జిల్లాలో షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. విశాఖ ప్రజలు షర్మిలకు బ్రహ్మరధం పడుతున్నారు. షర్మిల సబ్బవరం రాకతో జనసంద్రమైంది. పాదయాత్రలో భాగంగా సబ్బవరంలో ఏర్పాటు చేసిన సభకు జనం భారీగా తరలివచ్చారు. అశేష జనవాహిన నడుమ షర్మిల ప్రసంగించారు. రైతులంటే ప్రభుత్వానికి చిన్నచూపాని షర్మిల మండిపడ్డారు. దిగ్విజయ్ సింగ్ చెప్పినట్లు జగనన్నది కాంగ్రెస్ డీఎన్‌ఏ కాదని, విశ్వసనీయతే జగనన్న డీఎన్‌ఏ అని షర్మిల తెలిపారు. కాంగ్రెస్ పార్టీదే వెన్నుపోటు డీఎన్‌ఏ అని షర్మిల విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి వై.ఎస్.రాజశేఖరరెడ్డి 30 ఏళ్లు సేవచేశారని ఆమె తెలిపారు. వైఎస్ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చి వెన్నుపోటు పొడిచారన్నారు.