జీవితం నాశనం అయింది, బతికింది చాలు | Man Ends Life In Visakhapatnam | Sakshi
Sakshi News home page

మనస్తాపంతో ఆత్మహత్య

Published Tue, Jan 5 2021 7:57 AM | Last Updated on Tue, Jan 5 2021 8:50 AM

Man Ends Life In Visakhapatnam - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, సబ్బవరం (విశాఖపట్నం): మండలంలోని గొల్లలపాలెం శివారు మామిడి తోటలో స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగి మనస్తాపంతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గాజువాకలోని వడ్లపూడి లక్ష్మీపురం కాలనీలో నివసిస్తున్న జాజిల అప్పల రమేష్‌(42) స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. 10 సంవత్సరాల క్రితం మేనమామ కుమార్తె నీరజతో వివాహమైంది. ప్రస్తుతం ఆమె వీఆర్‌వోగా పనిచేస్తోంది. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. మనస్పర్థలతో కొన్నాళ్ల నుంచి భార్యకు దూరంగా రమేష్‌ ఉంటున్నాడు. (చదవండి: తల్లీకుమారుడి దారుణ హత్య)

ఈ నేపథ్యంలో ‘నా జీవితం నాశనమైపోయింది. ఇక నేను బతికింది చాలు. నేను మన తోటలో ఆత్మహత్య చేసుకుంటున్నాను...’ అని ఫోన్‌లో కుటుంబ సభ్యులకు మెసేజ్‌ చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే తల్లిదండ్రులతోపాటు కుటుంబ సభ్యులు తోట వద్దకు చేరుకుని రమేష్‌ మృతదేహం చూసి బోరున విలపించారు. తమ కుమారుడి మృతికి కోడలు నీరజ, ఆమె తండ్రి అవిరెడ్డి సూర్యనారాయణ, చినమామ అవిరెడ్డి కనకారావు వేధింపులే కారణమని ఆరోపిస్తూ మృతుడి తండ్రి వేంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ చంద్రశేఖరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement