Mumbai-Ahmedabad highway
-
ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. బిందెలు, డబ్బాలతో ఎగబడ్డ జనం
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఆయిల్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాద వార్త తెలుసుకున్న స్థానికులు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ట్యాంకర్ నుంచి లీకైన వంట నూనె కోసం ఎగబడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. వివరాల ప్రకారం.. ముంబై-అహ్మాదాబాద్ జాతీయ రహదారిపై పాల్ఘర్ జిల్లాలోని తవా గ్రామ సమీపంలో 12వేల ఆయిల్ తరలిస్తున్న ఓ ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. గుజరాత్‌లోని సూరత్ నుంచి ముంబైకి నూనెను ట్యాంకర్లలో తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాగా, ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు ట్యాంకర్ నుంచి లీకైన నూనె కోసం ఎగబడ్డారు. బిందెలు, క్యాన్లలో వంటనూనెను నింపుకునేందుకు పోటీపడ్డారు. ఈ క్రమంలో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. పోలీసుల అధికారులు 3 గంటలపాటు శ్రమించి పరిస్థితిని చక్కదిద్దారు. A tanker carrying 12,000 litres of edible oil for processing from #Surat in #Gujarat to #Mumbai overturned on the busy Mumbai-#Ahmedabad highway at #Palghar in #Maharashtra. A number of locals rushed to the spot and looted the #oil overflowing from the tanker.#ACCIDENT #News pic.twitter.com/GktU2tztkd — Chaudhary Parvez (@ChaudharyParvez) May 22, 2022 -
ట్యాంకర్, వోల్వో బస్సు డీ
-
ట్యాంకర్, వోల్వో బస్సు డీ: 8 మంది సజీవదహనం
ముంబై - అహ్మదాబాద్ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీజిల్ ట్యాంకర్, ఎదురుగా వస్తున్న వోల్వో బస్సును ఢీ కొట్టింది. దాంతో వోల్వో బస్సులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దాంతో ఎనిమిది మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో 14 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన మంగళవారం అర్ధరాత్రి 1.45 గంటల సమయంలో జరిగింది. బీపీసీఎల్ ట్యాంకర్ గుజరాత్ లోని హజారియా ప్రాంతానికి వెళ్తోంది. ఈ రెండు వాహనాలు ఢీకొనడంతో రెండింటికీ మంటలు అంటుకున్నాయి. అయితే మృతులు మాత్రం అంతా బస్సులోని వారేనని ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. మృతదేహాలు పూర్తిగా కాలిపోయి మసిబొగ్గులుగా మారిపోవడంతో గుర్తుపట్టడానికి ఏమాత్రం అవకాశం లేకుండా పోయింది. అయినా వాటిని పోస్టుమార్టం కోసం పంపారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసుకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గత సంవత్సరం మే 29వ తేదీన కూడా ఇలాంటి ప్రమాదమే ఒకటి సంభవించింది. ఆ ప్రమాదంలో 14 మంది మరణించగా 40 మంది తీవ్రంగా గాయపడ్డారు.