
బ్రెగ్జిట్ పరిణామాలకు సిద్ధం -ఆర్థిక శాఖ
న్యూఢిల్లీ: బ్రెగ్జిట్ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. యూరోపియన్ యూనియన్ లో బ్రిటన్ కొనసాగింపుపై జరగనున్న బ్రిటన్లో ప్రజాభిప్రాయ పరిసర పరిణామాలను గమనిస్తున్నామని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసకున్నామని తెలిపారు. బ్రిటన్ ఈయూ నుంచి వైదొలగితే.. తదనంతర పరిణామాలకు భారతదేశం సిద్ధంగా ఉందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ ప్రకటించారు. దీనిపై గురువారం కీలకమైన ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో బ్రిటన్ లో చోటు చేసుకోబోయే పరిణామాలను గమనిస్తామని.. దీనికి అన్నివిధాలా సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో కీలమైన భారత్ పై మొత్తం ట్రెండ్ ప్రభావం చూపే అవకాశం ఉందని, భారీ హెచ్చు తగ్గులు, ఒడిదుడుకులు చోటు చేసుకునే అవకాశం ఉందని, తగిన చర్చలుతీసుకోవాల్సిందిగా గ్లోబల్ ఫండ్ మేనేజర్లు ప్రభుత్వాన్ని కోరినట్టు అసోచామ్ రిపోర్టు చేసింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) మిగిలిన ఐరోపా దేశాలతో పోలిస్తే బ్రిటన్ లోనే పెట్టుబడులతో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలోమూడవది ఇండియా. ఐరోపా మార్కెట్లలో బ్రిటన్ భారతీయ కంపెనీలకు కీలకమైంది. వ్యక్తిగత దేశాలతో భారతదేశం ద్వైపాక్షిక వాణిజ్యంలో బ్రిటన్ 12 వ స్థానంలో ఉంది. భారతదేశం ..వాణిజ్య మిగులును అనుభవిస్తున్న 25 దేశాల్లో ఏడవస్థానంలో ఉంది. వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల నివేదిక ప్రకారం బ్రిటన్ తో భారతదేశ వర్తకంలో 2015-16 ఆర్థిక సంవ్సతరంలో 8,83 బిలియన్ ఎగుమతులు , 5.19 డాలర్ల దిగుమతులను కలిగింది. ఫిక్కీ కూడా యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ నిష్క్రమణ ప్రభావం భారత వ్యాపారాలకు గణనీయమైన అనిశ్చితి, బహుశా పెట్టుబడులు, ఆ దేశానికి నిపుణుల తరలింపు పై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పారు. అటు ఈ రిఫరెండం నేపథ్యంలో మార్కెట్లు భారతదేశం నెర్వస్ గా ఉన్నాయి.