సాక్షి, తిరుపతి: చంద్రబాబుకు దమ్ము, ధైర్యముంటే కొత్త పార్టీ పెట్టి పోటీ చేయాలని డిప్యూటీ సీఎం నారాయణస్వామి సవాల్ విసిరారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడారు. మంత్రి పదవులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం శిరోధార్యమన్నారు. తమకు పదవులు ఉన్నా లేకున్నా వైఎస్ జగన్‌తోనే ఉంటామని స్పష్టం చేశారు.
చదవండి: టీడీపీలో భగ్గుమన్న విభేదాలు.. జేసీపై పల్లె సంచలన వ్యాఖ్యలు
సీఎం జగన్‌కు మరింత మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకున్నానని.. దేవుని అనుగ్రహం, ప్రజల ఆశీస్సులు ఉన్నంత కాలం వైఎస్ జగన్ సీఎంగానే ఉంటారని, అన్ని అనుకూలిస్తే 15 సంవత్సరాల తర్వాత సీఎం జగన్ ప్రధాని అవుతారని నారాయణ స్వామి అన్నారు. వేషాలు వేసుకునే వాళ్లు రాజకీయాలకు పనికిరారని.. ఎన్టీఆర్‌పై నేను పోటీ చేస్తా అన్న చంద్రబాబు.. నేడు ఆ తెలుగుదేశం పార్టీ వారసులుగా చలామణి అవుతున్నాడు. చంద్రబాబుకు దమ్ము ధైర్యం వుంటే.. కొత్త పార్టీ పెట్టి పోటీ చేయాలని.. అలా గెలిస్తే తాను రాజకీయాల నుండి తప్పుకుంటాని నారాయణ స్వామి సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment