
నెల్లూరు(క్రైమ్): మద్యపాన వ్యసనాన్ని సమాజం నుంచి దూరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, 2024 నాటికి మద్య రహిత రాష్ట్రంగా ఏపీ మారబోతోందని రాష్ట్ర మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వి.లక్ష్మణ్‌రెడ్డి పేర్కొన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అన్ని వర్గాలవారు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన నెల్లూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..
► ప్రస్తుతం మద్యం విక్రయాలను గత ప్రభుత్వ హయాంలోని విక్రయాలతో పరిశీలిస్తే.. 30 శాతం మద్యం, 60 శాతం బీర్లు విక్రయాలు తగ్గాయి. 2024 నాటికి త్రీస్టార్, ఫైవ్ స్టార్ హోటల్స్‌కే మద్యం పరిమితం కానుంది.
► మద్యంలేని సమాజాన్ని సృష్టించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోంది. ఈ మహాయజ్ఞంలో అందరూ భాగస్వాములు కావాలి.
► మద్య పానంతో కలుగుతున్న నష్టాలపై, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై షార్ట్‌ఫిల్మ్‌ల పోటీలకు ఎంట్రీలను ఆహ్వానిస్తున్నాం. విజేతలకు అక్టోబర్ 2 మహాత్మగాంధీజయంతి రోజున గుంటూరులో ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్‌శాఖ మంత్రి నారాయణస్వామి చేతుల మీదుగా బహుమతులు అందజేయనున్నాం.
Comments
Please login to add a commentAdd a comment