కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు నివాసంలో సీమాంధ్ర కేంద్రమంత్రులు మంగళవారమిక్కడ సమావేశం అయ్యారు.
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు నివాసంలో సీమాంధ్ర కేంద్రమంత్రులు మంగళవారమిక్కడ సమావేశం అయ్యారు. హైదరాబాద్, రాయల తెలంగాణ, జీవోఎం భేటీ తదితర అంశాలపై వారు చర్చిస్తున్నారు. రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) తుది విడతగా నేడు భేటీ కానున్న నేపథ్యంలో సీమాంధ్ర నేతలు భేటీ అయ్యారు. ఇక జీవోఎం ఆమోదించనున్న నివేదికలో రాష్ట్ర విభజనపై సిఫారసులు ఎలా ఉంటాయనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ముఖ్యంగా హైదరాబాద్ ప్రతిపత్తి, ఉమ్మడి రాజధాని పరిధి, ఆర్టికల్ 371డీ, ఈ, నీటి సమస్యల పరిష్కారం అంశాలతో పాటు రాయల తెలంగాణ విషయమై జీవోఎం సిఫారసులు ఫలానా విధంగా ఉన్నాయని కొద్ది రోజులుగా మీడియాలో వస్తున్న పలు కథనాలతో తీవ్ర గందరగోళం నెలకొన్న నేపథ్యంలో సిఫారసుల అసలు స్వరూపం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.