sabbavaram
-
విశాఖ పెట్రోలియం ఇన్స్టిట్యూట్కు ఓకే
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం సమీపంలో సబ్బవరం వద్ద ఏర్పాటవుతున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ) పనులకు ఆటంకం కలిగించడానికి వీల్లేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. జాతీయ ప్రాముఖ్యత దృష్ట్యా ఈ సంస్థ నిర్మాణాన్ని ఆపడం సాధ్యం కాదని తెలిపింది. ఈ సంస్థ ఏర్పాటు కోసం సేకరించిన భూమికి ప్రభుత్వం ఎకరానికి అందించే రూ.13 లక్షల పరిహారం చాలదంటూ 29 మంది పిటిషనర్లు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఆరేళ్లుగా కోర్టులో వివాదం నడుస్తోంది. ప్రభుత్వం చెల్లించే పరిహారంతో పిటిషనర్లు నష్టపోతున్నారంటూ వారి తరఫు న్యాయవాది వాదించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదిని కోరింది. మరోవైపు భూములు ఇచ్చిన డీ–పట్టాదారులకు అదనంగా ఎకారానికి రూ.5.50 లక్షలు చెల్లించాలని, ఈ మొత్తాన్ని రెండు వారాల్లోగా కోర్టులో డిపాజిటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద వీరిలో తొమ్మిది మందిని విచారించి నష్టపరిహారానికి అర్హులో కాదో గుర్తించి కోర్టుకు 45 రోజుల్లో నివేదిక అందజేయాలని ఆదేశించారు. ఐఐపీఈ పనులకు పిటిషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ అవాంతరాలు సృష్టించరాదని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఐఐపీఈతో ప్రయోజనాలివీ.. ఐఐపీఈ విశాఖలో 2016లో ఏర్పాటైంది. ఇది ఐఐటీ, ఐఐఎంలతో సమాన స్థాయి కలిగి ఉంటోంది. పెట్రోలియం, కెమికల్ ఇంజినీరింగ్‌ల్లో అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులను ఆఫర్ చేస్తోంది. ఐఐపీఈ హెచ్‌పీసీఎల్, ఐఓసీఎల్, ఓఎన్జీసీ, గెయిల్, ఆయిల్ ఇండియా లిమిటెడ్, బీపీసీఎల్‌తో పాటు ఐఐటీ ఖరగ్‌పూర్‌తో మెంటార్షిప్ను కలిగి ఉంది. పెట్రో యూనివర్సిటీ నిర్మాణం పూర్తయితే సుమారు 1200 మంది విద్యార్థులు బీటెక్‌లో పెట్రోలియం, కెమికల్ కోర్సులు అభ్యసించే వీలుంటుంది. అంతేకాదు.. వీటితో పాటు ఎమ్మెస్సీ, ఎంటెక్, పీహెచ్డీ కోర్సులు చేయడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం ఏయూ ప్రాంగణంలో పెట్రో వర్సిటీ కోర్సులు నిర్వహిస్తున్నారు. సబ్బవరం మండలం వంగలి సమీపంలో ఈ సంస్థ ఏర్పాటుకు ప్రభుత్వం 201.8 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందుకోసం మొత్తం రూ.1050 కోట్లకు గాను రాష్ట్ర ప్రభుత్వం చొరవతో కేంద్ర ప్రభుత్వం రూ.350 కోట్ల నిధులను మంజూరు చేసింది. కేటాయించిన స్థలంలో కొన్నాళ్లుగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇంతలో 26 ఎకరాలకు సంబంధించిన రైతులు పరిహారంపై కోర్టునాశ్రయించారు. ఈ నేపథ్యంలో ఐఐపీఈ నిర్మాణ పనులకు ఆటంకం కలిగించవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులివ్వడంతో ఇన్నాళ్లూ దీనికి ఉన్న అడ్డంకులు తొలగినట్టయింది. దీంతో ముందుగా అనుకున్నట్టు 2024–25 నాటికి ఈ వర్సిటీ నిర్మాణం పూర్తి చేసి తరగతులు ప్రారంభించే అవకాశం ఉంది. (క్లిక్: పర్యాటక ప్రాంతాలు కళకళ.. భారీగా ఆదాయం) -
జీవితం నాశనం అయింది, బతికింది చాలు
సాక్షి, సబ్బవరం (విశాఖపట్నం): మండలంలోని గొల్లలపాలెం శివారు మామిడి తోటలో స్టీల్‌ప్లాంట్ ఉద్యోగి మనస్తాపంతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గాజువాకలోని వడ్లపూడి లక్ష్మీపురం కాలనీలో నివసిస్తున్న జాజిల అప్పల రమేష్(42) స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. 10 సంవత్సరాల క్రితం మేనమామ కుమార్తె నీరజతో వివాహమైంది. ప్రస్తుతం ఆమె వీఆర్వోగా పనిచేస్తోంది. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. మనస్పర్థలతో కొన్నాళ్ల నుంచి భార్యకు దూరంగా రమేష్ ఉంటున్నాడు. (చదవండి: తల్లీకుమారుడి దారుణ హత్య) ఈ నేపథ్యంలో ‘నా జీవితం నాశనమైపోయింది. ఇక నేను బతికింది చాలు. నేను మన తోటలో ఆత్మహత్య చేసుకుంటున్నాను...’ అని ఫోన్లో కుటుంబ సభ్యులకు మెసేజ్ చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే తల్లిదండ్రులతోపాటు కుటుంబ సభ్యులు తోట వద్దకు చేరుకుని రమేష్ మృతదేహం చూసి బోరున విలపించారు. తమ కుమారుడి మృతికి కోడలు నీరజ, ఆమె తండ్రి అవిరెడ్డి సూర్యనారాయణ, చినమామ అవిరెడ్డి కనకారావు వేధింపులే కారణమని ఆరోపిస్తూ మృతుడి తండ్రి వేంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ చంద్రశేఖరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సబ్బవరంలో రూ. కోటి నగదు పట్టివేత
-
టీడీపీ వాహనంలో కోటి రూపాయలు!
సాక్షి, విశాఖపట్నం : ఎన్నికల వేళ విశాఖపట్నం జిల్లాలో నోట్లు కట్టలు తెంచుకుంటున్నాయి. సబ్బవరంలో పోలీసుల తనిఖీల్లో కోటి రూపాయలు పట్టుబడ్డాయి. టీడీపీ కి చెందిన నేత కారులో నుంచి ఈ సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ సోమ్ము గ్రామీణ బ్యాంకుకు చెందినదిగా తరలించిన వ్యక్తులు చెబుతున్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న ఈ సొమ్ము నగరానికి చెందిన ఓ మంత్రికి సంబంధించినదిగా తెలుస్తోంది. పోలీసులు కూడా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది. మీడియా అడిగిన వివరాలను పోలీసులు వెల్లడించలేదు. నగదు పంపిణీకి ఏపీ గ్రామీణ బ్యాంక్‌ను టీడీపీ నేతలు వాడుకుంటున్నట్లు తెలుస్తోంది. -
సబ్బవరం నియోజకవర్గంలో జననేత వెంట జనం...
-
జనసంద్రంగా మారిన సబ్బవరం కూడళ్లు
-
రాష్ట్రంలో పాలన లేదు.. వ్యవసాయం లేదు
-
పెదబాబు పర్మిషన్, చినబాబుకు కమిషన్ : వైఎస్ జగన్
సాక్షి, సబ్బవరం : చంద్రబాబుకు విశాఖ భూములపై కన్ను పడిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. బాబు గజానికో కబ్జాకోరును తయారు చేశారని నిప్పులు చెరిగారు. 255వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా సబ్బవరంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అక్రమాలకు పెదబాబు పర్మిషన్ ఇస్తే చినబాబు కమిషన్ వసూలు చేస్కుంటాడని ధ్వజమెత్తారు. రికార్డుల తారుమారుతో పెందుర్తిలో పేదవాడి అసైన్డ్ భూములను లాకున్నారని ఆరోపించారు. అమ్మకానికి వీలులేని లేని అసైన్డ్ భూములను చంద్రబాబు బీనామీలతో తక్కువ ధరకే కొనుగోలు చేయించారని అన్నారు. అనంతరం ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతుల దగ్గర నుంచి భూములను లాక్కుని ప్రభుత్వానికి ఇచ్చారని తెలిపారు. మళ్లీ అవే భూముల్లో పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్తున్న బాబు దారుణమైన పాలనపై వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. భూ దందాలు చేస్తున్న టీడీపీ నాయకులకు తండ్రి చంద్రబాబు, కొడుకు లోకేష్ బాబు అండదండలు దండిగా ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో చోటుచేసుకున్న అన్ని స్కాముల్లో ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, పెదబాబు, చినబాబుల పాత్ర ఉందని విమర్శించారు. సబ్బవరం బహిరంగ సభలో వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే.. దేశం మొత్తంలో 16 లా యూనివర్సిటీలు ఉండగా.. ఏపీలో ఒక యూనివర్సిటీ ఉండాలని దివంగత నేత, నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పట్టుబట్టారని ఆయన తెలిపారు. వైఎస్ చొరవతో సబ్బవరంలో దామోదరం సంజీవయ్య లా యూనివర్సిటీ ఏర్పాటైందని వెల్లడించారు. పెందుర్తి నియోజకవర్గంలో మహిళపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైఎస్ జగన్ మండిపడ్డారు. ఎన్టీపీసీ నుంచి వెలువడుతున్న కాలుష్యంతో ఎన్నో గ్రామాల ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నా చంద్రబాబుకు పట్టడం లేదనీ, అధికారంలోకి రాగానే ఎన్టీపీసీ సమస్యను పరిష్కరిస్తామని వైఎస్ జగన్ వెల్లడించారు. పరిశ్రమల్లోని ఉద్యోగాలు స్థానికులకే.. ఫార్మాసిటీ వంటి భారీ పరిశ్రమలు ఉన్నా స్థానికులకు ఉద్యోగాలు దక్కడం లేదని అన్నారు. 75 శాతం ఉంద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా అధికారంలోకి రాగానే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతామని చెప్పారు. రాష్ట్రంలో పాలన లేదని విమర్శించారు. వ్యవసాయ రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతోందనీ, సహకారం రంగంలో ఉన్న చక్కెర ఫ్యాక్టరీలు మూతపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీ ఏమైంది..? అధికారంలోకి రాగానే రైతులకు బేషరతుగా రుణమాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు మాట తప్పారని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు పాలనలో ప్రజారోగ్యం అటకెక్కిందని అన్నారు. హైదరాబాద్‌లో వైద్యం చేయించుకోవడానికి ఆరోగ్య శ్రీ సేవల్ని అనుమంతించకపోవడం దారుణమన్నారు. మంత్రి యనమల రామకృష్ణుడు మాత్రం సింగపూర్‌లో పంటి వైద్యం చేయించుకుంటారని ఎద్దేవా చేశారు. -
255వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
సాక్షి, సబ్బవరం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏప్రీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 255వ రోజు ప్రారంభమైంది. విశాఖపట్నం జిల్లా గళ్లేపల్లి నుంచి ప్రారంభమై రావులమ్మపాలెం క్రాస్, ఆదిరెడ్డిపాలెం క్రాస్, సబ్బవరం వరకు వైఎస్ జగన్ పాదయాత్ర సాగనుంది. సబ్బవరంలో సాయంత్రం జరిగే భారీ బహిరంగ సభలో వైఎస్ జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. రాత్రికి చిన్నగొళ్లాలపాలెం క్రాస్ వద్ద వైఎస్ జగన్ బసచేస్తారు. వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర విశాఖ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. పాదయాత్రలో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకుసాగుతున్నారు. ఇప్పటివరకు వైఎస్ జగన్ 2,894.1 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. -
జిల్లా స్థాయి వాలీబాల్ విజేత సబ్బవరం
మునగపాక: కళాకారులు, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గ్రామీణ యువజన మందిరం అందిస్తున్న సేవలు అభినందనీయమని ఆర్ఈసీఎస్ మాజీ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్ కొనియాడారు. క్రీడాకారులు కూడా తమలో ఉన్న ప్రతిభను వెలికితీసి ఉన్నత స్థానాలను అధిరోహించాలన్నారు. గ్రామీణ యువజన మందిరం 52వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఆయన సోమవారం రాత్రి బహుమతిప్రధానం చేశారు. ఈసందర్బంగా ప్రసాద్ మాట్లాడుతూ క్రీడల ద్వారా శారీరక దారుడ్యంపెరగడంతోపాటు మానసిక ఉల్లాసం పెరుగుతుందన్నారు. యువజన మందిరం ద్వారా ఏటా కళాకారులు, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఇటువంటి పోటీలు నిర్వహించడం సంతోషదాయకమన్నారు. క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో తగిన గుర్తింపు పొందాలన్నారు. క్రీడల్లో రాణించేవారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉంటాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంతోమంది క్రీడాకారులున్నారని వారిని ప్రోత్సహిస్తే ఉన్నత స్థానాలకు చేరుకుంటారన్నారు. సబ్బవరం జట్టుకు ప్రథమ బహుమతి.. జిల్లాస్థాయి వాలీబాల్ పోటీల్లో సబ్బవరం జట్టు ప్రథమ స్థానం కైవసం చేసుకుంది.గాజువాకకు చెందిన మోడల్ జట్టు ద్వితీయ స్థానం, తోటాడ మూడో స్థానాన్ని స్థానాన్ని, మునగపాక టీమ్ నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది. -
రోడ్డు ప్రమాదంలో..ఒకరు మృతి
విశాఖపట్నం: సబ్బవరం మండల కేంద్రంలో శనివారం ఉదయం ఎదురెదురుగా వస్తున్న లారీ, బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో శ్రీకాంత్(22) అనే యువకుడు అక్కడిక్కడే మరణించాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రధానోపాధ్యాయుని దారుణ హత్య
సబ్బవరం: నంగినారపాడు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కన్నూరు సత్యనారాయణ (38) గురువారం సాయంత్రం దారుణ హత్యకు గురయ్యారు. అమృతపురం శివారు గ్రామం సూర్రెడ్డివానిపాలెం సమీపంలో రాజచెరువు వద్ద గురువారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. స్థానికుల కథనం ప్రకారం సత్యనారాయణ టెక్కలిపాలెంలోని స్వగృహంలో తల్లిదండ్రులతో ఉంటున్నాడు. ఆయన జీవీఎంసీ పరిధిలోని నంగినారపాడు ప్రాథమిక పాఠశాలలో అయిదేళ్లుగా పనిచేస్తున్నారు. గురువారం సాయంత్రం 4 గంటలకు పాఠశాల ముగిశాక బైక్‌పై ఇంటికి బయల్దేరారు. అమృతపురం శివారు సూర్రెడివానిపాలెం గ్రామం సమీపంలోని రాతిచెరువు వద్ద గుర్తు తెలియని కొందరు వ్యక్తులు అతనిపై దాడి చేయడంతో సమీపంలోని రజకులు చూసి కేకలు వేశారు. అప్పటికే సత్యనారాయణ తల వెనుక భాగంలో తీవ్ర గాయాలై రక్తపు మడుగులో పడి మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సత్యనారాయణకు భార్యతో విభేదాల వల్ల కొన్నేళ్లుగా విడిగా ఉంటున్నారు. కోర్టులో కేసు కూడా నడుస్తోంది. మృతునికి ఏడేళ్లు, మూడేళ్ల వయసున్న కుమారులున్నారు. హత్యపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్ఐ జి.గోవిందరావు, అనకాపల్లి సీఐ డి.చంద్ర సంఘటన స్థలానికి వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు. -
ట్యాంకర్ బోల్తా: ఇద్దరికి గాయాలు
చెన్నై నుంచి కొల్కత్తా వెళ్తున్న అయిల్ ట్యాంకర్ ఈ రోజు తెల్లవారుజామున విశాఖపట్నం సమీపంలోని సబ్బవరం వద్ద బోల్తా పడింది. దాంతో ట్యాంకర్ లోని స్పిరిట్ లీక్ అవుతుంది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, భద్రత సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే ట్యాంకర్ బొల్తా పడిన ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. దాంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. -
జగనన్నది కాంగ్రెస్ డీఎన్ఏ కానే కాదు: షర్మిల