'సీమాంధ్ర కేంద్ర మంత్రులది గోబెల్ ప్రచారం' | Lakshman reddy slams Seemandhra cabinet minister Goebbels campaign | Sakshi
Sakshi News home page

'సీమాంధ్ర కేంద్ర మంత్రులది గోబెల్ ప్రచారం'

Published Tue, Nov 12 2013 9:51 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

Lakshman reddy slams Seemandhra cabinet minister Goebbels campaign

తిరుపతి : రాష్ట్రం విడిపోయిందంటూ సీమాంధ్ర కేంద్ర మంత్రులు గోబెల్ ప్రచారం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ కో ఆర్డినేటర్  వి.లక్ష్మణ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆర్టికల్-3ని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆయన మంగళవారమిక్కడ అన్నారు.

అసెంబ్లీలో తీర్మానం, చర్చ లేకుండా విభజనకు పూనుకోవటం రాజ్యాంగ విరుద్ధమని లక్ష్మణ్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర విభజన వల్ల కలిగే నష్టాలను..తెలుగుజాతికి తెలియచెప్పేందుకు  డిసెంబర్ 2 నుంచి 29 వరకూ సీమాంధ్రలో సమైక్య కళాభేరి నిర్వహించనున్నట్లు లక్ష్మణ్ రెడ్డి వెల్లడించారు. సీమాంధ్రలోని అన్ని మండల కేంద్రాల్లో కళాభేరి కార్యక్రమాలు ఉంటాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement