లేబోరేటరీ శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి, చిత్రంలో మంత్రి అమర్‌నాథ్, మేయర్ హరివెంకటకుమారి, వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే ముత్తంశెట్టి తదితరులు
దొండపర్తి(విశాఖ దక్షిణ)/ఆనందపురం(భీమిలి) : కల్తీ మద్యాన్ని పరీక్షించేందుకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆంధ్రా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన అత్యాధునిక ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ లేబోరేటరీని గురువారం డిప్యూటీ సీఎం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కె.నారాయణస్వామి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి హాని కలగకుండా, కల్తీ మద్యానికి అవకాశం లేకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ల్యాబ్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పారు.
ప్రజలకు మెరుగైన విద్య, ఆరోగ్యం, సంక్షేమం అందించడమే నిజమైన అభివృద్ధి అని, అదే సీఎం జగన్ సంకల్పమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఇటువంటి ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని ఎక్సైజ్ అధికారులు చంద్రబాబును కోరినప్పటికీ.. ఆయన పట్టించుకోలేదని విమర్శించారు. ఇదిలా ఉండగా ఆనందపురం మండలం గోరింటలో రూ.20 కోట్లతో నిరి్మంచనున్న ఎక్సైజ్ శాఖ కాంప్లెక్స్, ఏపీఎస్‌బీసీఎల్ డిపో నిర్మాణ పనులకు నారాయణస్వామి శంకుస్థాపన చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ బొమ్మ పెట్టుకుని జగన్ రాష్ట్రమంతా తిరిగి సీఎం అయ్యారని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఫొటో పట్టుకుని తిరిగి లోకేశ్ ఒక్క సీటైనా గెలవాలని సవాల్ విసిరారు. చంద్రబాబు ఒక అవినీతి చక్రవర్తి అని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో రూ.1000 కోట్ల కుంభకోణానికి పాల్పడిందని, చంద్రబాబు అక్రమాలను రోడ్డు మీదకు లాగుతానని చెప్పిన దత్తపుత్రుడు పవన్.. ఇప్పుడు ఏం చేస్తున్నాడని ప్రశి్నంచారు.
తండ్రి చావుకు కారకుడైన బాబుకు పురందేశ్వరి వత్తాసు పలకడం హాస్యాస్పదం
కల్తీ మద్యం తాగడం వల్లే విశాఖలో ఇద్దరు చనిపోయారని పురందేశ్వరి అన్న వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన మండిపడ్డారు. కల్తీ మద్యం కారణంగానే ఎవరైనా చనిపోయారని నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమన్నారు.
తండ్రి చావుకు కారణమైన బాబుకు పురందేశ్వరి వత్తాసు పలకడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మార్గదర్శి అక్రమాలపై విచారణ జరుపుతున్నందుకే ఈనాడులో రామోజీరావు తప్పుడు రాతలు రాస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమాల్లో మంత్రి గుడివాడ అమర్‌నాథ్, నగర మేయర్ గొలగాని హరివెంకటకుమారి, వైఎస్సార్‌సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, డీసీసీబీ చైర్మన్ కోలా గురువులు, ఏయూ వీసీ ప్రసాదరెడ్డి తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment