
డీలర్లపై టీడీపీ కక్షసాధింపులు
జేసీకి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామి ఫిర్యాదు
జేసీకి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామి ఫిర్యాదు
చిత్తూరు(సెంట్రల్) : జిల్లాలో అధికార పార్టీకి అనుకూలంగా లేని చౌకదుకాణ డీలర్లపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని, తహసీల్దార్లు, ఆర్డీవోలపై ఒత్తిడి తీసుకొచ్చి వారి దుకాణాలను రద్దు చేయిస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూ రు ఎమ్మెల్యే నారాయణస్వామి గురువారం జిల్లా సంయుక్త కలెక్టర్ భరత్‌గుప్తకు ఫిర్యాదు చేసారు. ప్రధానంగా తన నియోజకవర్గ పరిధిలోని జీడీ నెల్లూరు, కార్వేటినగరం, వెదురుకుప్పం, పాలసముద్రం మండలాల్లోని చౌకదుకాణ డీల ర్లు మాజీ ఎమ్మెల్యే హయాంలోనే నియమితులయ్యారని, అప్పట్లో వారి వద్ద వేలాది రూపాయలు తీసుకుని డీలర్‌షిప్‌లు ఇప్పించారని, ఇప్పుడు వైఎస్సార్‌సీపీకి మద్దతిచ్చారనే నెపంతో వారిని తొలగించేందుకు మంత్రి గోపాలకృష్ణారెడ్డి ద్వారా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని ఆయన ఆరోపించారు.
కేవలం 18కిలోల బియ్యం తక్కువ వచ్చాయని వెదురుకుప్పంలోని షాప్ నెం. 6,28లను రద్దు చేయూలని డిమాండ్ చేస్తున్నార ని ఆయన జేసీ దృష్టికి తీసుకెళ్లారు. తన నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో పనిచేస్తున్న అందరు తహశీల్దార్లను బది లీ చేసి కొత్తవారిని నియమించాలని జేసీని కోరారు. ఈ సందర్భంగా ఆయ న విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రిలా వ్యవహరించడంలేదని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మాత్రమే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని వి మర్శించారు. తన నియోజకవర్గం పరి ధిలో గతంలో ఇచ్చిన పట్టాదారు పాసుపుస్తకాలను పరిశీలించి ఎవరి అనుభవంలో ఉందన్నది నిగ్గుతేల్చాలన్నారు. జేసీని కలసినవారిలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవి, జీడీ నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని నాయకులు ఉన్నారు.
మహాధర్నాను జయప్రదం చేయండి
డిసెంబర్ 5వ తేదీన వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చిత్తూరు కలెక్టర్ కార్యాలయం వద్ద చేపట్టనున్న మహాధర్నాను జయప్రదం చేయాలని నారాయణస్వామి కోరారు. ఈ మేరకు పలమనేరు, బంగారుపాళెం, చిత్తూరు నగరంలో నాయకులను కలసి ధర్నాకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలను తరలించాలని కోరిన ట్లు ఆయన పేర్కొన్నారు.