ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజధాని రైతులకు న్యాయం చేస్తారని, ఆయన రైతుల పక్షపాతి అని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయటమే సీఎం జగన్ లక్ష్యమని పేర్కొన్నారు. శనివారం నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ.. ‘ ముఖ్యమంత్రి జగన్ 7 నెలల్లోనే 90 శాతం హామీలను నెరవేర్చారు. మూడు రాజధానుల ప్రతిపాదనను అన్ని వర్గాలు హర్షిస్తున్నాయి.