర్యంలో పట్టుపరిశ్రమ రైతులకు ప్రోత్సాహకాలను అందించారు. ఐదుగురు ఉత్తమ రైతులను సన్మానించారు. స్టాల్స్‌ను ఏర్పాటుచేశారు. 400గ్రూపులకు బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి కింద రూ.22 కోట్లు చెక్కులను అందించారు. ♦ పూతలపట్టు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎం.ఎస్.బాబు ఆధ్వర్యంలో రైతు దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం ఆరుగురు ఆదర్శ రైతులను సన్మానించారు. రైతు దినోత్సవంలో భాగంగా స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. వైఎస్సార్ భరోసా కార్యక్రమంలో లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. రూ.2.49 కోట్ల రుణాలను మహిళా సంఘాలకు అందచేశారు. ♦ సత్యవేడు నియోజకవర్గంలో రైతు దినోత్సవంలో ఎమ్మెల్యే ఆదిమూలం పాల్గొన్నారు. రైతు దినోత్సవంలో భాగంగా స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 12 మంది ఆదర్శ రైతులను సన్మానించారు. అనంతరం లబ్ధిదారులకు పింఛన్లు ఇచ్చారు. విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. ♦ తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి ఆధ్వర్వంలో రైతు దినోత్సవం కార్యక్రమం జరిగింది. ఆరుగురు ఆదర్శ రైతులను సన్మానించి, ప్రశంసాపత్రాలను అందించారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం లబ్ధిదారులకు ఎమ్మెల్యే పింఛన్లను పంపిణీ చేశారు. ♦ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతు దినోత్సవం నిర్వహించి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. నలుగురు ఆదర్శరైతులను సన్మానించారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. రూ.19.35 కోట్ల రుణాలను మహిళా సంఘాలకు అందచేశారు. ♦ పుంగనూరులో రాష్ట్ర పార్టీ కార్యదర్శి పెద్దిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్, మాజీ ఎంపీపీ నరసింహులు, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆరుగురు ఆదర్శ రైతులను సన్మానించి, ప్రశంసాపత్రాలను అందించారు. అనంతరం లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. పుంగనూరులో జరిగిన కార్యక్రమంలో ముని సిపల్ కమిషనర్ మధుసూదన్‌రెడ్డి మునిసిపల్ ఎంప్లాయీస్ యూని యన్ నాయకులు ఫకృద్దీన్ షరీఫ్ పాల్గొన్నారు. ♦ కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురంలో రైతు దినోత్సవ కార్యక్రమంలో అధికారులు లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. రూ.16.54 కోట్ల రుణాలను మహిళా సంఘాలకు అందజేశారు. -
తిరుపతి పలమనేరు ఘటన బాధాకరం