విధిలేకే పోడియం వద్ద ఆందోళన: చిరంజీవి
న్యూఢిల్లీ : విధిలేని పరిస్థితుల్లోనే తాము స్పీకర్ పోడియం వద్ద ఆందోళన చేసినట్లు కేంద్రమంత్రి చిరంజీవి తెలిపారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయానికి తాము వ్యతిరేకం కాదన్నారు. సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని శిరసావహిస్తామని అయితే హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయటంతో పాటు తమ డిమాండ్లకు కేంద్రం అంగీకరిస్తే చాలని అన్నారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా పరిగణించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.