తిరుపతి: ఏపీలో మంత్రులకు కేవలం పదవులు మాత్రమే ఉన్నాయి.. అధికారాలన్నీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన కుమారుడు నారా లోకేష్ కు అప్పగించి రాజకీయం చేస్తున్నారంటూ విమర్శించారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పన్నుతున్న కుట్రలకు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడే ప్రసక్తే లేదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామి వ్యాఖ్యానించారు.
సీఎం చంద్రబాబు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలను డబ్బులతో కొనాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రజా ప్రతినిధులను డబ్బు ఆశ చూపెట్టి ప్రలోభాలకు గురిచేస్తున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబుకు కుల జబ్బు పట్టుకుందని, కులాల మధ్య ఆయన చిచ్చు పెడుతున్నారని వైఎస్ఆర్ సీపీ నేత నారాయణస్వామి ఆగ్రహం వ్యక్తంచేశారు.
'మంత్రులకు కేవలం పదవులే ఉన్నాయి..'
Published Fri, Feb 19 2016 6:13 PM | Last Updated on Wed, Aug 29 2018 3:37 PM
Advertisement
Advertisement