oil tanker accident
-
ఘోర బస్సు ప్రమాదం... 20 మంది సజీవ దహనం
లాహోర్: పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్యాసింజర్ బస్ని ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని అన్నారు . దీంతో సుమారు 20 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారని పోలీసులు తెలిపారు. ముల్తాన్ హైవేకి సుమారు 350 కి. మీ దూరంలో ఉన్న లాహోర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. కరాచి నుంచి లాహోర్కి బయులు దేరుతున్న ప్యాసింజర్ బస్సుని ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టడంతో ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టాయని వెల్లడించారు. దీంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి వచ్చి రెస్య్కూ చర్యలు చేపట్టినప్పటికీ ప్రయాణికులను కాపాడటం కష్టతరమైందని అన్నారు. ఈ ఘటనలో సుమారు ఆరుగురు తీవ్ర గాయాల పాలయ్యారని, ఆస్పత్రికి తరలించామని తెలిపారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఈ ఘటనలో మృతి చెందిన బాధితుల మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని అన్నారు. ఆయా మృతదేహాలకు డీఎన్ఏ టెస్ట్‌లు నిర్వహించి బాధిత కుటుంబాలకు అందజేస్తామని వెల్లడించారు. ఈ మేరకు పాకిస్తాన్ పంజాబ్ ముఖ్యమంత్రి పర్వేజ్ ఈ ఘటనలో మృతి చెందిన బాధితుల పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులును ఆదేశించారు. అలాగే మృతి చెందిన బాధిత కుటంబాలు తమ వారిని గుర్తించేలాగా సహకరించాలని అధికారులను కోరారు. (చదవండి: బస్సు బ్రేకులు ఫెయిలై ఘోర ప్రమాదం.. ఐటీబీపీ సిబ్బంది దుర్మరణం) -
ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. బిందెలు, డబ్బాలతో ఎగబడ్డ జనం
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఆయిల్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాద వార్త తెలుసుకున్న స్థానికులు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ట్యాంకర్ నుంచి లీకైన వంట నూనె కోసం ఎగబడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. వివరాల ప్రకారం.. ముంబై-అహ్మాదాబాద్ జాతీయ రహదారిపై పాల్ఘర్ జిల్లాలోని తవా గ్రామ సమీపంలో 12వేల ఆయిల్ తరలిస్తున్న ఓ ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. గుజరాత్‌లోని సూరత్ నుంచి ముంబైకి నూనెను ట్యాంకర్లలో తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాగా, ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు ట్యాంకర్ నుంచి లీకైన నూనె కోసం ఎగబడ్డారు. బిందెలు, క్యాన్లలో వంటనూనెను నింపుకునేందుకు పోటీపడ్డారు. ఈ క్రమంలో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. పోలీసుల అధికారులు 3 గంటలపాటు శ్రమించి పరిస్థితిని చక్కదిద్దారు. A tanker carrying 12,000 litres of edible oil for processing from #Surat in #Gujarat to #Mumbai overturned on the busy Mumbai-#Ahmedabad highway at #Palghar in #Maharashtra. A number of locals rushed to the spot and looted the #oil overflowing from the tanker.#ACCIDENT #News pic.twitter.com/GktU2tztkd — Chaudhary Parvez (@ChaudharyParvez) May 22, 2022 -
కాంగోలో 60 మంది సజీవ దహనం
కిన్షాసా: డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో శనివారం జరిగిన ఘోర ప్రమాదంలో 60 మంది సజీవ దహనమయ్యారు. మరో 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. రాజధాని కిన్షాసా– మతాడి ఓడరేవును కలిపే జాతీయ రహదారిపై కిసాంతు నగరం సమీపంలో ఆయిల్ ట్యాంకర్, మరో వాహనం ఢీకొన్నాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి, ఇతర వాహనాలకు, చుట్టుపక్కల నివాసాలకు అంటుకున్నాయి. అగ్నికీలల్లో చిక్కుకుని దాదాపు 60 మంది ప్రాణాలు కోల్పోగా, 100 మందికి తీవ్ర కాలిన గాయాలయ్యాయి. -
నాలుగు నెలలు.. నరకయాతన
సాక్షి, హైదరాబాద్: నగరంలోని చెంగిచర్ల చౌరస్తా వద్ద గత జనవరి 12న జరిగిన పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో తీవ్రంగా గాయపడిన చెంగిచర్లకు చెందిన శివకుమార్ నాలుగు నెలల పాటు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి ఆదివారం మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చెంగిచర్లకు శివకుమార్(25) చర్లపల్లిలోని హెచ్పీసీఎల్లో ఎలక్ట్రిషియన్‌గా పని చేసేవాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా కొబ్బరి కాయలు తెచ్చుకునేందుకు ఉప్పల్ వెళ్లిన అతను బైక్‌పై తిరిగి వస్తుండగా మేడిపల్లి చౌరస్తా వద్ద పెట్రోల్ ట్యాంకర్ పేలుడు జరిగింది. ఈ ఘటనలో శివకుమార్ బైక్, అతని ఒంటికి మంటలు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కొన్నాళ్ల పాటు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. శరీరంలో ఒక్కో అవయవం దెబ్బతినడంతో దిల్‌సుఖ్‌నగర్‌లోని షణ్ముక్ వైష్ణవి ఆసుపత్రికి తరలించారు. ఇప్పటి వరకు రూ. 5 లక్షలు ఖర్చు కాగా నాలుగు నెలల పాటు మృత్యువుతో పోరాడిన శివకుమార్ శనివారం రాత్రి మృతి చెందాడు. శివ మృతితో అతని ఇంటి వద్ద విషాద చాయలు అలుముకున్నాయి. ఆదివారం ఆస్పత్రి నిర్వాహకులు శివకుమార్ మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహంతో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు సమాచారం అందడంతో మేడిపల్లి పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా అతని ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రం స్థానిక శ్మశాన వాటికలో అతని అంత్యక్రియలు నిర్వహించారు. -
దేవుడా..!
నల్లటి చీకటిని కమ్మేసిన తెల్లటి మంచు పొరలు తెలతెలవారుతుండగా ఎర్రటి రక్తపు చారికలయ్యాయి. కొద్ది గంటల క్రితం గోవిందా గోవిందా.. అని స్మరించిన గొంతుకలు ‘ఎంత పనిచేశావు దేవుడా..’ అంటూ బోరున విలపించాయి. ఆదివారం వేకువజామున అద్దంకి– నార్కెట్‌పల్లి రహదారిలో అన్నవరప్పాడు వద్ద ఆగి ఉన్న ఆయిల్ ట్యాంకర్‌ను కారు ఢీకొన్న ఘటనలో నలుగురి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. దైవ దర్శనానికి వెళ్లి మరికొద్ది గంటల్లో గమ్యం చేరాల్సిన వీరి జీవితాలు విధి ఆడిన వింత నాటకంలో అర్ధంతరంగా ముగిసిపోయాయి. తెల్లవారుజామున సుప్రభాత గీతాలు వినిపించాల్సిన మృతుల ఇళ్లలో కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు విషాద గీతికలై దిక్కులు పిక్కటిల్లేలా మార్మోగాయి. రొంపిచర్ల (నరసరావుపేట): చిన్నారి చెవులు కుట్టించుకునేందుకు బంధువులంతా కలిసి సంతోషంగా తిరుపతికి వెళ్లి వస్తూ అరగంటలో ఇంటికి చేరే సమయంలో వారిని మంచుతోపాటు ఆయిల్ ట్యాంకర్ మృత్యు రూపంలో కబళించింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మూడు కుటుంబాల్లో విషాదం నెలకొంది. అందులో ఇద్దరు మహిళలతోపాటు ఓ యువకుడు, చిన్నారి ఉన్నారు. ఈ దుర్ఘటన రొంపిచర్ల మండలం అన్నవరప్పాడు గ్రామ సమీపంలో అద్దంకి– నార్కెట్‌పల్లి రహదారిపై ఆదివారం వేకువజామున నాలుగు గంటలకు జరిగింది. పిడుగురాళ్లకు చెందిన మన్విత, క్రోసూరు మండలం గుడిపాడుకు చెందిన పొత్తూరి ఝాన్సీ (40), ఆమె కుమారుడు రోహిత్ కుమార్ (14) అక్కడికక్కడే మృతి చెందారు. కనిగిరి లెనిన్‌కుమారి, కొదమగుండ్ల త్రివేణి, కనిగిరి సహశ్రీ, కూన మంగతాయారు, కపిలవాయి భాగ్యం, కొదమగుండ్ల శరణ్, కొదమగుండ్ల ఏడుకొండలు, హనుమంతరావు, గౌతం, కొదమగుండ్ల మోతి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108 అంబులెన్స్ ద్వారా నరసరావుపేటలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ పిడుగురాళ్లకు చెందిన మోతి (40) మృతి చెందింది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం:డీఎస్పీ నాగేశ్వరరావు సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ కే నాగేశ్వరరావు మాట్లాడుతూ రాత్రి వేళల్లో వాహనాలను పార్కింగ్ చేసే విషయంలో డ్రైవర్ల నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణమవుతుందని తెలిపారు. ట్యాంకర్‌ను రోడ్డుపై పార్కింగ్ చేయటంతోనే ప్రమాదం జరిగిందన్నారు. సీఐ ప్రభాకర్, ఎస్ఐ వెంకటరావు తమ సిబ్బందితో రోడ్డుపై అడ్డంగా ఉన్న వాహనాలను పక్కకు తరలించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మేమెట్టా బతకాలి ? క్రోసూరు: తల్లీ, కొడుకు మృతి చెందడంతో ఆ కుటుంబం రెక్కలు తెగిన పక్షిలా విలవిలలాడుతోంది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తల్లీకొడుకులు ఝాన్సీ, రోహిత్‌కుమార్ మృతదేహాలను స్వగ్రామమైన గుడిపాడుకు చేర్చారు. మృతురాలికి భర్త గోపాలకృష్ణ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తె వివాహం చేశారు. చిన్న కుమారుడైన రోహిత్‌కుమార్ అన్న సోమశేఖర్‌తోపాటు మండలంలోని బృగుబండ జిల్లా పరిషత్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. కూలీనాలి చేసుకుంటూ పిల్లలిద్దరినీ చదివించుకుంటున్న ఆ కుటుంబం ఇప్పుడు ఛిన్నాభిన్నమైంది. ‘ఇక మేమెట్టా బతకాలం’టూ ఆ తండ్రీకొడుకులు హృదయ విదారకంగా విలపిస్తున్నారు. గుండెలవిసేలా.. పిడుగురాళ్లటౌన్ : పట్టణానికి చెందిన కనిగిరి శ్రీనివాసరావుకు కొదమగుండ్ల వెంకటేశ్వర్లు, రామకృష్ణ, ఏడుకొండలు బావమరుదులు. వీరంతా పట్టణంలోనే బావ శ్రీను వద్ద వివిధ వ్యాపారాలు చేస్తూ జీవిస్తున్నారు. కొదమగుండ్ల ఏడుకొండలు కుమార్తె యతిశ్రీకి చెవులు కుట్టించేందుకు తిరుపతికి ఈ నెల 22వ తేదీ రాత్రి రెండు వాహనాల్లో సుమారు 20 మంది బంధువులు బయలుదేరారు. తిరుగుప్రయాణంలో ఓ వాహనం ఆగి ఉన్న ట్యాంకర్‌ను ఢీకొనడంతో వాహనంలో ఉన్న వెంకటేశ్వర్లు భార్య మోతి, రామకృష్ణ కుమార్తె మాన్విత చనిపోవడంతో ఆ కుటుంబం శోకసంద్రలో నిండిపోయింది. వారం క్రితం గుడిపాడు నుంచి చెల్లెల్ని చూసేందుకు పిడుగురాళ్లకు వచ్చిన పొత్తూరి ఝూన్సీని ఈ కార్యక్రమానికి రావాలని పిలిచారు. దీంతో ఆమె కొడుకు రోహిత్‌కుమార్‌ను కూడా తీసుకొచ్చింది. ఇద్దరూ మృత్యువాత పడ్డారు. శ్రీను భార్య కాలు తీసేయడం, మొదటి బావమరిది భార్య, రెండో బావమరిది కుమార్తె చనిపోవడం, మూడో బావమరిది భార్య గర్భిణి గాయపడటంతో ఆ కుటుంబాల బాధ వర్ణణాతీతంగా ఉంది. చిన్నారి మాన్విత మృతదేహాన్ని చూసిన ప్రతి ఒక్కరి కళ్లు చెమర్చాయి. ప్రేమించి వివాహం చేసుకున్న భార్య తనను ఒంటరిని చేసి వెళ్లడంతో మౌతి భర్త గుండెలవిసేలా రోదిస్తున్నాడు. -
ట్యాంకర్ టెర్రర్
ఉప్పల్/బోడుప్పల్/మేడిపల్లి: శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయం.. అంతవరకూ ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం.. భారీ శబ్దంతో డీజిల్ ట్యాంకర్ల పేలుడు.. ఏం జరిగిందో తెలిసేలోపే అర కిలోమీటర్ దూరం వ్యాపించిన అగ్నికీలలు.. రోడ్డు మీ ద ద్విచక్ర వాహనాలపై వెళుతున్న వారికి అంటుకున్న మంటలు.. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగిచెర్ల వద్ద శుక్రవారం భారీ అగ్నిప్రమాదం తాలూకూ విధ్వంసమిదీ. డీజిల్ ట్యాంకర్లు మరమ్మతు చేసే షెడ్లో రెండు ట్యాంకర్లు ప్రమాదవశా త్తూ పేలడం తో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. ట్యాంకర్ల నుంచి అక్రమంగా పెట్రోల్, డీజిల్ తీసేందుకు ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ప్రమాదాన్ని గమనించిన షెడ్ నిర్వాహకుడు, పనిచేసేవారు, ట్యాంకర్ డ్రైవర్లు, క్లీనర్లు అక్కడి నుంచి పరారవ్వగా.. దారినవెళ్లే అమాయకులు గాయాల పాలైనట్లు తెలుస్తోంది. అదుపులో షెడ్ నిర్వాహకుడు.. షెడ్ నిర్వాహకుడు రాజును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వర శర్మ, మల్కాజిగిరి ఏసీపీ గోనె సందీప్‌రావు వెల్లడించారు. ఈ ప్రమాదంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, నిర్వాహకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అక్రమంగా డీజిల్ తీసిన తర్వాత సదరు ట్యాంకర్ రివర్స్ తీసుకుంటున్నప్పుడు నిప్పురవ్వలు చెలరేగి ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందన్నారు. క్షతగాత్రులకు గాంధీలో చికిత్స.. అగ్నిప్రమాద ఘటనలో గాయపడిన ఆరుగురు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన వెంకటేష్‌నాయక్(26)కు 80 శాతం కాలిన గాయాలయ్యాయని, అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన స్వామినాయక్(35)కు 35 శాతం, మచిలీపట్నానికి చెందిన వాసుకు 25 శాతం కాలిన గాయాలయ్యాయని చెప్పారు. చెంగిచర్లకు చెందిన గోల్డ్‌స్మిత్ నల్లా నాగులు(40), డ్రైవర్ మహ్మద్ జలీల్‌ఖాన్ (50), అంబర్‌పేట రతన్నగర్కు చెందిన టైలర్ షేక్ ఇబ్రహీం(60) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు మేడిపల్లి అపెక్స్ ఆస్పత్రిలో కుషాయిగూడకు చెందిన ఏఎస్ఐ మురళీదాస్గౌడ్(50), నవనీత్(28), చెంగిచెర్లకు చెందిన డొప్ప శివ(25) చికిత్సపొందుతున్నారు. వీ6 చానల్ రిపోర్టర్ శేఖర్, చెంగిచర్లకు చెందిన కేతావత్ లక్ష్మణ్(25) స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిందిలా.. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం.. మేడిపల్లి చౌరస్తా చెంగిచర్ల వెళ్లే రహదారి పక్కన డీజిల్ ట్యాంకర్లు మరమ్మతులు చేసే షెడ్డు ఉంది. మేడిపల్లికి చెందిన రాజు అనే వ్యక్తి పదేళ్లుగా ఈ షెడ్డును నిర్వహిస్తున్నాడు. అయితే అదే షెడ్లో డీజిల్, పెట్రోల్ విక్రయ అక్రమ దందాను సాగిస్తున్నట్టు తెలుస్తోంది. మరమ్మతుల పేరుతో ట్యాంకర్లను తీసుకొచ్చి వాటిలోని పెట్రోల్, డీజిల్‌ను తీసి డ్రైవర్లు, షెడ్డు నిర్వాహకులు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఓ ట్యాంకర్ నుంచి డీజిల్, పెట్రోల్ అక్రమంగా వెలికి తీసిన తర్వాత సదరు ట్యాంకర్ రివర్స్ తీసుకుంటున్నప్పుడు నిప్పురవ్వలు అంటుకుని మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న మరో ట్యాంకర్‌కు మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా రెండు డీజిల్ ట్యాంకర్లు పేలడంతో అర కిలోమీటర్ దూరం వరకు అగ్నికీలలు వ్యాపించాయి. షెడ్లో ఉన్న వారు బయటకు పరుగులు తీయగా.. రోడ్డు మీద ద్విచక్ర వాహనాలపై వెళుతున్న వారు మంటలు అంటుకుని తీవ్రంగా గాయపడ్డారు. ఆరు ఫైరింజన్లు మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ క్రమంలో ఫైర్ సిబ్బందికి కూడా గాయాలైనట్లు అధికారులు తెలిపారు. గాయపడిన 11 మందిని గాంధీ, ప్రైవేటు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొంప ముంచిన ఫొటోల సరదా.. ఇటీవల ప్రతీ ఘటనను తమ స్మార్ట్ఫోన్లలో బంధించేందుకు ఎక్కువ మంది అత్యుత్సాహం చూపిస్తున్నారు. చెంగిచర్ల అగ్ని ప్రమాద స్థలంలో దారిన వెళ్లే్ల వారు తమ వాహనాలను నిలిపి వీడియోలు తీసేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో డీజిల్ ట్యాంకర్ల ఒక్కసారిగా పేలడంతో మంటలు వ్యాపించి.. రోడ్డుపై ఉన్న ఆరుగురు అందులో చిక్కుకుపోయారు. బైక్‌లపై ఉండటంతో కొందరు తప్పించుకోలేకపోయారు. ఆరు ద్విచక్ర వాహనాలు కాలిబూడిదయ్యాయి. అర కిలోమీటర్ మేర మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల ఉన్న చెట్లు, మొక్కలు మాడి మసైపోయాయి. ఇద్దరిని కాపాడా.. ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఏం జరిగిందో తెలియక పరుగులు తీశాం. హాహాకారాలు వినపడటంతో తేరుకుని చూస్తే.. రోడ్డుపై వెళ్లేవారు కాలిపోతున్నారు. వెంటనే టవల్‌తో మంటలార్పి ఇద్దరిని కాపాడాను. ఈ క్రమంలో నా చేతులు కాలిపోయాయి. – కేతావత్ లక్ష్మణ్ -
మేడిపల్లిలో భారీ అగ్ని ప్రమాదం
-
ఉలిక్కిపడ్డ మేడిపల్లి.. వాహనదారుడి నరకయాతన..
-
ఉలిక్కిపడ్డ మేడిపల్లి.. క్షతగాత్రుడి నరకయాతన
సాక్షి, హైదరాబాద్: భారీ అగ్నిప్రమాదంతో మేల్కాజ్గిరి-మేడ్చల్ జిల్లాలోని మేడిపల్లి ఉలిక్కిపడింది. శుక్రవారం మధ్యాహ్నం పెట్రోల్ ట్యాంకర్‌కు మంటలు అంటుకోవడంతో పెద్ద ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా ఉవ్వెత్తున మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ఆయిల్ ట్యాంకర్‌తో పాటు పలు వాహనాలు దగ్ధమయ్యాయి. పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకోవడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. వాహనదారుడి నరకయాతన.. ఆయిల్ ట్యాంకర్ నుంచి వ్యాపించిన మంటలు అంటుకుని ద్విచక్ర వాహనదారుడొకరు నరకయాతన అనుభవించారు. తలకు హెల్మెట్‌తో ఒళ్లంతా గాయాలతో అతడు పడిన యాతన హృదయాలను ద్రవింపజేసింది. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం గురించి తెలియగానే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు. ముగ్గురు గాయపడ్డారు: సీపీ ఆయిల్ ట్యాంకర్ అగ్నిప్రమాదంలో ముగ్గురు గాయపడినట్టు రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. క్షతగాత్రులను గాంధీ ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. మంటలు అదుపులోకి వచ్చాయని, సహాయక చర్యలను ఉప్పల్ ఏసీపీ పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు. -
ట్యాంకర్ బోల్తా: ఇద్దరికి గాయాలు
చెన్నై నుంచి కొల్కత్తా వెళ్తున్న అయిల్ ట్యాంకర్ ఈ రోజు తెల్లవారుజామున విశాఖపట్నం సమీపంలోని సబ్బవరం వద్ద బోల్తా పడింది. దాంతో ట్యాంకర్ లోని స్పిరిట్ లీక్ అవుతుంది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, భద్రత సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే ట్యాంకర్ బొల్తా పడిన ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. దాంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. -
విద్యార్థినులపై దూసుకెళ్లిన ఆయిల్ ట్యాంకర్
-
విద్యార్థినులపై దూసుకెళ్లిన ఆయిల్ ట్యాంకర్
విశాఖపట్నం: నూతన సంవత్సరం రోజున విశాఖ నగరంలో విషాదం నెలకొంది. ఒక ఆయిల్ ట్యాంకర్ నలుగురు విద్యార్థినులపై దూసుకెళ్లింది. ఒక విద్యార్థిని మృతి చెందింది. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. కొమ్మాది జాతీయ రహదారిపై వాంబేకాలనీ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. నూతన సంవత్సరం రోజున స్నేహితురాలికి శుభాకాంక్షలు తెలియజేసేందుకు ఆమె ఇంటికి నలుగురు విద్యార్థినులు వెళ్లారు. వారు తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మౌనిక ఆనే విద్యార్థిని మృతి చెందగా, త్రివేణి అనే విద్యార్థినికి తీవ్రగాయాలయ్యాయి.