'ఢిల్లీ, తమిళనాడు తరహాలో మద్య విధానం ఉండాలి'
Published Mon, Jun 16 2014 2:08 PM | Last Updated on Sat, Sep 2 2017 8:54 AM
హైదరాబాద్: ఢిల్లీ, తమిళనాడు తరహాలో మద్యం దుకాణాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి మద్య నియంత్రణ ఉద్యమ కమిటీ రాష్ట్ర కన్వీనర్ వి.లక్ష్మణ్ రెడ్డి సూచించారు. జంట నగరాల్లో కల్లు దుకాణాల ఏర్పాటు ప్రయత్నాన్ని విరమించుకోవాలని ప్రభుత్వానికి లక్ష్మణ్ రెడ్డి విజ్క్షప్తి చేశారు.
మద్య విధానంలో బెల్టు షాపులను సమూలంగా తొలగించడానికి ప్రభుత్వం చొరవ చూపాలని ఆయన అన్నారు. మద్యం షాపులు, విచ్చల విడిగా బెల్టు షాపులకు అనుమతి ఇవ్వడం వలన అనేక కుటుంబాలు ఇబ్బందులకు లోనవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
నగరంలో కల్లు షాపుల తెరిచే విషయంపై ఆలోచన చేస్తామని ఇటీవల తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి టి.పద్మరావు ఓ మీడియా సమావేశంలో అన్నారు. కల్లు షాపుల తెరిచివేత, బెల్లు షాపుల మూసివేతపై ప్రభుత్వానికి మద్య నియంత్రణ ఉద్యమ కమిటీ సూచించడం చర్చనీయాంశమైంది.
Advertisement