హైదరాబాద్: ‘అసలు హైదరాబాద్‌లో కల్తీ కల్లు అనేదే లేదు. అంతగా కాకపోతే కల్లులో నీళ్లు, చక్కెర వంటివి కలుపుతుంటారు’ అని అసెంబ్లీ లాబీలో కల్తీ కల్లు ప్రస్తావన వచ్చినపుడు ఎక్సైజ్ మంత్రి టి. పద్మారావు వ్యాఖ్యానించారు. కల్లు ఉత్పత్తికి సరిపోను తాటిచెట్లు, ఈతచెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. అయితే గుడుంబా అంటే విషమేనని, దానివల్లే రాష్ట్రంలో మరణాలు సంభవిస్తున్నాయన్నారు.
గుడుంబా కంటే సారాయి అన్ని విధాలా మంచిదని, ప్రభుత్వం సారాయి దుకాణాలు పెట్టాలనే డిమాండ్ కూడా వస్తోందని మంత్రి అసలు విషయాన్ని బయటపెట్టారు. కల్లు దుకాణాలు పెట్టినందుకే తమ ప్రభుత్వం విమర్శలను ఎదుర్కొంటోందని, ఇక సారాయి దుకాణాలు పెడితే ఎట్లా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయన్నారు.
హైదరాబాద్‌లో కల్తీ కల్లే లేదు
Published Tue, Nov 18 2014 7:13 AM | Last Updated on Sat, Sep 2 2017 4:41 PM
Advertisement