మదిరేపల్లి(శింగనమల) : గొర్రెలు జొన్న పైరును తినడంతో నాముకొని కళ్ల ముందే చనిపోతుండడంతో, వాటిని బతికించుకోవడానికి వారు పడుతున్న పాట్లను చూసి ప్రజలు చలించిపోయారు. ఈసంఘటన శింగనమల మండలంలోని మదిరేపల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగింది. మదిరేపల్లి గ్రామంకు చెందిన పెద్ద పెద్దన్న గొర్రల మందలో 150 గొర్రెలు వరుకు మృతి చెందాయి. దాదాపు రూ.8లక్షల మేరకు నష్టం వాటిల్లింది. మదిరేపల్లి గ్రామంకు చెందిన పెద్ద పెద్దన్న, నారాయణస్వామి, చిన్నరాజులు, నారాయణస్వామి, యల్లప్ప,నారాయణస్వామి, రాజప్ప, ఉజ్జేనప్ప, నారాయణస్వామి, జయకాంత్, వన్నప్ప, నారాయణస్వామి 12 మంది కలిసి 2వేలు గొర్రెలును మేపుకుంటున్నారు. రోజు మాదిరిగానే గొర్రెలను ఒక వైపు, గొర్రె పిల్లలను ఒక వైపు మేపు కోసం తీసుకెళ్లారు. మధ్యాహ్నం సమయంలో కొద్దిగా ఎండిపోయిన జొన్న పైరులో గొర్రెలును మేపుకున్నారు. అందులో 200 గొర్రెలు నాము కొని (అరగక) ఇబ్బంది పడ్డాయి. దీంతో గొర్రెల మందను పొలం నుంచి బయటకు తీసుకుపోయారు. కాని గంట గడిచిలోపే గొర్రెలు ఒక్కొక్కటీ కింద పడి కళ్లు ముందే చనిపోతుండడంతో గొర్రెలు యజమానులు అందోళన చెందారు.
విషయంను గ్రామస్థులుకు, వెటర్నరీ సిబ్బందికి తెలియడంతో వారు గోపాల మిత్రలుతో కలిసి వచ్చి వైద్యం చేశారు. పొలల్లోనే ఎక్కడ పడితే అక్కడ 150 గొర్రెలు చనిపోయాయి. ప్రజలు మిగిలని గొర్రెలకు వైద్యులతో మందును వేయించారు. 50 గొర్రెలు వరకు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. శింగనమల, బుక్కరాయసముద్రం మండల వెటర్నరీ వైద్యులు సుధాకర్, రామచంద్రారెడ్డి, గోపాల మిత్రలు వైద్యం అందజేశారు. అనంతరం డిప్యూటీ తహశీల్దారు వరప్రసాద్, వీఆర్వో వెంకట్రామిరెడ్డి, జెడ్పీటీసీ శాలిని సంఘటన స్థలానికి వచ్చి పరీశీలించారు. బాధితులతో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించడానికి కృషి చేస్తామని తెలిపారు.
అయ్యయ్యో..
Published Thu, Dec 25 2014 2:43 AM | Last Updated on Sat, Sep 2 2017 6:41 PM
Advertisement
Advertisement