సాక్షి, విశాఖపట్నం: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలు అమలు జరిగేలా చర్యలు చేపట్టారు. పాఠశాల ప్రారంభానికి ముందే ప్రతి విద్యార్థి చేతులు శానిటేషన్‌తో శుభ్రం చేసుకున్న తర్వాతే లోపలికి అనుమతిస్తారు. అదే సమయంలో ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థి టెంపరేచర్‌ను కూడా పరీక్షిస్తారు. అనుమానిత లక్షణాలు ఉంటే దగ్గరలో ఉన్న ప్రాథమిక వైద్య కేంద్రానికి కూడా తల్లిదండ్రుల ద్వారా తీసుకువెళ్లే ఏర్పాట్లు కూడా చేశారు. జిల్లాలోని 942 ప్రభుత్వ పాఠశాలలో ఈ చర్యలు చేపట్టారు.
తాజా అంచనాల బట్టి దాదాపు 98 వేల మంది విద్యార్థులు సగటున ప్రతి రోజు తరగతులకు హాజరవుతున్నట్టు విద్యా శాఖ చెబుతోంది. అదే సమయంలో ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఇప్పటికే వివిధ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక అనుమానిత లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు నిర్వహించుకోవాలని కూడా అధికారులు ఆదేశించారు. ప్రతిరోజు కోవిడ్ నిబంధనల అమలుపై జిల్లా విద్యాశాఖ అధికారి తనిఖీలు నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం పెందుర్తి జిల్లా పరిషత్ పాఠశాలలో డీఈవో లింగేశ్వర రెడ్డి తనిఖీలు చేపట్టి కోవిడ్ నిబంధనలు అమలు తీరుపై ఆరా తీశారు.
Comments
Please login to add a commentAdd a comment