‘ప్రభాస్ డెడికేషన్ అమేజింగ్’
హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా మరో నెల రోజుల్లో విడుదల కానున్న చిత్రం బాహుబలి-2. ఈ చిత్రం కోసం ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తితో చూస్తున్నారు. అయితే, ఈ సినిమాలో హీరోగా నటించిన ప్రభాస్ ద్విపాత్రాభినయం చేసిన విషయం అందరికీ తెలిసిందే. తండ్రి పాత్రలో అమరేంద్ర బాహుబలిగా, కొడుకు పాత్రలో మహేంద్రబాహుబలిగా చాలా అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా రెండు విభిన్నపాత్రలకు తగినట్లుగా శరీరా ఆకృతిని దాదాపు నాలుగేళ్లపాటు అత్యంత జాగ్రత్తతో కాపాడుకున్నాడు.
ఎంతలా అంటే ఆయనకు ప్రత్యేక ఫిజికల్ ట్రైనర్‌గా పనిచేసిన బాడీ బిల్డర్ లక్ష్మణ్‌రెడ్డి అవాక్కయ్యేలాగా. ప్రభాస్‌కున్న అంకిత భావాన్ని చూసి ఆయన కూడా ఆశ్చర్యానికి లోనయ్యారంట. ప్రభాస్ డెడికేషన్ అమేజింగ్ అంటూ ఆయన ఓ మీడియాకు చెప్పారు. అమరేంద్ర బాహుబలికోసం ప్రభాస్ 100 కేజీలు పెరిగిన ప్రభాస్ శివుడి(మహేంద్ర బాహుబలి) పాత్రకు తగినట్లుగా మారేందుకు కూడా అమితంగా కష్టపడ్డాడని తెలిపారు.
ఎగ్ వైట్స్, చికెన్, నట్స్, అల్మాండ్స్, చేపలు, కూరగాయలువంటివాటితో బాహుబలి 1 పాత్రకోసం ఆరుసార్లు ఆహారంగా ఇచ్చామని, బాహుబలి-2 పాత్రకోసం చీస్, మటన్ దాదాపు ఎనిమిదిసార్లు ఇచ్చామని చెప్పారు. ప్రభాస్‌కు బిర్యాని అంటే చాలా ఇష్టం అని, జంక్ ఫుడ్ అంటే కూడా నచ్చుతుందని ఈ విషయంలో తాను చాలా కఠినంగా ఉండేవాడినని, అయితే, అతడి ఇష్టాన్ని అర్థం చేసుకొని అనుమతిచ్చేవాడినని పేర్కొన్నారు. ప్రభాస్ తీసుకునే ఆహారం, వర్కవుట్స్ అన్నీ కూడా దాదాపు నాలుగేళ్లపాటు తన పర్యవేక్షణలోనే జరిగాయని వివరించారు.