lakshman reddy
-
77 ఏళ్ల వయసులో 1.5 కి.మీ. స్విమ్మింగ్
కంటోన్మెంట్: ఎమ్మెల్లార్ విద్యాసంస్థల చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి 77ఏళ్ల వయసులో అరుదైన రికార్డు సాధించారు. ట్రయథ్లాన్ చాంపియన్‌గా పేరొందిన ఆయన ఇటీవల మహరాష్ట్ర లోనావాలాలో జరిగిన స్విమ్మింగ్ పోటీల్లో 1.5 కిలో మీటర్ల దూరం ఈది సరికొత్త ఘనత సాధించారు. యువతకు స్ఫూర్తి కలిగించాలన్న లక్ష్యంతోనే తాను ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ వెటరన్ స్పోర్ట్స్ జరిగినా హాజరవుతానని అన్నారు. ఇప్పటికీ నిరంతరం వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ చేస్తూ ఉంటానని అన్నారు. యువత ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. శరీరంపై పట్టు సాధిస్తే జీవితంలో ఏదైనా సాధించే అవకాశం కలుగుతుందన్నారు. క్రీడల వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక వికాసమూ కలుగుతుందన్నారు. (చదవండి: టు లెట్.. టేక్ కేర్) -
Kommareddy Raja Mohan Rao: ప్రగతిశీల వైద్య శిఖామణి
మానవతావాది, పూర్వ ఉపకులపతి, ప్రజా వైద్యులు, అభ్యుదయవాదిగా 86 సంవత్సరాల జీవితాన్ని గడిపిన డాక్టర్ కొమ్మారెడ్డి రాజా రామమోహన్ రావు పశ్చిమగోదావరి జిల్లా పోతునూరులో 1922లో జన్మించారు. 1951 నుండి 1980 వరకు గడిపిన వైద్యరంగ జీవితం చిరస్మరణీయం. సింగరేణి కాలరీస్ వైద్యాధికారిగా 200 పడకల ఆసుపత్రిని నిర్మించి సింగరేణి కాలరీలో పనిచేస్తున్న 60 వేల మంది కార్మికులకు ఆధునిక వైద్యాన్ని అందించారు. సింగరేణి బొగ్గు గనుల చుట్టుపక్కల గ్రామాలను దత్తత తీసుకొని ఉచిత వైద్యాన్ని అందించారు. గుంటూరు మెడికల్ కాలేజీ, సిద్ధార్థ మెడికల్ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేసి ఆయా కళాశాలల అభివృద్ధికి పునాదులు వేశారు. 1982–86 మధ్య ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా విద్యా రంగంలో పలు మార్పులు, సవరణలకు కారకులయ్యారు. దేశంలో ప్రప్రధమంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ‘శాస్త్రీయ సోషలిజం అధ్యయన కేంద్రా’న్ని నెలకొల్పిన ఘనత ఆయనకే దక్కుతుంది. అలాగే ‘మహాయాన బౌద్ధ కేంద్రం’ కూడా ఆయన పదవీ కాలంలోనే నెలకొల్పబడింది. సర్జన్స్ అంతర్జాతీయ కాలేజ్, ఇంటర్నేషనల్ మెడికల్ స్టడీస్ అకాడమీ, భారత సర్జన్ల సంఘం, భారత యూరోలాజికల్ సొసైటీ, ఇండి యన్ మెడికల్ అసోసియేషన్, జెనీటో– యూరినరీ సర్జరీ(అమెరికా) శిక్షణాబోర్డు తదితర సంఘాలలో అనేక బాధ్యతలు నిర్వహించారు. ఇంగ్లండ్, అమెరికా, జపాన్ తదితర చోట్ల జరిగిన వైద్య సభలకు హాజరయ్యారు. అటు వైద్యరంగానికీ, ఇటు విద్యారంగ వ్యాప్తికీ రామమోహన్ రావు చేసిన కృషికి అనేక అవార్డులు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి. 1984లో యార్లగడ్డ రాజ్యలక్ష్మి, వెంకన్న చౌదరి కళాపీఠం తరఫున జాతీయ అవార్డు లభించింది. సామాజిక, వైద్య సేవ రంగాలలో ఆయన చేసిన కృషికిగాను 1992లో ప్రతిష్ఠాత్మకమైన డాక్టర్ బీసీ రాయ్ అవార్డును పొందారు. శాస్త్రవిజ్ఞానాన్ని గ్రామ సీమలకు చేర్చాలన్న లక్ష్యంతో ‘జన విజ్ఞాన వేదిక’ ఉపాధ్యక్షులుగా పనిచేశారు. వీరి నిరాడంబర జీవితం, సరళ స్వభావం, సేవా తత్పరత, ఆపన్నుల పట్ల ఆదరణ, ప్రగతి శీల ఉద్యమాల పట్ల ఆయనకున్న నిబద్ధత వలన ఒకానొక సందర్భంలో భారత రాష్ట్రపతి పదవికి వామపక్ష అభ్యర్థిగా ఆయన పేరును పరిశీలించిన సంగతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. రాజా రామమోహన్ రావు తండ్రి కొమ్మారెడ్డి సత్యనారాయణమూర్తి 1937 లోనే శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం నుండి మద్రాసు వరకు రైతాంగ సమస్యల పరిష్కారం కోసం జరిపిన రైతు రక్షణ యాత్ర చారిత్రాత్మకం. జీవితాన్ని స్వార్థం కొరకు కాక లోకహితం కొరకు ధారపొయ్యాలన్న తండ్రి మాటను శిరోధార్యంగా తీసు కున్నారు రామమోహనరావు. ఆయన ఆశయాలను మనమూ కొనసాగిద్దాం. – వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, జనచైతన్య వేదిక, ఏపీ అధ్యక్షులు (సెప్టెంబర్ 25న కొమ్మారెడ్డి శత జయంతి సందర్భంగా గుంటూరు, వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సెమినార్ జరుగనుంది) -
‘అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సీఎం జగన్ న్యాయం చేస్తున్నారు’
ఒంగోలు/నెల్లూరు (సెంట్రల్): వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పట్నుంచి పేదల సంక్షేమానికి ప్రత్యేక పథకాలు రూపొందిస్తున్న సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతగా పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, మద్య నియంత్రణ కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణ్‌రెడ్డి చెప్పారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో అంతకంటే ఎక్కువగా పట్టణ ఓటర్లు కృతజ్ఞత చూపేందుకు ముందుకు రావాలని కోరారు. శనివారం ప్రకాశం జిల్లా ఒంగోలులోని ప్రెస్‌క్లబ్, నెల్లూరులోని మాగుంట లే అవుట్‌లోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కరోనా కష్ట కాలంలోనూ ఆకలి మరణాలు లేకుండా ప్రతి ఇంటికీ ఏదో ఒక పథకం రూపంలో నగదు అందించడం ద్వారా ఆ కుటుంబాలు ఆర్థిక సంక్షోభానికి గురికాకుండా తట్టుకోగలిగాయని లక్ష్మణరెడ్డి స్పష్టం చేశారు. ఓటు ఎవరికి వేశారనే దానితో సంబంధం లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తున్నారని చెప్పారు. ఏపీ దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు పాలడుగు విజేంద్ర బహుజన్, జనచైతన్య వేదిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
2024 నాటికి మద్య రహిత రాష్ట్రంగా ఏపీ
నెల్లూరు(క్రైమ్): మద్యపాన వ్యసనాన్ని సమాజం నుంచి దూరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, 2024 నాటికి మద్య రహిత రాష్ట్రంగా ఏపీ మారబోతోందని రాష్ట్ర మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వి.లక్ష్మణ్‌రెడ్డి పేర్కొన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అన్ని వర్గాలవారు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన నెల్లూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ► ప్రస్తుతం మద్యం విక్రయాలను గత ప్రభుత్వ హయాంలోని విక్రయాలతో పరిశీలిస్తే.. 30 శాతం మద్యం, 60 శాతం బీర్లు విక్రయాలు తగ్గాయి. 2024 నాటికి త్రీస్టార్, ఫైవ్ స్టార్ హోటల్స్‌కే మద్యం పరిమితం కానుంది. ► మద్యంలేని సమాజాన్ని సృష్టించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోంది. ఈ మహాయజ్ఞంలో అందరూ భాగస్వాములు కావాలి. ► మద్య పానంతో కలుగుతున్న నష్టాలపై, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై షార్ట్‌ఫిల్మ్‌ల పోటీలకు ఎంట్రీలను ఆహ్వానిస్తున్నాం. విజేతలకు అక్టోబర్ 2 మహాత్మగాంధీజయంతి రోజున గుంటూరులో ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్‌శాఖ మంత్రి నారాయణస్వామి చేతుల మీదుగా బహుమతులు అందజేయనున్నాం. -
అభివృద్ధి అంటే.. భూముల విక్రయం కాదు
సాక్షి, విశాఖపట్నం: దేశంలోనే అత్యంత వెనుకబడిన జిల్లాల్లో శ్రీకాకుళం, విజయనగరం, కడప, అనంతపురం ఉన్నాయని మద్యపాన నిషేధ ప్రచార కమిటీ చైర్మన్ పి.లక్ష్మణరెడ్డి అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారానే ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి సాధ్యమని ఆయన తెలిపారు. జిల్లాలోని పబ్లిక్ లైబ్రరీలో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ‘వికేంద్రీకరణతోనే సమాజ ప్రగతి’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో లక్ష్మణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓకే ప్రాంతం అభివృద్ధిగా అడుగులు వేస్తే భవిష్యత్తులో వేర్పాటువాద ఉద్యమాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. రాజధాని కోసం రూ. లక్షా 50 వేల కోట్లు అవసరం అవుతుంది. అంత పెద్ద మొత్తం ఒకే చోట వెచ్చించడం ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ చదవండి: వికేంద్రీకరణతోనే సమాజ ప్రగతి విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని ఏర్పాటు చేస్తే కేవలం ఐదు నుంచి పది వేల కోట్లతో రాజధాని నిర్మాణం పూర్తవుతుందని లక్ష్మారెడ్డి వివరించారు. విశాఖకు ఉన్న నైసర్గిక స్వరూపాన్ని బట్టి రాజధానిగా ఏర్పాటు చేస్తే.. ప్రపంచంలోనే ఉన్నత స్థాయి నగరంగా ఎదిగే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. గతంలో అమరావతి గ్రాఫిక్ చూపించి కోట్లాది రూపాయల విలువ చేసే భూములను కొందరు స్వాధీనం చేసుకున్నారని ఆయన మండిపడ్డారు. అభివృద్ధి అంటే భూముల విక్రయం, విలువ ద్వారా సాధ్యం కాదని లక్ష్మణరెడ్డి తెలిపారు. అదేవిధంగా ఈ సదసస్సులో పాల్గొన్న ప్రొఫెసర్ కేసీ రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి ఎప్పుడు భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా చేయాలన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి రింగ్ రోడ్డు నిర్మించినప్పుడు కొందరు నవ్వారని.. ఇప్పుడు అది హైదరాబాద్ ప్రజలకు జీవనాధారం అయిందని గుర్తు చేశారు. పేరుకు అమరావతి రాజధాని అయినా రాజధాని ఎక్కడో దూరంగా ఉందన్నారు. శివరామకృష్ణన్ కమిటీలో ఎక్కడా అమరావతి ప్రస్తావన లేదని ప్రొఫెసర్ కేసీ రెడ్డి తెలిపారు. చాలా కమిటీ నివేదికల్లో అమరావతి రాజధాని నిర్మాణం వలన ఇబ్బందులు ఉన్నాయని ప్రస్తావించడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. విశాఖను అభివృద్ధి చేయలన్నది సీఎం జగన్ ఆలోచన అని.. విశాఖ ప్రజలు అభివృద్ధి ఎవరు చేసినా ఆహ్వానిస్తారని ప్రొఫెసర్ కేసీ రెడ్డి తెలిపారు. ఈ సదస్సులో పాల్గొన్న ప్రొఫెసర్ కేఎస్ చలం మాట్లాడుతూ.. 1953లోనే విశాఖలో రాజధాని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన జరిగిందని ఆయన గుర్తు చేశారు. నర్మదా, గోదావరి నదుల జలాలు విశాఖ తూర్పు కనుమల్లోని నీరని అన్నారు. గోదావరి జిల్లాలో రెండో పంటకు సీలేరు నీరే ఆధారమని ఆయన చెప్పారు. గోదావరి పుష్కరాలలో నీరు లేనప్పుడు.. చంద్రబాబు నాయుడు స్నానం చేసిన నీరు సీలేరు నుంచి విడిచిపెట్టినవని ఆయన గుర్తు చేశారు. ఆంధ్రుల రాజధానిగా అమరావతి, కర్నూలు, విశాఖను అభివృద్ధి చేస్తే అభ్యంతరాలు ఏమిటని ప్రొఫెసర్ కేఎస్ చలం ప్రశ్నించారు. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతాలు ఉత్తరాంధ్రలో ఉన్నాయని.. విశాఖ కేంద్రంగా రాజధాని ఏర్పాటు నిర్ణయాన్నిఉత్తరాంధ్ర ప్రజలు స్వాగతిస్తున్నారని కేఎస్ చలం తెలిపారు. -
వికేంద్రీకరణతోనే సమాజ ప్రగతి
సాక్షి, డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): వికేంద్రీకరణతోనే సమాజ ప్రగతి సాధ్యమని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, మద్యపాన నిషేధ ప్రచార కమిటీ చైర్మన్ పి.లక్ష్మణరెడ్డి అభిప్రాయపడ్డారు. వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి, పాలన వికేంద్రీకరణతో ప్రాంతీయ అసమానతలు తగ్గుతాయని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రగతిని దృష్టిలో పెట్టుకుని తీసుకుంటున్న చర్యలు అమోఘమని కొనియాడారు. గ్రామ సచివాలయాల ఏర్పాటు చరిత్రలో లిఖించదగ్గదని కొనియాడారు. నెల రోజుల వ్యవధిలో దాదాపు 4 లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టారన్నారు. రాజధానిగా అమరావతి అంత శ్రేయస్కరం కాదని మేధావులు, విద్యావేత్తలు, కమిటీలు చెప్పినప్పటికీ గత ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని ఆక్షేపించారు. మూడు పంటలు పండే ప్రాంతాన్ని రియల్ ఎస్టేట్‌గా చంద్రబాబు ప్రభుత్వం మార్చిందని విమర్శించారు. రాష్ట్రానికి మధ్యలో ఉందని అమరావతిని రాజధాని చేయడం సరికాదన్నారు. అంతర్జాతీయ స్థాయిలోనే ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగిందని ఆరోపించారు. అదీ కూడా ఒక సామాజిక వర్గం కోసమే చంద్రబాబు అక్కడ రాజధాని ప్రకటించారని దుయ్యబట్టారు. అభివృద్ధి కాని ప్రాంతంలో లక్షల కోట్లు వెచ్చించి రాజధాని నిర్మించే కన్నా.. వనరులన్నీ సమృద్ధిగా ఉన్న విశాఖపట్నంలో ఐదారు వేల కోట్లతో హైదరాబాద్, ముంబయి తలదన్నిన రాజధానిని ఏర్పాటు చేసుకోవచ్చని భావించి ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. రాష్ట్రం అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్‌గా మారాలంటే సాగునీటి ప్రాజెక్టులకు అధిక నిధులు వెచ్చించాలన్నారు. రాష్ట్ర సమతుల్యాభివృద్ధికి ప్రతిపక్షాలు అడ్డుపడకుండా వికేంద్రీకరణను స్వాగతించాలని ఆయన హితవు పలికారు. అంబేడ్కర్ యూనివర్సిటీ మాజీ వీసీ లజపతిరాయ్ మాట్లాడుతూ వికేంద్రీకరణపై ప్రజల్లో చైతన్యం బాగా వచ్చిందన్నారు. వికేంద్రీకరణ అనేది ఇప్పటిది కాదని 1953లోనే ప్రారంభమైందని గుర్తు చేశారు. గత అనుభవాల దృష్ట్యా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రకటనను స్వాగతిస్తున్నామని చెప్పారు. 70 ఏళ్లుగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అభివృద్ధి చెందకుండా మిగిలిపోయాయన్నారు. గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు, కృష్ణా జలాలు రాయలసీమకు ఇవ్వాలని కోరారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి సమితి చైర్మన్ పేర్ల సాంబమూర్తి మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల సంక్షేమం కోసం రాజకీయాలకు అతీతంగా పరిపాలన వికేంద్రీకరణకు అందరూ మద్దతు పలకాలని కోరారు. ఈ సమావేశంలో జనచైతన్య వేదిక విశాఖ జిల్లా కార్యదర్శి కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. పౌర గ్రంథాలయంలో నేడు సదస్సు వికేంద్రీకరణతోనే సమాజ ప్రగతి అనే అంశంపై సోమవారం ద్వారకానగర్‌లోని పౌర గ్రంథాలయంలో సదస్సు నిర్వహించనున్నట్టు జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు పి.లక్ష్మణరెడ్డి తెలిపారు. ఉదయం 10.30 నుంచి నిర్వహించనున్న సదస్సుకు ప్రొఫెసర్ కేసీ రెడ్డి, ప్రొఫెసర్ కేఎస్ చలం, ప్రొఫెసర్ బాల మోహన్‌దాస్, పలువురు మేధావులు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, విద్యార్థి సంఘాల నాయకులు హాజరవుతారని పేర్కొన్నారు. -
జనసేన వక్రభాష్యాలు భావ్యం కాదు..
సాక్షి, విజయవాడ: మంచి పనిని స్వాగతించక పోగా.. వక్రభాష్యాలు చెప్పటం భావ్యం కాదని.. జనసేన తీరును జనచైతన్య వేదిక ఎండగట్టింది. వైఎస్సాఆర్సీపీ వంద రోజుల పాలన గురించి జనసేన విడుదల చేసిన నివేదికను జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్‌రెడ్డి తప్పుబట్టారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు జనచైతన్య వేదిక బహిరంగ లేఖ రాసింది. చంద్రబాబు బెల్టుషాపులను ప్రోత్సహించి మద్యాన్ని ఏరులై పారించి రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్ చేస్తే ఎందుకు ప్రశ్నించలేదని పవన్ కల్యాణ్‌ను లక్ష్మణ్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. దశలవారీ మద్య నిషేధం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న సాహసోపేత నిర్ణయం అని లక్ష్మణ్‌రెడ్డి ప్రశంసించారు. పవన్‌కు అభ్యంతరం ఎందుకు? సీఎం వైఎస్ జగన్ బెల్టుషాపుల భరతం పట్టి గ్రామాల్లో ప్రశాంత వాతావరణానికి బాటలు వేశారన్నారు. ‘చంద్రబాబు మద్యం వ్యసనాన్ని జనం చెంతకు చేరిస్తే.. జగన్ ఆ వ్యసనాన్ని దూరం చేస్తున్నారని’ చెప్పారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందతో వందల కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయిందన్నారు. అవినీతిపై విచారణ చేస్తామంటే పవన్ అభ్యంతరం చెప్పటం న్యాయం కాదన్నారు. బిహార్, గుజరాత్, మిజోరాం లలో సంపూర్ణ మద్యపాన నిషేధం విజయవంతంగా అమలు జరుగుతోందని.. పవన్ కల్యాణ్ తన వ్యాఖ్యలను పునః సమీక్షించుకోవాలని కోరారు. మద్యపాన నిషేధాన్ని రాజకీయం చేయొద్దు.. మద్యం వల్ల సంసారాలు గుల్ల అవుతున్నాయని.. యువత వ్యసనపరులవుతున్నారని మానసిక వైద్య నిపుణులు ఇండ్ల సుబ్బారెడ్డి అన్నారు. రాష్ట్రంలో దశల వారి మద్యనిషేధం, డిఅడిక్షన్ సెంటర్లు పెట్టాలనుకోవటం శుభ పరిణామంగా పేర్కొన్నారు. మద్యపాన నిషేధాన్ని రాజకీయం చేయకుండా ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలన్నారు. పవన్ కల్యాణ్ రాజకీయ దృక్పథం మాని మద్యనిషేధానికి కృషి చేయాలని కోరారు. -
బాబు దుబారా వల్లే రాష్ట్రం అప్పులో కూరుకుపోయింది
-
కొత్త ప్రభుత్వానికి బాబు ఇచ్చే గిఫ్ట్ అదే
సాక్షి, గుంటూరు : రాబోయే నూతన ప్రభుత్వానికి చంద్రబాబు ఇచ్చే గిఫ్ట్ అప్పుల భారమే అని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ రెడ్డి విమర్శించారు. శనివారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రం చేయనన్ని అప్పులు ఏపీ చేసిందన్నారు. చంద్రబాబు అధికారం చేపట్టే నాటికి రాష్ట్రానికి అప్పు రూ. 90 వేల కోట్లు ఉంటే.. ఇప్పుడది రూ.3.5 లక్షల కోట్లకు చేరిందని తెలిపారు. చేసిన అప్పులు తీర్చడానికే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసిందంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుందన్నారు. పుష్కరాల పేరుతో రూ. 3200 కోట్లు ఖర్చు చేస్తే.. అందులో కనీసం రూ. 300 కోట్ల పని కూడా జరగలేదన్నారు. పోలవరం ఎర్త్ డ్యాం ఒక్కశాతం కూడా పూర్తి కాలేదని లక్ష్మణ్ రెడ్డి ఆరోపించారు. దుబారా ఖర్చులకు రాష్ట్ర ప్రభుత్వం కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిందన్నారు. అప్పు చేసి తెచ్చిన డబ్బులన్ని చంద్రబాబు దీక్షలకు, విదేశీ పర్యటనలకు, దుబారా ఖర్చులకే సరిపోయాయని విమర్శించారు. అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్ అనే అంశంపై ఈనెల 21వ తేదీన గుంటూరులో మేధావులతో సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : బాబు దుబారా వల్లే రాష్ట్రం అప్పులో కూరుకుపోయింది -
ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలం
-
ప్రతిపక్షాన్ని కేసులతో వేధిస్తున్నారు
-
‘ప్రభాస్ డెడికేషన్ అమేజింగ్’
హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా మరో నెల రోజుల్లో విడుదల కానున్న చిత్రం బాహుబలి-2. ఈ చిత్రం కోసం ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తితో చూస్తున్నారు. అయితే, ఈ సినిమాలో హీరోగా నటించిన ప్రభాస్ ద్విపాత్రాభినయం చేసిన విషయం అందరికీ తెలిసిందే. తండ్రి పాత్రలో అమరేంద్ర బాహుబలిగా, కొడుకు పాత్రలో మహేంద్రబాహుబలిగా చాలా అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా రెండు విభిన్నపాత్రలకు తగినట్లుగా శరీరా ఆకృతిని దాదాపు నాలుగేళ్లపాటు అత్యంత జాగ్రత్తతో కాపాడుకున్నాడు. ఎంతలా అంటే ఆయనకు ప్రత్యేక ఫిజికల్ ట్రైనర్‌గా పనిచేసిన బాడీ బిల్డర్ లక్ష్మణ్‌రెడ్డి అవాక్కయ్యేలాగా. ప్రభాస్‌కున్న అంకిత భావాన్ని చూసి ఆయన కూడా ఆశ్చర్యానికి లోనయ్యారంట. ప్రభాస్ డెడికేషన్ అమేజింగ్ అంటూ ఆయన ఓ మీడియాకు చెప్పారు. అమరేంద్ర బాహుబలికోసం ప్రభాస్ 100 కేజీలు పెరిగిన ప్రభాస్ శివుడి(మహేంద్ర బాహుబలి) పాత్రకు తగినట్లుగా మారేందుకు కూడా అమితంగా కష్టపడ్డాడని తెలిపారు. ఎగ్ వైట్స్, చికెన్, నట్స్, అల్మాండ్స్, చేపలు, కూరగాయలువంటివాటితో బాహుబలి 1 పాత్రకోసం ఆరుసార్లు ఆహారంగా ఇచ్చామని, బాహుబలి-2 పాత్రకోసం చీస్, మటన్ దాదాపు ఎనిమిదిసార్లు ఇచ్చామని చెప్పారు. ప్రభాస్‌కు బిర్యాని అంటే చాలా ఇష్టం అని, జంక్ ఫుడ్ అంటే కూడా నచ్చుతుందని ఈ విషయంలో తాను చాలా కఠినంగా ఉండేవాడినని, అయితే, అతడి ఇష్టాన్ని అర్థం చేసుకొని అనుమతిచ్చేవాడినని పేర్కొన్నారు. ప్రభాస్ తీసుకునే ఆహారం, వర్కవుట్స్ అన్నీ కూడా దాదాపు నాలుగేళ్లపాటు తన పర్యవేక్షణలోనే జరిగాయని వివరించారు. -
గోదావరిలో ఈతకు వెళ్లి యువకుడు గల్లంతు
గోదావరిలో ఈతకు వెళ్లిన యువకుడు నీట మునిగి గల్లంతైన సంఘటన అదిలాబాద్ జిల్లా మామడ మండలం ఆదర్శ్‌నగర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లక్ష్మణ్‌రెడ్డి(20) శివారులోని నదిలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి గల్లంతయ్యాడు. ఇది గుర్తించిన గ్రామస్థులు పోలీసుల సాయంతో యువకుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
'స్వార్థంతోనే విద్వేషాలు సృష్టిస్తున్నారు'
-
'ఢిల్లీ, తమిళనాడు తరహాలో మద్య విధానం ఉండాలి'
హైదరాబాద్: ఢిల్లీ, తమిళనాడు తరహాలో మద్యం దుకాణాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి మద్య నియంత్రణ ఉద్యమ కమిటీ రాష్ట్ర కన్వీనర్ వి.లక్ష్మణ్ రెడ్డి సూచించారు. జంట నగరాల్లో కల్లు దుకాణాల ఏర్పాటు ప్రయత్నాన్ని విరమించుకోవాలని ప్రభుత్వానికి లక్ష్మణ్ రెడ్డి విజ్క్షప్తి చేశారు. మద్య విధానంలో బెల్టు షాపులను సమూలంగా తొలగించడానికి ప్రభుత్వం చొరవ చూపాలని ఆయన అన్నారు. మద్యం షాపులు, విచ్చల విడిగా బెల్టు షాపులకు అనుమతి ఇవ్వడం వలన అనేక కుటుంబాలు ఇబ్బందులకు లోనవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో కల్లు షాపుల తెరిచే విషయంపై ఆలోచన చేస్తామని ఇటీవల తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి టి.పద్మరావు ఓ మీడియా సమావేశంలో అన్నారు. కల్లు షాపుల తెరిచివేత, బెల్లు షాపుల మూసివేతపై ప్రభుత్వానికి మద్య నియంత్రణ ఉద్యమ కమిటీ సూచించడం చర్చనీయాంశమైంది. -
రాష్ట్ర పునర్విభజన బిల్లు ఓ పద్ధతి ప్రకారం పంపలేదు
-
'సీమాంధ్ర కేంద్ర మంత్రులది గోబెల్ ప్రచారం'
తిరుపతి : రాష్ట్రం విడిపోయిందంటూ సీమాంధ్ర కేంద్ర మంత్రులు గోబెల్ ప్రచారం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ కో ఆర్డినేటర్ వి.లక్ష్మణ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆర్టికల్-3ని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. అసెంబ్లీలో తీర్మానం, చర్చ లేకుండా విభజనకు పూనుకోవటం రాజ్యాంగ విరుద్ధమని లక్ష్మణ్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర విభజన వల్ల కలిగే నష్టాలను..తెలుగుజాతికి తెలియచెప్పేందుకు డిసెంబర్ 2 నుంచి 29 వరకూ సీమాంధ్రలో సమైక్య కళాభేరి నిర్వహించనున్నట్లు లక్ష్మణ్ రెడ్డి వెల్లడించారు. సీమాంధ్రలోని అన్ని మండల కేంద్రాల్లో కళాభేరి కార్యక్రమాలు ఉంటాయన్నారు. -
ఏపీ రాష్ట్రపరిరక్షణ కమిటీ చైర్మన్ లక్ష్మణరెడ్డితో సాక్షి వేదిక
-
జగన్ పరిస్థితి ఆందోళనగానే ఉంది-లక్ష్మణరెడ్డి