సాక్షి, విశాఖపట్నం : తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జర్నలిస్ట్‌లందరికి ఇళ్లు స్థలాలు మంజూరు చేస్తామని ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా 267వ రోజు పాదయాత్రలో ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రతినిధులు వైఎస్ జగన్‌ను కలిసి వారి సమస్యలపై వినతిపత్రం అందచేశారు.
పదవీ విరమణ చేసిన జర్నలిస్ట్‌లకు నెలకు రూ.10వేలు పెన్షన్ ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. దాంతోపాటు జర్నలిస్ట్ చనిపోతే భార్యకు నెలకు ఐదువేలు పెన్షన్ ఇవ్వాలని వైఎస్ జగన్‌ను కలిసిన ప్రతినిధులు కోరారు. జర్నలిస్ట్ సమస్యలపై స్పందించిన జగన్.. పూర్తి అధ్యయనం చేసిన తరువాత పెన్షన్‌పై తగిన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. జర్నలిజం విభాగాల్లో సాంకేతిక వనరుల కల్పనకు జగన్ హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment