
కార్వేటినగరం (చిత్తూరు జిల్లా): ట్యాక్సీ, బస్సు డ్రైవర్లు వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు వ్యాక్సినేషన్ చేపట్టిన విధంగానే, ప్రజలతో నిత్యం సంబంధాలుంటున్న ట్యాక్సీ, బస్సు, ఆటో డ్రైవర్లకు వ్యాక్సిన్ అందించాలన్నారు.
జిల్లా కలెక్టర్లు కరోనా నివారణపై యుద్ధ ప్రాతిపదికన అవగాహన కల్పించి కరోనా మరణాల సంఖ్యను తగ్గించేందుకు కృషి చేయాలన్నారు. మాస్కులు లేకుండా నిర్లక్ష్యంగా రోడ్లపైకి వచ్చే వారికి భారీగా జరిమానా విధించి కరోనా కట్టడికి పోలీస్ యంత్రాంగం కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలో అత్యధికంగా వ్యాక్సినేషన్ అందిస్తున్నారని గుర్తుచేశారు.