T. Padma Rao
-
అపోలోకు పద్మారావు
సాక్షి, హైదరాబాద్: హోం క్వారంటైన్లో ఉన్న రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ తిగుళ్ల పద్మారావుగౌడ్‌ను మరిం త మెరుగైన వైద్యసేవల కోసం జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. పద్మారావుతోపాటు నలుగురు కుటుంబసభ్యులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. మూడు రోజులుగా హోంక్వారంటైన్లో ఉన్న ఆయనను శుక్రవారం అపోలో ఆస్పత్రికి తరలించి ప్రత్యేకగదిలో వైద్యం అందిస్తున్నారు. కాగా, డిప్యూటీ స్పీకర్ పద్మారావును సీఎం కేసీఆర్ శుక్రవారం ఫోన్ ద్వారా పరామర్శించారు. డిశ్చార్జయిన మహమూద్ అలీ కరోనాతో ఆసుపత్రిలో చేరిన హోం మంత్రి మహమూద్ అలీ శుక్రవారం డిశ్చార్జి అయ్యారు. ఆయనతో పాటు కుమారుడు, మనవడు కూడా డిశ్చార్జి అయ్యారు. జూన్ 28న మహమూద్ అలీతోపాటు, ఆయన కుమారుడు, మనవడికి కూడా కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో జూబ్లీహిల్స్ అపోలోలో చేరిన వారంతా ప్రస్తుతం డిశ్చార్జి అయ్యారు. ఇకపై హోంక్వారంటైన్లోనే ఉంటూ చికిత్స పొందనున్నారు. -
హైదరాబాద్‌లో కల్తీ కల్లే లేదు
హైదరాబాద్: ‘అసలు హైదరాబాద్‌లో కల్తీ కల్లు అనేదే లేదు. అంతగా కాకపోతే కల్లులో నీళ్లు, చక్కెర వంటివి కలుపుతుంటారు’ అని అసెంబ్లీ లాబీలో కల్తీ కల్లు ప్రస్తావన వచ్చినపుడు ఎక్సైజ్ మంత్రి టి. పద్మారావు వ్యాఖ్యానించారు. కల్లు ఉత్పత్తికి సరిపోను తాటిచెట్లు, ఈతచెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. అయితే గుడుంబా అంటే విషమేనని, దానివల్లే రాష్ట్రంలో మరణాలు సంభవిస్తున్నాయన్నారు. గుడుంబా కంటే సారాయి అన్ని విధాలా మంచిదని, ప్రభుత్వం సారాయి దుకాణాలు పెట్టాలనే డిమాండ్ కూడా వస్తోందని మంత్రి అసలు విషయాన్ని బయటపెట్టారు. కల్లు దుకాణాలు పెట్టినందుకే తమ ప్రభుత్వం విమర్శలను ఎదుర్కొంటోందని, ఇక సారాయి దుకాణాలు పెడితే ఎట్లా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయన్నారు. -
'ఢిల్లీ, తమిళనాడు తరహాలో మద్య విధానం ఉండాలి'
హైదరాబాద్: ఢిల్లీ, తమిళనాడు తరహాలో మద్యం దుకాణాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి మద్య నియంత్రణ ఉద్యమ కమిటీ రాష్ట్ర కన్వీనర్ వి.లక్ష్మణ్ రెడ్డి సూచించారు. జంట నగరాల్లో కల్లు దుకాణాల ఏర్పాటు ప్రయత్నాన్ని విరమించుకోవాలని ప్రభుత్వానికి లక్ష్మణ్ రెడ్డి విజ్క్షప్తి చేశారు. మద్య విధానంలో బెల్టు షాపులను సమూలంగా తొలగించడానికి ప్రభుత్వం చొరవ చూపాలని ఆయన అన్నారు. మద్యం షాపులు, విచ్చల విడిగా బెల్టు షాపులకు అనుమతి ఇవ్వడం వలన అనేక కుటుంబాలు ఇబ్బందులకు లోనవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో కల్లు షాపుల తెరిచే విషయంపై ఆలోచన చేస్తామని ఇటీవల తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి టి.పద్మరావు ఓ మీడియా సమావేశంలో అన్నారు. కల్లు షాపుల తెరిచివేత, బెల్లు షాపుల మూసివేతపై ప్రభుత్వానికి మద్య నియంత్రణ ఉద్యమ కమిటీ సూచించడం చర్చనీయాంశమైంది.