
సబ్బవరంలో సాయంత్రం జరిగే భారీ బహిరంగ సభలో వైఎస్ జగన్ పాల్గొని ప్రసంగిస్తారు.
సాక్షి, సబ్బవరం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏప్రీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 255వ రోజు ప్రారంభమైంది. విశాఖపట్నం జిల్లా గళ్లేపల్లి నుంచి ప్రారంభమై రావులమ్మపాలెం క్రాస్, ఆదిరెడ్డిపాలెం క్రాస్, సబ్బవరం వరకు వైఎస్ జగన్ పాదయాత్ర సాగనుంది. సబ్బవరంలో సాయంత్రం జరిగే భారీ బహిరంగ సభలో వైఎస్ జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. రాత్రికి చిన్నగొళ్లాలపాలెం క్రాస్ వద్ద వైఎస్ జగన్ బసచేస్తారు.
వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర విశాఖ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. పాదయాత్రలో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకుసాగుతున్నారు. ఇప్పటివరకు వైఎస్ జగన్ 2,894.1 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.