
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 267వ రోజు షెడ్యూల్ ఖరారైంది. రాజన్న తనయుడు చేపట్టిన పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో భీమిలి నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది.
267వ రోజు శనివారం ఆనందపురం మండలం పప్పలవానిపాలెం నుంచి పాదయాత్రను వైఎస్ జగన్ కొనసాగిస్తారు. అక్కడి నుంచి కొలవానిపాలెం క్రాస్, భీమేంద్ర పాలెం, యర్రవాని పాలెం మీదుగా రామవరం చేరుకుంటారు. మధ్యాహ్న విరామం అనంతరం రామవరం మీదుగా గండిగుండం క్రాస్ వరకు పాదయాత్ర సాగిస్తారు. వైఎస్ జగన్ రాత్రి అక్కడే బస చేయనున్నారు.