prepared
-
Pooja Kannan: చెల్లి మెహందీ ఫంక్షన్.. దగ్గరుండి రెడీ చేసిన సాయిపల్లవి (ఫోటోలు)
-
కాశీ విశ్వనాథునికి మధుర జైలు నుంచి గులాల్
మహాశివుడు కొలువైన కాశీలో రంగ్భరి ఏకాదశి(మార్చి 20)రోజున హోలీ వేడుకలు జరగనున్నాయి. ఆ రోజున విశ్వనాథుడు, పార్వతిమాత భక్తుల నడుమ హోలీ ఆడనున్నారు. దీంతో కాశీ మొత్తం రంగులమయంగా మారనుంది. ఈసారి కాశీ విశ్వనాథుని హోలీ వేడుకల కోసం మథురలో ప్రత్యేక గులాల్ సిద్ధం చేస్తున్నారు. మథుర జైలులోని ఖైదీలు కాశీలో కొలువైన పరమశివుని కోసం పండ్లు, పూలు, కూరగాయల రసాలతో హోలీ రంగులు తయారు చేస్తున్నారు. ఈ విధంగా తయారైన ఎరుపు, పసుపు గులాల్‌లను కాశీలో హోలీ వేడుకలకు వినియోగించనున్నట్లు సమాచారం. మథుర నుండి ఒక క్వింటాల్ హెర్బల్ గులాల్ కాశీకి రానున్నదని, ఈ గులాల్ తయారీలో సుగంధాన్ని కూడా ఉపయోగిస్తున్నారని ఉత్సవ నిర్వాహకులు తెలిపారు. అయోధ్య నుండి కూడా కాశీ విశ్వేశ్వరుని హోలీ వేడుకలకు హెర్బల్ గులాల్ రానుంది. అలాగే కాశీ వ్యాపారులు కూడా విశ్వేశ్వరునికి హెర్బల్ గులాల్ సమర్పించనున్నారు. హోలీ వేడుకల్లో మహాశివుడు, పార్వతిమాత ఆసీనులయ్యే సింహాసనం ప్రస్తుతం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. హోలీ వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. -
విద్యా సంస్కరణలకు అద్దంపట్టేలా రాష్ట్ర శకటం
సాక్షి, న్యూఢిల్లీ : 75వ గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో భాగంగా జనవరి 26న న్యూఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో ఆంధ్రప్రదేశ్ శకటాన్ని ప్రదర్శించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో చేపట్టిన సంస్కరణలకు అద్దంపట్టేలా ‘‘ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల విద్యను మార్చడం – విద్యార్థులను ప్రపంచవ్యాప్తంగా పోటీపడేలా చేయడం’’ అనే ఇతివృత్తంతో శకటాన్ని రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు, వినూత్న పథకాలను తీసుకురావడంతో పాటు కార్పొరేట్ పాఠశాలలకు పోటీగా ప్రభుత్వ పాఠశాలలను అప్‌గ్రేడ్ చేస్తోందని, తద్వారా విద్యార్థులను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతోందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కేంద్రానికి వివరించింది. ఇప్పటికే 62 వేల డిజిటల్ క్లాస్‌రూమ్‌ల ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త చరిత్ర సృష్టించింది. ‘మనబడి నాడు–నేడు’ కార్యక్రమం ద్వారా ఇంగ్లిష్ ల్యాబ్, ఫర్నిచర్, గ్రీన్ చాక్ బోర్డులు, స్మార్ట్ టీవీ, డిజిటల్ క్లాస్ రూమ్‌లు, ప్లే గ్రౌండ్ తదితర మౌలిక సదుపాయాలు కల్పించింది. విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో నాణ్యమైన విద్యను అందిస్తోంది. ఈ అంశాన్ని అందరినీ ఆకట్టుకునేలా శకటంలో ప్రదర్శించనున్నారు. దీనికి సంబంధించి 55 సెకెన్ల నిడివిగల థీమ్ సాంగ్ రూపొందించామని, శకటం పరేడ్‌లో ప్రదర్శనకు సిద్ధమైందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. -
భాగ్య నగరి నుంచి... ఆయోధ్యా పురికి!
హైదరాబాద్: అయోధ్యలో రామాలయ నిర్మాణం ప్రతిష్టాత్మకంగా జరుగుతోంది. యావత్ దేశం ఇందులో పాలు పంచుకుంటోంది. అయోధ్య రాముని ఆలయానికి తలుపులు హైదరాబాద్‌లోనే తయారవుతున్నాయి. హైదరాబాద్‌కు చెందిన సంస్థే ఈ పనిని చేపట్టింది. గర్భగుడి తలుపులతో పాటు ప్రధాన ఆలయం చుట్టూ ఉన్న అన్ని తలుపులను రూపొందిస్తోంది. హైదరాబాద్‌కు చెందిన అనురాధ టింబర్ డిపో ఆలయ తలుపులను సిద్ధం చేస్తోంది. గత ఏడాది జూన్ నుంచి ఈ పనులను ప్రారంభించారు. ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయి. సంస్థ డైరెక్టర్ శరత్ బాబు మాట్లాడుతూ.. గర్భగుడి తలుపు 5 ఏళ్ల రాముడి విగ్రహాన్ని కలిగి ఉంటుందని తెలిపారు. తలుపులు 8 అడుగుల పొడవు,12 అడుగుల వెడల్పు, ఆరు అంగుళాల మందంతో బలంగా ఉంటాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఆలయం చుట్టూ 100 ఫ్రేమ్‌లను ఏర్పాటు చేశామని వెల్లడించారు. 118 తలుపులు పూర్తి చేశామని స్పష్టం చేశారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు. అయోధ్య రామాలయ తలుపులు తమిళనాడుకు చెందిన హస్తకళాకారులు నిర్మించారు. తామర, నెమళ్లు సంప్రదాయ భారతీయ సాంస్కృతిక చిహ్నాలతో నగారా శైలిలో తయారు చేశారు. నగారా అనేది ఉత్తర భారతీయ ఆలయ నిర్మాణ శైలి. ఇది గుప్తుల కాలంలో మూడవ శతాబ్దంలో ప్రారంభమై ముస్లింల ఆగమనం వరకు కొనసాగింది. తలుపులకు మహారాష్ట్రకు చెందిన బలార్షా టేకు చెక్కను ఉపయోగించారు. ఈ చెక్క భాగం బంగారు రేకుతో కప్పబడి ఉంటుంది. రామాలయ తలుపులు నిర్మించడానికి దేశంలో ప్రధాన సంస్థలకు ఆలయ కమిటీ ఆహ్వానించింది. ఇందులో హైదరాబాద్‌కు చెందిన సంస్థకే ఈ పనిని అప్పగించారు. జనవరి 22న ఆలయ ప్రారంభోత్సవం జరగనుంది. ఆలయ మొదటి అంతస్తు వరకు నిర్మాణం పూర్తైంది. ప్రస్తుతం అలంకరణల పని జరుగుతోంది. ఇదీ చదవండి: 'రామాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందలేదు' -
కల్తీ మద్యానికి అవకాశం లేకుండా విశాఖలో ఎక్సైజ్ లేబొరేటరీ
దొండపర్తి(విశాఖ దక్షిణ)/ఆనందపురం(భీమిలి) : కల్తీ మద్యాన్ని పరీక్షించేందుకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆంధ్రా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన అత్యాధునిక ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ లేబోరేటరీని గురువారం డిప్యూటీ సీఎం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కె.నారాయణస్వామి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి హాని కలగకుండా, కల్తీ మద్యానికి అవకాశం లేకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ల్యాబ్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పారు. ప్రజలకు మెరుగైన విద్య, ఆరోగ్యం, సంక్షేమం అందించడమే నిజమైన అభివృద్ధి అని, అదే సీఎం జగన్ సంకల్పమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఇటువంటి ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని ఎక్సైజ్ అధికారులు చంద్రబాబును కోరినప్పటికీ.. ఆయన పట్టించుకోలేదని విమర్శించారు. ఇదిలా ఉండగా ఆనందపురం మండలం గోరింటలో రూ.20 కోట్లతో నిరి్మంచనున్న ఎక్సైజ్ శాఖ కాంప్లెక్స్, ఏపీఎస్‌బీసీఎల్ డిపో నిర్మాణ పనులకు నారాయణస్వామి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ బొమ్మ పెట్టుకుని జగన్ రాష్ట్రమంతా తిరిగి సీఎం అయ్యారని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఫొటో పట్టుకుని తిరిగి లోకేశ్ ఒక్క సీటైనా గెలవాలని సవాల్ విసిరారు. చంద్రబాబు ఒక అవినీతి చక్రవర్తి అని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో రూ.1000 కోట్ల కుంభకోణానికి పాల్పడిందని, చంద్రబాబు అక్రమాలను రోడ్డు మీదకు లాగుతానని చెప్పిన దత్తపుత్రుడు పవన్.. ఇప్పుడు ఏం చేస్తున్నాడని ప్రశి్నంచారు. తండ్రి చావుకు కారకుడైన బాబుకు పురందేశ్వరి వత్తాసు పలకడం హాస్యాస్పదం కల్తీ మద్యం తాగడం వల్లే విశాఖలో ఇద్దరు చనిపోయారని పురందేశ్వరి అన్న వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన మండిపడ్డారు. కల్తీ మద్యం కారణంగానే ఎవరైనా చనిపోయారని నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమన్నారు. తండ్రి చావుకు కారణమైన బాబుకు పురందేశ్వరి వత్తాసు పలకడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మార్గదర్శి అక్రమాలపై విచారణ జరుపుతున్నందుకే ఈనాడులో రామోజీరావు తప్పుడు రాతలు రాస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమాల్లో మంత్రి గుడివాడ అమర్నాథ్, నగర మేయర్ గొలగాని హరివెంకటకుమారి, వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, డీసీసీబీ చైర్మన్ కోలా గురువులు, ఏయూ వీసీ ప్రసాదరెడ్డి తదితరులున్నారు. -
కోవిడ్ సన్నద్ధతపై దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్.. అప్రమత్తంగా ఉండాల్సిందే!
దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండంటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. గతవారం దీనిపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించి, రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా సూచించారు. ఇందులో భాగంగానే అధికారులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులలో సౌకర్యాలపై ఈ రోజు (సోమవారం), రేపు (మంగళవారం) దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే హర్యానాలోని ఝజ్జర్ ఎయిమ్స్‌లో మాండవియా మాక్‌డ్రిల్‌ను పర్యవేక్షించనున్నట్లు సమాచారం. ఈ మేరకు మాండవియా ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇటీవల కరోనా కేసులు గణనీయంగా పెరుతున్నాయని అన్నారు. దానికి అనుగుణంగా ప్రభుత్వం కూడా ఎదుర్కొనేలా సంసిద్ధంగా ఉందని నొక్కి చెప్పారు. అంతేగాదు ఆస్పత్రిలో సంరక్షణ ఏర్పాట్లు, సంసిద్ధతపై వారానికోసారి సమీక్ష జరుగుతుందని కూడా తెలిపారు. అలాగే పెరుగుతున్న ఈ కేసుల దృష్ట్యా కరోనా నాలుగో వేవ్‌పై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. చివరి కోవిడ్ మ్యూటేషన్ ఓమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్.7, ఇప్పుడు వస్తున్న మరో వేరియంట్ ఎక్స్‌బీబీ 1.16 వంటి కారణంగానే కేసులు పెరుగుతున్నాయన్నారు. ఐతే ఈ ఉప వేరియంట్లు అంత ప్రమాదకరమైనవి కాదని చెప్పారు. కొత్త వేరియంట్లతో సంబంధం లేకుండా 'టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేట్' అనే కోవిడ్ నిర్వహణ, పర్యవేక్షణకు సంబంధించిన ఫైవ్ ఫోల్డ్ స్ట్రాటజీ సిద్దంగా ఉందని చెప్పారు. కాగా, గత కొన్ని రోజులుగా దేశంలో చాలా ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నందున అనేక రాష్ట్రాల్లో మళ్లీ మాస్కులు తప్పనిసరి చేయడమేగాక మరికొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించింది కేంద్రం. ముందుజాగ్రత్తగా హర్యానా, పుదుచ్చేరి వంటి రాష్ట్రాలుబహిరంగ ప్రదేశాల్లో ముఖానికి మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేసింది. అలాగే హర్యానలోని పాఠశాలల్లో కూడా మాస్క్‌లు తప్పనిసరి చేయడమే గాక ఉత్తరప్రదేశ్‌లో 'అధిక ప్రాధాన్యత' పేరుతో విమానాశ్రయాల్లో అంతర్జాతీయ ప్రయాణికులను స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించేలా అధికారులను ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం. (చదవండి: మహారాష్ట్ర ఆలయంలో విషాదం..చెట్టుకూలి ఏడుగురు మృతి) -
తరువాతి మహమ్మారికి సిద్ధంగా ఉండాలి!
జెనీవా : కరోనా మహమ్మారితో ప్రపంచమంతా అతలాకుతలమవుతున్నవేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసన్ మరో సంచలన హెచ్చరిక చేశారు. "ఇదే చివరి మహమ్మారి కాదు" అని జెనీవాలో ఒక వార్తా సమావేశంలో పేర్కొన్నారు. ప్రపంచం తదుపరి మహమ్మారికి సిద్ధంగా ఉంటే మంచిది అని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రపంచదేశాలు ప్రజారోగ్యంపై మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారి ఒక్కటే ప్రపంచానికి చివరిది కాదు, మున్ముందు మరిన్ని ప్రాణాంతక మహమ్మారులు వచ్చే అవకాశం లేకపోలేదని అధనామ్ అన్నారు. మహమ్మారి అనేది జీవిత వాస్తవం.. అది జీవితంలో ఒక భాగం. అందుకే భవిష్యత్‌లో మహమ్మారి వస్తే దానిని ఎదుర్కొనేందుకు ప్రపంచదేశాలు ప్రస్తుతం కంటే మెరుగ్గా సిద్ధంగా ఉండాలని సూచించారు. భవిష్యత్‌లో ప్రజారోగ్యంపై అన్ని దేశాలు మరింత శ్రద్ధ పెట్టాలని, భారీగా ఖర్చు చేయాలని టెడ్రోస్ వెల్లడించారు. కాగా 2019 డిసెంబర్లో చైనాలో మొదటి కేసు గుర్తించగా క్రమంగా అది ప్రపంచ దేశాలను చుట్టేసింది. అమెరికా, భారత్, బ్రెజిల్ దేశాలు ఈ మమమ్మారికి భారీగా ప్రభావితమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 27.19 మిలియన్ల ప్రజలు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. 8,88,326 మంది ప్రాణాలు కోల్పోయారు. -
తెలంగాణ కొత్త సచివాలయనికి రంగం సిద్దం
-
బ్రెగ్జిట్ పరిణామాలకు సిద్ధం -ఆర్థిక శాఖ
న్యూఢిల్లీ: బ్రెగ్జిట్ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. యూరోపియన్ యూనియన్ లో బ్రిటన్ కొనసాగింపుపై జరగనున్న బ్రిటన్‌లో ప్రజాభిప్రాయ పరిసర పరిణామాలను గమనిస్తున్నామని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసకున్నామని తెలిపారు. బ్రిటన్ ఈయూ నుంచి వైదొలగితే.. తదనంతర పరిణామాలకు భారతదేశం సిద్ధంగా ఉందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ ప్రకటించారు. దీనిపై గురువారం కీలకమైన ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో బ్రిటన్ లో చోటు చేసుకోబోయే పరిణామాలను గమనిస్తామని.. దీనికి అన్నివిధాలా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో కీలమైన భారత్ పై మొత్తం ట్రెండ్ ప్రభావం చూపే అవకాశం ఉందని, భారీ హెచ్చు తగ్గులు, ఒడిదుడుకులు చోటు చేసుకునే అవకాశం ఉందని, తగిన చర్చలుతీసుకోవాల్సిందిగా గ్లోబల్ ఫండ్ మేనేజర్లు ప్రభుత్వాన్ని కోరినట్టు అసోచామ్ రిపోర్టు చేసింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) మిగిలిన ఐరోపా దేశాలతో పోలిస్తే బ్రిటన్ లోనే పెట్టుబడులతో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలోమూడవది ఇండియా. ఐరోపా మార్కెట్లలో బ్రిటన్ భారతీయ కంపెనీలకు కీలకమైంది. వ్యక్తిగత దేశాలతో భారతదేశం ద్వైపాక్షిక వాణిజ్యంలో బ్రిటన్ 12 వ స్థానంలో ఉంది. భారతదేశం ..వాణిజ్య మిగులును అనుభవిస్తున్న 25 దేశాల్లో ఏడవస్థానంలో ఉంది. వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల నివేదిక ప్రకారం బ్రిటన్ తో భారతదేశ వర్తకంలో 2015-16 ఆర్థిక సంవ్సతరంలో 8,83 బిలియన్ ఎగుమతులు , 5.19 డాలర్ల దిగుమతులను కలిగింది. ఫిక్కీ కూడా యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ నిష్క్రమణ ప్రభావం భారత వ్యాపారాలకు గణనీయమైన అనిశ్చితి, బహుశా పెట్టుబడులు, ఆ దేశానికి నిపుణుల తరలింపు పై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పారు. అటు ఈ రిఫరెండం నేపథ్యంలో మార్కెట్లు భారతదేశం నెర్వస్ గా ఉన్నాయి. -
పురపోరు నేడే
♦ సిద్దిపేట మున్సిపాలిటీలో ఎన్నికలకు సర్వం సిద్ధం ♦ పోలింగ్ కేంద్రాలకు తరలిన ఈవీఎంలు సిద్దిపేట జోన్: స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ సిద్దిపేటలోని 28 వార్డులకు బుధవారం పోలింగ్ నిర్వహించడానికి ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉదయం 7నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్ కోసం పట్టణంలోని 72 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 74.710 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్‌కు సంబంధించిన ఈవీఎంల పంపిణీ, సిబ్బందికి సామగ్రి అందజేత ప్రక్రియలను మంగ ళవారం పొన్నాల గ్రామ శివారులోని ఇందూరు ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించారు. 34 వార్డులకు గాను ఆరు వార్డులు టీఆర్ఎస్ ఖాతలో పడిన విషయం తెలిసిందే. మిగిలిన 28 వార్డుల్లో ఎన్నికలను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం 8 జోనల్ అధికారులను, 8 రూట్లుగా విభజించి, 8 మంది అధికారులను రూట్ అధికారులను నియమించింది. ఈ ఎన్నికలను సీనియర్ ఐఏఎస్ అధికారి దినకర్ బాబు, ఎన్నికల వ్యయ పరిశీలకులుగా విజయ్‌కుమార్ వ్యవహరిస్తున్నారు. సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల అధికారిగా కమిషనర్ రమణాచారి ఏర్పాట్లను పర్యవేక్షించారు. పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ విధానం అమర్చారు. దీని ద్వారా ప్రతి క్షణం పోలింగ్ ప్రక్రియను వీడియో ద్వారా చిత్రీకరించనున్నారు. అదే విధంగా రెండు పోలింగ్ స్టేషన్లను కలిపి ఒక మైక్రో అబ్జర్వర్‌ను నియమించారు. సున్నిత ప్రాంతాల్లోని పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ ప్రక్రియను అధికారులు వీడియో చిత్రీకరించనున్నారు. ఎన్నికల సిబ్బందికి పట్టణ శివారులోని పొన్నాల ఇంజనీరింగ్ కళాశాలలో అధికారులు పోలింగ్ సామగ్రి పంపిణీ చేశారు. మంగళవారం రాత్రి ఆయా పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకునేలా ఎన్నికల అధికారులు ఆదేశాలు జారీ చేశారు. -
ఏపీపీఎస్సీ కొత్త సిలబస్ సిద్ధం
రెండు మూడ్రోజుల్లో అధికారిక వెబ్సైట్లోకి సాక్షి,హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) పోటీ పరీక్షల కోసం కొత్త సిలబస్‌ను సిద్ధం చేసింది. గ్రూప్-1 మొదలుకొని తక్కిన అన్ని గ్రూపుల పరీక్షలకు సిలబస్‌ను రూపొందించింది. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్లు, ప్రముఖ విద్యావేత్తలతో కూడిన బృందం రూపొందించిన ఈ ముసాయిదా సిలబస్ నివేదికలు ఇటీవలే ఏపీపీఎస్సీకి అందాయి. నాగార్జున యూనివర్సిటీ కేంద్రంగా ఈ కసరత్తు సాగింది. ఉమ్మడి ఏపీపీఎస్సీలోని సిలబస్‌లో స్వల్పంగానే మార్పులు చేసి, కొత్తగా అదనపు అంశాలను జోడించినట్లు సమాచారం. ఉమ్మడి రాష్ట్ర విభజనానంతరం పరిస్థితుల్లో ఏపీలోని అంశాలకు కొంత ప్రాధాన్యత ఇచ్చేలా ఈ సిలబస్‌ను తయారు చేశారు. ముఖ్యంగా కొత్త రాజధాని అమరావతి చారిత్రక విశేషాలకు ప్రాధాన్యత కల్పించారు. అలాగే 13 జిల్లాల్లోని అంశాలకు పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో తెలంగాణ ప్రాంతం అంశాలకు కూడా సముచిత ప్రాధాన్యం కల్పించేలా సిలబస్‌ను రూపొందించినట్లు చెబుతున్నారు. ఈ ముసాయిదా సిలబస్‌ను రెండు, మూడురోజుల్లో ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో పెట్టనున్నారు. పదిరోజుల పాటు నిపుణులు ఇతర ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం వాటిని మళ్లీ నిపుణుల కమిటీకి సమర్పిస్తారు. కమిటీలో చర్చించిన తదుపరి తుది సిలబస్‌ను ఏపీపీఎస్సీ ఖరారు చేస్తుందని సంస్థ ఉన్నతాధికారవర్గాలు వివరించాయి. -
130 అణ్వాయుధాలతో భారత్‌పై గురి!
-
‘విద్యుత్ ఉద్యోగుల’పై చర్చా మార్గం
► ఏపీకి పంపినవారిపై కోర్టు బయట పరిష్కారానికి తెలంగాణ, ఏపీ సిద్ధం ► వివాద పరిష్కారంపై చొరవ చూపిన టీ ట్రాన్స్‌కో సీఎండీ ► అవసరమైతే కొంత మందిని వెనక్కి తీసుకునే యోచన? సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం కొంత మెత్తబడింది. ఆంధ్రప్రదేశ్‌కు రిలీవ్ చేసిన 1,252 మంది ఉద్యోగుల్లో అవసరమైతే కొంత మందిని శాశ్వత ప్రాతిపదికన వెనక్కి తీసుకుని... ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. చర్చల ద్వారా న్యాయస్థానం వెలుపలే ఈ వివాదానికి ముగింపు పలికి, ఏపీతో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని భావిస్తోంది. దీనిపై ఏపీ సర్కారు కూడా సానుకూలంగా స్పందించింది. ఇరు రాష్ట్రాల విద్యుత్ సంస్థల సీఎండీలు సమావేశమై చర్చల ద్వారా ఉద్యోగుల విభజన వివాదాన్ని పరిష్కరించుకుందామని తాజాగా టీ ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు ప్రతిపాదించగా... దానికి ఏపీ ట్రాన్స్‌కో ఎండీ కె.విజయానంద్ సమ్మతించారు. ఈ నెల 22న హైదరాబాద్‌లోని ‘విద్యుత్ సౌధ’లో ఇరు రాష్ట్రాల విద్యుత్ సంస్థల సీఎండీలు, హెచ్ఆర్ విభాగం డెరైక్టర్లు సమావేశమై చర్చలు జరపాలని ఇరుపక్షాలు ఓ అంగీకారానికి వచ్చాయి. శాశ్వత పరిష్కారం కోసం.. పుట్టినచోటు ఆధారంగా స్థానికతను పరిగణనలోకి తీసుకుని విద్యుత్ ఉద్యోగుల విభజన జరిపేందుకు గతేడాది జూన్ 6న తెలంగాణ ఇంధన శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ తర్వాత రెండు మూడు రోజుల వ్యవధిలోనే 1,252 మంది ఉద్యోగులను తెలంగాణ విద్యుత్ సంస్థలు ఏపీకి పంపుతూ రిలీవ్ చేశాయి. ఆ ఉద్యోగులను తీసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అంగీకరించలేదు. కమల్‌నాథన్ కమిటీ మార్గదర్శకాల ఆధారంగానే విద్యుత్ ఉద్యోగుల విభజన జరపాలని వాదించింది. ఇక తెలంగాణ సర్కారు నిర్ణయంపై రిలీవైన ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో రిలీవైన ఉద్యోగులను తెలంగాణ విద్యుత్ సంస్థలు మూడు నెలల కింద తాత్కాలికంగా విధుల్లో తీసుకున్నాయి. కోర్టు సూచనల మేరకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు 52:48 నిష్పత్తిలో ఈ ఉద్యోగులకు జీతభత్యాలను చెల్లిస్తున్నాయి. తాజాగా ఈ వివాదాన్ని వేగంగా పరిష్కరించేందుకు ఈ నెల 20 నుంచి రోజువారీగా విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఇటీవలే హైకోర్టును ఆదేశించింది. దీంతో బుధవారం నుంచి హైకోర్టులో రోజువారీగా విచారణ జరగనున్న నేపథ్యంలో... చర్చల ద్వారా కోర్టు వెలుపలే వివాదానికి ముగింపు పలుకుదామని ఇరు రాష్ట్రాలు ఓ అభిప్రాయానికి వచ్చాయి. పెద్దగా తేడా ఉండదంటున్న టీ-సంస్థలు ఏపీ డిమాండ్‌కు అనుగుణంగా కమల్‌నాథన్ కమిటీ మార్గదర్శకాల ప్రకారమే ఉద్యోగుల తుది విభజన జరిపినా... ఇప్పటికే ఏపీకి పంపిన ఉద్యోగుల సంఖ్యలో పెద్దగా వ్యత్యాసం ఉండదని తెలంగాణ విద్యుత్ సంస్థలు భావిస్తున్నాయి. కమల్‌నాథన్ మార్గదర్శకాల ప్రకారం ఉద్యోగుల విభజనపై లెక్కలు సైతం వేసి చూశాయి. ఆ ప్రకారం చూసినా రిలీవైన 1,252 మంది ఉద్యోగుల్లో 100-200 మంది మాత్రమే తిరిగి తెలంగాణకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశాయి. వారిని వెనక్కి తీసుకోడానికి ఒప్పుకున్నా పెద్దగా నష్టం లేదని... ఏపీలో పనిచేస్తున్న 450 మంది తెలంగాణ ఉద్యోగులు సైతం రాష్ట్రానికి తిరిగి వచ్చేందుకు మార్గం సుగమం అవుతుందని భావిస్తున్నాయి. -
వాళ్ల కోసం లక్ష చపాతీలు
బెంగళూరు: భారీవర్షాలు, వరదలతో అతలాకుతలమైన చెన్నై ప్రజలను ఆదుకునేందుకు బెంగళూరు ప్రజలు నిరంతరాయంగా శ్రమిస్తున్నారు. అష్టకష్టాలు పడుతున్న బాధితులకు లక్ష చపాతీలను పంచేందుకు సిద్ధమవుతున్నారు. శరవేగంగా చపాతీలు తయారు చేస్తూ తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఆపదలో ఉన్న పొరుగు రాష్ట్రాన్ని ఆదుకునేందుకు కర్ణాటక ఇప్పటికే తన సహాయాన్ని ప్రకటించింది. వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రూ. 5 కోట్ల ఆర్థిక సాయం చేస్తానంది. వరదల్లో చిక్కుకున్నవారిని ఆదుకునేందుకు బెంగళూరు వాసులు సోషల్ మీడియా ద్వారా వినూత్న సేవల్ని అందించారు. దీనికోసం వారు ఒక ప్రత్యేక వెబ్ సైట్ ను రూపొందించారు. దీంతోపాటు ట్విట్టర్, ఫేస్ బుక్ లో, సహాయానికి సంబంధించిన సమాచారం, తక్షణ సహాయాన్నందించే దాతల వివరాలు తదితర సమాచారాన్ని విరివిగా అందించారు.