రాష్ట్ర విభజన అనివార్యం : చిరంజీవి
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన అనివార్యమని కేంద్ర మంత్రి చిరంజీవి స్పష్టం చేశారు. ఇక కలిసుండాలని కోరుకోవటంలో ప్రయోజనం లేదని ఆయన బుధవారమిక్కడ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయాల్సిందేనని చిరంజీవి అభిప్రాయపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్పై వెనక్కి తగ్గేది లేదని ఆయన అన్నారు. విభజన ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసిందని చిరంజీవి తెలిపారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశల్లోనే తెలంగాణ బిల్లు వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు. కాగా అంతకు ముందు సీమాంధ్ర కేంద్ర మంత్రులు జీవోఎం సభ్యుడు జైరాం రమేష్తో భేటీ అయ్యారు. హైదరాబాద్పైనే వారు ప్రధానంగా చర్చించారు. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని సీమాంధ్ర కేంద్రమంత్రులు విజ్ఞప్తి చేశారు.