మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప‍్రమాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఆయిల్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాద వార్త తెలుసుకున్న స్థానికులు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ట్యాంకర్ నుంచి లీకైన వంట నూనె కోసం ఎగబడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది.
వివరాల ప్రకారం.. ముంబై-అహ్మాదాబాద్ జాతీయ రహదారిపై పాల్ఘర్ జిల్లాలోని తవా గ్రామ సమీపంలో 12వేల ఆయిల్ తరలిస్తున్న ఓ ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. గుజరాత్లోని సూరత్ నుంచి ముంబైకి నూనెను ట్యాంకర్లలో తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాగా, ఈ ప్రమాదంలో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు ట్యాంకర్ నుంచి లీకైన నూనె కోసం ఎగబడ్డారు. బిందెలు, క్యాన్లలో వంటనూనెను నింపుకునేందుకు పోటీపడ్డారు. ఈ క్రమంలో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. పోలీసుల అధికారులు 3 గంటలపాటు శ్రమించి పరిస్థితిని చక్కదిద్దారు.
A tanker carrying 12,000 litres of edible oil for processing from #Surat in #Gujarat to #Mumbai overturned on the busy Mumbai-#Ahmedabad highway at #Palghar in #Maharashtra. A number of locals rushed to the spot and looted the #oil overflowing from the tanker.#ACCIDENT #News pic.twitter.com/GktU2tztkd
— Chaudhary Parvez (@ChaudharyParvez) May 22, 2022
Comments
Please login to add a commentAdd a comment