చెన్నై నుంచి కొల్కత్తా వెళ్తున్న అయిల్ ట్యాంకర్ ఈ రోజు తెల్లవారుజామున విశాఖపట్నం సమీపంలోని సబ్బవరం వద్ద బోల్తా పడింది. దాంతో ట్యాంకర్ లోని స్పిరిట్ లీక్ అవుతుంది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, భద్రత సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే ట్యాంకర్ బొల్తా పడిన ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్కు తీవ్రగాయాలు అయ్యాయి. దాంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.