నగరి వైఎస్‌ఆర్ విగ్రహానికి పుష్పాలంకరణ
సాక్షి, చిత్తూరు అర్బన్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రైతుపక్షపాతి. వారికి ఏ కష్టమొచ్చినా నేనున్నానంటూ చాటిచెప్పేవారు. ఎలాంటి నష్టమొచ్చినా అండగా నిలిచేవారు. అందుకే ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం రైతు దినోత్సవంగా నామకరణం చేసింది. రైతు రాజ్య మని చాటిచెప్పింది. సోమవారం వైఎస్సార్ జయంతి సందర్భంగా జిల్లాలోని అన్ని మండల కేంద్రాలు, పట్టణాల్లో వైఎస్సార్‌సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు సేవా కార్యక్రమాలను మిన్నంటించారు. వైఎస్‌ఆర్ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. గంగాధరనెల్లూరులో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆధ్వర్యంలో ఐదుగురు రైతులకు సన్మానం చేశారు. కలెక్టర్ నారాయణభరత్ గుప్త, అధికారులు, పార్టీ నేతలు పాల్గొన్నారు. స్వయం సహాయక సంఘాలకు రూ.14 కోట్లు, కౌలు రైతులకు రూ.40 లక్షల రుణాలను అందజేశారు. నియోజకవర్గ పరిధిలోని 217 పంచాయతీల్లో వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించారు.
గంగాధర నెల్లూరులో కౌలు రైతులకు రుణాలు పంపిణీ చేస్తున్నఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, కలెక్టర్ నారాయణ భరత్ గుప్త
తిరుపతిలో పింఛన్లుపంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి,ఎమ్మెల్సీ, యండపల్లి శ్రీనివాసులు రెడ్డి, తిరుపతి నగర కమిషనర్ గిరీషా
♦ తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో అక్కారాంపల్లెలో రైతు దినోత్సవం నిర్వహించి ఐదుగురు ఆదర్శరైతులను సన్మానించారు. ఆటోనగర్‌లో జరిగిన కార్యక్రమంలో పింఛన్లను పంపిణీ చేశారు. తుడా సర్కిల్ వద్ద ఇమాంసాహెబ్, నరేంద్రనాథ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. బైరాగిపట్టెడలో విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. పలుచోట్ల సేవా కార్యక్రమాలు చేపట్టారు.
♦ చంద్రగిరిలో ప్రభుత్వ విప్, తుడా చైర్మన్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. రైతులకు వ్యవసాయ పరికరాలను అందించారు. పెంచిన వైఎస్సార్ భరోసా కానుకలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. పలు ప్రాంతాల్లో కేక్ కట్ చేశారు. రూ.18.86 కోట్ల రుణాలను మహిళా సంఘాలకు అందజేశారు.
♦ నగరి నియోజకవర్గంలో జరిగిన రైతు దినోత్సవంలో ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు. నలుగురు ఆదర్శ రైతులకు దుశ్శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు.
♦ పీలేరులో జరిగిన రైతు దినోత్సవంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఉత్తమ రైతుల ను సన్మానించి వారికి ప్రశంసాపత్రాలను పంపిణీ చే శారు. అనంతరం నిర్వహించిన రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీచేశారు. విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు.
♦ చిత్తూరులో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆధ్వర్యంలో చిత్తూరు నగరంలో లబ్ధిదారులకు పింఛన్ అందచేశారు. గుడిపాల, చిత్తూరు రూరల్ మండలాల్లో పర్యటించి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డికి నివాళులర్పించారు. బుల్లెట్ సురేష్ ఆధ్వర్యంలో కేక్‌కట్ చేసి, పేదలకు అన్నదానం చేయగా, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గాయత్రీదేవి ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో అన్నదానం చేశారు.
♦ మదనపల్లెలో జరిగిన రైతు దినోత్సవంలో ఎమ్మెల్యే మహమ్మద్ నవాజ్ బాషా, సబ్ కలెక్టర్ చేకూరి కీర్తి పాల్గొన్నారు. ఆరుగురు ఉత్తమ రైతులను సన్మానిం చారు. అనంతరం కౌలు రైతులకు చెక్కులను అందించారు. ఆధునిక యంత్రాలతో కూడిన స్టాల్స్‌ను ఏర్పాటుచేశారు. వైఎస్సార్ పింఛన్ కానుక కార్యక్రమంలో లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు.
♦ పలమనేరు నియోజకవర్గంలో రైతు దినోత్సవంలో ఎమ్మెల్యే వెంకటేగౌడ ఆధ్వర్యంలో పట్టుపరిశ్రమ రైతులకు ప్రోత్సాహకాలను అందించారు. ఐదుగురు ఉత్తమ రైతులను సన్మానించారు. స్టాల్స్‌ను ఏర్పాటుచేశారు. 400గ్రూపులకు బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి కింద రూ.22 కోట్లు చెక్కులను అందించారు.
♦ పూతలపట్టు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎం.ఎస్.బాబు ఆధ్వర్యంలో రైతు దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం ఆరుగురు ఆదర్శ రైతులను సన్మానించారు. రైతు దినోత్సవంలో భాగంగా స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. వైఎస్సార్ భరోసా కార్యక్రమంలో లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. రూ.2.49 కోట్ల రుణాలను మహిళా సంఘాలకు అందచేశారు.
♦ సత్యవేడు నియోజకవర్గంలో రైతు దినోత్సవంలో ఎమ్మెల్యే ఆదిమూలం పాల్గొన్నారు. రైతు దినోత్సవంలో భాగంగా స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 12 మంది ఆదర్శ రైతులను సన్మానించారు. అనంతరం లబ్ధిదారులకు పింఛన్లు ఇచ్చారు. విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు.
♦ తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి ఆధ్వర్వంలో రైతు దినోత్సవం కార్యక్రమం జరిగింది. ఆరుగురు ఆదర్శ రైతులను సన్మానించి, ప్రశంసాపత్రాలను అందించారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం లబ్ధిదారులకు ఎమ్మెల్యే పింఛన్లను పంపిణీ చేశారు.
♦ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతు దినోత్సవం నిర్వహించి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. నలుగురు ఆదర్శరైతులను సన్మానించారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. రూ.19.35 కోట్ల రుణాలను మహిళా సంఘాలకు అందచేశారు.
♦ పుంగనూరులో రాష్ట్ర పార్టీ కార్యదర్శి పెద్దిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్, మాజీ ఎంపీపీ నరసింహులు, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆరుగురు ఆదర్శ రైతులను సన్మానించి, ప్రశంసాపత్రాలను అందించారు. అనంతరం లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. పుంగనూరులో జరిగిన కార్యక్రమంలో ముని సిపల్ కమిషనర్ మధుసూదన్‌రెడ్డి మునిసిపల్ ఎంప్లాయీస్ యూని యన్ నాయకులు ఫకృద్దీన్ షరీఫ్ పాల్గొన్నారు.
♦ కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురంలో రైతు దినోత్సవ కార్యక్రమంలో అధికారులు లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. రూ.16.54 కోట్ల రుణాలను మహిళా సంఘాలకు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment